రూ.8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రేమ్‌కుమార్
బిచ్కుంద : బిచ్కుంద ట్రాన్స్‌కో ఏఈ ప్రేమ్‌కుమార్ ఓ రైతు వద్ద నుంచి రూ.ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ నరేందర్ శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బిచ్కుంద మండలం తక్కడ్‌పల్లి గ్రామానికి చెందిన గంగారాం అనే రైతుకు మంజూరైన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వడానికి ఏఈ 8 నెలలుగా ఇబ్బంది పెడుతున్నాడు.
రూ.30 వేలు లంచం ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తామని చెప్పా డు. రైతు ఎంత బతిమాలినా ఏఈ వినకపోవడంతో చివరకు రూ.10 వేలు ఇచ్చేలా రైతు ఒ ప్పందం చేసుకున్నాడు. అనంతరం గంగా రాం ఏసీబీని ఆశ్రయించడంతో డబ్బు నోట్ల కు కెమికల్ అంటించి, ఆ నోట్లను రైతుకు ఇ చ్చామని డీఎస్పీ చెప్పారు. దీంతో రైతు ఆ డబ్బును బస్టాండ్ సమీపంలోని ఓ టీస్టాల్ వద్ద ఏఈకి ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని వివరించారు. వెంటనే ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేశామని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు. ఈ దాడిలో ఏసీబీ సబ్ ఇన్స్‌పెక్టర్ రఘునాథ్, చంద్రశేఖర్, ఖుర్షిద్ అలీ పాల్గొన్నారు.
ఏసీబీకి చిక్కిన ఏఈ
Published Sat, Apr 18 2015 2:55 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement