connaught place
-
కేజ్రీకి ఈ ఆలయం ఒక సెంటిమెంట్?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు జూన్ ఒకటి వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ లోపు ప్రచారం కూడా చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆయనకు ఈ ఆలయం అంటే చాలా ఇష్టమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. సంకటమోచన హనుమాన్ ఆలయ దర్శన సమయంలో, అతని భార్య, ఇతర నేతల ఆయన వెంట ఉండనున్నారు.రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి కేజ్రీవాల్ పలు సందర్భాల్లో ఈ ఆలయానికి వెళుతుంటారు. ఈ ఆలయంలో వెలసిన హనుమంతునిపై ఆయనకు ఎంతో నమ్మకం ఉంది. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2013లో తొలిసారిగా ఆయన ఈ హనుమాన్ ఆలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడి 49 రోజులు సీఎంగా కొనసాగారు. దీని తర్వాత 2015లో ఢిల్లీలో రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు కేజ్రీవాల్ మళ్లీ సీఎం అయ్యాక మరోసారి ఈ ఆలయాన్ని సందర్శించారు.2020లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, అంతకు ముందు కూడా సీఎం కేజ్రీవాల్ ఈ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆయన ఈ ఆలయానికి వెళ్లారు. నాడు ఆయన పార్టీ మరోసారి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చిలో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఈ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మే 10న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
‘బొద్దింకల దోసె’?! షాక్ అయిన అమ్మడు
సామాన్యంగా బొద్దింకలను చూస్తేనే శరీరం ఝల్లుమంటుంది...అలాంటి బొద్దింక ఆహారంలో కనిపిస్తే..? ఆ భోజనం తినగలమా? ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున వార్త "ఆహారంలో బొద్దింక". ట్రైన్, రెస్టారెంట్, విమానాల్లో ఇలా ఎక్కడ చూసినా ఇవే వార్తలు. తాజాగా ఢిల్లీలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని కనౌట్ ప్లేస్‌లోని ఓ రెస్టారెంట్లో మధ్యాహ్న భోజనం కోసం ఓక మహిళ, ఆమె స్నేహితురాలు దోసను ఆర్డర్ చేసారు. సరిగ్గా అలా తినడం మొదలు పెట్టిందో లేదో.. అక్కడ అనుమానాస్పదంగా ఏదో కనిపించింది. ఏంటా అని పరిశీలనగా చూసింది. అంతే.. ఒకటి కాదు రెండు కాదు ఎకంగా ఎనిమిది బొద్దింల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఇవి చదవండి: నిత్యం వీటిని తినడంతో.. కలిగే మార్పులు తెలుసా! దీంతో ఈ సంఘటనను రికార్డుచేయాలని నిర్ణయించుకుంది. స్నేహితురాలి సాయంతో వీడియో రికార్డ్ చేస్తోంది. ఇంతలోనే హోటల్ సిబ్బందిలో ఒకరు ఎంట్రీ ఇచ్చాడు. అకస్మాత్తుగా ప్లేట్‌ను లాగేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇషాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ‘బొద్దింకల’పై ఆరా తీస్తున్నారు. తనకెదురైన భయంకరమైన అనుభవాన్ని ఇషాని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ కేఫ్ లైసెన్స్, శుభ్రతపై అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. రెస్టారెంట్ల పరిశుభ్రత స్థాయి, లైసెన్స్‌లను తనిఖీ చేయడానికి అధికారులు క్రమం తప్పకుండా రెస్టారెంట్లను సందర్శించి తగిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు నమోదు కావంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ది క్వింట్’ షేర్ చేసిన ఈ వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
ఇండియాలో అత్యధిక రెంట్ వచ్చేది ఎక్కడో తెలుసా?
దేశ రాజధానిలో అత్యంత రద్ధీ ఉండే మార్కెట్ ఏరియాల్లో ఒకటైన కన్నాట్‌ప్లేస్ మరో రికార్డు సృష్టించింది. ఇండియాలోనే ఆఫీస్ రెంట్/లీజు పరంగా అత్యధిక అద్దె లభించే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ తాజాగా ప్రకటించిన వివరాల్లో అత్యంత కాస్ట్లీ ఏరియా రికార్డులకెక్కింది. కన్నాట్‌ప్లేస్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 112 నగరాల్లోని 127 ఆఫీస్ మార్కెట్లకు సంబంధించి ప్రతీ ఏడు సర్వే చేపడుతోంది. అందులో భాగంగా తాజాగా 2020కి సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించింది. ఇందులో ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ ఏరియాలో చదరపు అడుగు స్థలానికి 109 డాలర్ల రెంట్ (రూ.8276)తో ఇండియాలోనే ప్రథమ స్థానంలో ప్రపంచ వ్యాప్తంగా 17వ స్థానంలో నిలిచింది. ఇంతకుముందు ప్రకటించిన జాబితాలో కన్నాట్‌ప్లేస్ 23వ స్థానంలో ఉండగా తాజాగా సవరించిన ధరలతో ఇక్కడ రెంట్ మరింత ప్రియంగా మారింది. కన్నాట్‌ప్లేస్‌లో ఆఫీస్ వర్క్‌ప్లేస్ డిమాండ్ అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన శాన్ఫ్రాన్సిస్కో కంటే ఖరీదైంది కావడం గమనార్హం. రెండో స్థానంలో ముంబై బాంద్రా న్యూఢిల్లీ తర్వాత ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ఏరియా రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు ఆఫీస్ స్పేస్ రెంట్ 102 డాలర్లుగా ఉంది. ఆ తర్వాత స్థానంలో ముంబైలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏరియా 58 డాలర్లు, బెంగళూరులో 51 డాలర్లు, గురుగ్రామ్ 48 డాలర్లు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ సగటు 44 డాలర్లుగా జేఎల్ఎల్ పేర్కొంది. ఇక అత్యంత చవకగా ఆఫీస్ స్పేస్ రెంట్‌కి లభించే నగరంగా చెన్నై నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు స్థలం రెంట్ ఏడాదికి కేవలం 21 డాలర్లుగా ఉంది. ఫస్ట్‌ప్లేస్‌లో న్యూయార్క్ న్యూయార్క్ మిడ్‌టౌన్, హాంగ్‌కాంగ్ సెంట్రల్ ఏరియాలో ఆఫీస్ రెంట్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. ఇక్కడ చదరపు అడుగు స్థలానికి అద్దెగా ఏకంగా 261 డాలర్లు చెల్లించాల్సిందే. ఆ తర్వాతి స్థానంలో బీజింగ్‌లో ఫినాన్స్ స్ట్రీట్, లండన్ వెస్ట్ఎండ్, యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీ నగరాలు ఉన్నాయి. చదవండి:హైదరాబాద్ తర్వాతే ముంబై, బెంగళూరు నగరాలు -
LJP: మత్తు ఇచ్చి నాపై లైంగికదాడి: ఆ ఎంపీపై సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ/పట్నా: లోక్‌జనశక్తి పార్టీలో తిరుగుబాటు జరిగిన నాటి నుంచి ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరాస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అబ్బాయి వ్యవహారశైలి కారణంగానే.. ముఖ్యంగా పార్టీని పరిరక్షించేందుకే తాను మిగతా ఎంపీలతో బయటకు వచ్చానని బాబాయ్ చెబుతుంటే.. వెన్నుపోటు రాజకీయాలు చేశారని చిరాగ్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ కుట్ర వెనుక జేడీయూ హస్తం ఉందని, ప్రస్తుతం తమ పార్టీలో సంక్షోభానికి నితీశ్ కుమార్ వర్గం కారణమని ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనా తన కజిన్, ఎంపీ ప్రిన్స్‌రాజ్ పాశ్వాన్(రామ్‌విలాస్ పాశ్వాన్ సోదరుడు రామచంద్ర పాశ్వాన్ తనయుడు) సైతం తమ అంకుల్ పశుపతితో చేతులు కలిపి తనను ఒంటరి చేశారనే బాధ చిరాగ్‌ను వేధిస్తోందని ఆ కుటుంబ సన్నిహితులు అంటున్నారు. మత్తు ఇచ్చి అత్యాచారం.. ఈ పరిణామాల నేపథ్యంలో... ఓ కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రిన్స్‌రాజ్ పాశ్వాన్ తనపై లైంగిక దాడి చేశాడంటూ ఓ మహిళ కనాట్‌ప్లేస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మూడు పేజీలతో కూడిన తన ఫిర్యాదులో.. ‘‘నా డ్రింక్‌లో మత్తుమందు కలిపి ప్రిన్స్‌రాజ్.. ఢిల్లీలోని ఓ హోటల్లో నాపై అత్యాచారం చేశారు’’ అని ఆమె ఆరోపించారు. ఇక ఈ విషయంపై స్పందించిన పోలీసులు.. ఈ ఘటనపై ఆరా తీస్తున్నామని, అయితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు.ఇదిలా ఉండగా.. అత్యాచార ఆరోపణల గురించి చిరాగ్ పాశ్వాన్ దృష్టికి రాగా.. తనకు పూర్తి వివరాలు తెలియదని, ఇరు వర్గాలను పోలీసులను సంప్రదించమని తాను సలహా ఇచ్చానని పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. కాగా దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు-2020 సమయంలో జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలోకి దింపి నితీశ్ కుమార్‌కు సవాల్ విసిరారు. అప్పటి నుంచి చిరాగ్, పశుపతి మధ్య తలెత్తిన విభేదాలు ముదిరి తిరుగుబాటుకు దారి తీసింది. ఇక ఈ ఎన్నికల్లో ఎల్జేపీ విఫలమైనప్పటికీ తన ఓట్ల శాతం మాత్రం పెరిగిందని చిరాగ్ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబాన్ని, పార్టీని కలిపి ఉంచేందుకు తను చేసిన ప్రయత్నాలు వృథా అయిపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మంచాన పడి ఉంటే.. వెన్నుపోటు పొడిచారు: చిరాగ్ పాశ్వాన్ ‘నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్ చచ్చిపోయాడు’ -
ఫ్యాషన్ డిజైనర్ నిర్లక్ష్యం.. లగ్జరీ కారుతో దారుణం!
సాక్షి, న్యూఢిల్లీ : నిర్లక్ష్యంగా రాంగ్‌సైడ్‌లో వాహనం నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఓ యువతి. లగ్జరీ ఎస్‌యూవీని కారు అడ్డదిడ్డంగా నడుపుతూ.. ఓ మహిళ ఢీకొట్టి తొక్కించేసింది. దీంతో ప్రమాదస్థలిలోనే ఆమె ప్రాణాలు విడిచింది. దేశ రాజధాని ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా అగర్వాల్ లగ్జరీ ఎస్యూవీ (స్పోర్ట్ష్ యుటిలిటీ వెహికల్) కారును రాంగ్రూట్లో నడుపుతూ.. ఫూల్వతి అనే 50 ఏళ్ల మహిళను ఢీకొట్టింది. ఆదివారం రాత్రి శివాజీ స్టేడియం బస్ టెర్మినల్ వద్ద గల ఓ రెస్టారెంట్ ముందు ఫూల్వతి నిల్చుని ఉండగా.. అజాగ్రత్తగా వాహనం నడుపుతూ.. ఆమెపైకి శ్రేయ దూసుకుపోయింది. ఆమెను ఢీకొట్టడమే కాకుండా.. దాదాపు 300 మీటర్లు కారుతో ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఫూల్వతి అక్కడిక్కడే మృతిచెందారు. దగ్గరలోని చెక్ పోస్టు వద్ద విధుల నిర్వర్తిస్తున్న పోలీసులు విషయాన్ని గ్రహించి నిందితురాలిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి.. కేసు నమోదు చేశామని వెల్లడించారు. -
వికృత చేష్టలు.. మహిళకి నరకం
సాక్షి, న్యూఢిల్లీ : మరో దారుణమైన ఘటన దేశ రాజధాని నడిబొడ్డున చోటు చేసుకుంది. ఓ మహిళా లెక్చరర్‌ను ఆంగతకుడొకడు ఆమె పని చేసే కళాశాల పరిసరాల్లోనే వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళ(32) కథనం ప్రకారం... గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్నౌట్ ప్రాంతంలోని లంచ్ సమయం కావటంతో తన కళాశాల మేడ మీద ఫోన్ ఆమె మాట్లాడుతూ ఉంది. ఇంతలో ఓ వ్యక్తి ఆమె దగ్గరగా వచ్చి పట్టుకునేందుకు యత్నించాడు. అది గమనించిన మహిళ భయంతో పరుగులు తీయబోయింది. అయితే కిందకు వెళ్లేందుకు ఉన్న దర్వాజకు అప్పటికే అతను గడియ బిగించేశాడు. భయపడిన మహిళ మేడ మీదే అటు ఇటు పరిగెత్తింది. ఒకానోక దశలో మేడ మీద నుంచి దూకేందుకు ఆమె యత్నించింది. అయితే చివరకు ఆమెను గట్టిగా పట్టుకున్న వ్యక్తి.. ఆమె నోరు నొక్కి అసభ్యంగా తాకటం మొదలుపెట్టాడు. ఆపై వికృత చేష్టకు పాల్పడటంతో విదిలించుకున్న మహిళ గట్టిగా అరిచింది. దీంతో ఆ వ్యక్తి ఆమె ఫోన్ లాక్కుని పక్కనే ఉన్న మరో మేడ మీదకు దూకి పారిపోయాడు. తోటి ఉద్యోగస్థుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె.. జరిగిన ఘటనను ఓ మీడియా సంస్థకు వివరించారు. ఆ వ్యక్తిని మరోసారి చూస్తే తాను గుర్తుపడతానని ఆమె చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ మృగాన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పట్టపగలే ఈ ఘటన చోటు చేసుకోవటంతో మహిళకు మద్దతుగా పలు సంఘాలు ఆందోళన చేపట్టాయి. -
అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్.. 9వ స్థానంలో కన్నాట్ ప్లేస్
ముంబై: భారత్‌లో అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్లలో న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అదే అంతర్జాతీయ స్థాయిలో 9వ స్థానంలో ఉంది. ఇక్కడ ఆక్యుపెన్సీ ధర ఏడాదికి ఒక చదరపు అడుగుకు 153.89 డాలర్లుగా ఉంది. దీంతో కన్నాట్‌లో ఆఫీస్ మార్కెట్ ధర దుబాయ్, డౌన్‌టౌన్ బోస్టన్, షాంఘైలలో కన్నా ఎక్కువగా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో మాత్రం ఆఫీస్ మార్కెట్ ధరలు తగ్గాయి. ప్రపంచంలోని టాప్–50 అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్ల జాబితాలో ముంబైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్ 20వ స్థానంలో, నారిమన్ పాయింట్ 33వ స్థానంలో నిలిచాయి. హాంగ్‌కాంగ్‌లోని సెంట్రల్, లండన్‌లోని వెస్ట్ ఎండ్ ప్రాంతాలు జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇవే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్లు. -
బద్దలవుతున్న యాక్సిస్ బ్యాంకు భాగోతాలు!
-
బద్దలవుతున్న యాక్సిస్ బ్యాంకు బాగోతం!
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో భారీఎత్తున సాగుతున్న అక్రమాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంకులో భారీగా అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే పాతనోట్ల మార్పిడి రాకెట్‌తో కుమ్మక్కయినందుకు న్యూఢిల్లీకి చెందిన యాక్సిస్ బ్యాంకు మేనేజర్లు ఇద్దరినీ ఈడీ అధికారులు అరెస్టు చేయగా... తాజాగా నోయిడా సెక్టర్-51లోని యాక్సిస్ బ్యాంకు శాఖలోనూ అక్రమాలు వెలుగుచూశాయి. ఆదాయపన్ను (ఐటీ) అధికారులు గురువారం ఈ శాఖపై దాడులు నిర్వహించారు. ఈ యాక్సిస్ బ్యాంకు శాఖలో 20 బూటకపు కంపెనీల ఖాతాలు ఉన్నాయని, ఇందులో అక్రమార్కులు రూ. 60 కోట్లు డిపాజిట్ చేశారని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. మరోవైపు ఢిల్లీ కనౌట్ ప్లేస్‌లోని యాక్సిస్ బ్యాంకు బ్రాంచ్‌లోనూ ఐటీ అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఢిల్లీలో గతంలో అరెస్టయిన యాక్సిస్ బ్యాంకు అధికారులను పోలీసులు గురువారం కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నెల 26 వరకు వారిని జ్యూడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇక, ఢిల్లీలోని చాందినీచౌక్‌కు చెందిన యాక్సిస్ బ్యాంకు శాఖలో ఐటీ అధికారులు గతంలో సోదాలు నిర్వహించారు. ఇక్కడ భారీగా అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. నల్లధనాన్ని తెల్లధనంగా మారుస్తూ కోల్‌కతాలో యాక్సిస్ బ్యాంకుకు చెందిన డిప్యూటీ మేనేజర్ గతంలో అరెస్టైన సంగతి తెలిసిందే. గత నెల 8న పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన తర్వాత ఐటీ అధికారులు బ్యాంకులపై నిఘా పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాక్సిస్ బ్యాంకులో సాగుతున్న అక్రమాలు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. -
బద్దలవుతున్న యాక్సిస్ బ్యాంకు బాగోతం!
-
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం నడిబొడ్డులో రెండు చోట్ల మంగళవారం అగ్ని ప్రమాదాలు సంభవించాయి. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆల్ ఇండియా మెడికల్ ఇన్సిస్టిట్యూట్ (ఎయిమ్స్)లో మొదటి అంతస్తులోని వార్డులో ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో మంటలంటుకుంటున్నాయి. దీంతో రోగులు, వారి బంధువులు భయంతో పరుగులు తీశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పైర్ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. \అందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని..అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఎయిర్ కండిషనర్లోని వైరు ద్వారా షార్ట్ సర్య్కూట్ కావడంతోనే ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. మరోవైపు ఢిల్లీలోని కన్నౌట్ ప్లేస్‌లోని నాలుగంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని ఓరియంటల్ బ్యాంక్ ఆవరణలో భారీ మంటలు చెలరేగాయి. దాదాపు 20 అగ్నిమాపక శకటాలు మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయని అధికారులు తెలిపారు. చుట్టపక్కలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడినట్టుగా సమాచారం. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
కన్నాట్‌ప్లేస్‌లో వైఫై ప్రారంభం
న్యూఢిల్లీ: కన్నాట్‌ప్లేస్‌లో ఆదివారం పబ్లిక్ వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి ఈ సేవలను ప్రారంభించారు. టాటా టెలీసర్వీసెస్ భాగస్వామ్యంతో పరిపాలనా విభాగం ఈ సేవలను ప్రజలకు అందజేస్తున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) తెలియజేసింది. వినియోగదారులు మొదటి 20 నిమిషాలపాటు ఈ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని, ఆ తర్వాత నుంచి కొంత చార్జి పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. రీచార్జీ కార్డులు వివిధ షాపుల్లో అందుబాటులో ఉంటాయని వారు వివరించారు. వైఫై సదుపాయమున్న అన్ని ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు ఈ వసతి అందుబాటులో ఉంటుందన్నారు. అంతేకాక ఇతర ఏమైనా సమాచారం కావాలంటే వైఫై కాల్ సెంటర్ నం. +9111 60607070కు ఫోన్ చేసి సేవలను పొందవచ్చు. ఈ ప్రాంతంలో ఒకేసారి ఐదువేల మంది వినియోగదారులు వైఫై సేవలను వినియోగించుకోవచ్చని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. -
పరుగులు పెట్టించిన అగ్ని
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం జరిగిన భారీ అగ్రిప్రమాదాలు అగ్నిమాపక విభాగాన్ని పరుగులు పెట్టించాయి. మొదటి ఘటన కన్నాట్‌ప్లేస్‌లో, రెండోది కినారీబజార్లో జరిగా యి. ఈ రెండు ప్రమాదాల్లో ప్రాణనష్టం ఏమీలేకపోయినప్పటికీ 30 దుకాణాలు దగ్ధమయ్యాయి. కన్నాట్‌ప్లేస్ ఏ బ్లాక్‌లోని రామాభవన్‌లో మంటలు చెలరేగాయంటూ అగ్నిమాపక విభాగానికి ఉదయం 7.50 గంటలకు సమాచారం అందింది. అగ్నిమాపక శకటాలతో ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పడానికి అనేకగంటలపాటు శ్రమించారు. రామాభవన్‌లో అగ్నిప్రమాదం సంభవించిందని అనుకున్నప్పటికీ నిజానికి మంటలు చెలరేగింది హామిల్టన్ హౌజ్‌లోని ఎన్ఐఐటీ సెంటర్లోనని ఆ తర్వాత తేలింది. భవనం రెండో అంతస్తులో ఉన్న ఎన్ఐఐటీ సెంట ర్లో గ్రంథాలయంలో మొదలైన మంటలు ఆ తర్వాత అంతటా వ్యాపించాయి.ఆ తర్వాత వెనుకవైపునగల రామా బిల్డింగ్ వరకు వ్యాపించాయి. అయితే రామాభవన్‌లో మంటలు చెలరేగినట్లు తొలుత భావించారు. ఎన్ఐఐటీ సెంటర్ పై అంతస్తులో జిమ్ ఉంది. ఉదయాన్నే జిమ్‌కు వచ్చిన వారు అగ్నిమాపక విభాగానికి సమాచారమందించారు అగ్నిపమాక విభాగం సిబ్బం ది వెంటనే రంగంలోకి దిగి ఇరుగుపొరుగు భవనాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి ఆ తర్వాత మంటలను ఆర్పారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు కార్యాలయం మూసిఉండడంతో ఎవరూ గాయపడలేదని ప్రధాన అగ్నిమాపక అధికారి విపిన్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక మధ్యాహ్నం రెండుగంటల సమయంలో చాందినీచౌక్ ప్రాంతంలోని కినారీ బజార్లో మంటలు రేగి పలు దుకాణాలకు వ్యాపించాయి. జరీ దుకాణాలు ఎక్కువగా ఉండే కినారీబజార్ ఇరుకు వీధుల్లో నుంచి అగ్నిమాపక వాహనాలు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దాదాపు రెండు డజన్ల అగ్నిమాపక వాహనాలను తీసుకెళ్లినప్పటికీ మంటలను ఆర్పడానికి అగ్నిమాపసిబ్బంది చాలా శ్రమపడాల్సివచ్చింది. ట్రాన్స్‌ఫార్మర్‌లో చెలరేగిన మంటలు దుకాణాలకు వ్యాపించాయని అంటున్నారు. ఫోన్ కాల్ రాగానే అగ్నిమాపక వాహనాలను పంపామని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డెరైక్టర్ ఎ.కె. శర్మ చెప్పారు. -
ఢిల్లీ కన్నాట్‌ప్లేస్‌లో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ భవనంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. కన్నాట్‌ప్లేస్‌లో ఓ భవనంలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఈరోజు ఉదయం 7.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సుమారు మూడు గంటల అంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. ఎన్ఐఐటీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఉన్న ఏ-బ్లాక్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కాగా ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇక ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ అనంతరం తేలుతుందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ ఏ.కె. శర్మ తెలిపారు. -
కన్నాట్ ప్లేస్ లో అగ్ని ప్రమాదం