బాబు మోసాలకు ఓటుతో బుద్ధి చెప్పండి
బాబు మోసాలకు ఓటుతో బుద్ధి చెప్పండి
Published Tue, Mar 7 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
– వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి
నంద్యాలవిద్య/నంద్యాలవ్యవసాయం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన మోసాలను ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం కోర్టులు, తహసీల్దార్, రిజిస్ట్రార్, ట్రెజరీ, బీఎస్‌ఎన్‌ఎల్, ఏపీట్రాన్స్‌కో కార్యాలయాల్లో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్యోగులను, నిరుద్యోగులను దగా చేశారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని రెండున్నరేళ్లు మభ్యపెట్టారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో మళ్లీ ఈ హామీని వెలుగులోకి తెచ్చారన్నారు. అయితే పట్టభద్రులు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. తాను విజయం సాధిస్తే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, యువకుల ఉపాధి కోసం పోరాడుతానని చెప్పారు.
కోర్టు ఆవరణంలో ప్రచారం...
కోర్టు ఆవరణంలోని బార్ అసోసియేషన్‌లో వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హైకోర్టు బెంచి కర్నూలులో ఏర్పాటు చేస్తామని, లాయర్లకు డెప్త్ బెనిఫిట్స్ కోసం రూ.5లక్షలు ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తానన్నారు. ఈనెల 9వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తమ మొదటి ఓటు ప్రాధాన్యత తనకే వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, న్యాయవాదులు మాధవరెడ్డి, ఎస్‌ఎం ఖాద్రి, వివేకానందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
హోలీక్రాస్ చర్చిలో ప్రార్థనలు..
స్థానిక ఆర్‌ఎస్ రోడ్డులోని హోలీక్రాస్ కెథడ్రల్ చర్చిలో గోపాల్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన ఆర్‌ఎస్‌రోడ్డు, విశ్వాసపురం, మిషన్ కాంపౌండ్, ఎల్‌ఐసీ ప్రాంతాల్లో పర్యటించి, పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఆయన వెంట పెన్షనర్ల అసోసియేషన్ కార్యదర్శి ఎల్‌ఈఈ అమృతం, బ్రహ్మానందరెడ్డి, పుల్లారెడ్డి, సాయిరాంరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement