
ఢిల్లీ : బీజేపీ ఎంపీ బి శ్రీరాములు నివాసంలో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎంపీ కుటుంబం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా రోడ్డులోని ఎంపీ నివాసంలో జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. ‘తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.’ అని తెలిపారు. కాగా అగ్నిప్రమాదంలో నివాసంలోని ఫర్నిచర్ దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.