transformer
-
అది అగ్గే..కాదు పిడుగే!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్)లో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన వ్యవహారంలో.. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ జెన్కోకు, ప్లాంట్ నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్కు మధ్య వివాదం ముదురుతోంది. ఇది ప్లాంట్‌లో విద్యుదుత్పత్తిపై ప్రభావం చూపి నష్టానికి కారణమవుతోంది. ఇటీవల బీటీపీఎస్‌లోని 270 మెగావాట్ల యూనిట్–1కు సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైన విషయం తెలిసిందే.అంతర్గత సమస్య వల్లే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని జెన్కో దర్యాప్తులో తేల్చగా.. అది పిడుగుపాటుతోనే దగ్ధమైందని బీహెచ్ఈఎల్ చెబుతోంది. 320 ఎంవీఏ (మెగా వోల్ట్స్ యాంపియర్) సామర్థ్యమున్న ఈ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్.. మరమ్మతులు సాధ్యం కాని రీతిలో దెబ్బతిన్నదని, మరమ్మతులు చేసినా మళ్లీ కాలిపోతుందని బీహెచ్ఈఎల్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య వివాదం కొలిక్కిరాకపోవడంతో.. యూనిట్–1 పునరుద్ధరణలో పీటముడి పడింది. రోజూ 6.48 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తికి గండిపడింది. రూ.108 కోట్ల విద్యుత్ నష్టం! ఈఆర్సీ టారిఫ్ ఉత్తర్వుల ప్రకారం.. భద్రాద్రి ప్లాంట్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.4.30 కాగా.. అందులో ఫిక్స్డ్ చార్జీ రూ.1.94, వేరియబుల్ చార్జీ రూ.2.36గా నిర్ధారించింది. ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి జరిగినా, జరగకపోయినా.. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి తీసుకున్న పెట్టుబడి రుణాలను జెన్కో ప్రతినెలా క్రమం తప్పకుండా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన మొత్తాన్నే విద్యుత్ ధరలో ఫిక్స్డ్ చార్జీలుగా గణించి వసూలు చేస్తారు. ప్లాంట్ నుంచి విద్యుత్ కొన్నా, కొనకున్నా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు జెన్కోకు ఫిక్స్డ్ చార్జీలు చెల్లిస్తాయి. అదే సాంకేతిక సమస్యలతో విద్యుదుత్పత్తి నిలిచిపోతే ఫిక్స్డ్ చార్జీల నష్టాన్ని జెన్కోనే భరించాల్సి ఉంటుంది. భద్రాద్రి యూనిట్–1లో 39 రోజులుగా రోజుకు రూ.2.78 కోట్ల విలువైన విద్యుదుత్పత్తి నిలిచిపోగా.. ఇందులో రోజుకు రూ.1.25 కోట్లను ఫిక్స్డ్ చార్జీల రూపంలో జెన్కో నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటివరకు మొత్తంగా రూ.108.66 కోట్ల విలువైన విద్యుదుత్పత్తికి గండిపడగా.. రూ.49.02 కోట్లను ఫిక్స్డ్ చార్జీల రూపంలో నష్టాన్ని భరించాల్సి వచ్చింది. రోజులు గడిచే కొద్దీ ఈ నష్టం పెరుగుతూ పోతుంది. వెంటనే మరమ్మతులు చేసి యూనిట్–1ను పునరుద్ధరించకపోతే జెన్కోకు రూ.వందల కోట్ల నష్టం తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరమ్మతులకు బీహెచ్ఈఎల్ ససేమిరా.. కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 270 మెగావాట్ల నాలుగు యూనిట్లున్నాయి. జూన్ 29న రాత్రి 7.30 గంటల సమయంలో ప్లాంట్‌లో పిడుగుపడింది. ఆ సమయంలో యూనిట్–1కు సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. అయితే పిడుగుపడిన సమయంలోనే.. యాదృచ్ఛికంగా జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ అంతర్గత లోపాలతో మంటలు రేగి కాలిపోయిందని జెన్కో ఇంజనీర్లు నిర్ధారించి నివేదిక సమరి్పంచారు. అంతర్గత సమస్యలతో కాలిపోయినందున నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్ తన సొంత ఖర్చుతో పునరుద్ధరిస్తుందని పేర్కొన్నారు.మరోవైపు బీహెచ్ఈఎల్ నిపుణుల కమిటీ మాత్రం పిడుగుపాటు వల్లే జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటూ విరుద్ధమైన నివేదిక ఇచ్చింది. ట్రాన్స్ఫార్మర్కు తీవ్ర నష్టం జరిగిందని.. మరమ్మతులు చేసినా, మళ్లీ కాలిపోవడం ఖాయమని పేర్కొంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోవాలని జెన్కోకు సూచించింది. ఈ క్రమంలో మరమ్మతులు ఎవరు చేయాలన్న విషయంలో జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య వివాదం నెలకొంది. దీనితో యూనిట్–1 పునరుద్ధరణ పనుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీహెచ్ఈఎల్ మరమ్మతులకు అంగీకరించకపోవడంతో ప్రైవేటు కాంట్రాక్టర్లతో మరమ్మతులు చేయించేందుకు జెన్కో ప్రయతి్నస్తున్నట్టు తెలిసింది. -
అగ్గే.. పిడుగు కాదు!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీఎస్)లోని యూనిట్–1కు చెందిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం కావడానికి పిడుగుపాటు కారణం కాదని జెన్కో దర్యాప్తులో తేలింది. పిడుగు పడిన సమయంలోనే యాధృచ్చికంగానే జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ అంతర్గత లోపాలతో..దాని లోపల మంటలు ఉత్పన్నమయ్యాయని, ఇందుకు బాహ్య కారణాలు లేవని నిర్ధారించింది. శనివారం బీటీఎస్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి కారణాలను విశ్లే షిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. కారణాన్ని పట్టించిన రిలే వ్యవస్థ ట్రాన్స్ఫార్మర్లలో ‘రిలే’అనే రక్షణ వ్యవస్థ ఉంటుంది. ప్రమాదాలను ముందే పసిగట్టి వాటి నివారణకు సంబంధిత రక్షణ వ్యవస్థలను అప్పటికప్పుడు రిలే వ్యవస్థ క్రియాశీలం చేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ దగ్ధం కావడానికి అంతర్గత లోపాలు కారణమా? బాహ్య సమస్యలు కారణమా? అనే విషయాన్ని ఏ రకమైన రిలేలు ప్రమాద సమయంలో ఆపరేట్ అ య్యాయో పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. » బీటీఎస్‌లో ప్రమాదం జరిగినప్పుడు ‘87జీటీ, 64ఆర్’అనేæ రెండు వేర్వేరు రిలే వ్యవస్థలు మాత్రమే యాక్టివేట్ అయ్యాయి. » ట్రాన్స్‌ఫార్మర్‌లో అంతర్గత సమస్యలు ఉత్పన్నమైనపుడు మాత్రమే ఈ రెండు రిలేలు ఆపరేట్ అవుతాయి. » ట్రాన్స్ఫార్మర్కు బాహ్యంగా ఏదైన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మాత్రమే యాక్టివేట్ అయ్యే ‘87 హెచ్వీ’అనే రిలే వ్యవస్థ ఆ సమయంలో స్పందించలేదు. దీంతో అంతర్గత సమస్యలతోనే జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైందని జెన్కో ఇంజనీరింగ్ నిపుణులు నిర్ధారించారు. ఆజ్యం పోసిన ఆయిల్ లీకేజీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బీటీఎస్‌లో 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కి సంబంధించిన జనరేటింగ్ స్టేషన్లో 16కేవీ సామర్థ్యంతో విద్యుదుత్పత్తి అవుతుంది. దీనిని 400కేవీ సామర్థ్యానికి పెంచితేనే గ్రిడ్‌కు సరఫరా చేయడానికి వీలుంటుంది. ఈ పనిని జనరేటింగ్ ట్రాన్స్ఫార్మర్ చేస్తుంది. » జనరేటింగ్ స్టేషన్లో ఉత్పత్తి అయిన విద్యుత్ ఆర్‌వైబీ(రెడ్ ఎల్లో బ్లూ) అనే మూడు ఫేజుల కండర్ల(తీగల) ద్వారా ట్రాన్స్ఫార్మర్ వరకు సరఫరా అయ్యి బుష్‌ల ద్వారా లోపలికి వెళుతుంది. » ట్రాన్స్ఫార్మర్ లోపల చుట్టబడిన కాయిల్స్ ఆయిల్లో మునిగి ఉంటాయి. » ఆర్‌వైబీ అనే మూడు ఫేజులుండగా, బీ–ఫేజ్ కాయిల్స్‌లో ఫాల్ట్ ఏర్పడి మంటలు చోటు చేసుకున్నట్టు ‘రిలే’వ్యవస్థల స్పందన ద్వారా నిర్ధారించారు. » ఎప్పుడైతే బీ–ఫేజ్‌కు ప్రమాదం జరిగిందో.. ఆర్ ఫేజ్ మధ్య విద్యుత్ ఓల్టేజీ భారీగా పెరిగి ట్రాన్స్ ఫార్మర్లోని ఆయిల్ ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరాయి. దీంతో ట్రాన్స్ఫార్మర్ నుంచి బుష్‌ల ద్వారా ఆయిల్ బయటకు వచ్చి లీక్ అయ్యింది. » ఆయిల్ లీక్ కావడంతో అగి్నకి ఆజ్యం పోసినట్టు అయ్యి ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ కారణాలను విశ్లేషించిన తర్వాత ప్రమాదం పిడుగు వల్ల కాకుండా ట్రాన్స్‌ఫార్మర్‌లో ఏర్పడిన అంతర్గత లోపాలతోనే జరిగినట్టు జెన్కో నిపుణులు తేల్చారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.30కోట్లకు పైగా నష్టం జరిగినట్టు ఇప్పటికే ఓ నిర్థారణకు వచ్చారు. ట్రాన్స్ఫార్మర్ను పూర్తిగా విప్పి పరిశీలించిన తర్వాత నష్టంపై పూర్తి స్పష్టత వస్తుందని ప్రభుత్వానికి జెన్కో తెలియజేసింది. ట్రాన్స్‌ఫార్మర్‌లో అంతర్గత లోపాలు ఏర్పడడానికి నిర్మాణ, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలు కారణం కావొచ్చని భావిస్తున్నారు. -
కరెంట్ ‘కాలి’పోతోంది
సాక్షి, అమరావతి: వేసవి ఉష్ణోగ్రత విద్యుత్ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. మునుపెన్నడూ లేనంతగా మండిపోతున్న ఎండలు, వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు వంటి విపత్తుల కారణంగా కరెంటును పంపిణీ చేసే ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా సబ్ స్టేషన్లు అగ్ని గుండంలా మారుతున్నాయి. సాధారణంగానే వాటి వద్ద ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఈసారి ఆ పరిధిని మించి వేడి తరంగాలు చుట్టుముడుతున్నాయి. పవర్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేసేలా చర్యలు ఎండలకు భయపడి జనం బయటకు రావడం తగ్గించారు. పాఠశాలలకు సెలవులు. అవుట్డోర్ వర్క్స్ లేవు. ఇంట్లో ఉండి అన్ని ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇళ్లలో ఎసీల వినియోగం వల్ల ట్రాన్స్ఫార్మర్లపై ఊహించని భారం పడుతున్నది. ఒక ఇంటిలో ఒక ఏసీ వాడితే వచ్చే లోడ్ అకస్మాత్తుగా 500 వాట్స్ నుంచి 2 వేల వాట్స్‌గా మారుతోంది. ఇది రాత్రి సమయంలో సాధారణ హౌస్ డ్రాల్ కంటే 3 రెట్లు ఎక్కువ. దీనివల్ల ఎనిమిదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఎక్కువకు విద్యుత్ డిమాండ్‌కు చేరుకుంది. ఇంతలా కరెంట్ వాడకం రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వ్యవస్థ దాదాపు స్థిరంగా ఉండడం విశేషం. ఈ పరిస్థితిని ముందే ఊహించి ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడమే దీనికి కారణం. అయితే సాధారణ లోడ్ ఉన్పప్పుడు పవర్ ట్రాన్స్ఫార్మర్ చమురు ఉష్ణోగ్రత 35 నుంచి 40 డిగ్రీలు ఉంటుంది. కానీ అసాధారణ లోడ్, వేడి వల్ల ట్రాన్స్ఫార్మర్ చుట్టూ 70 నుంచి 80 డిగ్రీల వేడి ఉంటోంది. విద్యుత్ సబ్ స్టేషన్లలో పనిచేస్తూ, ట్రాన్స్ఫార్మర్లæ నిర్వహణను చూస్తున్న అధికారులు, సిబ్బంది ఇంత వేడిలో అక్కడ పనిచేయాలంటేనే భయపడిపోతున్నారు. అయినప్పటికీ విద్యుత్ సరఫరాలో ఆటంకం కలుగకూడదని, ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తూ, పవర్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేసేలా చేస్తున్నారు. అన్నిటా పిల్లర్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్లు రాష్ట్రంలో అన్ని చోట్లా పిల్లర్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే పెట్టాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. అంటే అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలు, పరిశ్రమల వద్ద పెట్టినట్లు గృహ, వ్యవసాయ అవసరాలకు కూడా సిమెంటు దిమ్మలపై ట్రాన్స్ఫార్మర్లను పెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం అనేక చోట్ల విద్యుత్ స్థంభాల మీద ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. అవి గాలి, వానకు పడిపోతున్నాయి. స్థంభం కూలిపోతే, దానిపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మార్చడానికి సమయం పడుతోంది. ఈ లోగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే అలాంటి ట్రాన్స్ఫార్మర్లు తీసేయాలని నిర్ణయించారు. కొన్ని చోట్ల 30 నుంచి 40 ఏళ్ల పాత కండక్టర్లు ఉన్నాయి. గత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోకుండా వదిలేశాయి. దీంతో కొద్దిపాటి గాలివాన, ఎండకే అవి తెగిపోతున్నాయి. వాటిని పూర్తిగా మార్చేసి, కొత్త లైన్లు వేసే పనిలో విద్యుత్ శాఖ ఉంది. -
భానుడి భగభగలు: ట్రాన్స్ఫార్మర్ల ముందు కూలర్లు, ఫ్యాన్లు
ఉత్తరాదిన భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో సామాన్యులు, జంతువులు, పక్షులే కాదు చివరికి విద్యుత్ పరికరాలు కూడా ఆ వేడిని తట్టుకోలేకపోతున్నాయి. విపరీతమైన ఎండ వేడిమికి విద్యుత్ శాఖకు చెందిన పరికరాలు గరిష్ట లోడ్ కారణంగా అత్యంత వేడిగా మారుతున్నాయి.పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న సమయంలో విద్యుత్ లోడ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్ల ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అవి పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటిని చల్లబరచేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది టాన్స్ఫార్మర్ల ముందు ఫ్యాన్లు, కూలర్లు అమరుస్తున్నారు.మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లోని చంబల్ కాలనీలోని విద్యుత్ గ్రిడ్‌లోని ట్రాన్స్ఫార్మర్, బీపీఎల్ కూడలిలోని విద్యుత్ గ్రిడ్ ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. వీటిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తున్నాయి. తద్వారా వారు విద్యుత్‌ను సక్రమంగా, అంతరాయం లేకుండా సరఫరా చేయగలుగుతున్నారు.సాధారణంగా విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్ఫార్మర్ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలి. అయితే వేడి కారణంగా ట్రాన్స్ఫార్మర్లోని ఆయిల్ వేడెక్కితే, దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. అలాగే ట్రిప్పింగ్ జరిగే అవకాశం కూడా ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఉష్ణోగ్రతను స్థిరంగా నిర్వహించడానికి వాటి మందు కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో ఇటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. -
మెట్ట రైతుకు మంచి రోజులు
కొమ్ముగూడెం, కృష్ణాపురం, బంగారుగూడెం గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి బోణం గణేష్ : ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌లో ఏమాత్రం లోటు రాకూడదు. రైతన్నలకు ఇచ్చే కరెంట్‌కు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగు చేయడం లేదా కొత్తది ఇవ్వడం జరగాలి. ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదు. సర్వీసు కూడా అడిగిన వెంటనే మంజూరు చేయాలి. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు’ అని అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రత్యేకంగా పూర్తిగా బోరు నీటిపైనే ఆధారపడి సాగు చేసే మెట్ట ప్రాంత రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముగూడెం, కృష్ణాపురం, బంగారుగూడెం గ్రామాల్లో రైతుల వ్యవసాయ క్షేత్రాలు కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా 2 విడతల్లో ఇచ్చేవారు. అది కూడా వేళకాని వేళల్లో వచ్చేది. గతంలో కరెంట్ కోసం రైతన్నలు రాత్రిపూట పొలాల్లో జాగారం చేయాల్సిన దుస్థితి. ఫీడర్లు సరిపడా లేకపోవడం వల్ల వ్యవసాయ మోటార్లు తరచూ కాలిపోయేవి. ఏపీలో ఉన్న 6,663 ఫీడర్లలో కేవలం 3,854 మాత్రమే వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అందుబాటులో ఉండేవి. ఒక్కో ట్రాన్స్ఫార్మర్పై నాలుగైదు సర్విసులు ఉండటం వల్ల ఏ సమస్య వచ్చినా అన్నిటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. మరమ్మతులకు నెలల తరబడి సమయం పట్టడంతో కళ్లెదుటే పంటలు ఎండిపోయేవి. పెట్టుబడులు కూడా వెనక్కి రాక అన్నదాతలు అఘాయిత్యాలకు పాల్పడ్డ దుస్థితి గతంలో నెలకొంది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.1,700 కోట్లను ఖర్చు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 19.92 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 6,605 ఫీడర్లు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉంది. విద్యుత్ ప్రమాదాలు, సరఫరా నష్టాలకు ప్రధానంగా ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు బలంగా లేకపోవడం, ఓవర్ లోడ్ కారణం. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణంతోపాటు ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యం పెంపు, పవర్ కెపాసిటర్ల ఏర్పాటు, పాత లైన్ల మరమ్మతులతో సమస్యలు తొలగిపోయాయి. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి వ్యవసాయ సర్వీసుకీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి కరెంట్ అందిస్తున్నారు. ప్రభుత్వానిదే భారమంతా.. తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు) పరిధిలో వ్యవసాయ ఫీడర్లు ఏటా 15,700 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. ఇది ఏపీలో ఏటా వినియోగించే 64 నుంచి 66 వేల మిలియన్ యూనిట్ల వినియోగంలో నాలుగింట ఒక వంతు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, బ్రేకర్ల జీవిత కాలం 25 ఏళ్లుగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిర్థారించింది. కాల పరిమితి తీరిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలి. లేదంటే యూనిట్‌కు రూ.8 చొప్పున నష్టాలు పెరుగుతాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి నాలుగైదు సర్విసులకు విద్యుత్ సరఫరా చేయడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు త్వరగా పాడవుతున్నాయి. ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటి మరమ్మతులకు రూ.102 కోట్లు ఖర్చవుతోంది. దీన్ని అధిగమించేందుకు హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (హెచ్‌వీడీఎస్), రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) ద్వారా ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ, ఫీడర్లను వేరు చేయడం లాంటి చర్యలు చేపట్టారు. బోరు దగ్గరకు 180 మీటర్ల వరకు ఉచితంగా విద్యుత్ లైన్లను సమకూరుస్తున్నారు. సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్లర్లు, లైన్ల సామర్థ్యం పెంచుతున్నారు. ఈ ప్రక్రియకు ఒక్కో వ్యవసాయ సర్విసుకు అయ్యే దాదాపు రూ.1.20 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రైతులకు ఏ కష్టం రాకుండా.. వ్యవసాయ రంగం అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు పంపిణీ వ్యవస్థను పటిష్టం చేశారు. ఏపీలో మొత్తం 2,12,517 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. వేలాది కి.మీ. పొడవున కొత్త లైన్లు నిర్మించాం. – కె.విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తడిచిన పొలమే తడిచి.. మా ప్రాంతంలో అంతా కరెంట్‌పై ఆధారపడే వ్యవసాయం జరుగుతుంది. గతంలో హెచ్‌టీ, ఎల్టీ లైన్లు ఒకే స్థంభం మీద ఉండటంతో చిన్న గాలికే కలిసిపోయి ట్రాన్స్ఫార్మర్, మోటార్ కాలిపోయేవి. రోజుకి 7 గంటలు అది కూడా 2,3 మూడు సార్లు కరెంట్ ఇవ్వడంతో తడిచిన పొలాలే తడిచి అవస్థలు ఎదుర్కొన్నాం. ఈ ప్రభుత్వం పగటిపూట 9 గంటలు కరెంటిస్తుంది. – రామకృష్ణ, ఉద్యాన రైతు, కొమ్ముగూడెం -
పంచాయతీ లెక్కలు అడిగినందుకు.. విద్యుత్ తీగలు పట్టుకున్న సర్పంచ్
న్యాల్కల్(జహీరాబాద్): గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చుల వివరాలు సభ్యులు అడగడంతో మనస్తాపానికి గురైన ఓ సర్పంచ్ విద్యుత్ తీగలను పట్టుకునాన్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధి రేజింతల్ గ్రామంలోజరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. సర్పంచ్ కుత్బుద్దీన్, కార్యదర్శి, వార్డు సభ్యులు హాజరయ్యారు. ‘పంచాయతీ అభివృద్ధికి ఎన్ని నిధులొచ్చాయి? ఏయే పనులు చేపట్టారు?’ వివరాలు కావాలని సభ్యులు నిలదీశారు. దీంతో అభివృద్ధి పనులను వివరించాలని రికార్డులను పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్ ఇచ్చారు. ఆమె వివరాలు వెల్లడిస్తున్న సమయంలో వార్డు సభ్యులు, సర్పంచ్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘గ్రామాభివృద్ధి కోసం పంచాయతీ నిధులతో పాటు ఇతర నిధులను తీసుకొచ్చినా నిలదీస్తారా? అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నా నన్నే అనుమానిస్తారా?’ అంటూ తీవ్ర మనస్తాపానికి గురైన సర్పంచ్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రైతు వేదిక దగ్గరకు వెళ్లి అక్కడున్న విద్యుత్ ట్రాన్స్పార్మర్ తీగలను పట్టుకున్నాడు. విద్యుదాఘాతంతో కింద పడిపోయాడు. విషయాన్ని గమనించిన పలువురు చికిత్స నిమిత్తం గంగ్వార్ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది బీదర్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో బీదర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని గ్రామస్తులు తెలిపారు. ‘సభ్యులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలే కాని విద్యుత్ తీగలు పట్టుకోవడం ఏమిటి’ అని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తూ ..
వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం సాహెబ్పేట్ గ్రామానికి చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ బట్టు బాలయ్య (59) శనివారం జానకంపేట్ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్పై విద్యుదాఘాతానికి గురై మర ణించాడు. ఓ ట్రాన్స్ఫార్మర్ నుంచి వ్యవసాయ పంపులకు విద్యుత్ అందట్లేదని రైతులు చెప్పడంతో ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా ఆపేసిన బాలయ్య దానిపైకి ఎక్కాడు. కానీ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా చేసే ఇన్సులేటర్ ఒకటి విరగడంతో యథావిధిగా విద్యుత్ సరఫరా అయ్యింది. దీన్ని బాలయ్య గమనించకపోవడంతో పైకెక్కగానే షాక్‌కు గురై ట్రాన్స్‌ఫార్మర్‌పైనే మరణించాడు. -
ఇక స్మార్ట్ సబ్స్టేషన్లు!
► అదో విద్యుత్ సబ్‌స్టేషన్. అక్కడ ఉద్యోగులెవరూ లేరు. అక్కడి నుంచి ఆ ప్రాంతంలోని గృహాలకు, దుకాణాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ► ఆ సబ్‌స్టేషన్ పరిధిలోని ఒక వీధిలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. సమాచారం ఇద్దామంటే సబ్‌స్టేషన్‌లో ఎవరూ లేరు. అయినా సంబంధిత విద్యుత్ సిబ్బంది వెంటనే అక్కడకు వచ్చి మరమ్మతులు ప్రారంభించారు. ... ఇందుకు కారణం సదరు సబ్‌స్టేషన్ నుంచి ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లడమే. ఉద్యోగులు, సిబ్బంది లేకుండా సమాచారం ఎలా వెళ్లిందనేగా మీ అనుమానం? ఆ సబ్‌స్టేషన్.. స్మార్ట్ సబ్‌స్టేషన్. ఉద్యోగులు, సిబ్బంది అవసరం లేకుండానే విద్యుత్ సరఫరాలో సమస్య, అధిక లోడు, తక్కువ లోడు ఇలా ఏ సమాచారమైన వెంటనే తెలియజేసేలా సబ్‌స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింద విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల సబ్‌స్టేషన్‌ను పూర్తి స్థాయి ఆటోమేషన్ సబ్‌స్టేషన్ (స్మార్ట్ సబ్‌స్టేషన్)గా తీర్చిదిద్దనుంది. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం అంతా కంట్రోల్ రూమ్ నుంచే.. వాస్తవానికి ఇప్పటికే గిడిజాల వద్ద 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఉంది. ప్రస్తుతం ఉన్న సబ్‌స్టేషన్ స్మార్ట్ సబ్‌స్టేషన్‌గా మారనుంది. ఈపీడీసీఎల్ పరిధిలోని అన్ని సబ్స్టేషన్లను స్మార్ట్ సబ్స్టేషన్లుగా మార్చేందుకు సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం రూ.334.51 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా ఆహ్వానించింది. గిడిజాల సబ్‌స్టేషన్‌ను స్మార్ట్ సబ్‌స్టేషన్‌గా మార్చేందుకు రూ.50 లక్షల మేర వ్యయమవుతుందని అంచనా వేసింది. ఈ సబ్‌స్టేషన్‌లో ఇక ఉద్యోగులెవరూ ఉండరు. పెదవాల్తేరు సబ్‌స్టేషన్‌లోని స్కాడ్ కంట్రోల్ రూమ్ నుంచే నడవనుంది. గిడిజాల సబ్‌స్టేషన్ పరిధిలోని విద్యుత్ పంపిణీ, ఇబ్బందులు ఇలా సమాచారమంతా ఆన్లైన్ ద్వారానే స్కాడ్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. తదనుగుణంగా ఇక్కడి నుంచే కార్యకలాపాలను నియంత్రించే వీలు కలగనుంది. మరింత నాణ్యమైన సేవలు.. ఈపీడీసీఎల్ పరిధిలోని సబ్స్టేషన్లను ఆటోమేషన్ కిందకు మార్చాలని భావిస్తున్నాం. ప్రయోగాత్మకంగా గిడిజాల సబ్‌స్టేషన్‌లో అమలు చేయనున్నాం. ఇందులో వచ్చే ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. స్మార్ట్ సబ్‌స్టేషన్‌లో ఎక్కడా ఉద్యోగుల అవసరం ఉండదు. అంతా రిమోట్ ద్వారానే నిర్వహించే వీలు కలుగుతుంది. వినియోగదారులకు కూడా మరింత నాణ్యమైన సేవలు అందుతాయి. – కె.సంతోషరావు, సీఎండీ, ఈపీడీసీఎల్ -
16 ఏళ్ల నిర్లక్ష్యం.. పోయిన ప్రాణం
సాక్షి, జగిత్యాల: జిల్లా వెల్గటూరు మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన మల్లవేని రాజు (35) గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ట్రాక్టరు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య స్వప్న, కూతురు అవిఘ్నయ(2) ఉన్నారు. ఈ నెల 13న విధుల్లో భాగంగా గ్రామానికి చెందిన ఓ కౌలు రైతు వ్యవసాయ భూమిలో పనికి వెళ్లాడు. అయితే ఆ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ నుంచి స్తంభానికి విద్యుత్ లైన్ ఉంది. ఎన్నో ఏళ్లుగా తీగలు వేలాడుతూ ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారు పట్టించు కోలేదు. దీంతో భూమి యజమాని తాత్కాలికంగా కర్రను సపోర్టుగా పాతాడు. పొలంలో రాజు ట్రాక్టరుతో పని చేస్తుండగా.. వేగంగా వీచిన గాలులకు కర్ర కింద పడిపోవడంతో ట్రాక్టరుకు తగిలిన తీగలు రాజుకు చుట్టుకుపోయాయి. దీంతో తీవ్ర విద్యుత్‌షాక్‌కు గురైన రాజు అక్కడికక్కడే చనిపోయాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే తన భర్త చనిపోయాడని రాజు భార్య స్వప్న ఆరోపిస్తోంది. 16 ఏళ్ల నుంచి ఆ సమస్య ఉందని రాజు సోదరుడు లక్ష్మణ్ చెప్పాడు. ఇదే ప్రాంతంలో 16 ఏళ్ల క్రితం వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి నాలుగు గేదెలు చనిపోయినా విద్యుత్ సిబ్బంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్యను పట్టించుకోలేదు. చదవండి: మూగజీవాలపై యమపాశం -
ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణం పోయింది
కోహెడరూర్(హుస్నాబాద్): ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతు చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురై ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ఓ వ్యక్తి ప్రాణాలు వదిలిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరెపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోరెడ్డిపల్లికి చెందిన మంద తిరుపతి(35) లైన్‌మన్ సహాయంతో ఎల్సీ తీసుకొని ఆరెపల్లిలోని ఓ రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తున్నాడు. మధ్యలోనే విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణాలు విడిచాడు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు మృతదేహం తో సిద్దిపేట– హన్మకొండ రహదారిపై ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రహదారి పై అటుగా వెళ్తున్న రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ ఘటనాస్థలాన్ని పరిశీలించి రూ.15 లక్షలు, తిరుపతి భార్యకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఆందోళన విరమించారు. -
ట్రాన్స్ఫార్మర్ను కూల్చేశారు!
అనంతపురం, కంబదూరు: తను ఏమి చేసినా.. ఎలా చేసినా అడిగేవారు లేరన్న ధీమాతో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ అడ్డదిడ్డంగా ముందుకెళ్తోంది. తమ పనికి ఎటువంటి అడ్డం లేకున్నా ఓ రైతు పొలంలోని ట్రాన్స్ఫార్మర్ను తొలగించేసింది. విద్యుత్ సరఫరా బంద్ కావడంతో ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని రైతుల పంటలు నీరందక నిలువునా ఎండిపోతున్నాయి. బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కళ్యాణదుర్గం నుంచి వైసీ పల్లి వరకు రెండు లేన్ల తారు రోడ్డు వేస్తున్నారు. ఈ పనులను ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ చేస్తోంది. అయితే దేవేంద్రపురం – వైసీ పల్లి గ్రామాల మధ్యలో రోడ్డు నిర్మాణానికి ఎలాంటి అడ్డూ లేకున్నా రైతు వేణుగోపాల్ పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను, విద్యుత్ స్తంభాలను రాత్రికి రాత్రే గుట్టుచప్పుడుగా తొలగించేశారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు ట్రాన్స్ఫార్మర్ పరిధిలో మూడు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. రైతులు వేణుగోపాల్ పది ఎకరాలు, లక్ష్మమ్మ ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేయగా.. కృష్ణానాయక్ ఐదు ఎకరాల్లో టమాట పెట్టాడు. రాత్రికి రాత్రే ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలను తొలగించేయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతులు సంబంధిత కాంట్రాక్టర్‌ను కలిసి గోడు వెల్లబోసుకుంటే మరమ్మతు చేయిస్తామని హామీ ఇచ్చారు. 15 రోజులు గడిచినా దాని గురించి పట్టించుకోలేదు. ప్రస్తుతం సాగులో ఉన్న వేరుశనగ, టమాట పంటలు నీరందక ఎండుముఖం పట్టాయి. రూ.లక్షల్లో పంట నష్టం వాటిల్లుతోందని రైతు వేణుగోపాల్‌రెడ్డి ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. అనుమతి లేకుండానే తొలగింపు.. ట్రాన్స్ఫార్మర్ తొలగింపునకు ఎటువంటి అనుమతీ పొందలేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండానే తొలగించారని తెలిపారు. ఇదే విషయమై ఆర్అండ్బీ డీఈ శ్రీనివాసులును వివరణ కోరగా.. ఇంతవరకూ తమ దృష్టికి రాలేదన్నారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం అన్యాయం ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వారు రోడ్డు నిర్మాణానికి ఎలాంటి అడ్డు లేకున్నా ట్రాన్స్ఫార్మర్ను, విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేయడం అన్యాయం. సంబంధిత రైతుకు çకనీసం సమాచారం ఇవ్వకుండా తొలగించడం సరికాదు. కాంట్రాక్టర్ నిర్వాకం వల్ల రైతు సాగు చేసిన పంట దెబ్బతింది. అ«ధికారులు కూడా కాంట్రాక్టర్‌కు వత్తాసు పలికి రైతుకు అన్యాయం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. – తిరుపాల్, మాజీ సర్పంచ్, రాంపురం -
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన స్కూల్ బస్సు
-
స్తంభం మీదే ప్రాణాలొదిలాడు
మర్పల్లి: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. వీధిలైట్లు అమర్చే క్రమంలో విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ శాఖ దినసరి కూలీ గోపాల్ విద్యుదాఘాతంతో స్తంభం మీదే మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కోటమర్పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. కోటమర్పల్లి గ్రామానికి చెందిన తుడుము గోపాల్(19) విద్యుత్ శాఖలో క్యాజువల్ లేబర్ ప్రభాకర్‌రెడ్డి వద్ద దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం అతడు గ్రామంలో వీధిలైట్లు బిగించి విద్యుత్ సరఫరా చేయాలని ప్రభాకర్‌రెడ్డికి చెప్పాడు. దీంతో ఆయన సబ్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. అంతలోనే గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద తీగలు తాకడంతో సబ్‌స్టేషన్‌లో విద్యుత్ ట్రిప్ అయింది. ఈ క్రమంలో ఎల్సీ కావాలని గోపాల్ కోరగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే, వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో స్తంభంపై ఉన్న గోపాల్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబీకులు, గ్రామస్తులు మర్పల్లి చౌరస్తా వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఘటనాస్థలానికి చేరుకొని మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
దర్జాగా విద్యుత్ చౌర్యం
చర్ల భద్రాచలం : మండలంలోని చింతగుప్ప సమీపంలో బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టర్ దర్జాగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాడు. ఆర్ కొత్తగూడెం నుంచి కుర్నపల్లికి వెళ్లే ప్రదాన రహదారి పక్కనే ఈ వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ విద్యుత్ శాఖాదికారులుగానీ, సిబ్బందిగానీ పట్టించుకోకపోవడాన్ని స్థానికులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. విద్యుత్ వాడకానికి సంబందించి కాంట్రాక్టర్ ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నేరుగా చింతగుప్పలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు వైర్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వంతెన నిర్మాణ ప్రాంతానికి సుమారు 600 మీటర్ల మేర సర్వీస్ వైరును ఏర్పాటు చేసి విద్యుత్తును చోరీ చేస్తున్నాడు. రెండు నెలల క్రితం ఆర్ కొత్తగూడెం– కుర్నపల్లి రహదారిలో చింతగుప్ప వద్దనున్న చింతవాగుపై వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా వెల్డింగ్, కటింగ్, రాడ్ బెండింగ్ వంటి పనులతోపాటు అక్కడ వర్కర్ల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాలకు విద్యుత్ అవసరమవ్వడంతో సంబందింత కాంట్రాక్టర్ విద్యుత్ చౌర్యానికి తెర లేపాడు. చింతగుప్పలో గ్రామస్తుల కోసం ఏర్పాటు చేసిన 6.6 కేవీఏ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ కటౌట్లకు వైరును తగిలించి 11 కేవీ విద్యుత్ లైన్‌కు స్తంభాల మీదుగా సుమారు 600 మీటర్ల సర్వీస్ వైరును వంతెన నిర్మాణ ప్రాంతం వరకు ఏర్పాటు చేశారు. అక్రమంగా ఏర్పాటు చేసిన ఈ విద్యుత్ లైన్‌తో అక్కడ వెల్డింగ్, కటింగ్ వంటి పనులు చేయిస్తూ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నప్పటికీ సంబందిత శాఖాదికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిరుపేదలు, గిరిజనులు, దళితులు కనీసం కరెంట్‌మీటరుకు గానీ కరెంట్బిల్లు గానీ కట్టలేని పరిస్థితిలో ఉండే వారు ఒకటో రెండో బల్బుల వాడకం కోసం విద్యుత్ సరఫరా తీసుకొని వాడుకుంటే కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించే విద్యుత్ శాఖాదికారులు... ఈ బహిరంగ విద్యుత్ చౌర్యంపై మౌనంగా ఉండడం వెనుక ‘ఏదో మతలబు’ ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ట్రాన్స్‌కో ఏఈ మోహన్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరింది. విద్యుత్ చౌర్యానికి పాల్పడే కాంట్రాక్టర్‌పై కేసులు నమోదు చేస్తామని ఆయన అన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ ఎక్కి రైతు ఆందోళన
సిద్ధిపేట జిల్లా: సిద్ధిపేట రూరల్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో ఓ రైతు ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. గ్రామానికి చెందిన బొల్ల బుచ్చయ్యకు చెందిన పొలంలో ట్రాన్స్ఫార్మర్ 15 రోజుల క్రితం చెడిపోయింది. ఈ సమస్య సదరు రైతు అధికారులకు ఎంత విన్నవించినా పరిష్కారం కాలేదు. దీంతో మంగళవారం కిరోసిన్ డబ్బా పట్టుకుని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. తన సమస్య పరిష్కారం కాకపోతే ట్రాన్ఫార్మర్ మీదే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటానని బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని స్థానిక రైతులు పోలీసులకు, విద్యుత్ అధికారులకు తెలియజేశారు. -
ట్రాన్స్ఫార్మర్ పేలడంతో మంటల్లో చిక్కుకున్న కారు
-
ప్రాణం తీసిన ట్రాన్స్ ఫార్మర్
జోగుళాంబ గద్వాల జిల్లా ఆలూరులో ముగ్గురు రైతులు బలి • సర్కారు ట్రాన్సఫార్మర్ రాక ప్రైవేటుగా కొన్న రైతులు • పొలంలోని దిమ్మెపై అమర్చుతుండగా ప్రమాదం • ముగ్గురు మృతి.. మరో నలుగురికి తీవ్ర గాయాలు • పరిహారం కోసం బంధువులు, గ్రామస్తుల డిమాండ్ • మృతదేహాలతో గ్రామంలో బైఠాయింపు • దరఖాస్తు చేసి ఆరు నెలలైనా అందని ట్రాన్స్ఫార్మర్లు • అధికారుల నిర్లక్ష్యం.. మామూళ్ల కక్కుర్తి • పంటలు ఎండిపోతాయనే ఆవేదనలో రైతులు • కాపాడుకునేందుకు సొంతంగా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు • బిగించే నైపుణ్యం లేక విద్యుత్ ప్రమాదాలు • తమ నిర్లక్ష్యమేమీ లేదంటున్న విద్యుత్ అధికారులు ఖరీఫ్ దెబ్బకొట్టింది.. రబీలోనైనా ఉన్న కాస్త భూమిని సాగుచేసుకుందామనుకున్నారు.. నీళ్లున్నా కరెంటు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ లేదు.. విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసినా ఎప్పుడు వస్తుందో తెలియదు.. సవాలక్ష కొర్రీలు.. అది లేదు, ఇది లేదంటూ రోజూ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడాలు.. కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల చేతులు తడిపినా పనవుతుందన్న నమ్మకం లేదు.. చేసేదిలేక ఆ రైతులే ఓ పాత ట్రాన్సఫార్మర్ కొనుక్కువచ్చారు.. బిగించేందుకూ సన్నద్ధమయ్యారు. కానీ బిగింపులో మెళకువలు తెలియకపోవడం వారి పాలిట శాపమైంది. విద్యుత్ షాక్‌కు గురై... గుడిసె కుర్వ ఉరుకుందు (45), మూలింటి కుర్వ పెద్ద బుడ్డన్న (45), కారం ఈదన్న (40) ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు రైతులు తీవ్రగాయాల పాలయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. - గట్టు ఇటీవల మంచి వర్షాలు పడడంతో గట్టు మండలంలోని ర్యాలంపాడు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ర్యాలంపాడు గ్రామానికి చెందిన రైతులు మూలింటి బుడ్డన్న, గుండన్న, గుడిసె పెద్ద నర్సింహులు కలిసి.. రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న వారి పొలాలకు పైపులైన్ ఏర్పాటు చేసుకున్నారు. దాని మోటార్లకు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్ కావా లి. విద్యుత్ శాఖకు దరఖాస్తు చేస్తే నెలలు గడిచినా ట్రాన్స్ఫార్మర్ వచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో.. తామే ప్రైవేటుగా ట్రాన్స్ఫార్మర్ కొనుగో లు చేయాలని నిర్ణయించుకున్నారు. బ్యాక్‌వాటర్ సమీపంలో ఉన్న గుడిసె తిమ్మప్ప పొలంలో కొందరు రైతులు ఇప్పటికే రెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నారు. వాటి పక్కనే తాము మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కర్ణాటకలో పాత ట్రాన్సఫార్మర్ కొనుగోలు చేసి మరమ్మతు చేయించుకున్నారు. శుక్రవారం మూలింటి బుడ్డన్న ట్రాక్టర్లో ట్రాన్స్ఫార్మర్ను తీసుకుని గుడిసె తిమ్మప్ప పొలానికి బయలుదేరాడు. దానిని అమర్చేందుకు సహాయం కోసం కారం ఈదన్న, చిన్న జమ్మన్నలతోపాటు పక్క పొలానికి చెందిన కుర్వ ఉరుకుందు, బసన్న, గోవింద్, నర్సప్పలను పిలిచాడు. తిమ్మప్ప పొలం లో అప్పటికే ఉన్న 2 ట్రాన్స ఫార్మర్ల పక్కనే ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు దిమ్మె నిర్మించారు. దానికి, ట్రాక్టర్ ట్రాలీకి అనుసంధానంగా ఇనుప పైపు పెట్టారు. దానిపై ట్రాన్స ఫార్మర్ ఉంచి దిమ్మెపైకి నెడుతుండగా.. అది ఒరిగి పక్కనున్న ట్రాన్సఫార్మర్కు తగిలింది. దీంతో ఏడుగురు రైతులూ విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ట్రాన్స్ఫార్మర్ను గట్టిగా పట్టుకున్న గుడిసె ఉరుకుందు(45), కారం ఈదన్న (45) మూలింటి బుడ్డన్న(40) అక్కడికక్కడే మృతిచెందారు. నర్సప్పకు తీవ్రగాయాలుకాగా గోవిందు, బసన్న, చిన్న జమ్మన్నకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో నర్సప్ప పరిస్థితి విషమంగా ఉండడంతో గద్వాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు రైతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. రోడ్డున పడిన మూడు కుటుంబాలు సాయం చేసేందుకు వెళ్లిన ముగ్గురు రైతులు మృత్యువాత పడడంతో వారి కుటుంబాలన్నీ విషాదంలో మునిగిపోయాయి. ఘటనలో మ రణించిన బుడ్డన్నది పేద కుటుంబం. ఆయనకు భార్య సరోజమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారికి నాలుగు ఎకరాల పొలం ఉండేది. ర్యాలంపాడు రిజ ర్వాయర్‌లో ముంపునకు గురైంది. దాంతో బుడ్డన్న కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పుడాయన మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైపోయింది. గుడిసె ఉరుకుందుకు భార్య గోవిందమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కారం ఈదన్నకు భార్య సుజాత, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్దలు మరణించడంతో వారంతా కన్నీట మునిగిపోయారు. పరిహారం కోసం ఆందోళన... మృతి చెందిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలంటూ ఆలూరు గ్రామస్తులు, మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. జిల్లా అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చేదాకా మృతదేహాలను తరలించేది లేదంటూ బైఠాయించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఏఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల డీఎస్పీ బాలకోటి, సీఐ సురేశ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదే హాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా గ్రామస్తులు, బంధువులు అడ్డుకున్నారు. దీంతో రాత్రి వరకు కూడా మృతదేహాలను గ్రామంలోనే ఉంచారు. సాయం చేసేందుకు వెళ్లి.. కారం ఈదన్న, చిన్న జమ్మన్న కలసి పునరావాస కేంద్రంలో ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకకు అనుమతి కోసం గట్టు తహసీల్దార్ కార్యాలయానికి బయలుదేరారు. కానీ ట్రాన్స్ఫార్మర్ను దిమ్మెపై అమర్చడానికి సాయం చేయాల్సిందిగా మిగతా రైతులు కోరడంతో తోడుగా వెళ్లారు. వారిలో ఈదన్న మరణించగా.. జమ్మన్న తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లే.. సాక్షి, గద్వాల: విద్యుత్ శాఖ నుంచి సకాలంలో ట్రాన్స్ఫార్మర్లు అందకపోవడం, మామూళ్ల కోసం అధికారుల కక్కుర్తి, ప్రభుత్వ నిర్లక్ష్యం, రైతుల అవసరాన్ని గుర్తించకపోవడం, కనీస పర్యవేక్షణ లేకపోవడం వంటివి రైతుల ఉసురు తీస్తున్నాయి. పంటలు కళ్లముందే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతుండడంతో.. రైతులు పంటను రక్షించుకోవాలన్న తపనతో తామే ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు గతంలో డీడీ తీసిన వెంటనే సరఫరా చేసేవారు. రెండేళ్లుగా పెద్ద సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కానీ అధికారులు తగిన స్థాయిలో సరఫరా చేయడంపై దృష్టి సారించడం లేదు. నలుగురు రైతులు కలిసి ఒక్కొక్కరూ రూ.6 వేల చొప్పున మొత్తం రూ.24 వేలు డీడీ తీసి ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. దానికితోడు అధికారులు మరో రూ.24 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇలా డబ్బులు చెల్లించినా ట్రాన్స్ఫార్మర్ మంజూరుకావడానికి సుమారు 6 నెలల నుంచి ఏడాది కాలం పడుతోంది. దీంతో రైతులు పంటలను కాపాడుకోవడానికి ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్లు తెచ్చుకుని, ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సుమారు రూ.25 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం ద్వారా మంజూరైన ట్రాన్స్ఫార్మర్కు అధికారులే దగ్గరుండి కనెక్షన్ ఇస్తారు. కానీ రైతులు ప్రైవేటుగా తెచ్చుకుంటున్న ట్రాన్స్ఫార్మర్లకు వారే కనెక్షన్లు ఇచ్చుకోవడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్క గట్టు మండలంలోనే సుమారు 300 ట్రాన్సఫార్మర్లను అనధికారికంగా ఏర్పాటు చేసుకున్నట్లు అంచనా. మాకు సమాచారం లేదు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాన్సఫార్మర్లకు మేమే కనెక్షన్లు ఇస్తాం. మాకు తెలియకుండా రైతులు ప్రైవేటుగా కొనుగోలు చేశారు. ఇలాంటి ప్రైవేటు ట్రాన్సఫార్మర్లను మేం ప్రోత్సహించం. ఆ ట్రాన్సఫార్మర్ బిగించుకుంటున్నట్లు సమాచారం కూడా లేదు. మాకు తెలియకుండా రైతులే కనెక్షన్ ఇచ్చుకునేందుకు ప్రయత్నించారు. కనీసం లైన్ క్లియర్ కూడా అడగలేదు.. - గట్టు ట్రాన్సకో ఏఈ ఆర్థర్ కాటన్ అధికారుల నిర్లక్ష్యమేమీ లేదు విద్యుత్ శాఖ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా ప్రైవేటుగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మాకు దరఖాస్తు చేసుకుంటే లైన్‌మన్‌ను పంపించి ఏర్పాటు చేస్తాం. కానీ ఇతర ప్రాంతాల నుంచి ట్రాన్స్ఫార్మర్ను కొనుగోలు చేసుకువచ్చి.. ప్రభుత్వ ట్రాన్స్ఫార్మర్కు కనెక్షన్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆలూరులో చనిపోయిన రైతులకు విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణం కాదు.. - శ్రీనివాస్, విద్యుత్‌శాఖ డీఈ ఎల్సీ తీసుకోలేదు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సంబంధించి రైతులు లైన్ క్లియర్ కోసం ఉదయం 11.50కు ఫోన్ చేశారు. ఎల్సీ ఇవ్వాలంటే లైన్‌మన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని రైతులకు సూచించా. ఆ తర్వాత రైతుల నుంచి సమాచారమేదీ లేదు. ఆలూరు ఫీడర్‌కు ఉదయం 10 గంటల నుంచి సింగిల్ ఫేస్ లైన్ ఆన్‌లో ఉంది. మధ్యాహ్నం 12.30 గంటలకు త్రీఫేజ్ లైన్ ఆన్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఘోరం జరిగింది. - చెన్నకేశవులు, ఆలూరు సబ్‌స్టేషన్ ఆపరేటర్ -
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొని లారీ దగ్ధం
దమ్మపేట(ఖమ్మం జిల్లా): ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామ శివారులో వేగంగా వెళుతున్న బొగ్గు లోడుతో ఉన్నలారీ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న ట్రాలీ లారీని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొంది. ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో బొగ్గులారీ లోడుతో ఉన్న లారీ దగ్ధమైంది. లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రుణ్ణి సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బొగ్గు లారీ పూర్తిగా దగ్ధమైంది. -
ఏటీ అగ్రహారంలో తప్పిన ప్రమాదం
గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఏటీ అగ్రహారంలో పెద్ద ప్రమాదమే తప్పింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఏటీ అగ్రహారంలో ఓ చెట్లకొమ్మ విరిగి పడటంతో ఏడు విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగలడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. దాంతో దగ్గరలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో పెద్ద ఎత్తునా మంటలు చెలరేగాయి. ఘటన స్థలికి దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. -
దొంగల చేతిలో ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం
గోరంట్ల : మండల పరిధిలోని కదిరి- హిందూపురం ప్రధాన రహదారి లోని చింతమానుపల్లి సమీపంలో వ్యవసాయ బోర్లకు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ్వంసం చేసి , రాగి వైరును చోరీ చేశారు. 25కెవీ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేయడంతో అందులో ఉన్న సుమారు 60 లీటర్ల మేర ఆయిల్ కింద పారబోసి, ట్రాన్స్‌ఫార్మర్‌లో అమర్చిన 55కిలోల రాగి తీగలను తీసుకె ళ్లిపోయారు. దీంతో రూ. 24 వేలరూపాయల మేర ఆస్ధినష్టంతో పాటు బోరుకింద సుమారు 5 ఎకరాల్లో స్ప్రింక్లర్ల సౌకర్యంతో సాగు చేసిన వేరుశనగ పంట దెబ్బతినే ప్రమాదం ఉందని బాధిత రైతు చింతమానుపల్లి ముత్యాలప్ప తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబసభ్యులు మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. -
ట్రాన్స్‌కో.. జర దేఖో
ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా...? ఇనుప చువ్వలు తేలిన కరెంట్ స్తంభాలు ఆశాలపల్లి(సంగెం) : అధికారులు ప్రమాదాలను పసిగట్టడంలో విఫలమవుతున్నారు. సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఆశాలపల్లిలో కరెంట్ స్తంభం ఇనుప చువ్వలు తేలి సగం విరిగిపోయి ఎపుడు పడిపోతుందో నన్న భయం జంకుతోంది. గ్రామంలోని బొడ్రాయి వద్ద మాచర్ల కుమారస్వామి ఇంటివద్ద గల 11 కెవి విద్యుత్ స్తంభం సిమెంట్ ఊడిపోయి లోపల ఉన్న ఇనుప చువ్వలు తుప్పుపట్టిపోయూరుు. దానికే సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ను అమర్చారు. వేసవిలో గాలి దుమారాలు అధికంగా వస్తున్నందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇటీవల మండలంలోని వంజరపల్లిలో వేలాడుతున్న 11 కేవి విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మహిళలు దుర్మణం పాలైన సంఘటనలో ఏఈ సహా నలుగురి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదం జరకుముందే శిథిలమైన స్తంభం స్థానంలో మరో స్తంభం ఏర్పాటు చేసి ప్రమాదాన్ని నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పరుపుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లా: షామీర్పేట్ మండలం మలక్‌పేట్ గ్రామ పరిధిలోని ఓ పరుపుల ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీబాలాజీ ఫోమ్స్ కంపెనీలోని స్పాంజి తయారీలో వాడే రసాయనాలు ప్రమాదవశాత్తు అంటుకుని మండాయి. అగ్నికీలలు పక్కనే ఉన్న కార్మికుల క్వార్టర్లలోకి కూడా వ్యాపించాయి. మంటలు వ్యాపించి ఫ్యాక్టరీలో ఉంచిన స్పాంజి మొత్తం ఆహుతయింది. యంత్రాలు మాత్రమే మిగిలాయి. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో అక్కడి కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పేలిన ట్రాన్స్ఫార్మర్..తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పేలింది. ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు ఎగసిపడి కాలిపోయింది. అయితే, ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. -
విద్యుదాఘాతానికి వ్యక్తి బలి
► మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ► జిన్‌కుంట సబ్‌స్టేషన్‌లో ఘటన బల్మూర్ : సబ్‌స్టేషన్‌లో పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గంటపాటు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. బల్మూర్ మండలంలోని జిన్‌కుంటకు చెందిన నెల్లి సలేశ్వరం (40), లక్ష్మయ్య, యాదయ్య సుమారు పదేళ్లుగా విద్యుత్ కాంట్రాక్టర్ చుక్కారెడ్డి వద్ద కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం స్థానిక సబ్‌స్టేషన్‌లో ఈ ముగ్గురూ తొమ్మిది గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కోసం 33/11 పవర్ ట్రాన్స్ఫార్మర్ లైన్ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం స్తంభాలపై ఉన్న వారు ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయారు. ఇది గమనించిన తోటి సిబ్బంది వెంటనే నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సలేశ్వ రం మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారిం చారు. అనంతరం మిగతా ఇద్దరినీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, సలేశ్వరానికి భార్య భీమమ్మతోపాటు కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనతో వారు కన్నీరుమున్నీరయ్యారు. అధికారుల నిర్లక్ష్యమేనని రాస్తారోకో సబ్‌స్టేషన్‌లో పనులు చేస్తున్నపుడు ఏబీ స్విచ్‌ను బంద్ చేయాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని మృతుడి కుటుంబ స భ్యులు, బంధువులు, జిన్‌కుంట గ్రామస్తులు ఆరోపించారు. ఈ పని ఏడీ, ఏఈ పర్యవేక్షణలో ఎల్సీ (లైన్ కట్) తీసుకు ని చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యం వహించారన్నారు. సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిం చే ఆపరేటర్లు నిత్యం మద్యం మత్తులో జోగుతుంటారన్నారు. ఈ మేరకు వారు అచ్చంపేట-నాగర్‌కర్నూల్ రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఈ రూట్లో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీధర్ అక్కడికి చేరుకుని బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సంఘటనపై మృతుడి భార్య భీమమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అంతిరెడ్డిపల్లిలో రైతు.. వెల్దండ : మరో సంఘటనలో వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంతిరెడ్డిపల్లికి చెందిన కొండల్‌రెడ్డి (42) వృత్తిరీత్యా రైతు. ఈయనకు భార్య సుగుణమ్మతోపాటు ఇద్దరుకు మార్తెలు ఉన్నారు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం సమీపంలోని తమ పొలం వద్ద అతను బోరుమోటార్ వైర్లు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలి స్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ జానకిరాంరెడ్డి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటనతో బాధిత కుటుంబ సభ్యులు బోరుమన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కుల్కచర్ల(రంగారెడ్డి జిల్లా): ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పరిగి మండల పరిధిలోని రాంరెడ్డిపల్లిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు.. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన గోపాల్(25) తన మామతో కలిసి రాంరెడ్డిపల్లికి చెందిన గొల్ల భీమయ్య బోరుబావికి విద్యుత్ లైన్ వేయడానికి వచ్చాడు. పనులు పూర్తయిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ దగ్గర కనె క్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ ప్రసారం బంద్ చేశామని చెప్పడంతోనే గోపాల్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడని, వారి నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. -
లైన్మెన్పై చెప్పుతో దాడి
రాప్తాడు పీఎస్‌లో కేసు నమోదు నిందితుడికి అధికార పార్టీ అండ అనంతపురం : అధికార పార్టీ అండదండలతో నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, చివరికి దాడులు చేయడం పరిపాటిగా మారుతోంది. తాజాగా రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో మాట వినని ట్రాన్స్‌కో లైన్మెన్ను చెప్పుతో దాడి చేశాడు ఓ నాయకుడు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలిలా ఉన్నాయి. గొందిరెడ్డిపల్లి, పుల్లలరేవు గ్రామాలకు బోయ నాగరాజు అనే వ్యక్తి లైన్మెన్గా పని చేస్తున్నాడు. గొందిరెడ్డిపల్లికి చెందిన నాగభూషణం, నారాయణస్వామి, లక్ష్మీనారాయణకు ట్రాన్స్ఫార్మర్ మంజూరైంది. ఈ నెల 17న లైన్మెన్ నాగరాజు దగ్గరుండి ట్రాన్స్ఫార్మర్ బిగించారు. ఈ పనిలో తక్కిన 11 కేవీ కండక్టర్ వైరును ట్రాన్స్‌కో కార్యాలయానికి తరలించారు. అయితే లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మిగులు వైరును తనకివ్వాలని లైన్మెన్ను కోరాడు. నిబంధనల ప్రకారం మిగులు వైరును కార్యాలయానికి తరలిస్తామని, ఇవ్వడానికి వీలుకాదని లైన్మెన్ స్పష్టం చేశాడు. ఇది మనుసులో పెట్టుకున్న లక్ష్మీనారాయణ మరుసటి రోజు 18న ఉదయం 9 గంటల సమయంలో గొందిరెడ్డిపల్లిలో ఎదురైన లైన్‌మన్‌ను దుర్భాషలాడుతూ దాడికి దిగాడు. కిందపడేసి చెప్పుతో దాడి చేశాడు. స్థానికులు కల్పించుకుని విడిపించారు. రాప్తాడు పీఎస్‌లో కేసు నమోదు : ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైన లైన్మెన్ నాగరాజు నేరుగా రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. నిందితుడికి అధికార పార్టీ నాయకులు అండ ఉండటంతో పోలీసులూ చూసీ చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కేసు కూడా వెనక్కు తీసుకోవాలని బాధితుడిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఒకానొక సందర్భంలో బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా బోయ నాగరాజు తనకు జరిగిన అవమానంపై కుల నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. -
విద్యుత్‌షాక్‌తో రైతు మృతి
మద్దూరు : పొలం వద్ద ఉన్న ఎస్ఎస్-3 ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్ ఆఫ్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గరై రైతు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా మద్దూరు మండలం మర్మాముల శివారు బంజరలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వేచరేణి యాదగిరి (45) తన పొలంలో వరి సాగు చేసాడు. ఈ వారం రాత్రి 1 నుంచి ఉదయం 7 గంటల వరకు త్రీఫేస్ విద్యుత్ ఉంటుంది. మంగళవారం సరఫరా నిలిచిపోయి పంపులు నడవకపోవడంతో పక్క రైతులు రాత్రి 2 గంటలకు వచ్చి యూదగిరిని నిద్ర లేపారు. వారితో కలసి పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లిన యూదగిరి.. ఫ్యూజ్ వైర్ వేస్తుండగా షాక్‌కు గురై పడిపోయూడు. పక్కనున్న రైతులు వెంటనే చేర్యాల ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయకముందే బుధవారం ఉదయం 7 గంటలకు యూదగిరి మృతి చెందాడు. భార్య మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పులి రమేష్ తెలిపారు. -
చీకట్లో వెలుగుతుంది వెలుగొస్తే ఆరుతుంది
ప్రయోజనం * మార్కెట్లోకి ఫొటో రిసెప్టర్ బెడ్‌లైట్స్ * కొత్త మోడల్స్‌లో ఎల్ఈడీ బెడ్ లైట్స్ కూడా అనంతపురం : శయన మందిరాల చిరుకాంతులు చిందించేందుకు ఇప్పుడు ఎన్నో మోడల్స్‌లో ఎల్ఈడీ లైట్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. కోడిగుడ్డు లాంతరులా ఉండే బల్బులు కొంత కాలం పడక గదులను ఏలాయి. వాటి స్థానంలో చిన్న బల్బులు (జీరో వాట్) వచ్చాయి. అయితే వీటికి ట్రాన్స్ఫార్మర్ ఉండేది. బల్బు మిణుకు మిణుకుమంటుంటే ట్రాన్స్ఫార్మర్ మార్చుకునే పరిస్థితి ఉండేది. బెడ్రూమ్ అలంకరణలకు ప్రాధాన్యత పెరగడంతో బెడ్బల్బులు కూడా రూపాంతరం చెందాయి. త్వరగా మారుతున్న టెక్నాలజీతో అతి తక్కువ విద్యుత్ వినియోగించుకుంటూ కంటికి ఇంపుగా ఉండే బల్బులకు ప్రాధాన్యత పెరిగింది. తాజ్‌మహల్, వేలాడే ఇల్లు, పక్షుల ఆకారాలు, నత్త, డాల్ఫిన్, గ్లోబ్ తదితర ఎన్నో ఆకారాల్లో బెడ్ బల్బులు మార్కెట్‌ను ఎప్పుడో ఆక్రమించాయి. తాజాగా ఎల్ఇడీ బల్బులు హవా నడుస్తున్న తరుణంలో చైనా నుంచి ఎల్ఈడీ నైట్ ల్యాంపులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. చైనాకు చెందిన ఈ ఎల్ఈడీ లైట్లు రూ.100 నుంచి రూ.200 మధ్య ధరలో లభిస్తున్నాయి. ఫొటో రిసెప్టర్ లైట్ల ప్రత్యేకత కొత్తగా వస్తున్న ఫొటో రిసెప్టర్ లైట్లకు ఓ ప్రత్యేకత ఉంది. పడక గది (ఏ గది అయినా) లో లైట్ వేసేవరకు వెలుగుతూ ఉన్న రిసెప్టర్ ఎల్ఈడీ లైట్ ఆటోమేటిక్‌గా ఆరిపోతుంది. ఈ లైట్ కాంతి ఉన్నప్పుడు అంటే పగలు వెలుతురు ఉన్న గదిలోను, రాత్రివేళ లైటు వెలిగి ఉన్న గదిలోను ఆరిపోయి ఉంటుంది. చీకటి ఉంటే వెలుగుతుంది. చైనాకు చెందిన వీటి ధర సుమారు రూ.2 వేల వరకు ఉంటుంది. -
ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని రైతుల నిరసన
ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరిన రైతులతో ఏఈ దురుసుగా ప్రవర్తించడంతో కోపోద్రిక్తులైన అన్నదాతలు ఆయనపై దాడికి యత్నించారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం రైతులు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు కోసం వినతి పత్రం అందిస్తుండగా.. ఏఈ చెన్నకృష్ణ రైతులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహించిన అన్నదాత లు ఏఈపై దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు ఇది గుర్తించి రైతులను అడ్డుకున్నారు. దాడికి యత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. -
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన ట్రాక్టర్
గరిడేపల్లి: మద్యం మత్తులో ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం మంగాపురం గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ట్రాక్టర్‌పై వస్తున్న లింగయ్య రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టడంతో... ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉన్న స్తంభం కూలిపోయి హైటెన్షన్ విద్యుత్ తీగలు కిందపడ్డాయి. అదే సంమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు గ్రామస్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
మైక్రోవేవ్ ఓవెన్ ఇలా పనిచేస్తుంది!
1. మనం స్విచ్ ఆన్ చెయ్యగానే మైక్రో ఓవెన్లోని ట్రాన్స్ఫార్మర్.. ఇళ్లలో ఉండే 220 వోల్టుల విద్యుత్తును 4000 లేదా అంత కంటే ఎక్కువ వోల్టుల పవర్ గా మార్చి మాగ్నెట్రాన్కు అందిస్తుంది. ఈ మాగ్నెట్రాన్ విద్యుత్తు నుంచి సూక్ష్మ తరంగాలను పుట్టించడం కోసం ఓవెన్ లోపల ఏర్పాటై ఉంటుంది. 2. లోనికి వెళ్లిన హై ఓల్టేజీ.. మాగ్నెట్రాన్ మధ్యలో ఉండే ఫిలమెంటును వేడిచేసి ఎలక్ట్రాన్లను మండిస్తుంది. ఈ ఎలక్ట్రాన్లు రెండు వలయాల అయస్కాంతాలతో గిర్రున తిరగడం వల్ల వేడి ఉద్భవిస్తుంది 3. మాగ్నెట్రాన్పై ఉండే ఏంటెన్నా ద్వారా సూక్ష్మ తరంగాలు కుకింగ్ చాంబర్లోకి వెళతాయి. 4. అలా చాంబర్లోకి వెళ్లిన తరంగాలు ఆహార పదార్థాన్ని అన్ని వైపుల నుంచి సమంగా వేడి చేస్తాయి. 5. ఓవెన్ తలుపుకు లోహపు వల (మెటల్ మెష్) ఉంటుంది. దానికి రంధ్రాలు ఉంటాయి. అవి తరంగాలు తప్పించుకోలేనంత చిన్నవిగా, అదే సమయంలో లోపల కుక్ అవుతున్న పదార్థం కనిపించే విధంగా ఉంటాయి. 6. అన్ని వైపుల నుంచి వేడి సమానంగా అందేందుకు వీలుగా ఆహారాన్ని టర్న్ టేబుల్ గుండ్రంగా తిప్పుతూ ఉంటుంది. -
ట్రాన్స్ఫార్మర్ పేలి ఏఈ మృతి
చంద్రగిరి: ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఈ నాగరాజు చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నరిశింగాపురం గ్రామ సమీపంలోని శ్రీ పద్మావతి కార్లిడెట్ కంటైనర్స్ ఫ్యాక్టరీ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ ట్రాన్స్ పార్మర్‌కు మరమ్మత్తులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ పేలి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న నాగరాజుకు మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను 108 సాయంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో చైన్నైలోని అపోలోకు తీసుకువెళ్లారు. కాగా.. శరీరంలోని అధిక భాగాలు కాలిపోవడంతో.. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి
మర్రిగూడ: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ముత్యాలు (50) అనే వ్యక్తి ఇంటి పక్కనే ఉన్న ట్రాన్స్ఫారం దగ్గర ముళ్ల చెట్లు పెరిగిపోవడంతో వాటిని తొలగించేందుకు వెళ్లాడు. వైర్లు పక్కనే ఉండడంతో ట్రాన్స్ఫారం ఆఫ్ చేసి చెట్లను కొడదామనుకున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫారంను ఆఫ్ చేయబోగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రాన్స్ఫార్మర్ను తాకిన బాలుడికి తీవ్ర గాయాలు
గార్లదిన్నె(అనంతపురం) : ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తూ ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలకేంద్రంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలకేంద్రానికి చెందిన షేక్ షావలి(12) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కాగా ఈ రోజు పాఠశాలకు సెలవు కావడంతోపాటు బంద్ ప్రభావం ఉండటంతో ఇంటి ముందు క్రికెట్ ఆడుకుంటున్నాడు. అయితే షేక్ షావలి బంతి ట్రాన్స్ఫార్మర్ వద్ద పడటంతో దాన్ని తీసుకురావడానికి వెళ్లాడు. బంతిని తీసే క్రమంలో ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. -
ఆడుకుంటూ అనంతలోకాలకు
- చిన్నారిని చిదిమేసిన ట్రాన్స్ఫార్మర్ - విద్యుదాఘాతానికి బాలుడి మృతి - అధికారుల నిర్లక్ష్యమే కారణం జగద్గిరిగుట్ట: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటూ అక్కడే ఉన్న కంచెలేని ట్రాన్స్ఫార్మర్ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్‌కు చెందిన ప్రభాకర్, శోభ దంపతులు మైసమ్మనగర్కు వలస వచ్చి భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. వీరికి కుమారుడు విష్ణు (5) సంతానం. భార్యాభర్తలిద్దరూ గురువారం కూలి పనులకు వెళ్లగా.. ఇంటి వద్దే ఉన్న విష్ణు మధ్యాహ్నం 3 గంటలకు ఓ ఇంటి ముందు ఉన్న అరుగుపై ఆడుకుంటూ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రుల రోదన పలువురిని కంటతడి పెట్టించింది. కుటుంబానికి న్యాయం చేయాలి.. ట్రాన్స్ఫార్మర్ ఎత్తుపెంచి, చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోపోవడంతోనే ప్రమాదం జరిగిందంటూ బాలుడి మృతదేహంతో సంఘటన స్థలంలో ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యుత్ అధికారులు, పోలీసులు నచ్చచెప్పి ఆందోళన విరమింపచేశారు. -
ట్రాన్స్ఫార్మర్ పేలి హెల్పర్‌కు గాయాలు
కథలాపూర్ : ఆదిలాబాద్ జిల్లా లో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోవడంతో హెల్పర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని కథలాపూర్ మండలంలో గురువారం జరిగింది. మండలంలోని చింతకుంట గ్రామంలో ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. ఆయిల్ మీద పడడంతో అక్కడున్న ప్రైవేటు హెల్పర్ వంతెన శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. అతణ్ణి వెంటనే కథలాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ట్రాన్స్‘ఫార్మర్’పైనే బలి
విద్యుత్ సిబ్బందిని నిలదీసిన రైతులు నిజామాబాద్ రూరల్: ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజు వైరులో సమస్యతో త్రీఫేస్ కరెంట్ రావడం లేదని విద్యుత్ అధికారులకు విన్నవించినా.. పట్టించుకోలేదు. వర్షాభావంతో పంట ఎండుతుండడంతో చివరకు ఓ రైతు సరి చేద్దామని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ప్రాణాలు కోల్పోయిన ఘటన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధి ధర్మారం గిరిజన తండాలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు బానోత్ రమేష్ (23) విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పెకైక్కి చెడిపోయిన వైర్లను మరమ్మతులు చేస్తుండగా.. ఒక్కసారిగా విద్యుత్ ప్రసారం కావడంతో ట్రాన్ఫార్మర్ పైనే ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజులుగా తండాలోని ఫీజు వైరు సమస్యతో టు ఫేస్ కరెంట్ మాత్రమే వస్తోంది. ఈ మేరకు స్థానిక రైతులు ఏఈ, లైన్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో రమేష్ ఉదయం ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు ప్రాణాలు కోల్పోయాడని స్థానిక రైతులు విద్యుత్ అధికారులను నిలదీశారు. పోలీసులు వచ్చి రైతులను సముదాయించారు. -
ట్రాన్స్‘ఫార్మర్’పైనే.. ప్రాణాలు విడిచాడు..
ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్ వేయబోయి ఓ రైతు తన ప్రాణం పోగొట్టుకున్నాడు. నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన రైతు సరసం సుధాకర్‌రెడ్డి(52) మంగళవారం పొలంలో వరినాట్లు వేయించాడు. నీరు పెడదామని బుధవారం మోటార్ ఆన్‌చేయగా కరెం టు లేదు. సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలించగా ఫ్యూజ్ ఊడిపోయినట్లు గుర్తిం చాడు. దీంతో ఫ్యూజ్ వేద్దామని ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేశాడు. కానీ సరిగా ఆఫ్కాలేదు. అది గమనించని సుధాకర్‌రెడ్డి ఫ్యూజ్ వేస్తుం డగా.. విద్యుదాఘాతంతో అదే ట్రాన్స్ఫార్మర్పై పడి ప్రాణాలు వదిలాడు. -భూదాన్ పోచంపల్లి -
ట్రాన్స్‘ఫార్మర్’ ఇబ్బందులు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. వర్ధన్నపేటలోని 133/11 కేవీ సబ్‌స్టేషన్‌లోని 50 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ మూడు వారాల కిత్రం కాలిపోరుుంది. ఫలితంగా ఆయూగ్రామాలకు కరెంట్ కోతలు తప్పడంలేదు. ఓ వైపు వర్షాభావం.. మరోవైపు విద్యుత్ కోతలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. - కాలిపోయిన పవర్ ట్రాన్స్ఫార్మర్ - ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం - 100కుపైగా గ్రామాల్లో విద్యుత్ అంతరాయం - కాలుతున్న మోటార్లు వర్ధన్నపేట 133/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి మైలారం, నందనం, కొండూరు, కూనూరు ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతోంది. మైలారం ఫీడర్లో మైలారం, ల్యాబర్తి, అన్నారం, నందనం ఫీడర్లో నందనం, పంథిని ఐనవోలు, ఇల్లంద, వడ్లకొండ.. కొండూరు ఫీడర్లో కొండూరు, రాయపర్తి, కాట్రపల్లి.. కూనూర్ ఫీడర్లో కూనూర్, దమ్మన్నపేట, జఫర్గడ్, వెంకటాపూర్ సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 100పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా కానుంది. ఓవర్‌లోడ్‌తో ఇబ్బంది.. వర్ధన్నపేట సబ్‌స్టేషన్‌లో 2001లో 50 ఎంవీఏ, 31.5 ఎంవీఏ సామర్థ్యంతో రెండు పవర్ ట్రాన్స్ఫార్మర్లు (పీటీఆర్) ఏర్పాటు చేశారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ల ద్వారా విద్యుత్‌ను కంట్రోల్ చేస్తూ గ్రామాల్లోని సబ్స్టేషన్లకు సరఫరా చేసేవారు. సాంకేతిక కారణాలతో గత నెల 21న అర్ధరాత్రి రూ. కోటి విలువైన 50 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. అప్పటి నుంచి అధికారులు మరమ్మతుకు చర్యలు తీసుకోలేదు. అందుబాటులో ఉన్న పీటీఆర్ 31.5 ఎంవీఏ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఓవర్‌లోడ్ కారణంగా పవర్‌డ్రాప్ (అంతరాయం) అవుతున్నా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. వ్యవసాయానికి అంతంత మాత్రమే.. కొన్ని మండలాల్లో వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా అవుతున్నా.. వర్ధన్నపేట పరిధిలో కనీసం 5-6 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. ఓవర్‌లోడ్‌తో సబ్స్టేషన్లలోని ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కి విద్యుత్ నిలిచిపోతుంది. గ్రామాల్లో 12 గంటల పాటు ఎల్ఆర్ పేరుతో విద్యుత్‌ను నిలిపివేస్తున్నారు. వ్యవసాయానికి సరఫరా అయ్యే విద్యుత్‌ను రైతులు నష్టపోతున్నారు. కొన్ని గ్రామాల్లో తరచూ విద్యుత్ మోటార్లు కాలిపోతున్నారుు. నివేదిక పంపించాం..: సత్యనారాయణ, ట్రాన్సకో ఏఈ సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన వెంటనే ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి 50 ఎంవీఏ పీటీఆర్‌ను తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. రైతులు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవం. -
రాజమండ్రిలో పేలిన ట్రాన్స్ఫార్మర్
తూర్పుగోదావరి: రాజమండ్రి రూరల్ మండలంలోని బొంగూరు గ్రామంలో ఉన్న 220 కేవీ సబ్‌స్టేషన్‌లో ప్రమాదవశాత్తూ బుధవారం ట్రాన్ఫార్మర్ పేలింది. ఈ ఘటనతో సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో మండల పరిధిలోని 13 గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు. (రాజమండ్రి రూరల్) -
కాటేసిన కరెంట్
కరెంట్ షాక్‌తో పాలేరు దుర్మరణం ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజు వేస్తుండగా విద్యుదాఘాతం పెద్దేముల్ మండలం మంబాపూర్లో ఘటన పెద్దేముల్ : ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజు వేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో ఓ పాలేరు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన అదివారం పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ శివారులో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హన్మగల్ల భాస్కర్ (35) మంబాపూర్ గ్రామ శివారులో తాండూరు ప్రాంతానికి చెందిన నగల వ్యాపారి పాండు ఫాంహౌస్‌లో ఆరునెలలుగా పాలేరుగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా, మూడు రోజుల క్రితం ఫాంహౌస్‌లో బోరుమోటార్ పనిచేయడం లేదు. ఈ విషయాన్ని భాస్కర్ తన యజమాని పాండు దృష్టికి తీసుకెళ్లాడు. ఆదివారం ఉదయం బోరు మెకానిక్ వస్తాడు...నీవు అక్కడే ఉండాలని చూసుకో.. అని యాజమాని భాస్కర్‌కు సూచించాడు. దీంతో ఆయన బోరుమోటార్ వద్ద గడ్డి, ముళ్లకంపలు శుభ్రం చేశాడు. అనంతరం పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలించి ఫ్యూజు పోయిందని గుర్తించాడు. ఫ్యూజ్ పోవడంతోనే బోరుమోటర్ పనిచేయడం లేదేమోనని భావించాడు భాస్కర్. ఫ్యూజ్ వేస్తే బోరుమోటార్ నడుస్తుండొచ్చనుకున్నాడు. దీంతో ట్రాన్స్ఫార్మర్ దిమ్మెపైకి ఎక్కి ఫ్యూజు వేసే యత్నం చేశాడు. అయితే అదే విద్యుత్ స్తంభానికి మంబాపూర్ గ్రామానికి కరెంట్ సరఫరా అయ్యే మెయిన్ లైన్ కూడా ఉంది. దానిని భాస్కర్ గమనించకపోవడంతో ఫ్యూజులు వేస్తుండగా పైన ఉన్న తీగలు భాస్కర్ తలకు తగలడంతో విద్యుదాఘాతమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్తంభంపైనే తీగలపై ఆయన మృతదేహం వేలాడుతోంది. ఈ విషయాన్ని గమనించిన పక్కపొలం రైతులు మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఫాంహౌస్ యజమాని, మంబాపూర్ గ్రామస్తులు ఘటనా స్థలానికి పెద్దఎత్తున చేరుకున్నారు. భాస్కర్ మృతికి మీరే బాధ్యులంటూ ఫాంహౌస్ యజమాని పాండును నిలదీసి దూషించసాగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పెద్దేముల్ ఎస్ఐ రమేష్, విద్యుత్ ఏఈ మైపాల్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆందోళనకారులను పోలీసులు సముదాయించారు. మృతుడికి భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కు అయిన భాస్కర్ మృతితో భార్యాపిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలని గ్రామస్తులు కోరారు. -
కన్నీటి సాగు..
- 8 నెలల్లో 9 సార్లు కాలిన ట్రాన్స్ఫార్మర్ - తరచూ కరెంట్ సరఫరాకు అంతరాయం - నీటితడులందక అవస్థలు - వంద ఎకరాల్లో వరి ఎండుముఖం - తాజాగా అమర్చిన మూడు గంటల్లోనే కాలిన వైనం - మరమ్మతుకు వచ్చిన ప్రతిసారీ రూ.5 వేల ఖర్చు - గుండెలు బాదుకుంటున్న రాజిపేట రైతులు రాజిపేట రైతులు కరెంట్ లేక కన్నీటి సాగు చేస్తున్నారు. తరచూ కరెంటు సమస్యతో సతమతమవుతున్నారు. నెలకోసారి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుండడంతో నెత్తినోరు బాదుకుంటున్నారు. మరమ్మతుకు వచ్చిన ప్రతిసారీ రూ.5 వేల చొప్పున ఖర్చు చేస్తున్నారు. మరమ్మతు చేసి బిగించడానికి రోజుల సమయం పడుతుంది. అప్పటిదాక కరెంటు లేక పంటలు ఎండుతున్నాయి. రబీలో దాదాపు వంద ఎకరాల్లో వరి ఎండడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. మెదక్ రూరల్: మెదక్ మండలం రాజిపేట గ్రామ శివారులోగల వెంకటేశ్వరాలయం సమీపంలోని మామిళ్ల వద్ద 100 హెచ్‌పీ ట్రాన్స్ఫార్మర్ ఉంది. దానిపై 19 వ్యవసాయ బోరుబావులున్నాయి. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దాదాపు నెలకోసారి కాలిపోతుంది. కాలిపోయిన ప్రతిసారీ మరమ్మతులు చేయిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో ట్రిప్పుకు రూ.5 వేల చొప్పున ఖర్చు చేస్తున్నారు. దీన్ని మరమ్మతులు చేయించి తిరిగి బిగించేందుకు రోజుల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా నీటి తడులందక పంటలు ఎండిపోతున్నాయి. వంద ఎకరాలకు దెబ్బ... రబీ సీజన్లో సుమారు 100 ఎకరాల్లో వరి సాగు చేశారు. మరో ఇరవై రోజుల్లో పంట చేతికందుతుందనగా ఈనెలలోనే నాలుగు సార్లు కాలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్ లోడ్ వల్లే కాలిపోతుందని భావించి కొన్ని కనెక్షన్లు తొలగించినా ట్రాన్స్ఫార్మర్ పరిస్థితిలో మార్పు లేదని వారంటున్నారు. తరచూ కాలిపోతుండడంతో టీఆర్ సెంటర్ అధికారులు పాత ట్రాన్స్ఫార్మర్ తీసుకుని కొత్తది అమర్చినా అదే పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎనిమిది నెలల్లో తొమ్మిది సార్లు కాలిపోవడంతో సుమారు రూ.45 వేల ఖర్చు వచ్చిందన్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న 100 ఎకరాల వరి పొలాలు కళ్లముందే ఎండిపోవటంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. బిగించిన మూడు గంటల్లోపే.. తాజాగా రెండు రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోగా దాన్ని బాగుచేయించి బిగించిన మూడు గంటల్లోపే మళ్లీ కాలిపోయిందని రైతులు కంటతడి పెట్టారు. ఎకరానికి సుమారు రూ.15 వేల చొప్పున పెట్టుబడులు పెట్టి సాగుచేస్తే ట్రాన్స్ఫార్మర్ కారణంగా పంటలు దెబ్బతిన్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. మెయిన్ లైన్ కింద ఎల్టీ లైన్ వల్లేనా? బోరుబావులకు సరఫరా అయ్యే ఎల్టీ విద్యుత్ వైర్ల పైనుంచే మెయిన్ లైన్ వెళ్తోంది. మామిడి శివారు ప్రాంతంలో స్తంభాలకు పైభాగంలో మెయిన్ వైర్లు ఉంటే ఆ స్తంభాలకే కొంత దూరంలో కింది భాగంలో ఎల్టీ వైర్లను అమర్చారు. దీంతో కరెంట్ సరఫరాలో లోపం ఏర్పడి ట్రాన్స్ఫార్మర్ తరచూ కాలిపోతుందా...? అని రైతులు అనుమానిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ విషయాన్ని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి ఎక్కడ సమస్య ఉందో గుర్తించి పరిష్కరించాలని రైతులు రామకిష్టయ్య, రామారావు, గోపాల్, యాదాగౌడ్, సత్తయ్య, చిన్న రామకిష్టయ్య, బాల్‌రాజ్, సాయగౌడ్ తదితరులు కోరుతున్నారు. లేనిచో తమకు ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదంటున్నారు. -
ఏసీబీకి చిక్కిన ఏఈ
రూ.8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రేమ్‌కుమార్ బిచ్కుంద : బిచ్కుంద ట్రాన్స్‌కో ఏఈ ప్రేమ్‌కుమార్ ఓ రైతు వద్ద నుంచి రూ.ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ నరేందర్ శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బిచ్కుంద మండలం తక్కడ్‌పల్లి గ్రామానికి చెందిన గంగారాం అనే రైతుకు మంజూరైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడానికి ఏఈ 8 నెలలుగా ఇబ్బంది పెడుతున్నాడు. రూ.30 వేలు లంచం ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని చెప్పా డు. రైతు ఎంత బతిమాలినా ఏఈ వినకపోవడంతో చివరకు రూ.10 వేలు ఇచ్చేలా రైతు ఒ ప్పందం చేసుకున్నాడు. అనంతరం గంగా రాం ఏసీబీని ఆశ్రయించడంతో డబ్బు నోట్ల కు కెమికల్ అంటించి, ఆ నోట్లను రైతుకు ఇ చ్చామని డీఎస్పీ చెప్పారు. దీంతో రైతు ఆ డబ్బును బస్టాండ్ సమీపంలోని ఓ టీస్టాల్ వద్ద ఏఈకి ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని వివరించారు. వెంటనే ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేశామని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు. ఈ దాడిలో ఏసీబీ సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథ్, చంద్రశేఖర్, ఖుర్షిద్ అలీ పాల్గొన్నారు. -
విద్యుద్ఘాతంతో యువకుడి మృతి
తలకొండపల్లి : ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజులను సరిచేస్తున్న ఓ కార్మికుడు విద్యుద్ఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... చీపునుంత గ్రామానికి చెందిన గుమ్మడి శేఖర్ (22) విధుల్లో భాగంగా శనివారం ఉదయం గ్రామ శివారులోని 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజులను సరిచేయడానికి వెళ్లాడు. ఆ క్రమంలో విద్యుద్ఘాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ అజీజుల్లా తెలిపారు. శవాన్ని ఫోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ట్రాన్స్‌కో ఏఈ రమేశ్‌తో పాటు ఉపసర్పంచ్ చెన్నకేశవులు తదితరులు సందర్శించారు. -
డిస్కం అధికారిక దోపిడీ!
రైతులకు ట్రాన్స్ఫార్మర్ పెట్టినా.. కనెక్షన్ ఇచ్చినా రూ.2వేలు నిర్బంధ వసూళ్లు ప్రశ్నించలేకపోతున్న కరువు రైతులు బి.కొత్తకోట: ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ఆపరేషన్స్ (డిస్కం) వ్యవసాయ రైతులనుంచి అధికారిక దోపీడీకి పాల్పడుతోంది. కరువు పరిస్థితులు, పంటలు పండకపోవడంతో తీవ్రంగా న ష్టాలు చవిచూస్తున్న రైతులకు డిస్కం అధికారులు తీసుకొన్న నిర్ణయం ఇబ్బందులకు గురిచేస్తోంది. తీసుకొవాల్సిన మొత్తం కంటే ముందుచూపు పేరుతో అధికారికంగా అన ధికార వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో 2.65లక్షల వ్యవసాయ కనె క్షన్లు పనిచేస్తున్నాయి. ఈ కనెక్షన్ల నుంచి ఒక్కొటీకి నెలకు రూ.30 చార్జీలను రైతులు చెల్లించాలి. అయితే దీనికి విరుద్ధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనధికార ఆదేశాలను అమలుచేస్తున్నారు. ఒక్కో రైతునుంచి ఏకకాలంలో ఒకే మొత్తంగా రూ.2వేలు వసూలు చేస్తున్నారు. రైతులు విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, అదనపు సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు వీటిని మంజూరు చేస్తున్నారు. డిమాండ్ నోటీసులమేరకు రైతులు సొమ్మును చెల్లించారు. ప్రస్తుతం వీటిని ఇస్తున్న అధికారులు రైతులనుంచి నిర్బంధంగా రూ.2వేలు వసూలు చేస్తూ బిల్లులు ఇస్తున్నారు. ఇది ఎందుకంటే భవిష్యత్తులో చెల్లించాల్సిన బిల్లులకోసమని చెప్పుకొస్తున్నారు. ఇక రైతు నెలకు కేవలం రూ.30 చెల్లించాలి. దీనికోసం కనెక్షన్ కలిగివుండాలి. కొత్త కనెక్షన్ పొందిన రైతులకు కనెక్షన్ ఇచ్చేముందు, లేకపోతే ఇవ్వకముందే రూ.2వేలు వసూలు చేసుకుంటున్నారు. ఇది చెల్లించకుంటే కనెక్షన్, ట్రాన్స్ఫార్మర్ ఇవ్వరే మోనన్న ఆందోళనతో రైతులు విధిలేని పరిస్థితుల్లో చెల్లిస్తున్నారు. దీంతో 67నెలల బిల్లులను ఓకేసారి రైతులనుంచి వసూలు చేస్తున్నారు. సర్వీసు నంబర్లు ఇవ్వకనే రూ.4వేలు బి.కొత్తకోట మండలం నాయనబావికి చెందిన రైతు డీ.లోకనాథరెడ్డి రెండు వ్యవసాయబోర్లు వేశాడు. వీటికి వ్యవసాయ కనెక్షన్లకోసం 2014 జూన్2న 20హెచ్‌పీ సామర్థ్యానికి డిపాజిట్టు చెల్లించాడు. ఇంతవరకు కనెక్షన్లకు సర్వీసు నంబర్లు ఇవ్వలేదు. అయితే జనవరి 23న ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు. ఇది ఇవ్వాలంటే రూ.4వేల సర్వీసు చార్జీలు ముందుగానే చెల్లించాలన్న షరతు విధించడంతో విధిలేక చెల్లించి రశీదు పొందాడు. సర్వీసు నంబర్లు లేకున్నా చార్జీలైతే వసూలు చేసుకున్నారు. కనెక్షన్ ఇవ్వకనే రూ.2వేలు బి.కొత్తకోట మండలం కాయలవారిపల్లెకు చెందిన మహిళా రైతు టీ.అమరావతమ్మ రెండెకరాల పొలంలో వ్యవసాయకోసం బోరుచేయించింది. కనెక్షన్ కోసం 2014 ఏప్రిల్ 1న రూ.10,600 చెల్లించింది. అప్పటికే వున్న 15హెచ్‌పీ సామర్థ్యాన్ని 25 హెచ్‌పీ స్థాయికి పెంచాలి. అయితే ఈ ఏడాది జనవరి18న సామర్థ్యం పెంచుతూ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేశారు. దీన్ని ఏర్పాటు చేసేందుకు రూ.2వేలు కట్టించుకున్నారు. అప్పటివరకు సేద్యమే జరగలేదు. సర్వీసు చార్జీలు కట్టాల్సిన అవసరం కూడా లేదు. అయినప్పటికీ ముందుగానే 67 నెలల బిల్లులను వసూలు చేసుకున్నారు. -
ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసిన దుండగులు
కడప(చిన్నమండెం): గుర్తుతెలియని దుండగులు మంగళవారం రాత్రి రెండు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్‌ను దొంగలించుకుపోయారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా చిన్నమండెం మండలం కొత్తపల్లె గ్రామ పరిధిలో జరిగింది. స్థానిక నేరాలవంక పల్లెకు చెందిన రైతులు ట్రాన్స్ఫార్మర్ కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రభుత్వ అధికారులు స్పందించలేదు. దీంతో రైతులంతా కలిసి సొంత డబ్బులతో ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నారు. వాటిని మంగళవారం గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి అందులో ఉండే కాపర్‌వైర్ ఎత్తుకెళ్లారు. బుధవారం విద్యుత్ వచ్చే సమయానికి మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతులు విషయం తెలిసి బోరుమన్నారు. -
కౌలురైతును కాటేసిన కరెంట్
సీతారామపురం : ఆయనకు సెంటు పొలం లేదు. ఆస్తిపాస్తులు లేని నిరుపేద కుటుంబం. ఈ నేపథ్యంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తూ, వచ్చే అరకొర ఫలసాయంతో బతుకుబండి లాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనను కరెంట్ కాటేసింది. కానరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. విద్యుదాఘాతానికి గురై పొలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సీతారామపురంలోని పడమటివీధికి చెందిన ఆకుల రామయ్య(49)కు భార్య నాగేశ్వరమ్మ, పదహారేళ్ల కుమారుడు ఉన్నారు. వీరికి సెంటు పొలం కూడా లేకపోవడంతో రామయ్య నాలుగేళ్లుగా 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నాడు. రూ.17 వేల చొప్పున కౌలు చెల్లిస్తున్నాడు. ప్రస్తుతం ఆ భూమిలో కొంత మేర సజ్జ, వరి పంట సాగు చేస్తుండగా, మిగిలిన భూమిని సాగుకు సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలో పొలంలోని విద్యుత్ మోటారు మరమ్మతులకు గురైంది. దానికి మరమ్మతులు చేయించేందుకు మంగళవారం మెకానిక్‌ను పొలంలోకి తీసుకెళ్లాడు. మరమ్మతుల నేపథ్యంలో పొలం పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఆపారు. పని పూర్తయిన తర్వాత రామయ్య ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. అయితే ఆన్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు వైర్లు త గలడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో సీతారాంపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
విద్యుత్‌షాక్ తో రైతు మృతి
యర్రగొండపాలెం టౌన్: ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజు వేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కి షాక్‌కు గురై రైతు మృతిచెందిన ఘటన మండలంలోని గంగపాలెంలో సోమవారం జరిగింది. గ్రామంలోని దక్షిణం వైపున్న పొలాల్లో హెచ్‌టీలైన్ ట్రాన్స్ఫారం పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామానికి చెందిన రైతు మాగులూరి కోటయ్య (35) ట్రాన్స్ఫారం వద్ద ఫీజు పోవడాన్ని గుర్తించి సరిచేస్తుండగా..విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. విద్యుత్ సిబ్బంది ఎల్సీ ఇచ్చారని, అందువల్లనే మరమ్మతులు చేసేందుకు కోటయ్య విద్యుత్ స్తంభం ఎక్కినట్లు గ్రామంలోని రైతులు తెలిపారు. హెల్పర్లు అందుబాటులో ఉండకపోవడంతో ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కోటయ్యను తీసుకెళ్లి మరమ్మతులు చేయించుకునే వారమని రైతులు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండి తక్షణ చర్యలు చేపట్టకపోవడంతో, సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు తమ పంటలను కాపాడుకునే ప్రయత్నంలో ఇలా ప్రాణాలు కోల్పోతున్నారని వాపోతున్నారు. మృతునికి భార్య వరలక్ష్మి, తల్లిదండ్రులు ఉన్నారు. అందరికీ సహాయంగా ఉండే కోటయ్య విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎల్సీ ఇచ్చారు కదా, మళ్లీ సరఫరా ఎలా ఇచ్చారని ఈ సంఘటనపై వైపాలెం ట్రాన్స్‌కో ఏఈ రాజును రైతులు ప్రశ్నించారు. ఎల్సీ ఇవ్వలేదని, అసలు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కడంతో కోటయ్య ప్రమాదానికి గురయ్యాడని ఆయన తెలిపారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో ఏవైనా అంతరాయం ఏర్పడినప్పుడు కచ్చితంగా విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై ముక్కంటి సిబ్బందితో కలిసి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతికి గల కారణాలు పరిశీలించి..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యాధికారి పీ చంద్రశేఖర్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. -
సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం
- స్విచ్‌బోర్డు నుంచి చార్జర్ జారిపడటంతో వ్యక్తికి స్వల్పగాయాలు - ట్రాన్స్ఫార్మర్కు ఎర్తింగ్ సరిగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు కందుకూరు: సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురయ్యాడు. అంతలోనే అదృష్టవశాత్తు చార్జర్ స్విచ్‌బోర్డు నుంచి జారికింద పడిపోవడంతో స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని అన్నోజిగూడలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆనెమోని రవి(35) లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతున్నాడు. ఈక్రమంలో ఆయన విద్యుదాఘాతానికి గురయ్యాడు. అంతలోనే చార్జర్ స్విచ్‌బోర్డు నుంచి జారి కిందపడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రవి కుడిచేతి వేలికి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఆయన స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీకాంత్, ఆనెమోని సుధాకర్ ఇంటి గోడలకు శనివారం రాత్రి కరెంట్ ప్రసారమవడంతో గమనించిన వారు అప్రమత్తమయ్యారు. గ్రామంలో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తరచూ ప్రమాదాలు.. గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ సరిగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎర్తింగ్ సమస్యతో గ్రామానికి చెందిన ఢిల్లీ రాములు విద్యుత్‌షాక్‌తో మృత్యువాత పడ్డాడని, పలువురు తీవ్రగాయాలకు గురయ్యారని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా ట్రాన్స్‌కో అధికారులు స్పందించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
కాటేస్తున్న కరెంట్
షాబాద్: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి తరచూ జనం మృత్యువాత పడుతున్నారు. ఇటీవల పలువురు కరెంట్ కాటుకు బలైపోయారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద అధికారులు ఆన్ఆఫ్ సిస్టమ్‌లు ఏర్పాటు చేయకపోవడంతో విద్యుదాఘాతానికి గురవుతున్నారు. మామూళ్లకు అలవాటుపడిన అధికారులు చేతి తడపనిదే ఏపని చేయడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల కందూకురు మండలంలో ఓ రైతు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంట్ సరఫరా నిలిపి వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన విషయం తెలిసిందే. ఈనెల 3వ తేదిన షాబాద్ మండలం దామర్లపల్లి గ్రామానికి చెందిన చెన్నయ్య తన ఇంటిపై ఉన్న కట్టెలను ఓ దగ్గర పేర్చుతుండగా పైన ఉన్న కరెంట్ వైర్లు తగిలి మృతి చెందాడు. పండుగ పూటే ఆ ఇంటి విషాదం చోటుచేసుకుంది. ఇంటికి పెద్దదిక్కు అయిన ఆయన మృతితో కుటుంబం వీధిన ప డింది. తాజాగా మంగళవారం దామర్లపల్లి సర్పంచ్ గట్టుపల్లి జంగయ్య ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా కరెంట్ కాటేసింది. దీంతో అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. విద్యుత్ అధికారుల లోపం స్పష్టంగా ఉండడంతో జనం వారి తీరుపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సర్పంచ్ మృతదేహాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి ట్రాన్స్‌కో ఏడీ, ఏఈలపై ఫోన్లో మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించకపోతే ఆందోళనలు తప్పవని మండలవాసులు హెచ్చరిస్తున్నారు. -
వలపన్నారు... పట్టుకున్నారు
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు డబ్బుల డిమాండ్ ఏసీబీని ఆశ్రయించిన ల్యాబర్తి రైతులు రూ.10వేలు తీసుకుంటూ పట్టుబడిన రమేష్ హన్మకొండ సిటీ : ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఓ విద్యుత్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. రైతులు సమాచారం అందజేయడంతో ఏసీబీ డీఎస్పీ సాయిబాబా ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన అధికారులు గురువారం వలపన్ని లంచగొండి ఏఈ భూక్య రమేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో వ్యవసాయ బావుల వద్ద ఉన్న ఎస్ఎస్ 12 ట్రాన్స్ఫార్మర్ 100 కేవీపై లోడ్ అధికంగా పడుతుండడంతో తరచుగా కరెంట్ ట్రిప్పవుతోంది. దీంతో అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయూలని రైతులు వర్ధన్నపేట మండల ఇన్చార్జ్ ఏఈగా కొనసాగుతున్న సబ్ ఇంజనీర్ రమేష్‌ను ఆశ్రయించారు. డబ్బులు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇప్పిస్తానని ఆయన రైతులకు కరాఖండిగా చెప్పాడు. ప్రస్తుతం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదని... డబ్బులు ఇచ్చుకోలేమని రైతులు ఆయన ఎదుట ఆవేదన వెళ్లగక్కారు. డబ్బులు ఇస్తేనే పని అవుతుందని ఏఈ తేల్చిచెప్పాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్ఫార్మర్ మంజూరైంది. రైతులు మళ్లీ ఏఈని సంప్రదించారు. డబ్బులు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇస్తామని ఆయన మరోమారు తేల్చిచెప్పడంతో రైతులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు మాటువేసిన ఏసీబీ అధికారులు హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ జిల్లా స్టోర్స్ వద్ద ఏఈ భూక్య రమేష్ గురువారం రైతుల నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ నుంచి డబ్బులు స్వాధీనం చేసుకుని, రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు పంపామని ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు సాం బయ్య, రాఘవేందర్రావు సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా రూ.30 వేలు ఇచ్చాం : అదనపు ట్రాన్స్ఫార్మర్ కోసం ఏఈని కలిస్తే రూ. 60 వేలు ఖర్చు అవుతాయని, ఆ డబ్బులు ఇస్తే వెంటనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. అంత డబ్బు ఇచ్చుకోలేమని... ముందుగా రూ. 30 వేలు ఇచ్చాం. మరో రూ.పది వేలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పాడు. దీంతో వాటిని ఇవ్వడానికి ఒప్పుకుని, ఏసీబీ అధికారులను కలిశామని రైతులు రమేష్, వెంకటేశ్వర్లు తెలిపారు. -
పరుగులు పెట్టించిన అగ్ని
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం జరిగిన భారీ అగ్రిప్రమాదాలు అగ్నిమాపక విభాగాన్ని పరుగులు పెట్టించాయి. మొదటి ఘటన కన్నాట్‌ప్లేస్‌లో, రెండోది కినారీబజార్లో జరిగా యి. ఈ రెండు ప్రమాదాల్లో ప్రాణనష్టం ఏమీలేకపోయినప్పటికీ 30 దుకాణాలు దగ్ధమయ్యాయి. కన్నాట్‌ప్లేస్ ఏ బ్లాక్‌లోని రామాభవన్‌లో మంటలు చెలరేగాయంటూ అగ్నిమాపక విభాగానికి ఉదయం 7.50 గంటలకు సమాచారం అందింది. అగ్నిమాపక శకటాలతో ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పడానికి అనేకగంటలపాటు శ్రమించారు. రామాభవన్‌లో అగ్నిప్రమాదం సంభవించిందని అనుకున్నప్పటికీ నిజానికి మంటలు చెలరేగింది హామిల్టన్ హౌజ్‌లోని ఎన్ఐఐటీ సెంటర్లోనని ఆ తర్వాత తేలింది. భవనం రెండో అంతస్తులో ఉన్న ఎన్ఐఐటీ సెంట ర్లో గ్రంథాలయంలో మొదలైన మంటలు ఆ తర్వాత అంతటా వ్యాపించాయి.ఆ తర్వాత వెనుకవైపునగల రామా బిల్డింగ్ వరకు వ్యాపించాయి. అయితే రామాభవన్‌లో మంటలు చెలరేగినట్లు తొలుత భావించారు. ఎన్ఐఐటీ సెంటర్ పై అంతస్తులో జిమ్ ఉంది. ఉదయాన్నే జిమ్‌కు వచ్చిన వారు అగ్నిమాపక విభాగానికి సమాచారమందించారు అగ్నిపమాక విభాగం సిబ్బం ది వెంటనే రంగంలోకి దిగి ఇరుగుపొరుగు భవనాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి ఆ తర్వాత మంటలను ఆర్పారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు కార్యాలయం మూసిఉండడంతో ఎవరూ గాయపడలేదని ప్రధాన అగ్నిమాపక అధికారి విపిన్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక మధ్యాహ్నం రెండుగంటల సమయంలో చాందినీచౌక్ ప్రాంతంలోని కినారీ బజార్లో మంటలు రేగి పలు దుకాణాలకు వ్యాపించాయి. జరీ దుకాణాలు ఎక్కువగా ఉండే కినారీబజార్ ఇరుకు వీధుల్లో నుంచి అగ్నిమాపక వాహనాలు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దాదాపు రెండు డజన్ల అగ్నిమాపక వాహనాలను తీసుకెళ్లినప్పటికీ మంటలను ఆర్పడానికి అగ్నిమాపసిబ్బంది చాలా శ్రమపడాల్సివచ్చింది. ట్రాన్స్‌ఫార్మర్‌లో చెలరేగిన మంటలు దుకాణాలకు వ్యాపించాయని అంటున్నారు. ఫోన్ కాల్ రాగానే అగ్నిమాపక వాహనాలను పంపామని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డెరైక్టర్ ఎ.కె. శర్మ చెప్పారు. -
కరెంటు కాటుకు యువ రైతు బలి
చేగుంట : ట్రాన్స్ఫార్మర్ నుంచి బోరు మోటార్లకు వచ్చే విద్యుత్ సరఫరాను నిలివేసే క్రమంలో ఓ యువ రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలనును వదిలాడు. ఈ సంఘటన మండలంలోని ఉప్పర్‌పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అశోక్‌గౌడ్ (26) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఉదయం తన పొలంలో పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో బోరుకు సంబంధించిన మోటారులో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో దానిని మరమ్మతులు చేసేందుకు ట్రాన్స్ఫార్మర్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ను నిలిపేందుకు నిర్ణయించాడు. అందులో భాగంగానే ట్రాన్స్ఫార్మర్ వద్దకు ఏవీ స్విచ్ ఆఫ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టు పక్కల రైతులు ప్రమాదాన్ని పసిగట్టి రక్షించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో రైతులు కుటుంబ సభ్యులు, చేగుంట పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి చేరుకుని శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మృతుడికి భార్య సంధ్య ఒక కూతురు రుచిక ఉన్నారు. కాగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే అశోక్‌గౌడ్ కరెంటు షాక్‌కు గురై మృతి చెందాడని గ్రామస్తులు, రైతులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుదాఘాతంతో ఎద్దు మృతి : మరో ఘటనలో విద్యుదాఘాతానికి గురై ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని పోసాని పల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రమౌళి తన వ్యవసాయ పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎద్దును మేపుతున్నాడు. ఈ క్రమంలో ఎద్దు ట్రాన్స్ఫార్మర్ను ప్రమాదవశాత్తు తాకకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు మృతితో తనకు రూ. 35 వేలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యాడు. -
ట్రాన్సఫార్మర్కు మరమ్మతు చేస్తూ..
విద్యుదాఘాతంతో రైతు మృతి మర్పడగలో విషాదం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనన్న గ్రామస్తులు కొండపాక : ట్రాన్స్ఫార్మర్ ఎక్కి వైరు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మర్పడగ శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుం ది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన రైతు వల్లంగల్ల కనకయ్య (46) తనకున్న రెండెకరాల పొలాన్ని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం ఉదయం యథావిధిగా ఉదయం ఆరు గంటలకు పాలు తీసుకెళ్లి గ్రామంలో వేసి వచ్చాడు. అయితే కరెంట్ వచ్చే సమయంలో కావడంతో కనకయ్య పొలం వద్దకు వెళ్లి బోరు మోటారు ఆన్ చేశాడు. కాగా బోరుకు కరెంట్ సరఫరా కాకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి చూశాడు. ఇదిలా ఉండగా.. ట్రాన్స్ఫార్మర్కు ఉండే మూడు ఫ్యూజ్‌ల స్థానంలో బోల్టులు బిగించి ఉంటాయి. కాగా ఒక నట్ బోల్ట్ స్థానంలో అల్యూమినియం వైర్ చుట్టా రు. అది వేడికి పదే పదే కాలిపోతూ ఉంటుంది. అయితే అవసరాన్ని బట్టి రైలు ఎవరికి వారు వేసుకుంటుంటారు. అందులో భాగంగానే రైతు కనకయ్య ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి వైరును బిగించడానికి పైకి ఎక్కాడు. వైరును బిగిస్తున్న క్రమంలో మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫార్మర్కు వచ్చే 11 కేవీ లైన్ ప్రమాదవశాత్తు కనకయ్య తలకు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని మరో రైతు రంగయ్య గుర్తించి గ్రామంలోకి పరుగున వెళ్లి చెప్పాడు. బాధిత కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడికి భార్య బాల లక్ష్మి, కుమారుడు వేణు (22), ఇద్దరు కుమార్తెలు లావణ్య (18), లత (15)లు ఉన్నారు. సమాచారం అం దుకున్న ఎస్ఐ జార్జ్ గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించా రు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కొండపాక ఎంపీపీ పద్మ, పీఏసీఎస్ డెరైక్టర్ నరేందర్‌లు మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుం బాన్ని ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ సభ్యులు బాల్‌రాజ్, ఆకారం, యాదగిరిలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే .. : ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్ష్యంతోనే రైతు కనకయ్య మృతిచెందాడని గ్రామ రైతులు పలువురు ఆరోపించారు. 15 రోజులుగా వైరు కాలిపోతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వీరి నిర్లక్ష్యంతోనే కనకయ్య మృతిచెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మామూళ్లిస్తేనే..
- రైతులకు తప్పని ట్రాన్స్ఫార్మర్ కష్టాలు - డబ్బు ఇవ్వనిదే స్పందించని సిబ్బంది - నూతన ట్రాన్స్‌ఫార్మర్లకోసం ఎదురు చూపులు - పెండింగ్‌లో 2 వేల దరఖాస్తులు నెల్లూరు(హరనాథపురం): విద్యుత్ సరఫరాలో కీలకమైన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురైతే రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 11,316 సింగిల్ ఫేస్, 23,928 త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. కాలిపోయినప్పుడు వెం టనే మార్చేందుకు రోలింగ్ పేరుతో నాలుగు శాతం ట్రాన్స్ఫార్మర్లను సిద్ధంగా ఉంచాల్సి ఉండగా ప్రస్తుతం అవి 2.3 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ విలు వ రూ.75 వేలు నుంచి రూ.లక్ష వర కు ఉంటుంది. ప్రతి నెలా జిల్లాలో సుమారు 500 ట్రాన్స్ఫార్మర్లు కాలి పోతుంటాయి. ఒక్క నెల్లూరు డివిజ న్లోని వీటి సంఖ్య నెలకు 180 వర కు ఉంటుంది. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేసేందుకు ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరులో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మరో నాలుగు సెంటర్లు ప్రైవేటు రంగంలో నడుస్తున్నాయి. రైతు అవసరాలే ఆదాయ వనరు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే సంబంధిత ఏఈ దృష్టికి తీసుకెళ్లి రికార్డుల్లో నమోదు చేసుకోవాలి. రైతు ఫిర్యాదు చేసిన 48 గంటల్లో అధికారులే ప్రభుత్వ వాహనంలో మరో ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి అమర్చాలి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల వరకు ఏర్పాటు చేయని పరిస్థితి నెలకొంది. రైతులు చందాల వేసుకుని ఏఈ, లైన్‌మన్, హెల్పర్ల చేయితడిపితే కాని స్పందన ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన సమయంలో రైతుల అవసరాన్ని బట్టి రూ.3 వేలు నుంచి రూ.12 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కావలి, గూడూరు డివిజన్లలో రూ.10 వేలు వరకు, నెల్లూరు, ఆత్మకూరు డివిజన్లలో రూ.15వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్లను తరలించేందుకు 19 సబ్డివిజన్ల పరిధిలో మూడు వాహనాలు మాత్రమే ఉండడంతో రవాణా చార్జీలు సైతం రైతులపైనే పడుతున్నాయి. మరమ్మతు కేంద్రాల్లోనూ దందా అక్రమ వసూళ్ల దందా ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రాల్లోనూ సాగుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముడుపులిచ్చిన వారికి వెంటనే కొత్తవి ఇస్తున్నారని, లేని పక్షంలో రోజుల తరబడి తిప్పుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు కొత్త ట్రాన్స్ఫార్మర్ల మంజూరులోనూ తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ప్రస్తుతం జిల్లాలో 2 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ కు సంబంధించి లోఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉండడంతో త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. -
తరాలు మారినామారని తలరాత
మడికట్టు (చేవెళ్లరూరల్): తరాలు మారినా.. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. ఎంతమంది పాలకులు వచ్చినా ఆ గ్రామస్తుల తలరాత మాత్రం మారడం లేదు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ రాత మారేనా అని ఎదురు చూస్తున్నారు. మండలంలోని తంగడపల్లికి మడికట్టు అనుబంధ గ్రామంగా ఉంది. ఇక్కడి జనాభా దాదాపు 500కుపైనే. 350 మంది ఓటర్లున్నారు. ఏళ్లతరబడి గ్రామంలో సమస్యలు తిష్టవేసుకొని ఉన్నాయి. ఎన్నికల సమయంలోనో, ఏదైనా ప్రారంభోత్సవాల సందర్భంలో మాత్రమే నాయకులు, అధికారులు దర్శనమిస్తారని.. స్థానిక సమస్యల గురించి పట్టించుకునేవారే లేరని గ్రామస్తులు వాపోతున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రధాన సమస్యలివీ.. గ్రామం మొత్తానికి ఒకేఒక బోరు మోటార్ ఉంది. దీంతోనే గ్రామానికి నీటి సరఫరా అవుతోంది. సింగిల్ ఫేజ్ మోటార్లు ఉన్నప్పటికీ నీళ్లు లేక పనిచేయటం లేదు. గ్రామానికి ఏడాది క్రితం బీటీ రోడ్డు వేశారు. ఆరునెలలు తిరక్కుండానే అది గుంతలమయంగా మారింది. వర్షం పడితే గుంతల్లో నీళ్లు నిలిచి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. గ్రామానికి వచ్చే ఒకేఒక బస్‌కు సైతం అంతరాయం తప్పడం లేదు. గుంతలను చూసి డ్రైవర్లు ఈ ఊరికి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. గ్రామంలో ఇళ్లను తాకే ఎత్తులో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. గ్రామానికి విద్యుత్‌ను సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ వద్ద ఆన్ ఆఫ్ లేక సింగిల్‌ఫేజ్ కనెక్షన్‌తోనే సరఫరా అవుతోంది. ఏళ్ల కిత్రం ఒక్క మురుగు కాలువను నిర్మించారు. గ్రామంలో ఇళ్లు విస్తరిస్తున్నా వాటికి అనుగుణంగా మురుగు కాలువలను నిర్మించడం లేదు. ఉన్న ఒక్క కాలువను కూ డా శుభ్రం చేసేవారులేక పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఇళ్ల మధ్యే మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. ఇక అంతర్గత రహదారులు లేవు. మట్టి రోడ్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. సర్పంచ్ తంగడ్‌పల్లిలో ఉండటంతో ఇక్కడి ప్రజల సమస్యలు తెలియటంలేదు. -
అకాల వర్షంతో రైతులు విలవిల
గిద్దలూరు రూరల్, న్యూస్‌లైన్: మండలంలో సోమవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురుగాలులు, వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వెంకటాపురం, బురుజుపల్లి, దిగువమెట్ట, రాజుపేటలో రైతులు ఎక్కువగా నష్టపోయారు. వెంకటాపురానికి చెందిన పసుపు రైతులు అకాల వర్షం దెబ్బకు పసుపు కొమ్ముల్ని రక్షించుకునేందుకు అవస్థ పడ్డారు. గ్రామానికి చెందిన వట్టికూటి శ్రీనివాసరావు ఇంటి వద్ద బయట ఆరబోసిన పసుపు కొమ్ములు తడిసిపోయాయి. దిగువమెట్ట సమీపంలోని మామిడి తోటలో ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపోయాయి. రాజుపేట, మిట్టమీదపల్లె గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ఫలితంగా గ్రామంలోని 28 వ్యవసాయ మోటార్లకు సరఫరా నిలిచిపోయింది. గాలులకు బురుజుపల్లె వెంకటాపురం గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న విద్యుత్ స్తంభం తీగలతో సహా కిందకు ఒరిగి ప్రమాదకరంగా ఉంది. -
ఎర్తింగ్ లోపంతో ఊరంతా షాక్
అధికారుల నిర్లక్ష్యంతో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా ఊరంతా షాక్ వచ్చింది. దీంతో 8 మందికి గాయాలయ్యాయి. బాధితులంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలోని సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ లోపం ఏర్పడి సమస్య తలెత్తుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారని నారాయణఖేడ్ మండలంలోని గంగాపూర్ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్: ఊరంతా షాక్‌తో 8 మంది గాయపడ్డారు. ఈ సంఘటన నారాయణఖేడ్ మండలంలోని గంగాపూర్‌లో సోమవా రం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి విద్యుత్ సరఫరా అవుతున్న సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్లోపం తలెత్తింది. దీంతో రెం డు మూడు రోజులుగా ఏ విద్యుత్ ఉపకరణం ముట్టుకున్నా షాక్ వస్తుంది. సో మవారం ఉదయం ఇంట్లో టీవీ ఫ్లగ్పెడుతున్న క్రమంలో సాయిగొండ(46), మరో ఇంట్లో ఎల్లవ్వ(40), ఈమె కోడ లు పంది లక్ష్మి(30), మరో ఇంట్లో లక్ష్మీ(35), కె.శ్రీనివాస్(26), నర్సుగొండ(34)తోపాటు మరో ఇద్దరికి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. వీరి తోపాటు మరి కొందరికి స్వల్పంగా గాయాల య్యాయి. సాయిగొండకు చేతికి, కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రు ల్లో చికిత్సలు పొందుతున్నారు. గ్రామానికి విద్యుత్ సరఫరా అవుతున్న సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్లోపం ఉందని, దీంతోనే విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నట్లు పేర్కొంటూ గ్రామస్థు లు ఆందోళనకు దిగారు. ఏడెనిమిదేళ్లు గా గ్రామంలో ఇలా ప్రమాదాలు జరుగుతున్నా ట్రాన్స్‌కో అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్వద్ద ఆన్, ఆఫ్ స్విచ్‌లు కూడా లేవని ఏ ప్రమాదం జరిగినా నా రాయణఖేడ్లోని సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సమాచారం ఇ వ్వాల్సి వస్తుందన్నారు. రెండు రోజులు గా షాక్ వస్తున్న విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోవడంలేదన్నారు. తరచూ ప్రమాదాలు గంగాపూర్ గ్రామంలో తరచూ విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్లోపంతో ఏడెమినిదేళ్లుగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఇప్పటివరకు పదులసంఖ్యలో గాయాల పాయాలయ్యారని చెప్పారు. నాలుగేళ్ల క్రితం గ్రామ సమీపంలో 11కేవీ వైర్లు క్రిందకు వేలాడుతుండగా ఆటోలో తీసుకెళ్తున్న ఇనుపపైప్కు వైర్లు తగిలి ఆటో దగ్దమయ్యింది. ఈ ప్రమాదంలో సుమా రు 10మంది వరకు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. గ్రామంలోని పంచాయతీ ఆవరణతోపాటు, గ్రామంలోకి వెళ్లే రెండు సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లవద్ద ఎర్తింగ్ లోపం ఉందన్నారు. వీటివద్ద ఎర్తింగ్ సమస్యను అధికారులు నివారించలేకపోతున్నట్లు చెప్పారు. స మస్యను నివారించి ప్రజలను ప్రమాదా ల బారి నుండి కాపాడాలని సర్పంచ్ నా రాయణ అధికారులను కోరారు. -
గొంతెండుతున్న పల్లెలు
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : మాక్లూర్ మండలం వెంకటాపూర్ గ్రామం... 20రోజుల క్రితం ఈ గ్రామానికి నీరు అందించే ట్రాన్స్ఫార్మర్, సబ్మెర్సిబుల్ పంపులు చెడిపోయాయి. అధికారులు ఇప్పటివరకు వాటికి మరమ్మతులు చేయించలేదు. ఫలితంగా గ్రామస్తులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. రాత్రి పూట వ్యవసాయ బావుల వద్ద కెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ఉదయం నుం చి రాత్రి వరకు కరెంటు ఉండకపోవడంతో నీటి కటకట ఏర్పడింది. జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. ఇక జిల్లా సరిహద్దు గ్రామాలలో గ్రామీణుల తాగునీటి అవస్థలు చెప్పనలవి కాకుం డా ఉన్నాయి. చుక్క నీరు లేదు ఎండలు మండుతున్నాయి. తాగేందుకు నీరు దొరకడం లేదు. ఏకధాటిగా 12 గంటల నుంచి 14 గంటల వరకు కరెంటు సరఫరా లేకపోవడం ఇం దుకు ప్రధాన కారణమవుతోంది. మరోవైపు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు నీటికోసం గోస పడుతున్నారు. గ్రామాలలో ఉన్న నీటి ట్యాంకుల వినియోగం సక్రమంగా లేదు. కొన్నిచోట్ల అవసరమైన మేరకు ట్యాంకుల నిర్మాణం లేనందున సరిపోయేంత నీరు అందుబాటులో ఉం డడం లేదు. ముఖ్యంగా జిల్లా సరిహద్దు ప్రాంతాలు, తం డాలలో నీటి కటకట ఏర్పడింది. గాంధారి, ఎల్లారెడ్డి, లింగంపేట, మద్నూరు, జుక్కల్, భీంగల్, సిరి కొండ, డిచ్పల్లి, కామారెడ్డి ప్రాంతాల్లో నీటి తీవ్రత ఎక్కువగా ఉంది. తండాలలోని వాగుల్లోని చెలిమలు, ఊట బావులనుంచి నీటిని తోడుకుంటున్నారు. మరికొన్ని చోట్ల వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఇందు కోసం కిలోమీటర్ల చొప్పు న కాలినడకన వెళుతున్నారు. ఇదీ పరిస్థితి జిల్లాలో 1,640 ఆవాస ప్రాంతాలు ఉండగా, 1,054 ఆవాస ప్రాంతాలకు నీటి సరఫరా ఉంది. 590 ఆవా స ప్రాంతాలకు పాక్షికంగా నీటి సరఫరా అవుతోంది. 159 ఆవాస ప్రాంతాలు సురక్షితం కానివి. ఈ ప్రాంతాలకు సీపీడబ్ల్యూ పథకం ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. అధికారులు చెబుతున్న వివరాలు ఇవి. కాగా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరే విధంగా ఉంది. అధికారులు చెప్పినట్లు 1,054 ఆవాస ప్రాంతాలకు కాకుండా, 600 ఆవాస ప్రాంతాలకు కూడా నీటి సరఫరా అందుబాటులో లేదు. 590 ప్రాంతాలకు పాక్షికంగా నీటి సరఫరా ఉందని పేర్కొనడంలోనూ నిజం లేదు. వంద ప్రాంతాలకు కూడా సక్రమంగా నీరు అందడం లేదు. 39 బోర్లను అద్దెకు తీసుకుని, 31 ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలపడం మరీ పచ్చి అబద్ధంగా కనిపిస్తోంది. బోర్ల నుంచి నీటిని అందించేందుకు కరెంటు సదుపాయమే లేదు. అయి నా అధికారులు వీటిని లెక్కలోకి తీసుకుంటున్నారు. అద్దె ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు నీటి సరఫరా నామమాత్రంగానే ఉంటోంది. ఈ ఏడాది వేసవి ప్రణాళికలో భాగంగా రూ. 1.50 కోట్లతో ప్రణాళిక లు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయి తే ఆ ప్రణాళికలు ఎక్కడా అమలవుతున్నట్లు కని పించడం లేదు. జిల్లాలో 347 బోర్లు, చేతిపంపులకు ఫ్లషింగ్, డిఫెనింగ్ చేసినట్లు అధికారులు రికార్డులలో చూపుతున్నారు. చేతిపంపుల వినియోగం అక్కడక్కడ మాత్రమే ఉంది. వేసవి కాలంలో చేతిపంపులే ప్రధాన నీటి వనరులుగా ఉపయోగపడతాయి. వీటి ని పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా అంతటా అధికారులు ఎన్నికల నిర్వహణలో నిమగ్నమయ్యారు. దీంతో నీటి ఎద్దడిపై చర్యలు తీసుకునేందుకు తీవ్ర ఆటం కాలు ఎదురవుతున్నాయి. అధికారులు ప్రధానమైన నీటి అవసరాలను పట్టించుకోకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
ఊరంతా షాక్
భీతిల్లిన మైలారం వాసులు ‘సింగిల్ ఫేజ్’ ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ లోపమే కారణం పలువురికి గాయాలు వర్గల్, న్యూస్‌లైన్: వర్గల్ మండలం మైలారం గ్రామం ఆది వారం విద్యుత్ షాక్‌కు గురైంది. ఇంట్లో స్విచ్ బోర్డులు, సిమెంట్ గోడలు, టీవీ స్విచ్‌లు ఇలా వేటిని తాకినా షాకిచ్చాయి. పలువురికి గాయాలయ్యాయి. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీ ప్రజలు ఒక్కసారిగా భీతిల్లిపోయారు. గ్రామస్థులు తెలి పిన వివరాల ప్రకారం... మజీద్ సమీప సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరా అయ్యే ఇళ్లల్లో ఆదివారం హైఓల్టేజీ సరఫరా అయ్యింది. దీంతో గోడలు, స్విచ్‌లు తాకినా కాలనీ వాసులు షాక్‌కు గురయ్యారు. ఇదే పరిస్థితిలో దండు లక్ష్మి, సింగారం నాగరాజు, నరేష్‌గౌడ్, అశోక్ తదితరులు షాక్ తగిలి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ట్రాన్స్‌కో క్యాజువల్ సిబ్బంది స్వామికి స్థానికులు ఫోన్ ద్వారా సమాచారం చేరవేయడంతో ఆయన వెంటనే గ్రామానికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపేసి ఎర్తింగ్ లోపాన్ని సరిచేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్‌కు నీటి తడి తగ్గడంతో హైఓల్టేజీ సరఫరా జరిగిందని స్వామి తెలిపారు. -
ట్రాన్స్‘ఫార్మర్’ కష్టాలు
నాలుగు రోజుల క్రితం మండల పరిధిలోని అలిరాజ్‌పేట్ గ్రామ సమీపంలోని రహదారి పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుండి గుర్తుతెలియని దుండగులు రాత్రి వేళలో అయిల్ను అపహరించారు. దీంతో ఆ చుట్టూ పక్కల గ్రామల రైతుల పంటల పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇది గమనిం చిన రైతులు జరిగిన విషయాన్ని విద్యు త్ శాఖ అధికారులకు తె లియజేశారు. అయితే పోలీసు స్టేషన్ నుండి ఎఫ్ఐఆర్(ప్రాథమిక సమాచార నివేదిక) తీసుకురావాలని రైతులకు సూచించారు. రైతు లు పోలీసు స్టేషన్లో అయిల్ చోరి విషయాన్ని ఎస్ఐ వీరన్నకు వివరించారు. దీంతో ఎస్ఐ అయిల్ చోరీకి సంబంధించిన ఎప్ఐఆర్ను సీఐ ద గ్గరికి వెళ్లి తీసుకోవాలని చెప్పడంతో పోలీసు స్టేషన్లో జరిగిన విషయంను విద్యుత్ అధికారులకు వివరించారు. ఎప్ఐఆర్ ఉంటేనే ట్రాన్స్‌ఫార్మర్‌లో అయిల్ పోసి మరమ్మతులు చేస్తామని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆ గ్రహించిన రైతులు అలిరాజ్‌పేట్-గణేష్‌పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై శుక్రవా రం అరగంటకుపైగా ధర్నాకు దిగారు. ఏడాదికాలంలో ఒకే ట్రాన్స్ఫార్మర్ నుం చి నాలుగుసార్లు అయిల్ చోరీ జరుగుతున్న పోలీసులు దొంగలను పట్టుకోవడంతో విఫలమవుతున్నారని రైతులు ఈ సందర్భంగా ఆరోపించారు. అటు పోలీసుల నిర్లక్ష్యం, ట్రాన్స్‌కో అధికారు ల అలసత్వం వల్ల తమ పంట పొలాలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న ఏఈ శ్రీనివాస్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయిస్తామని రైతులకు చెప్పడంతో ఆందోళనను విరమించారు. -
‘కట్’ కట..
ఖమ్మం, న్యూస్‌లైన్ : విద్యుత్ కోతలతో ఇప్పటికే జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండగా మార్చి ప్రారంభం నుంచి మరిన్ని గంటల పాటు కోతలు పెంచేందుకు ఏపీఎన్పీడీసీఎల్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పల్లెల్లో పగటి పూట కరెంట్‌కు నోచుకోవడం లేదు. అధికారిక కోతలకు తోడుగా అనధికారిక కోతలు పెరగడం, రాత్రివేళల్లో తరుచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న నేపధ్యంలో కోతలు ఇంకా పెరుగుతాయనే ప్రకటనలతో మరింతగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు మండల కేంద్రాల్లో 6 గంటలు, సబ్‌స్టేషన్ సెంటర్లలో 8 గంటలు, మున్సిపాలిటీ కేంద్రాల్లో 4 గంటల పాటు కోత విధిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా కేంద్రాలకు మాత్రం ఊరట కల్పించారు. అయితే జిల్లాకు సరఫరా చేసే విద్యుత్‌కు, వినియోగానికి మధ్య తేడా ఉండటంతో మరిన్ని గంటలు కోత విధించాల్సి వస్తోందని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు. మార్చి ప్రారంభం నుంచి జిల్లా కేంద్రంలో నాలుగు గంటలు, మన్సిపాలిటీలలో ఆరు గంటలు, మండల కేంద్రాల్లో ఏడు గంటలు కోత విధించనున్నారు. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వేసవిలో పరిస్థితి ఏంటని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. లోవోల్టేజీతో కాలుతున్న ట్రాన్సఫార్మర్లు, మోటార్లు... వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పింది. రాత్రి, పగలు తేడా లేకుండా విద్యుత్ సరఫరా చేయ డం.. అదీ ఒకటి, రెండు గంటలు మాత్రమే కావడంతో ఒక్క మడి కూడా పారడంలేదని రైతులు అంటున్నారు. విద్యుత్ విని యోగానికి అనుగుణంగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పంపి నా.. వాటి నిర్మాణాల్లో అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో ఉన్న ట్రాన్సఫార్మర్లపైనే అధిక లోడు పడటం, లోవోల్టేజీ సమస్య ఏర్పడడంతో తిరుమలాయపాలెం, కూసుమంచి, ఇల్లెందు, గార్ల, బయ్యారం, సత్తుపల్లి ప్రాం తాల్లో విద్యుత్ మోటార్లు తరచూ కాలిపోతున్నాయి. పంటలు ఏపుగా పెరుగుతున్న తరుణంలో సక్రమంగా నీరందకుంటే అవి చేతికందకుండా పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఫ్యూజు వేయబోయి...
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామ మాజీ సర్పంచ్, రైతు వొల్లాల లక్ష్మీనారాయణ(50) కరెంటుకాటుకు బలయ్యాడు. ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్‌వైర్ వేస్తుండగా, షాక్ తగిలి అక్కడే మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే... లక్ష్మీనారాయణకు పదెకరాల పొలం ఉంది. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి మోటార్ ఆన్ చేయబోగా, కాలేదు. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా, ఫ్యూజ్ పోయి కనిపించింది. దీంతో లక్ష్మీనారాయణ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి ఫ్యూజ్‌వైరు వేస్తుండగా, షాక్ కొట్టి దానిపైనే ప్రాణాలు విడిచాడు. - న్యూస్‌లై న్, ఇల్లంతకుంట -
మృతదేహంతో ఆందోళన
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ :అమలాపురం ఈదరపల్లి వంతెన వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించింది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆమె బంధువులు, ఏకలవ్య ఎరుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఈదరపల్లిలోని సబ్‌స్టేషన్ వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఈ నెల 19న అమలాపురం సమీపంలోని ఈదరపల్లి వంతెన వద్ద రోడ్డు పక్కగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలిన సంఘటనలో కూతాడి పెద్దింట్లమ్మ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆమె వీపుపై ట్రాన్స్ఫార్మర్లోని మరుగుతున్న ఆయిల్ పడడంతో మంటల్లో చిక్కుకుని 70 శాతానికి పైగా కాలిపోయింది. ఆమెను తొలుత అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె శనివారం రాత్రి మరణించింది. కాకినాడలో పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహంతో భర్త ముకుంద్, బంధువులు, ఎరుకుల సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో అమలాపురం ఈదరపల్లిలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అక్కడే బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్రరగేషియా, మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ శ్రీనివాసబాబు, ఎస్సైలు డి.రామారావు, యాదగిరి సంఘటన స్థలానికి చేరుకుని, ఆందోళనకారులతో చర్చించారు. స్నేహిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు కుంచే స్వర్ణలత, ఈదరపల్లి సర్పంచ్ నక్కా సంపత్‌కుమార్, న్యాయవాది నల్లి సుధీర్.. ట్రాన్స్‌కో ఏఈ ఎం.సతీష్‌తో చర్చలు జరిపారు. పెద్దింట్లమ్మకు తామే వైద్యం చేయించామని, అయినా ఫలితం లేకుండా పోయిందని, ట్రాన్స్‌కో నుంచి రూ.లక్ష పరిహారం చెల్లిస్తామని, అదనంగా పరిహారం వచ్చేలా కృషి చేస్తామని ఏఈ హామీ ఇచ్చారు. ఉద్యోగం విషయం తమ పరిధిలో లేదని చెప్పారు. దీనితో సంతృప్తి చెందని ఆందోళనకారులు ఆరు గంటలకు పైగా మృతదేహంతో ఆందోళన కొనసాగించారు. మృతురాలి కుటుం బానికి ఎక్స్‌గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం విషయమై అధికారులకు ప్రతి పాదనలు పంపుతామని, తగిన న్యాయం చేస్తామని ఏఈ హామీ ఇవ్వడంతో రాత్రి 8.30 గంటల సమయంలో ఆందోళన విరమించారు. -
తిమ్మాపూర్ ఎస్సీ కాలనీకి విద్యుత్ షాక్
కౌడిపల్లి, న్యూస్‌లైన్ : ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ లోపం కారణంగా పలువురి ఇళ్లకు కరెంట్ షాక్ వచ్చింది. ఈ సంఘటన మండలంలోని తిమ్మాపూర్ ఎస్సీ కాలనీలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలో వాటర్ ట్యాంక్ వద్ద ఎస్సీ కాలనీ సరఫరా అయ్యే సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. కాగా ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ లోపం కారణంగా అర్ధరాత్రి ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వచ్చింది. దీని కారణంగా ఇళ్లలోని కరెంట్ సరఫరా అవుతున్న ఎలక్ట్రానిక్ పరికరాలకు షాక్ వచ్చింది. ఇదిలా ఉండగా.. గ్రామానికి చెందిన రాగి మొగులయ్య ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ పడుకున్నారు. అయితే కొంత సమయం తరువాత అతడి కుమార్తె నీళ్లు తాగేందుకు నిద్ర లేచింది. ఈ సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో ఉన్న కలర్ టీవీ నుంచి పొగలు వస్తున్న విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులను లేపింది. అనంతరం టీవీ ప్లగ్ తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందకు పడిపోయింది. అయితే కొద్దిసేపటికి కరెంటు పోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో టీవీ పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ విషయం అధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ఉదయం లైన్ ఇన్స్పెక్టర్ కృష్ణ, సీఎల్ రఘుపతి, ఆపరేటర్ నాగరాజు తదితరులు మరమ్మతులు చేశారు. ఎర్తింగ్ లోపం కారణం గానే షార్ట్ సర్క్యూట్ అయ్యిందని తెలిపారు. మరమ్మతులు చేసి లోపాన్ని సవరించినట్లు వారు వివరించారు. -
పేలిన ట్రాన్స్ఫార్మర్
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ : అమలాపురం సమీపంలోని ఈదరపల్లి వంతెన వద్ద రోడ్డు పక్కగా ఉన్న ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బుధవారం ఉదయం 8గంటల సమయంలో అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ దుర్ఘటనలో భార్యాభర్తలు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ పేలే సమయానికి అటుగా వెళుతున్న భార్యాభర్తలు కూతాడి ముకుంద్, పెద్దింట్లమ్మ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఇంటినుంచి అల్పాహారం నిమిత్తం హోటల్‌కు వెళుతున్నపుడు వీరీ ప్రమాదం బారిన పడ్డారు. పేలిన ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలతో కూడిన మరుగుతున్న చమురు వీరిపై పడింది. ముకుంద్ స్వల్ప గాయాలతో తప్పించుకోగా పెద్దింట్లమ్మ తీవ్రంగా గాయపడింది. ఆమె వీపు భాగం మంటల్లో చిక్కుకోగా హాహాకారాలు చేస్తూ పరుగులు తీసింది. స్థానికంగా పనిచేస్తున్న జట్టు కూలీలు ఆమెపై ఇసుక పోసి, గోనెసంచులు కప్పి రక్షించారు. సర్పంచ్ నక్కా సంపత్‌కుమార్ వారిని 108 అంబులెన్స్‌లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. పెద్దింట్లమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వెద్యం కోసం ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాన్స్‌కో డీఈ చలపతిరావు, ఏఈ ఎం.సతీష్ సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితి సమీక్షించారు. 70 శాతం పైగా శరీరం కాలిపోగా పెద్దింట్లమ్మ పరిస్థితి విషమంగా ఉందని కాకినాడ వైద్యులు చెబుతున్నారు. ఇళ్లల్లో పనులు చేసుకుని బతికే పెద్దిం ట్లమ్మ ఈ ెప్రమాదానికి గురవడంతో కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు. తప్పిన పెను ప్రమాదం ప్రమాదం జరిగిన సమయంలో జన సంచారం లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఉన్న ప్రాంతంలోనే స్కూల్ బస్సులను ఆపి విద్యార్థులను ఎక్కించుకుంటారని, అయితే బంద్ కారణంగా బుధవారం దుకాణాలు మూసి ఉన్నాయని, విద్యార్థులూ లేరని తెలిపారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఆయిల్ లీకేజీపై ట్రాన్స్‌కో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉండే గ్యాస్ వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని ట్రాన్స్‌కో అధికారులు అంటున్నారు. పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్ శకలాలను పరిశీలన కోసం రాజమండ్రి విద్యుత్ కార్యాలయానికి పంపుతున్నామని పేర్కొన్నారు. కాగా బాధితులను శాఖ తరఫున ఆదుకుంటామని డీఈ చలపతిరావు హామీ ఇచ్చారు. -
ట్రాన్స్ఫార్మర్ కష్టాలు!
వీరఘట్టం, న్యూస్‌లైన్ :వ్యవసాయ విద్యుత్ సరఫరాలో పంపిణీ నష్టాలను నివారించి అన్నదాతకు మేలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం హైవోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(హెచ్‌వీడీఎస్) పథకాన్ని రూపొం దించింది. ప్రస్తుతం ఉన్న పెద్ద ట్రాన్స్ఫార్మర్ల వల్ల పంపిణీ నష్టాలు పెరుగుతున్నాయి. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ పరిధిలో 20 నుంచి 30 వరకు వ్యవసాయ బోర్లు ఉంటున్నాయి. దీంతో ట్రాన్స్ఫార్మర్లపై భారం పెరిగి లోవోల్టే జీ సమస్య ఏర్పడుతోంది. ఫలితంగా వ్యవసాయ పంపుసెట్ల మోటార్లు తర చూ కాలిపోతున్నాయి. అందుకే పెద్ద ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో హెచ్‌వీడీఎస్ పథకాన్ని రూపొందిం చారు. దీనికింద 3 నుంచి 5 వ్యవసాయ కనెక్షన్లకు ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ చొప్పున ఏర్పాటు చేస్తారు. దీనివల్ల పంపిణీ నష్టాలు తగ్గుతాయి. లోవోల్టేజీ సమస్య తీరిపోతుంది. వ్యవసాయ పంపు సెట్లు కాలిపోవడం చాలావరకు తగ్గిపోతుంది. జిల్లాలో ఈ పథకానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. హైదరాబాద్‌కు చెందిన జీవీఎస్ సంస్థకు రూ.38 కోట్లతో టెండరును కట్టబెట్టింది. దీంతో సమస్య తీరుతుంద ని రైతులు ఆశపడ్డారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. చేతులేత్తేసిన కాంట్రాక్ట్ సంస్థ రూ.38 కోట్ల భారీ టెండరు దక్కించుకున్న జీవీఎస్ సంస్థ హెచ్‌వీడీఎస్ అమలులోపూర్తిగా చేతులెత్తేసింది. టెండర్ నిబం ధనల ప్రకారం 2013జూలైనాటికి జిల్లాలో ఉన్న 25,565 వ్యవ సాయ పంపుసెట్లను హెచ్‌వీడీఎస్ కిందకు తీసుకురావాలి. నిర్దేశిత గడువు ముగిసి ఆరునెలలు దాటింది. కానీ జిల్లాలో 20 శాతం పనులు కూడా పూర్తికాలేదు. తొలుత రణస్థలం, లావే రు, ఎచ్చెర్లమండలాల్లో పనులు ప్రారంభించి 2013 జులై నాటి కి జిల్లా అంతటా పూర్తి చేయాలన్నది లక్ష్యం. కానీ జిల్లా అం తటా దేవుడెరుగు.. కనీసం లావేరు, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో కూడా పనులు పూర్తి చేయలేదు. లావేరు మండలంలో 350 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 150 ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే అమర్చారు. మెట్టవలస, బుడుమూరు, రొంపివలస, లక్ష్మీపురం, రేగపాలెం, బుడతవలస గ్రామాల్లో అరకొర పనులతో సరిపెట్టారు. రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. పట్టించుకోని అధికారులు అన్నదాతకు ఎంతో మేలు చేసే హెచ్‌వీడీఎస్ పథకాన్ని సకాలంలో పూర్తిచేయాలన్న ఉద్దేశం కాంట్రాక్టు సంస్థకు ఉన్నట్లు కనిపించడం లేదు. పనులు 20 శాతం కూడా పూర్తికాకపోయినా ఈస్ట్రన్ డిస్కం అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ సంస్థను మందలించి పనులు చేయించాలన్న ధ్యాస కూడా వారికి లేకుండాపోయింది. తప్పనిసరైతే కాంట్రాక్టు రద్దు చేసి మరో సంస్థకు అప్పగించవచ్చు. కానీ అధికారులు ఆ దిశగా కూడా ప్రయత్నించడం లేదు. కమీషన్లు దండుకోవడానికే వారు కాంట్రాక్టు సంస్థకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్నదాతకు తప్పని వెతలు హెచ్‌వీడీఎస్ పథకం అమలుకాకపోవటంతో అన్నదాతలకు విద్యుత్ కష్టాలు కొనసాగుతున్నాయి. వేసవి వస్తుండటంతో విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం 4 గంటలు కూడా ఇవ్వడం లేదు. విద్యుత్ సరఫరా ఉన్న సమయంలో లోవోల్టేజీ సమస్య వేధిస్తోంది. ట్రాన్స్ఫార్మర్లకు శివారులో ఉన్న పంపుసెట్లకు సమస్య మరింత ఎక్కువగా ఉంది. లోడు పెరిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. రైతుల పంపుసెట్ల మోటార్లు కూడా కాలిపోతున్నాయి. దీంతో మరమ్మతుల ఖర్చు అన్నదాతకు అదనపు భారమవుతోంది. ఒక్క పాలకొండ డివిజన్‌లోనే గడచిన నెల రోజుల్లో 200కుపైగా మోటార్లు కాలిపోయాయి. మరోవైపు కాలిపోయిన పెద్ద ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకు రైతులే చందాలు వేసుకుని పాలకొండ తీసుకువెళ్లాల్సి వస్తోంది. చిన్నచిన్న ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తే ఈ కష్టాలన్నీ తీరుతాయి. కానీ పథకాన్ని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి అటు కాంట్రాక్టు సంస్థకు, ఇటు అధికారులకు లేకుండాపోయింది. దీంతో నిధులున్నా పనులు పూర్తికాక అన్నదాతలు కుంగిపోతున్నారు. -
మూడు గంటల్లోనే...!
అంతా ఎవరి పనుల్లో వారున్నారు. ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్ధం. తేరుకునేలోపే మంటలు వ్యాపించి రూ. కోట్ల నష్టాన్ని ట్రాన్స్‌కోకు మిగిల్చాయి. మంటలను ఆర్పే ప్రయత్నం సకాలంలో చేయడంతో పాటు రక్షిత చర్యలు తీసుకున్నందున పక్కనే ఉన్న మరో ట్రాన్స్ఫార్మర్ను కాపాడుకో గలిగారు. ఇదీ జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్న విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో సంభవించిన అగ్ని ప్రమాద ఘటన తీరు. ధరూరు, న్యూస్‌లైన్ : సాంకేతిక లోపమో, విద్యుత్ స రఫరాలో అధిక వేడిమో సమస్య ఏదైనా విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఉన్న 100 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారి గా పేలి మంటల్లో కాలిపోవడంతో, మూడు గంటల్లో రూ.3 కోట్ల విలువ చేసే ట్రాన్స్ఫార్మర్ను ట్రాన్స్‌కో కోల్పోవాల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి... గ ద్వాల, నారాయణపేట డివిజన్లలో ఉన్న లోఓల్టేజీ స మస్యను నివారించాలన్న ఉద్దేశంతో రూ.18 కోట్లతో ట్రాన్స్‌కో జూరాల ప్రాజెక్టు వద్ద 220/132 కేవీ సబ్‌స్టేషన్‌ను 2011లో ప్రారంభించింది. మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు సబ్‌స్టేషన్‌లో ఒకేసారి భారీగా శబ్దం వచ్చింది. ఏమైందోనని బయటకు వచ్చి సిబ్బంది,అక్కడ విధుల్లో ఉన్న ఇంజనీర్లు చూ సే లోపే భారీ ఎత్తున పొగలు కమ్ముకొని మంటలు చెలరేగాయి. అక్కడేం జరుగుతుందో కూడా తెలి యని పరిస్థితి ఏర్పడింది. తీరా మంటల్లో 100 ఎం వీఏ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడాన్ని గమనించిన ట్రా న్స్‌కో అధికారులు విషయాన్ని అగ్నిమాపక కేంద్రాల తోపాటు, ఆ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గద్వాల, ఆ త్మకూరు ప్రాంతాల అగ్నిమాపక కేంద్రాల వాహనా లు హుటా హుటిన జూరాలకు చేరుకున్నాయి. సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా భారీ ఎత్తున ఎగిసి పడుతుండడంతో అదుపులోకి రాలేదు. రెండు వాహనాల ద్వారా నీటిని పంపింగ్ చేస్తూ ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు మూడు గంటలు ఫైర్ సిబ్బంది శ్రమించి ఐదు గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. 100 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు దాని అనుబందంగా ఉన్న రేడియేటర్ పూర్తిగా కాలిపోయాయి. ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ఈ విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. లోపం ఎక్కడ తలెత్తింది, మంటలు ఎందుకు వ్యాపించాయి అనే దానిపై ఆరా తీశారు. భారీ ఎత్తున పొగలు కమ్ముకొని మంటలు చెలరేగిన విషయాన్ని గమనించిన చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తరలి వచ్చారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ 200 మీటర్ల వరకు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురైన ట్రాన్స్‌కో అధికారులు, పోలీసులు ప్రజలను అక్కడికి రానివ్వలేదు. ఇదిలా ఉండగా మంటల్లో కాలిపోయిన 100 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ పక్కనే కుడి పక్కన ఉన్న మరో ట్రాన్స్ఫార్మర్కు అగ్ని ప్రమాదం తప్పినట్లయింది. ఎక్కడ ఇలాంటి సబ్స్టేషన్లు నిర్మించినా ట్రాన్స్ఫార్మర్ల మధ్య సిమెంట్ కాంక్రీటుతో ఒక గోడను ఏర్పాటు చేస్తామని, అందులో భాగంగానే ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం వల్ల మరో రూ.3 కోట్ల విలువ చేసే ట్రాన్స్ఫార్మర్ను కాపాడుకోగలిగామని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. అయితే అంతా ప్రాజెక్టుకూ నష్టం వాటిల్లి విద్యుత్తు ఉత్పత్తి కూడా ఆ ప్రభావం పడిందని తొలుత భావించారు. దాని కనెక్షన్ వేరే మార్గంలో ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు కలగలేదని అధికారులు తెలిపారు. కారణాలను అన్వేషిస్తున్నాం... డీఈ రాము. సబ్‌స్టేషన్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలను అన్వేషిస్తున్నాం. మంటలు ఎలా వ్యాపించి ఉంటాయి, అందుకు గల కారణాలు ఏంటి అనే దానిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. నిపుణుల బృందంచే విచారణ చేయించి కాలిపోవడానికి గల కారణాలను వెల్లడిస్తామని ట్రాన్స్‌కో డీఈ రాము తెలిపారు. -
రైతుల నెత్తిన ట్రాన్స్ఫార్మర్ల పిడుగు
చిన్నవి ఏర్పాటుచేసేందుకు కసరత్తు ఇప్పటికే నూజివీడు మండలంలో అమలు విద్యుత్ శాఖ బాధ్యత నుంచి తప్పుకొనేందుకు అంటున్న రైతులు ఒకవైపు విద్యుత్ కోతలతో విలవిల్లాడుతున్న రైతుల నెత్తిన ట్రాన్స్ఫార్మర్ల పేరిట కొత్త భారాలు మోపేందుకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) సిద్ధమవుతోంది. గ్రామాల్లో పెద్ద ట్రాన్స్ఫార్మర్లకు స్వస్తి పలికి చిన్నవి ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పద్ధతిని ఇప్పటికే నూజివీడు మండలంలో ప్రయోగాత్మకంగా అమలు చేయగా చక్కటి ఫలితాలు వచ్చాయని.. దీనిని జిల్లా అంతటా అమలు చేస్తామని ఎస్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. సాక్షి, విజయవాడ : వ్యవసాయ విద్యుత్ సరఫరా కోసం ఇప్పటివరకు రైతుల అవసరాలను బట్టి 100 కేవీ, 63 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసేవారు. ఒక 100 కేవీ ట్రాన్స్ఫార్మర్పై 5 హెచ్‌పీ మోటార్లు 20 నుంచి 25 వరకు, 20 హెచ్‌పీ మోటార్లు ఐదారు ఉపయోగించుకోవచ్చు. రైతులు అవసరాలను బట్టి మోటార్ హార్స్పవర్ (హెచ్‌పీ)ని ఏర్పాటు చేసుకుంటారు. ఒకేచోట 100 కేవీ, 63 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం వల్ల 5 హెచ్‌పీ మోటార్లు 25 ఉపయోగించుకోవాల్సి ఉండగా, రైతులు అక్రమంగా 30 నుంచి 35 వరకు ఉపయోగిస్తున్నారనే అనుమానాలు అధికారుల్లో ఉంది. విద్యుత్ కనెక్షన్లు తీసుకోకుండా దొంగతనంగా మోటార్ వైర్లు విద్యుత్ తీగలకు తగిలించి రైతులు వినియోగించుకుంటున్నారని, దీనివల్ల ట్రాన్స్ఫార్మర్లపై అధిక లోడుపడి పాడైపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ఏస్పీడీసీఎల్కు తీవ్రంగా నష్టం వస్తోందని పేర్కొంటున్నారు. దీంతో మినీ ట్రాన్స్ఫార్మర్లపై అధికారులు దృష్టిపెట్టారు. వ్యవసాయానికి 25 కేవీ, 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మోటార్ కెపాసిటీని బట్టి ఈ ట్రాన్స్ఫార్మర్లు నిర్మిస్తారు. ఐదారు 5 హెచ్‌పీ మోటార్లకు కలిపి ఒక 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తారు. రెండు మూడు 5 హెచ్‌పీ మోటార్లకు ఒక 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయొచ్చు. హెచ్‌పీకి రూ.1000 వసూలు కొత్తగా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు కావాల్సినవారు మినీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హెచ్‌పీకి రూ.1000 చొప్పున చెల్లిస్తే, వారికి కావాల్సిన కెపాసిటీని బట్టి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ఇప్పటికే ఉన్న లైను నుంచి కొత్తగా లైను వేయాలంటే దానికి అయ్యేభారాన్ని రైతులే భరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రైతుల నుంచి నిరసన మినీ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుపై రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. విద్యుత్‌శాఖ తమ బాధ్యతల నుంచి తప్పుకొనేందుకే ఈ విధంగా మినీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశలవారీగా 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు తీసివేసి చిన్నవి రైతులకు అంటగడతారని, ఇప్పటికే ఉచిత విద్యుత్ నుంచి ప్రభుత్వం చల్లగా జారుకుంటోందని, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, వాటి నిర్వహణ భారం కూడా రైతుల పైనే భారం మోపేందుకు సిద్ధమౌతుందని అంటున్నారు. రైతులు విద్యుత్ చౌర్యం చేసున్నారనే అధికారులు నెపం వేస్తున్నారే తప్ప రోజులో నాలుగైదు గంటలు కూడా విద్యుత్ లేకపోవడంతో అనేక మంది రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. పాత కనెక్షన్లకు పెద్ద ట్రాన్స్ఫార్మర్లే ఉండాలి ఇప్పటికే జిల్లాలో వేలాది మోటార్ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికీ పెద్ద ట్రాన్స్ఫార్మర్లు తీసివేసి చిన్నవి పెట్టి ఆ ఆర్థిక భారం రైతుల నెత్తిన వేయడం సరికాదు. చిన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో ఫ్యూజులు పోతే ఎవరు వేస్తారు? రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లకూడదనే నిబంధన ఉంది. విద్యుత్ ఉద్యోగి వచ్చి ఫ్యూజు వేసేవరకు వారు ఎదురుచూడాల్సి వస్తుంది. గ్రామాల్లో ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు ఉండటం వల్ల ఇబ్బందులు కూడా పెరుగుతాయి. అధికారులు రైతులకు మేలు కలిగే నిర్ణయాలే తీసుకుంటే మంచిది. - ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ -
కరెంట్ ఆగదు.. పొలం పారదు
బావుల నిండా నీరున్నా కరెంట్ లేక వేసిన నాట్లు వేసినట్టే ఎండిపోతున్నాయి. ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు సామర్థ్యానికి మించి కనెక్షన్లు ఉన్నాయి. దీంతో లోడ్ ఆగక తరచూ ఫీజు కొట్టేస్తోంది. లేకుంటే ట్రిప్ అవుతోంది. అదనపు సామర్థ్యం గల ట్రాన్స్ఫారం ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరిగినా స్పందన లేదు. మెట్టప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తం ఇదే సమస్య. - న్యూస్‌లైన్, హుస్నాబాద్ హుస్నాబాద్ మండలం అంతకపేట గ్రామంలో 100 హెచ్‌పీ సామర్థ్యం గల ఎస్ఎస్-1 ట్రాన్స్ఫార్మర్ ఉంది. దీనికింద 45 వ్యవసాయ బావులు ఉన్నాయి. దీని ద్వారానే గ్రామానికీ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. సామర్థ్యానికి మించి కనెక్షన్లు కావడంతో ట్రాన్స్ఫార్మర్ ఇప్పటికే రెండుసార్లు కాలిపోయింది. మరో 100 హెచ్‌పీ అదనపు ట్రాన్స్ఫార్మర్ కోసం రైతులు చందాలు వేసుకుని డీడీ కట్టారు. పదిరోజులైనా అధికారుల్లో చలనం లేదు. దీంతో రైతులు వంతులవారీగా.. ఒకరోజు 20 మంది రైతులు.. మరోరోజు 25 మంది రైతులు పొలాలకు నీరు పెట్టుకుంటున్నారు. తరచూ లోవోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయి. అయితే ట్రాన్స్ఫార్మర్.. లేకుంటే మోటార్.. వారంలో రెండుసార్లు కాలిపోతుండడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు. నారుపోసి 25 రోజులు అయితంది నారుపోసి 25 రోజులయితంది. గిప్పటివరకు ఇంకా పొలమే దున్నలేదు. దున్నదామంటే కరెంట్ సక్కగా ఉంటలేదు. వచ్చుడు..పోవుడు ఇదే పని. గిట్లయితే నాటేసుడెట్లయితది. కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం సార్లకు చెప్పినం. అయినా ఇత్తలేరు. - ఇర్రి వెంకటరెడ్డి, అంతకపేట స్టార్టర్ వద్ద నుంచి కదిలితే ఒట్టు.. ఈయన హుస్నాబాద్ మండలం అంతకపేటకు చెందిన రైతు ఇర్రి వెంకటరెడ్డి. ఐదెకరాల్లో రెండున్నర ఎకరాలు మొక్కజొన్న, రెండెకరాల్లో నాటేశాడు. ఈయన వ్యవసాయ బావి ఎస్ఎస్-1 ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఉంది. దానికి 45 కనెక్షన్లు ఉండడంతో విద్యుత్ కష్టాలు తీవ్రమయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు కరెంట్ రాగానే మక్కకు నీళ్లు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. సరిగ్గా 1.42 గంటలకు ట్రిప్ అయ్యింది. మళ్లీ 1.47కు వచ్చింది. అయ్యో అనుకుంటూ స్టార్టర్ వద్దకు వెళ్లి ఆన్ చేయగానే.. తిరిగి 1.57గంటలకు ట్రిప్ అయ్యింది. మూడు నిమిషాలకే మళ్లీ వచ్చిం ది. స్టార్టర్ ఆన్ చేసిన రైతు చేనులోకి వెళ్లాడు. ఐదు నిమిషాలు అయ్యిందో లేదో మళ్లీ ట్రిప్.. రైతుకు కోపం వచ్చింది. ‘ఈ కరెంట్ గింతే.. పొలం పారనివ్వది.. నన్ను నిలువనీయది..’ అనుకుంటూ స్టార్టర్ వద్దే కూర్చుండిపోయాడు. - న్యూస్‌లైన్, హుస్నాబాద్ నిర్వహణ లోపం.. సెస్ పరిధిలో 191 గ్రామాలు... 5680 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. సుమారు 60వేల వరకు వ్యవసా య నకనెక్షన్లు ఉన్నాయి. అయితే సంస్థ సిబ్బందిలేమితో ఇబ్బంది పడుతోంది. ఉన్న సిబ్బంది ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణను నిర్లక్ష్యం చేస్తుండడంతో సగటున రోజుకు పదిహేను ట్రాన్స్ఫార్మర్లు కాలిపో యి మరమ్మతుకు వస్తున్నాయి. వీటి సెస్‌కు తీసుకురావడం.. మళ్లీ తీసుకెళ్లడం.. హెల్పర్ సహాయం తో బిగించడం ద్వారా ఒక్క ట్రాన్స్ఫార్మర్కు రూ. మూడు వేల వరకు ఖర్చవుతోంది. ఇది రైతులే భ రించాలి. ఇది అనధికారికం. అధికారికంగా ఒక్కో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు రూ.18 వేలు ఖర్చవుతోంది. ఇలా సెస్‌పై నిత్యం రూ.2.70 లక్షల భారం పడుతోంది. రబీలో కరెంట్ ఇబ్బందుల దృష్ట్యా అప్పటి సెస్ పర్సన్ ఇన్చార్జి అరుణ్‌కుమార్ రెండు నెలల క్రితమే 150 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు రూ.1.25 కోట్లకు అనుమతించారు. అయితే సెస్ అధికారుల నిర్లక్ష్యంతో అవి ఇప్పటికీ చేరలేదు. 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు అవసరంగా ఉండగా.. 65 కేవీవి సరఫరా అయ్యాయి. ముందుచూపుతో వ్యవహరించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఇబ్బంది ఎదురవుతోంది. సామర్థ్యానికి మించి విద్యుత్ వినియోగం ఉండడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. రిపేరులోనూ అలసత్వమే.. సెస్ సంస్థకు సొంత స్టోర్స్ ఉంది. కానీ.. మరమ్మతు మాత్రం చేయడం లేదు. మెకానిక్‌లను పిలిపించి రిపేరు చేయించి రైతులకు సత్వరమే ట్రాన్స్పార్మర్లు అందించాల్సి ఉన్నా.. డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న అధికారులు కావడంతో పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణంలో మూడు ప్రైవేటు మరమ్మతు కేంద్రాల్లో రోజుకు ఆరు వరకే బాగవుతున్నాయి. వచ్చేవి 15 అయితే రిపేరు మాత్రం ఆరుకు దాటడం లేదు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. -
వారి మాటలకు అర్థాలే వేరులే...
ట్రాక్టర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ రిపేరుకొచ్చింది. మరో ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఎర్రగుంట్లలోని మరమ్మతుల కేంద్రానికి వెళ్లాల్సిందే. ప్రొద్దుటూరు నుంచి ట్రాక్టర్లో ఎర్రగుంట్లకు ట్రాన్స్ఫార్మర్ను తీసుకెళ్లేందుకే రూ.1500 వరకు ఖర్చవుతోంది. ఎలాగోలా వెళ్లినా అక్కడి సిబ్బంది చేతులు తడపకపోతే మరమ్మతులు చేయరు. ట్రాన్స్ఫార్మర్ల స్టాక్ లేదంటూ కొన్ని సందర్భాలలో వారం, పది రోజుల పాటు తిప్పుకుంటుంటారు. కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్: విద్యుత్ అధికారుల మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు. విద్యుత్ సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తాం..రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు కలుగనివ్వం...ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అన్ని ఖర్చులు భరించి మేమే మరమ్మతులు చేయిస్తామని చెబుతున్న మాటలు ఆచరణలో కనిపించడం లేదు. తామే వాహనాలను సమకూర్చుకుని ట్రాన్స్ఫార్మర్లు తీసుకువెళ్లి రిపేర్లు చేయించుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో హెచ్‌టీ 11కేవీ విద్యుత్ లైన్లు 19538.06 కిలోమీటర్లు, 33కేవీ 1747.20 కిలో మీటర్లు, 6.3 కేవీ విద్యుత్ లైన్లు 1277.30 కిలోమీటర్లు, ఎల్టీ లైన్లు 2111194.24 కిలోమీటర్ల చొప్పున లాగారు. అలాగే 5 కిలోవాట్స్ ఎంపీయర్ ట్రాన్స్ ఫార్మర్లు 284, 15 కేవీఏ 28851, 25 కేవీఏ 23239, 40 కేవీఏ 147, 50 కేవీఏ 35, 63 కేవీఏ 2674, 75 కేవీఏ 19, 100 కేవీఏ 4556, 150 కేవీఏ 6, 160 కేవీఏ 227, 200 కేవీఏ 5, 250 కేవీఏ 63, 281 కేవీఏ 1, 315 కేవీఏ 29, 400 కేవీఏ 2, 500 కేవీఏ 14 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. రోజుకు జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 20 వరకు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుంటాయని అధికారులు తెలుపుతున్నారు. చేయి తడిపితేనే గానీ కిందిస్థాయి సిబ్బంది రిపేర్లు చేయడం లేదని రైతులు బాహటంగానే ఆరోపిస్తున్నారు. లేనిపక్షంలో రేపురా...మాపురా అనడంతోపాటు మా...ఏడీఈ, ఏఈల వాహనాలు అందుబాటు లేవని తప్పించుకునే మాటలు చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. పెండ్లిమర్రి మండలంలోని చింతలవాండ్లపల్లె సమీపంలో 33/11 కేవీ విద్యుత్ స్తంభం కూలిపోయే స్థితిలో ఉందని చెప్పినా సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు తెలిపారు. అదే మండలం పగడాలపల్లెలోని పొలాల్లో స్తంభాలు ఏర్పాటు చేయకపోవడంతో కర్రలపైనే వైర్లను లాగి మోటార్లు ఆడించుకుంటున్నారు. సింహాద్రిపురం మండలంలో ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పలుగ్రామాల ప్రజలు చెబుతున్నారు. సంస్థే బరాయిస్తుంది.... ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే పట్టణాల్లో 24 గంటలు, గ్రామాల్లో 48 గంటల్లో రిపేర్లు చేసి బిగిస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే తీసుకువెళ్లడానికి 23 మంది ఏడీఈలు సిద్ధంగా ఉంటారు. హెచ్‌వీడీఎస్ పద్ధతి వచ్చాక వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం తగ్గింది. ఒక్కో సర్వీసుకు రూ. 50 వేలు సబ్సిడీ ఇస్తాం. అందులోనే 3 స్తంభాలు, వైరు, సామగ్రి ఇస్తాం. స్తంభం వద్ద కాకుండా దూరంగా బోర్లు వేసుకుని కర్రలపై తీగలను కొందరు రైతులు లాక్కుంటున్నారు. లాక్కున్నారు. బోరు వరకు స్తంభాలు, వైర్లు, సామగ్రి కోసం అదనంగా డబ్బులు చెల్లిస్తే మేమే ఏర్పాటు చేస్తాం. - డాక్టర్ కేఎస్ పరబ్రహ్మం, ట్రాన్స్ఫార్మర్ల డీఈ, కడప -
జీవచ్ఛవాల బతుకు పోరు
అది జక్రాన్‌పల్లి మండలంలోని అర్గుల్ గ్రామం... ప్రశాంతతకు మారు పేరు. కానీ, అక్కడ ఓ ఇంటిలో మాత్రం పదిహేడేళ్లుగా అశాంతి రాజ్యమేలుతోంది. అంతులేని విషాదం ఆ కుటుంబాన్ని వెంటాడుతోంది. విధి వారితో ఆటలాడుకుంది. మనసులనే కాదు.. మనుషులనూ కకావికలం చేసింది. ఉన్నవారిని జీవచ్ఛవాలుగా మార్చింది. జక్రాన్‌పల్లి, న్యూస్‌లైన్ : తలుపు తట్టగానే ఓ 44 ఏళ్ల మహిళ దీనం గా వచ్చి ఎవరని పలకరించింది. వచ్చిన పని చెప్పగానే, మౌనంగా మంచంకేసి చూపించింది. అక్కడ జీవచ్ఛవంలా పడి ఉన్నాడు ఓ యువకుడు. అతని పేరు బొబ్బిలి రమేశ్. వ యస్సు 40 ఏళ్లు. 1996 వరకు అతను కూడా అందరు యువకులలాగే చలాకీగా ఉన్నాడు. జీవితంపై రంగుల కలలు కన్నాడు. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశపడ్డాడు. తల్లిదండ్రుల పేదరికానికి తను పరిష్కారం కావాలనుకున్నాడు. కానీ ఇంటర్ ఫెయిల్ కావడం అతని పాలిట శాపమైంది. తండ్రికి సహాయంగా పొలానికి వెళ్లిన రమేశ్ అనుకోని ప్రమాదానికి గురయ్యాడు. పొలం వద్ద కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగిస్తున్నారు. ఇందుకోసం తీగలు సరి చేయడానికి స్తంభం ఎక్కాడు. అంతకు ముందే కరెంటు సరఫరా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ, దురదృష్టం అతడిని వెంటాడింది. అతడు స్తంభం ఎక్కగానే కరెంటు సరఫరా అయింది. అంతే, రమేశ్ విసురుగా కింద పడిపోయాడు. అలా పడిపోయిన రమేశ్ ఇక లేవలేదు. జీవచ్ఛంలా మారి మంచానికి పరిమితమయ్యాడు. నడుము నుంచి కింద వరకు శరీరం చచ్చుబడిపోయింది. చెదిరిన కుటుంబం ఈ సంఘటన కుటుంబాన్ని కుదిపేసింది. ఒక్కగానొక్క కొడుకు ఇలా కావడంతో తల్లిదండ్రులు కుమిలిపోయారు. కొడుకును బతికించుకోవడానికి ఎన్నో రాష్ట్రాలు తిరిగారు. చికిత్స కోసం ఉన్న నాలుగు ఎక రాల పొలాన్ని అమ్ముకున్నారు. ఒక్కగానొక్క ఆధారం కరిగిపోయింది కానీ ఫలితం లభించలేదు. అయిన వాళ్ల దగ్గర అప్పులు చేశారు. తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో సాయం చేసేవారూ కరువయ్యారు. ఇది వారిని మరింత కుంగదీసింది. ఆ దిగులుతోనే తల్లిదండ్రులు కన్నుమూశారు. తండ్రి, తల్లి, అన్నీ అక్కే రమేశ్ పరిస్థితి మెరుగుపడలేదు. ఇటు కన్నవారూ కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక అతడికి సపర్యలు చేసే బాధ్యత అక్క ఇందిర మీద పడింది. ఆమె ఈ బాధ్యతను పెద్ద మనసుతో స్వీకరించింది. పెళ్లి కూడా చేసుకోకుండా తమ్ముడి కోసం తన జీవితాన్ని ధారపోసింది. పదిహేడేళ్లుగా కన్నీళ్లను దిగమింగుతూ అతడి అలనా పాలనా చూస్తోంది. బీడీలు చుడుతూ, వీలైతే కూలీకి వెళ్తూ బతుకు బండిని లాగుతోంది. వీళ్ల బాధను పంచుకునే వాళ్లు కూడా కరువయ్యారు. నిస్సహాయంగా ‘‘వెన్ను పూస విరిగిపోయింది. ఛాతి భాగం నుంచి అరికాలి వరకు స్పర్శ ఉండదు. కూర్చోరాదు. నడవరాదు. ఎప్పుడూ వాటర్ బెడ్‌పైనే పడుకుంటాను. మలమూత్ర విసర్జన కూడా తెలవదు. ఎప్పుడూ యూరిన్ పైప్ ఉంటుంది. హైదరాబాద్‌లోని నిమ్స్, ముంబయిలోని కెమ్స్ ఆస్పత్రులలో ట్రీట్మెంట్ చేయించుకున్నాను. 17 ఏళ్లుగా మంచం పైనే గడుపుతున్నాను’’ అని ధీనంగా చెప్పాడు రమేశ్. మనసున్న దాతలు కాస్త సాయం చేస్తే కొంతలో కొంత ఆసరగా ఉంటుందని వేడుకుంటున్నాడు. మాటలకే పరిమితం రమేశ్‌కు ప్రమాదం జరిగినప్పుడు ఊరు ఊరంతా సానుభూతి చూపించింది. ‘‘నీకేం భయం లేదు. మేమున్నాం, సాయం చేస్తాం’’ అని నేతలెందరో అభయమిచ్చారు. వారి హామీలు మాటల వరకే పరిమితమయ్యాయి. ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన ఘోరానికి ఎంతో బాధపడుతూ సానుభూతి వ్యక్తం చేశారు. ఆర్థిక సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరాలు గడిచిపోయాయి. రమేశ్ మరింత అనారోగ్యానికి గురువుతున్నా, ఇప్పటి వరకు ఏ సాయమూ అందలేదు. -
కరెంటోళ్ల తీరు గిట్ల!
ఎల్కతుర్తి, న్యూస్‌లైన్: ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామ శివారులో ఉన్న ఎస్ఎస్-2 ట్రాన్స్ఫార్మర్కు 16 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 30 ఎకరాల భూములు సాగవుతున్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ గోపాల్పూర్ ఫీడర్ పరిధిలోకి వస్తుంది. ఫీడర్లో కొంతమంది రైతులు వ్యవసాయ విద్యుత్ సర్‌చార్జీలు బకాయిపడడంతో సంబంధిత అధికారులు ఫీడర్ మొత్తానికి కరెంటు సరఫరా నిలిపివేశారు. దీంతో సర్‌చార్జీలు చెల్లించిన చింతలపల్లి రైతులకు సైతం మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే కొందరు మొక్కజొన్న వేయగా, మరికొందరు విత్తనాలు పెడుతున్నారు. కొందరు రైతులు కూ రగాయలు సాగు చేస్తున్నారు. పంటలకు నీరు అవసరమైన సమయంలో కరెంటు నిలిపివేయడంతో వేసిన పంటలు మట్టిపాలయ్యే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు ఇప్పుడు వస్తుందోనని రైతులంతా బావుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒక్క ఫీడర్ కింద ఉన్న ట్రాన్స్ఫార్మర్ పరిధిలో కొంతమంది బిల్లులు చెల్లించకుంటే వారి స్టార్టర్లు తొలగించాలి, లేదా పోల్ వద్ద నుంచి కనెక్షన్ తొలగించాలని గానీ.. మొత్తం ఫీడర్‌ను నిలిపివేస్తే తమ పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఏఈ రాములుకు ఫోన్ చేస్తే స్పందించడం లేదేని, లైన్‌మన్ నా యక్‌ను అడిగితే తనకు తెలియదంటున్నాడని రైతులు భుజంగరావు, కుతాడి రాములు, చిరంజీవి తదితరులు వాపోయారు. నీళ్లు పెట్టకుంటే వేసిన పంటలు ఎండిపోక తప్పదని, దీనికి వి ద్యుత్ అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఇక స్పందించాల్సింది అధికారులే. దుక్కులు ఎండుతున్నయ్ చిగురుమామిడి : చిగురుమామిడి మండలంలోని ఆయా గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారులు ఆదివారం మళ్లీ త్రీఫేస్ కరెంటు సరఫరాను నిలిపివేశారు. శుక్రవారం నుంచి మూడు రోజులుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో దుక్కులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 16 గ్రామాల్లో 100, 63, 25, 16,15 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు 2,160 ఉన్నాయి. చిగురుమామిడి, రేకొండ, ఇందుర్తి, ముల్కనూర్ గ్రామాల్లో సబ్‌స్టేషన్ల్ ఉన్నాయి. వీటి పరిధిలో 5,300 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, సుమారు రూ.70లక్షల బకాయిలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మూడు రోజులుగా అధికారుల నిర్భంద వసూళ్ల వల్ల రూ.20 లక్షలు వసూలయ్యాయని చెబుతున్నారు. బిల్లులు కట్టిన వారిని, కట్టని వారిని ఒకే గాటన కట్టి త్రీఫేస్ విద్యుత్ సరపరా నిలిపివేయడం దారుణమని ఆయా గ్రామాల రైతులు మండిపడుతున్నారు. విద్యుత్ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంటే.. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మేల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రైతుల ఇబ్బందులను పట్టించుకోకపోవడం దారుణమని సీపీఐ మండల కార్యదర్శి అందెస్వామి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గీకురు రవీందర్ ఆరోపించారు. అన్ని గ్రామాల్లో కరెంటు సరఫరా పునరుద్ధరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. -
డబ్బు కొట్టు..పని పట్టు
=బడా కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్న అధికారులు =కనీస షెడ్డు లేని వారికి ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు పనుల అప్పగింత =ప్రతిఫలంగా ఒక్కో కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షలకుపైగా వసూలు =తీవ్రంగా నష్టపోతున్న చిరు కాంట్రాక్టర్లు సాక్షి,సిటీబ్యూరో: సెంట్రల్ డిస్కంలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల పనులకు‘టెండర్’ వేశారు. కాంట్రాక్టర్ల మధ్య పోటీని పెంచాల్సిన అధికారులు చిన్నచిన్న సాంకేతిక అంశాలను సాకుగా చూపి పోటీ నుంచి తప్పిస్తున్నారు. కనీసం షెడ్డు కూడా లేని వ్యక్తులకు నాలుగు నుంచి ఐదు టెండర్లు కట్టబెడుతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఒక్కో కాంట్రాక్టర్ రూ.రెండు లక్షలకుపైగా అధికారులకు ముట్టజెప్పుతుండడం విశేషం. రంగారెడ్డిలోని ఓ సీజీఎం స్థాయి అధికారి మొదలు డిస్కంలోని పలువురు డెరైక్టర్లకు ఇందులో ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 11 సర్కిళ్లు ఉండగా, వీటిలో 138 ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాలు ఉన్నాయి. ఆయా సర్కిళ్ల పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కోసం మింట్‌కాంపౌండ్‌లోని సీసీఎం ఆర్ఆర్ కార్యాలయం 2012 డిసెంబర్లో ఓపెన్ టెండర్లు పిలిచింది. ఇందుకు కనీసం రెండేళ్ల అనుభవాన్ని నిర్ధేశించారు. దీంతో కొంతమంది ఔత్సాహిక చిరు కాంట్రాక్టర్లుసీఎండీని కలిసి ఈ నిబంధనల నుంచి తమకు సడలింపు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన అంగీకరించడంతో 70కిపై గా టెండర్లు దాఖలు అయ్యాయి. అక్రమాలకు పాల్పడుతున్నారిలా..: అయితే అప్పటికే వేర్వేరు డివిజన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు ఏడాదిన్నర నుంచి మరమ్మతులు చేస్తున్నారు. శాశ్వత షెడ్డు నిర్మాణం, సిబ్బంది, ఇతరత్రా వసతుల కోసం ఒక్కొక్కరు భారీగా ఖర్చు పెట్టారు. తీరా గడువు దగ్గర పడటంతో రెండేళ్ల అనుభవాన్ని సాకుగా చూపి, వీరందరి జీవితాలను రోడ్డుపాలు చేశారు. గుత్తేదారుల మధ్య పోటీని పెంచాల్సిన అధికారులు బడా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కనీసం షెడ్డు కూడా లేని ఒక్కో కాంట్రాక్టర్‌కు నాలుగు నుంచి ఐదు పనులు అప్పగిస్తున్నారు. పైరవీలతో పనులు దక్కించుకున్న వీరు కమీషన్‌పై సబ్‌కాంట్రాక్టర్లకు పనులు కట్టబెడుతూ అక్రమాలకు తెరలేపుతున్నారు. చిన్నపాటి మరమ్మతులను పెద్దగా చూపుతూ భారీగా దండుకుంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కారు: డిస్కం పరిధిలోని కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 15 శాతం,ఎస్టీలకు 6శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు మాత్రం ఇవేవీ పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఎస్సీ,ఎస్టీలకు వ్యక్తిగత కాంట్రాక్టుల్లో రూ.లక్షవరకు, సొసైటీలకు రూ.మూడు లక్షల వరకు ధరావతు మినహాయింపు కల్పించినా అధికారులు వీటిని అమలు చేయడం లేదని, దీంతో ఆవర్గం చిరు కాంట్రాక్టులు భారీగా నష్టపోవాల్సి వస్తోందని విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు గోపి, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ లెసైన్స్బోర్డు సభ్యుడు నక్క యాదగిరిలు చెప్పారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి
దేవరకద్ర రూరల్, న్యూస్‌లైన్ : వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం... దేవరకద్ర మండలం గద్దెగూడేనికి చెందిన సత్యన్న (28) కు సమీపంలోఎకరా పొలం ఉంది. అందులో ప్రస్తుతం వరి సాగు చేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం నీరు పారపెట్టడానికి అక్కడికి వెళ్లి బోరుమోటార్ స్టార్ట్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇది గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే అతడిని గ్రామానికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈయనకు భార్య అనసూయతోపాటు కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. సిర్సవాడ (తాడూరు) : మండలంలోని సిర్సవాడకు చెందిన బింగి జంగిలయ్య (32) కు సమీపంలో రెండెకరాల పొలం ఉంది. ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు దుందుబీ వాగు ప్రవహించడంతో వ్యవసాయ బోర్లు నీటిలో మునిగిపోయాయి. దీంతో ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బుధవారం సాయంత్రం అక్కడికి వెళ్లిన ఈయన ఇసుకలో మునిగిన మోటార్‌ను తేల్చే క్రమంలో చేతికి తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో రైతు తాళ్ల విష్ణు అపస్మారక స్థితిలో చేరుకోగా కొద్దిసేపటికి తేరుకున్నాడు. అనంతరం అటువైపు వెళ్లిన పాపగల్ వాసి శేఖర్‌రెడ్డి గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారమిచ్చారు. మృతుడికి భార్య బాలమ్మతోపాటు ఓ కూతురు ఉంది. ఈ సంఘటనతో వారు బోరుమన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్న లారీ
నందిగామ రూరల్, న్యూస్‌లైన్ :పట్టణంలోని రైతుపేట పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ ట్రాన్స్ఫార్మర్ వద్ద మంగళవారం ఓ పెద్ద ప్రమాదం తప్పింది. సేకరించిన సమాచారం ప్రకారం.. చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ జి.నూకరాజు పెట్రోల్ బంక్‌కు వచ్చాడు. పెట్రోల్ కొట్టించుకుని విజయవాడ వైపు బయలుదేరాడు. లారీ అదుపుతప్పి బం కు వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఉన్న డ్రైయిన్‌లో పడింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్ నూకరాజుకు ఫిట్స్ రావడంతో లారీపై అదుపు కోల్పోయాడని, దీంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదే ట్రాన్స్ఫార్మర్ వద్ద ఈనెల ఏడో తేదీన విద్యుత్ షాక్‌కు గురై పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు క్లీనర్ బడేమియా అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ట్రాన్స్ఫార్మర్ రోడ్డు వెంబడే ప్రమాదకర పరిస్థితుల్లో ఉండటంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ట్రాన్స్ఫార్మర్ను సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
బల్దియా సొమ్ము దుబారా
గోదావరిఖని, న్యూస్‌లైన్ : ప్రజాధనమే కదా.. పోతోపోనీ అన్నట్లుంది రామగుండం కార్పొరేషన్ అధికారుల తీరు. అవసరమని చెప్పి అడ్డగోలు లోడ్‌తో విద్యుత్ కనెక్షన్లు తీసుకుని.. ఇప్పుడు కరెంటు వినియోగించకున్నా బిల్లు మాత్రం రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. ఇందులో ప్రైవేట్ వ్యక్తులు వాడుకుంటున్న కరెంటుకు కూడా నెలనెలా ఠంఛన్‌గా బిల్లు కడుతున్నారు. ఇలా ఎందుకు చెల్లిస్తున్నామని కనీసం ఫైల్ చూసుకునే తీరిక కూడా వీరికి దొరకడం లేదు. నెలకు రూ.5.75 లక్షల చొప్పున సుమారు రూ.61.50 లక్షలు ట్రాన్స్‌కో ఖాతాలో జమచేశారు. అంటే ఈ మేరకు కార్పొరేషన్‌కు ఆర్థిక నష్టం వాటిల్లినట్టే. కార్పొరేషన్ పరిధిలోని మల్కాపురం శివారులో నిర్మించిన సీవరేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం హై ఓల్టేజీ(హెచ్‌టీ) సర్వీస్‌తో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు వినియోగించకపోవడంతో ట్రాన్స్‌కో వాళ్లు సర్వీస్‌ను తొలగించారు. ప్లాంట్‌లోని నీటి మడుగుల్లో చేపలు పెంచుకోడానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి చెప్పారని తిరిగి ఆ సర్వీసును పునరుద్ధరించారు. చేపలు పెంచుకునే వ్యక్తి నుంచి చిల్లిగవ్వ కూడా కార్పొరేషన్‌కు రాకపోగా విద్యుత్ బిల్లును నెలకు రూ.లక్ష మాత్రం కార్పొరేషన్ ఖాతాలోంచే చెల్లిస్తున్నారు. ఈ తంతు రెండేళ్లుగా సాగుతోంది. ఎన్టీపీసీ నర్రశాలపల్లి వద్ద వాటర్‌ట్యాంకు కోసం 250 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ట్యాంకు ద్వారా చుక్క నీరు కూడా రాకపోగా విద్యుత్ బిల్లు నెలకు రూ.1.50 లక్షలు ట్రాన్స్‌కోకు సమర్పించుకోవాల్సిన దుస్థితి. ఏడాది నుంచి ఈ బిల్లు చెల్లిస్తున్నారు. అంటే ఈ రెండింటిపై ఇప్పటికే రూ.43 లక్షలకుపైగా అప్పనంగా చెల్లించారు. మున్సిపల్ కార్యాలయం వెనుక జిరాక్స్ సెంటర్‌ను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తుండగా, దానికి కార్పొరేషన్ కార్యాలయం నుంచి విద్యుత్ ఇస్తున్నారు. నెలకు వచ్చే రూ.3,600 బిల్లు కూడా కార్పొరేషన్ ఖాతా నుంచే చెల్లిస్తున్నారు. ఇదే ఆవరణలోని కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్‌కు కేటాయించిన భవనంలో మెప్మా పథకానికి సంబంధించిన కార్యకలాపాలు సాగుతుంటాయి. ఈ సంస్థకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. అందులోంచే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రతీ నెలా వచ్చే రూ.12 వేల కరెంటు బిల్లును కార్పొరేషన్ ఖాతా నుంచే కడుతున్నారు. పాత మున్సిపల్ కార్యాలయంలో ఐసీడీఎస్ భవనంతోపాటు లక్ష్మీనగర్‌లోని వ్యాపారుల వాహనాలకు అనధికారికంగా పార్కింగ్ కొనసాగుతోంది. ఇక్కడ కమర్షియల్ కేటగిరి-2లో త్రీఫేజ్ విద్యుత్ వినియోగిస్తున్నందున నెలకు రూ.10 వేల వరకు కరెంటు బిల్లును కార్పొరేషన్ చెల్లించాల్సి వస్తోంది. ఈ మూడు కలిసి నెలకు రూ.25,600 అవుతోంది. ఆరు నెలలుగా ఈ చెల్లింపులు జరుగుతున్నా అధికారులు కిమ్మనడం లేదు. ఈ పేరిట ఇప్పటికే రూ.1.50 లక్షలకు పైగా ప్రజాధనం వృథా అయింది. వెలగని దీపాలకూ బిల్లులు కార్పొరేషన్ పరిధిలో వీధిదీపాల కోసం మొత్తం 237 విద్యుత్ మీటర్లు అమర్చగా 52 పని చేయడం లేదు. వీటి పరిధిలో 40 వాట్స్ సామర్థ్యం గల ట్యూబ్‌లైట్లు 4,668 ఉండగా 1,662 లైట్లు వెలగడం లేదు. 70 వాట్స్ సామర్థ్యం గల డ్యూమ్లైట్లు 151 ఉండగా 93 వెలగడం లేదు. 150 వాట్స్ సామర్థ్యం గల డ్యూమ్లైట్లు 735 ఉండగా 343 వెలగడం లేదు. 250 వాట్స్ సామర్థ్యం గల డ్యూమ్ లైట్లు 142 ఉండగా 52 పనిచేయడం లేదు. 400 వాట్స్ సామర్థ్యం గల హైమాస్ట్ లైట్లు 15 సెంటర్లలో 120 అమర్చగా 81 వెలగడం లేదు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఫైవింక్లయిన్ చౌరస్తా వరకు రూ.36 లక్షల వ్యయంతో 71 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. ఇందులో 142 డ్యూమ్లైట్లకు 52 పనిచేయడం లేదు. దీంతో మంథనితోపాటు సింగరేణి గనులు, ఓసీపీలకు వెళ్లే కార్మికులు, ప్రజలు రాత్రి సమయంలో తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారు. రాజేశ్ థియేటర్ నుంచి మార్కండేయకాలనీ మీదుగా అడ్డగుంటపల్లి, కళ్యాణ్‌నగర్ వరకున్న వీధిదీపాలు వెలగకపోవడంతో ఆ కాలనీల్లో రహదారులు చీకట్లోనే మగ్గుతున్నాయి. మార్కండేయకాలనీలో పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినప్పటికీ రహదారులు చీకటిగా ఉండడంతో దొంగలను పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. ప్రధాన వ్యాపార కేంద్రాలైన కళ్యాణ్‌నగర్ నుంచి మేదరిబస్తీ మీదుగా లక్ష్మీనగర్, ప్రధాన చౌరస్తా వరకు గల డ్యూమ్లైట్లు కూడా సరిగా వెలగడం లేదు. తరుచూ లైట్లకు ఏర్పాటు చేసిన చాప్టర్లు, స్విచ్ బ్రేకర్లు చెడిపోతున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ.. విద్యుత్ దీపాల పేరుతో కార్పొరేషన్ ప్రతీ నెలా రూ.10 లక్షల బిల్లు ట్రాన్స్‌కోకు చెల్లిస్తోంది. 52 మీటర్లు పనిచేయక వీధిదీపాలు వెలగకపోయినా ట్రాన్స్‌కో నెలకు రూ.3 లక్షల వరకు బిల్లు వేస్తోంది. ఇవి చెడిపోయి ఆరు నెలలవుతుండగా ఈ ఆరు నెలలుగా మొత్తం రూ.18 లక్షలు అప్పనంగా చెల్లించినట్లే. ఇంత జరుగుతున్నా అధికారులు కొత్త మీటర్ల ఏర్పాటుపై మాత్రం దృష్టి సారించడం లేదు. ఇలా మొత్తం కలిసి ఇప్పటికే సుమారు రూ.62 లక్షలకు పైగా కరెంటు బిల్లు పేరిట ట్రాన్స్‌కోకు చెల్లించగా... ఇవి ఎందుకు చెల్లిస్తున్నామనే విషయాన్ని మాత్రం అధికారులు వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. తనకు సంబంధం లేని బిల్లును కూడా అనవసరంగా కార్పొరేషన్ చెల్లిస్తుండడంతో లక్షలాది రూపాయల ఆర్థిక భారం పడుతోంది. బిల్లులు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో ఇటీవల పలుమార్లు కరెంట్ కట్ చేసింది. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కలగజేసుకుని రామగుండం కార్పొరేషన్ పాలనను చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం - ఎస్.రవీంద్ర, కమిషనర్, రామగుండం కార్పొరేషన్ అవసరం లేకున్నా గతంలో హెచ్‌టీ కనెక్షన్లు ఇచ్చారు. దీంతో కరెంటు ఎక్కువ కాలుతోందని గుర్తించాం. ఇప్పుడు వాటన్నింటినీ ఎల్టీ కనెక్షన్లుగా మారుస్తున్నాం. అవసరం లేని చోట కనెక్ష న్లు కట్ చేస్తున్నాం. చేపల చెరువు దగ్గర కరెంట్ కనెక్షన్ కట్ చేయమని ట్రాన్స్‌కోకు లేఖ రాశాం. సీఆర్టీ భవనం నిర్వహణను చూసుకోవాలని స్వశక్తి సంఘాలకు సూచించాం. వీధి దీపాలున్నచోట పనిచేయని మీటర్లు తొలగించి కొత్త మీటర్లు ఏర్పాటు చేస్తాం. విద్యుత్ వినియోగం ఎక్కువ కాకుండా కార్పొరేషన్ ప్రత్యేకాధికారి అయిన జేసీతో చర్చించి అన్ని కాలనీల్లో టైమర్లు బిగించేందుకు చర్యలు తీసుకుంటాం.