ఢిల్లీలోని ఓ భవనంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. కన్నాట్ప్లేస్లో ఓ భవనంలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ భవనంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. కన్నాట్ప్లేస్లో ఓ భవనంలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఈరోజు ఉదయం 7.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సుమారు మూడు గంటల అంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. ఎన్ఐఐటీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఉన్న ఏ-బ్లాక్లో అగ్నిప్రమాదం జరిగింది. కాగా ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇక ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ అనంతరం తేలుతుందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ ఏ.కె. శర్మ తెలిపారు.