సాక్షి, న్యూఢిల్లీ : మరో దారుణమైన ఘటన దేశ రాజధాని నడిబొడ్డున చోటు చేసుకుంది. ఓ మహిళా లెక్చరర్‌ను ఆంగతకుడొకడు ఆమె పని చేసే కళాశాల పరిసరాల్లోనే వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
బాధిత మహిళ(32) కథనం ప్రకారం... గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్నౌట్ ప్రాంతంలోని లంచ్ సమయం కావటంతో తన కళాశాల మేడ మీద ఫోన్ ఆమె మాట్లాడుతూ ఉంది. ఇంతలో ఓ వ్యక్తి ఆమె దగ్గరగా వచ్చి పట్టుకునేందుకు యత్నించాడు. అది గమనించిన మహిళ భయంతో పరుగులు తీయబోయింది. అయితే కిందకు వెళ్లేందుకు ఉన్న దర్వాజకు అప్పటికే అతను గడియ బిగించేశాడు. భయపడిన మహిళ మేడ మీదే అటు ఇటు పరిగెత్తింది. ఒకానోక దశలో మేడ మీద నుంచి దూకేందుకు ఆమె యత్నించింది. అయితే చివరకు ఆమెను గట్టిగా పట్టుకున్న వ్యక్తి.. ఆమె నోరు నొక్కి అసభ్యంగా తాకటం మొదలుపెట్టాడు. ఆపై వికృత చేష్టకు పాల్పడటంతో విదిలించుకున్న మహిళ గట్టిగా అరిచింది. దీంతో ఆ వ్యక్తి ఆమె ఫోన్ లాక్కుని పక్కనే ఉన్న మరో మేడ మీదకు దూకి పారిపోయాడు.
తోటి ఉద్యోగస్థుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె.. జరిగిన ఘటనను ఓ మీడియా సంస్థకు వివరించారు. ఆ వ్యక్తిని మరోసారి చూస్తే తాను గుర్తుపడతానని ఆమె చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ మృగాన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పట్టపగలే ఈ ఘటన చోటు చేసుకోవటంతో మహిళకు మద్దతుగా పలు సంఘాలు ఆందోళన చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment