గోపాల్‌రెడ్డిని గెలిపించుకుందాం | we support gopalreddy | Sakshi
Sakshi News home page

గోపాల్‌రెడ్డిని గెలిపించుకుందాం

Published Sat, Oct 22 2016 11:15 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

గోపాల్‌రెడ్డిని గెలిపించుకుందాం - Sakshi

గోపాల్‌రెడ్డిని గెలిపించుకుందాం

– వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు 
 
కర్నూలు (ఓల్డ్‌సిటీ): వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బలపరచిన అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించుకుందామని పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు విద్యార్థులను కోరారు. శనివారం సాయంత్రం రాయలసీమ యూనివర్సిటీలో ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి ఓటర్ల నమోదు పత్రాలు అందించి పూరింపజేశారు. సీఎం చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నారని, ఏ ఎన్నికలు జరిగినా గెలిచేది వైఎస్‌ఆర్‌సీపీయేనని సలాంబాబు అన్నారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, నగర అధ్యక్షుడు గోపినాథ్‌ యాదవ్, వైఎస్‌ఆర్‌ ఎస్‌యూ రాయలసీమ యూనివర్సిటీ విభాగం అధ్యక్షుడు దేవాతో పాటు సంజు, సాహి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement