మైక్రోఓవెన్‌లో తీసుకొచ్చిన బంగారం
శంషాబాద్: అక్రమంగా బంగారం తరలిస్తున్న అయిదుగురు ప్రయాణికులను డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. వీరి నుంచి 4.08 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు 840 గ్రాముల బంగారాన్ని పైపుల్లో దాచుకుని తీసుకురాగా.. ముందస్తు సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అదే రోజు రాత్రి మస్కట్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతడు తీసుకొచ్చిన మైక్రోవేవ్ ఓ వెన్ ట్రాన్స్‌ఫార్మర్‌లో 2 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. దుబాయ్ నుంచి వచ్చిన మరో ముగ్గురు ప్రయాణికులను కూడా ముందస్తు సమాచారంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు బంగారం పేస్ట్‌ను క్యాప్సుల్స్‌గా మార్చి మలద్వారంలో పెట్టుకుని తీసుకొచ్చినట్లు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా బంగారాన్ని బయటికి తీశారు. ఈ ఐదుగురు ప్రయాణి కుల నుంచి 4,083 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం బంగారం విలువ రూ. 1.66 కోట్లుగా నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment