మైక్రోవేవ్ ఓవెన్ ఇలా పనిచేస్తుంది!
1. మనం స్విచ్ ఆన్ చెయ్యగానే మైక్రో ఓవెన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్.. ఇళ్లలో ఉండే 220 వోల్టుల విద్యుత్తును 4000 లేదా అంత కంటే ఎక్కువ వోల్టుల పవర్ గా మార్చి మాగ్నెట్రాన్‌కు అందిస్తుంది. ఈ మాగ్నెట్రాన్ విద్యుత్తు నుంచి సూక్ష్మ తరంగాలను పుట్టించడం కోసం ఓవెన్ లోపల ఏర్పాటై ఉంటుంది.
2. లోనికి వెళ్లిన హై ఓల్టేజీ.. మాగ్నెట్రాన్ మధ్యలో ఉండే ఫిలమెంటును వేడిచేసి ఎలక్ట్రాన్‌లను మండిస్తుంది. ఈ ఎలక్ట్రాన్‌లు రెండు వలయాల అయస్కాంతాలతో గిర్రున తిరగడం వల్ల వేడి ఉద్భవిస్తుంది
3. మాగ్నెట్రాన్‌పై ఉండే ఏంటెన్నా ద్వారా సూక్ష్మ తరంగాలు కుకింగ్ చాంబర్‌లోకి వెళతాయి.
4. అలా చాంబర్‌లోకి వెళ్లిన తరంగాలు ఆహార పదార్థాన్ని అన్ని వైపుల నుంచి సమంగా వేడి చేస్తాయి.
5. ఓవెన్ తలుపుకు లోహపు వల (మెటల్ మెష్) ఉంటుంది. దానికి రంధ్రాలు ఉంటాయి. అవి తరంగాలు తప్పించుకోలేనంత చిన్నవిగా, అదే సమయంలో లోపల కుక్ అవుతున్న పదార్థం కనిపించే విధంగా ఉంటాయి.
6. అన్ని వైపుల నుంచి వేడి సమానంగా అందేందుకు వీలుగా ఆహారాన్ని టర్న్ టేబుల్ గుండ్రంగా తిప్పుతూ ఉంటుంది.