TG: ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు.. కౌంటింగ్‌ | Nalgonda-Warangal-Khammam Graduates MLC Polling Results Updates | Sakshi
Sakshi News home page

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిజల్ట్‌.. కౌంటింగ్‌ అప్‌డేట్స్‌

Jun 5 2024 8:03 AM | Updated on Jun 5 2024 9:01 PM

Nalgonda-Warangal-Khammam Graduates MLC Polling Results Updates

వరంగల్, ఖమ్మం, నల్లగొంఎ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్ డేట్

నల్లగొండ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ అప్ డేట్

ఇంకా కొనసాగుతోన్న మొదటి రౌండ్ కౌంటింగ్

సాయంత్రం మూడున్నరకు ప్రారంభమైన మొదటి రౌండ్ కౌంటింగ్

నాలుగు రౌండ్ల పాటు సాగనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

ఒక్కో రౌండ్ లో 96 వేల చొప్పున  లెక్కింపు


నల్లగొండ

  • ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ
  • మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసిన బండిల్స్ కట్టె ప్రక్రియ
  • మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఇంకా కొనసాగుతున్న బెండల్స్ కట్టే ప్రక్రియ
సాయంత్రం 5 తర్వాతనే ఓట్ల లెక్కింపు ప్రారంభం

  • పట్టభద్రుల  ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 4 రౌండ్లలో బ్యాలెట్ ఓట్ల  బండిల్స్ కట్టే ప్రక్రియ పూర్తి అయింది 
  • ఇంకా మూడు రౌండ్లలో ఈ ప్రక్రియ పూర్తికానుంది.
  •  ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 
  • మూడు గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.


 

  • వరంగల్‌- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప​ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది.

 

  • ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది
  • ఒక్కో హాల్లో 24 లెక్కింపు టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 
  • ఇందుకోసం 2,100 మంది సిబ్బందిని కేటాయించారు.
  • ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్‌ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా, వీరితోపాటు మరో 49 మంది పోటీలో ఉన్నారు.

 

నల్లగొండ జిల్లా

  • నేడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • తిప్పర్తి మండలం దుప్పలపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ గౌడన్స్ లో లెక్కింపు
  • ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
  • 4 హాల్స్ లలో ఒక్కో హాల్ కు 24 టేబుల్స్ చొప్పున మొత్తం 96 టేబుల్స్ ఏర్పాటు
  • పోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపి లెక్కింపు
  • ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్ధులు
  • మొత్తం ఓటర్లు: 4,63,839
  • పోలైన ఓట్లు: 3,36,013
  • పోలింగ్ శాతం: 72.44
  • రోజుకు మూడు షిఫ్టుల్లో కొనసాగనున్న లెక్కింపు
  • ఒక్కో షిఫ్టులో 900 సిబ్బంది
  • మొదటగా బండిల్స్ కట్టే ప్రక్రియ
  • ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగే అవకాశం
  • ఆతర్వాత చెల్లుబాటు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయనున్న‌ సిబ్బంది
  • చెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారు గెలిచినట్లు ప్రకటన
  • మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకుంటే చివరి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ
  • ఎలిమినేట్ అయిన అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేశారో చూసి వారికి యాడింగ్
  • అలా కలిపిన తర్వాత యాభై శాతానికి మించి వస్తే గెలిచినట్లు ప్రకటన
  • నేడు ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌
  • వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్‌ బుధవారం ప్రారంభం కానుంది. 
  • ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. 
  • వరంగల్, ఖమ్మం, నల్లగొండ  ఉమ్మడి జిల్లాల పరిధిలోని 605 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో మొత్తం 52 మంది అభ్యర్థులకు  వచ్చిన ఓట్లను మూడు విడతల్లో లెక్కించనున్నారు. 
  • బ్యాలెట్‌ పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహించినందున ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగనుంది. 
  • బుధవారం ఉదయం 8 గంటలకు ఈ  ప్ర క్రియ ప్రారంభం అవుతుంది. 
  • నా లుగు హాళ్లలో 96 టేబుళ్లపై పోలైన 3,36,013 ఓట్ల లెక్కింపు చేపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement