న్యూఢిల్లీ: కన్నాట్‌ప్లేస్‌లో ఆదివారం పబ్లిక్ వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి ఈ సేవలను ప్రారంభించారు. టాటా టెలీసర్వీసెస్ భాగస్వామ్యంతో పరిపాలనా విభాగం ఈ సేవలను ప్రజలకు అందజేస్తున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) తెలియజేసింది. వినియోగదారులు మొదటి 20 నిమిషాలపాటు ఈ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని, ఆ తర్వాత నుంచి కొంత చార్జి పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. రీచార్జీ కార్డులు వివిధ షాపుల్లో అందుబాటులో ఉంటాయని వారు వివరించారు. వైఫై సదుపాయమున్న అన్ని ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు ఈ వసతి అందుబాటులో ఉంటుందన్నారు. అంతేకాక ఇతర ఏమైనా సమాచారం కావాలంటే వైఫై కాల్ సెంటర్ నం. +9111 60607070కు ఫోన్ చేసి సేవలను పొందవచ్చు. ఈ ప్రాంతంలో ఒకేసారి ఐదువేల మంది వినియోగదారులు వైఫై సేవలను వినియోగించుకోవచ్చని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
కన్నాట్‌ప్లేస్‌లో వైఫై ప్రారంభం
Published Sun, Nov 16 2014 10:15 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement
Advertisement