సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం జరిగిన భారీ అగ్రిప్రమాదాలు అగ్నిమాపక విభాగాన్ని పరుగులు పెట్టించాయి. మొదటి ఘటన కన్నాట్‌ప్లేస్‌లో, రెండోది కినారీబజార్‌లో జరిగా యి. ఈ రెండు ప్రమాదాల్లో ప్రాణనష్టం ఏమీలేకపోయినప్పటికీ 30 దుకాణాలు దగ్ధమయ్యాయి. కన్నాట్‌ప్లేస్ ఏ బ్లాక్‌లోని రామాభవన్‌లో మంటలు చెలరేగాయంటూ అగ్నిమాపక విభాగానికి ఉదయం 7.50 గంటలకు సమాచారం అందింది. అగ్నిమాపక శకటాలతో ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పడానికి అనేకగంటలపాటు శ్రమించారు. రామాభవన్‌లో అగ్నిప్రమాదం సంభవించిందని అనుకున్నప్పటికీ నిజానికి మంటలు చెలరేగింది హామిల్టన్ హౌజ్‌లోని ఎన్‌ఐఐటీ సెంటర్‌లోనని ఆ తర్వాత తేలింది.
భవనం రెండో అంతస్తులో ఉన్న ఎన్‌ఐఐటీ సెంట ర్‌లో గ్రంథాలయంలో మొదలైన మంటలు ఆ తర్వాత అంతటా వ్యాపించాయి.ఆ తర్వాత వెనుకవైపునగల రామా బిల్డింగ్ వరకు వ్యాపించాయి. అయితే రామాభవన్‌లో మంటలు చెలరేగినట్లు తొలుత భావించారు. ఎన్‌ఐఐటీ సెంటర్ పై అంతస్తులో జిమ్ ఉంది. ఉదయాన్నే జిమ్‌కు వచ్చిన వారు అగ్నిమాపక విభాగానికి సమాచారమందించారు అగ్నిపమాక విభాగం సిబ్బం ది వెంటనే రంగంలోకి దిగి ఇరుగుపొరుగు భవనాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి ఆ తర్వాత మంటలను ఆర్పారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు కార్యాలయం మూసిఉండడంతో ఎవరూ గాయపడలేదని ప్రధాన అగ్నిమాపక అధికారి విపిన్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఇక మధ్యాహ్నం రెండుగంటల సమయంలో చాందినీచౌక్ ప్రాంతంలోని కినారీ బజార్‌లో మంటలు రేగి పలు దుకాణాలకు వ్యాపించాయి. జరీ దుకాణాలు ఎక్కువగా ఉండే కినారీబజార్ ఇరుకు వీధుల్లో నుంచి అగ్నిమాపక వాహనాలు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దాదాపు రెండు డజన్ల అగ్నిమాపక వాహనాలను తీసుకెళ్లినప్పటికీ మంటలను ఆర్పడానికి అగ్నిమాపసిబ్బంది చాలా శ్రమపడాల్సివచ్చింది. ట్రాన్స్‌ఫార్మర్‌లో చెలరేగిన మంటలు దుకాణాలకు వ్యాపించాయని అంటున్నారు. ఫోన్ కాల్ రాగానే అగ్నిమాపక వాహనాలను పంపామని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డెరైక్టర్ ఎ.కె. శర్మ చెప్పారు.
పరుగులు పెట్టించిన అగ్ని
Published Mon, Aug 25 2014 10:46 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement