
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తల్లి సహా ఇద్దరు కూతుళ్లు సజీవ దహనమయ్యారు. తూర్పు ఢిల్లీలోని అక్షర్‌ధామ్ ఫ్లైఓవర్‌పై ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు... ఉపేంద్ర మిశ్రా అనే వ్యక్తి భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి ఇంటి నుంచి బయల్దేరాడు. ఈ క్రమంలో కారు అక్షర్‌ధామ్ టెంపుల్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ సీట్లో ఉన్న ఉపేంద్ర ఒక కూతురుని తీసుకుని బయటకు దూకేశాడు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడి భార్య రంజనా మిశ్రా, కూతుళ్లు నిక్కీ, రిధి కాలి బూడిదయ్యారు.
కాగా న్యాచురల్ గ్యాస్ లీక్ అవడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఈస్ట్ డీసీపీ జస్మీత్ సింగ్ తెలిపారు. అయితే ఇందుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపేంద్ర షాక్‌లో ఉన్నాడని, ఆయన పూర్తి స్పృహలోకి ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment