అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్‌.. 9వ స్థానంలో కన్నాట్‌ ప్లేస్‌ | Connaught Place India's most expensive office market, ranks 9th globally | Sakshi
Sakshi News home page

అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్‌.. 9వ స్థానంలో కన్నాట్‌ ప్లేస్‌

Published Sat, Jun 17 2017 1:38 AM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్‌.. 9వ స్థానంలో కన్నాట్‌ ప్లేస్‌

అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్‌.. 9వ స్థానంలో కన్నాట్‌ ప్లేస్‌

ముంబై: భారత్‌లో అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్లలో న్యూఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అదే అంతర్జాతీయ స్థాయిలో 9వ స్థానంలో ఉంది. ఇక్కడ ఆక్యుపెన్సీ ధర ఏడాదికి ఒక చదరపు అడుగుకు 153.89 డాలర్లుగా ఉంది. దీంతో కన్నాట్‌లో ఆఫీస్‌ మార్కెట్‌ ధర దుబాయ్, డౌన్‌టౌన్‌ బోస్టన్, షాంఘైలలో కన్నా ఎక్కువగా ఉంది.

ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో మాత్రం ఆఫీస్‌ మార్కెట్‌ ధరలు తగ్గాయి. ప్రపంచంలోని టాప్‌–50 అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్ల జాబితాలో ముంబైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌ 20వ స్థానంలో, నారిమన్‌ పాయింట్‌ 33వ స్థానంలో నిలిచాయి. హాంగ్‌కాంగ్‌లోని సెంట్రల్, లండన్‌లోని వెస్ట్‌ ఎండ్‌ ప్రాంతాలు జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇవే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement