Micro Owen
-
విమానాశ్రయంలో 4 కేజీల బంగారం పట్టివేత
శంషాబాద్: అక్రమంగా బంగారం తరలిస్తున్న అయిదుగురు ప్రయాణికులను డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. వీరి నుంచి 4.08 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు 840 గ్రాముల బంగారాన్ని పైపుల్లో దాచుకుని తీసుకురాగా.. ముందస్తు సమాచారంతో డీఆర్ఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు రాత్రి మస్కట్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతడు తీసుకొచ్చిన మైక్రోవేవ్ ఓ వెన్ ట్రాన్స్‌ఫార్మర్‌లో 2 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. దుబాయ్ నుంచి వచ్చిన మరో ముగ్గురు ప్రయాణికులను కూడా ముందస్తు సమాచారంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు బంగారం పేస్ట్‌ను క్యాప్సుల్స్‌గా మార్చి మలద్వారంలో పెట్టుకుని తీసుకొచ్చినట్లు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా బంగారాన్ని బయటికి తీశారు. ఈ ఐదుగురు ప్రయాణి కుల నుంచి 4,083 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం బంగారం విలువ రూ. 1.66 కోట్లుగా నిర్ధారించారు. -
మైక్రోవేవ్ ఓవెన్ ఇలా పనిచేస్తుంది!
1. మనం స్విచ్ ఆన్ చెయ్యగానే మైక్రో ఓవెన్లోని ట్రాన్స్ఫార్మర్.. ఇళ్లలో ఉండే 220 వోల్టుల విద్యుత్తును 4000 లేదా అంత కంటే ఎక్కువ వోల్టుల పవర్ గా మార్చి మాగ్నెట్రాన్కు అందిస్తుంది. ఈ మాగ్నెట్రాన్ విద్యుత్తు నుంచి సూక్ష్మ తరంగాలను పుట్టించడం కోసం ఓవెన్ లోపల ఏర్పాటై ఉంటుంది. 2. లోనికి వెళ్లిన హై ఓల్టేజీ.. మాగ్నెట్రాన్ మధ్యలో ఉండే ఫిలమెంటును వేడిచేసి ఎలక్ట్రాన్లను మండిస్తుంది. ఈ ఎలక్ట్రాన్లు రెండు వలయాల అయస్కాంతాలతో గిర్రున తిరగడం వల్ల వేడి ఉద్భవిస్తుంది 3. మాగ్నెట్రాన్పై ఉండే ఏంటెన్నా ద్వారా సూక్ష్మ తరంగాలు కుకింగ్ చాంబర్లోకి వెళతాయి. 4. అలా చాంబర్లోకి వెళ్లిన తరంగాలు ఆహార పదార్థాన్ని అన్ని వైపుల నుంచి సమంగా వేడి చేస్తాయి. 5. ఓవెన్ తలుపుకు లోహపు వల (మెటల్ మెష్) ఉంటుంది. దానికి రంధ్రాలు ఉంటాయి. అవి తరంగాలు తప్పించుకోలేనంత చిన్నవిగా, అదే సమయంలో లోపల కుక్ అవుతున్న పదార్థం కనిపించే విధంగా ఉంటాయి. 6. అన్ని వైపుల నుంచి వేడి సమానంగా అందేందుకు వీలుగా ఆహారాన్ని టర్న్ టేబుల్ గుండ్రంగా తిప్పుతూ ఉంటుంది.