sezied
-
అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
-
మరో ఫార్మా సెజ్ ఫ్యాక్టరీలో ప్రమాదం
-
AP: అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్
సాక్షి, అనకాపల్లి జిల్లా: రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలింది. వసంత కెమికల్స్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతిచెందారు. మృతుడిని ఒడిశాను చెందిన కార్మికుడిగా గుర్తించారు. రియాక్టర్ పేలడంలో కార్మికులు పరుగులు తీశారు. మరికొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం. -
విమానాశ్రయంలో 4 కేజీల బంగారం పట్టివేత
శంషాబాద్: అక్రమంగా బంగారం తరలిస్తున్న అయిదుగురు ప్రయాణికులను డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. వీరి నుంచి 4.08 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు 840 గ్రాముల బంగారాన్ని పైపుల్లో దాచుకుని తీసుకురాగా.. ముందస్తు సమాచారంతో డీఆర్ఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు రాత్రి మస్కట్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతడు తీసుకొచ్చిన మైక్రోవేవ్ ఓ వెన్ ట్రాన్స్‌ఫార్మర్‌లో 2 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. దుబాయ్ నుంచి వచ్చిన మరో ముగ్గురు ప్రయాణికులను కూడా ముందస్తు సమాచారంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు బంగారం పేస్ట్‌ను క్యాప్సుల్స్‌గా మార్చి మలద్వారంలో పెట్టుకుని తీసుకొచ్చినట్లు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా బంగారాన్ని బయటికి తీశారు. ఈ ఐదుగురు ప్రయాణి కుల నుంచి 4,083 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం బంగారం విలువ రూ. 1.66 కోట్లుగా నిర్ధారించారు. -
శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత!
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 4 కేజీల బంగారాన్ని గురువారం డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 800 గ్రాములు, మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 700 గ్రాములు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద కేజిన్నర బంగారాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా వారి వద్ద ఉన్న బంగారానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
సెజ్‌లోని ఐటీ కంపెనీలపై..పన్ను తగ్గించండి
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) నుంచి పనిచేసే ఐటీ కంపెనీలపై 15 శాతమే కార్పొరేట్ పన్ను విధించాలని కేంద్రాన్ని ఐటీ పరిశ్రమ డిమాండ్ చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020–21 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్న దృష్ట్యా... దీనికోసం సోమవారం నుంచి వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), స్టార్టప్‌లు, మొబైల్ తయారీ, ఆర్థిక సేవల రంగాలకు చెందిన ప్రతినిధులు మంత్రి ముందు తమ డిమాండ్ల చిట్టాను విప్పారు. ఐటీ పరిశ్రమ.. ‘‘కొత్తగా ఏర్పడే తయారీ రంగ కంపెనీలకు కార్పొరేట్ పన్ను రేటును 15 శాతానికి తగ్గించారు. సెజ్‌లలో ఏర్పాటయ్యే కొత్త సేవల కంపెనీలకూ 15 శాతం రేటు అమలు చేస్తే సెజ్‌లలోని తయారీ, సేవల రంగాలకు ఒకటే రేటు అమలవుతుందని కేంద్రానికి సూచించాం’’ అని నాస్కామ్ సీనియర్ డైరెక్టర్ ఆశిష్ అగర్వాల్ చెప్పారు. ఉపాధి కల్పన, పెట్టుబడుల విషయంలో సెజ్‌లు భవిష్యత్తు వృద్ధికి కీలకమన్నారు. విస్తృతమైన టెక్నాలజీలపై (డీప్‌టెక్) పనిచేసే స్టార్టప్‌ల కోసం నిధితోపాటు, ఆవిష్కరణల సమూహాలను ఏర్పాటు చేయాలని సూచించినట్టు వెల్లడించారు. దేశంలో డేటా డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సూచించినట్టు రిలయన్స్ జియో వైస్ ప్రెసిడెంట్ విశాఖ సైగల్ తెలిపారు. ఆర్థిక సేవల సంస్థలు.. టర్మ్ ఇన్సూరెన్స్ విస్తరణ కోసం జీఎస్టీ రేటును తగ్గించాలని, అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడానికి కేవైసీ నిబంధనలను క్రమబద్ధీకరించాలని ఫైనాన్షియల్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ రంగానికి చెందిన కంపెనీలు (బ్యాంకులు, బీమా కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు) ప్రభుత్వానికి సూచించాయి. ప్రభ్వురంగ బ్యాంకుల్లో పాలనను మెరుగుపరచడంపై, పీజే నాయక్ కమిటీ సిఫారసుల అమలుపై దృష్టి సారించాలని కోరాయి. ఎన్బీఎఫ్సీ రంగంలో ఒత్తిళ్లను తొలగించి, నిర్వహణను మెరుగుపరిచే విషయమై కూడా సూచనలు చేశాయి. ఆర్థిక పరిమితులకు లోబడి వీటిని పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. ‘‘ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులపై పన్ను మినహాయింపును రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచాలని సూచించాయి. అటల్ పెన్షన్ యోజనలో ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లు చేయాలని కూడా కోరాం’’ అని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. మొబైల్ పరిశ్రమ... ఇటీవల ప్రభుత్వం ఎగుమతులపై తగ్గించిన రాయితీలతో ఉద్యోగాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని, అలాగే, మొబైల్ హ్యాండ్సెట్లపై జీఎస్టీ రేటు తగ్గించాలని కోరింది. దేశంలో పెద్ద ఎత్తున తయారీకి ఇది అవసరమని పేర్కొంది. ఎగుమతులపై 8% రాయితీ ఇవ్వాలని కోరింది. జీఎస్టీ పరిహార చెల్లింపులకు కట్టుబడి ఉన్నాం ముంబై: జీఎస్టీ పరిహార చెల్లింపులపై కేంద్రం తన హామీని విస్మరించబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి భరోసానిచ్చారు. వసూళ్లు తగ్గినందునే పరిహార చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు వివరణ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు అసహనానికి గురికావాల్సిన అవసరం లేదన్నారు. పరిహారాన్ని వెంటనే కేంద్రం చెల్లించాలంటూ కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఇలా స్పందించారు. ‘‘ఇది వారి హక్కు. నేను తోసిపుచ్చడం లేదు. దీన్ని నిలబెట్టుకోకపోవడం ఉండదని స్పష్టం చేయదలుచుకున్నాను’’ అని వివరించారు. ముంబైలో సోమవారం జరిగిన టైమ్స్ నెట్వర్క్ ‘భారత ఆర్థిక సదస్సు’ను ఉద్దేశించి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డేటా (సమాచారం) విశ్వసనీయతపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాష్ట్రాలకు రూ.35,298 కోట్ల పరిహారం కీలకమైన జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఈ నెల 18న జరగనుండగా, రెండు రోజుల ముందు సోమవారం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.35,298 కోట్లను జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని పరోక్ష పన్నులు, కస్టమ్స్ మండలి (సీబీఐసీ) ట్వీట్ ద్వారా తెలియజేసింది. సకాలంలో పరిహార చెల్లింపులను కేంద్రం విడుదల చేయకపోవడంతో పలు రాష్ట్రాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
కట్టలు కట్టలుగా నోట్లు
సాక్షి, చెన్నై: ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ఓటర్లకు తాయిలాల పంపిణీకి వినూత్న మార్గాల్ని అన్వేషించే పనిలో రాజకీయ పక్షాలు ఉన్నట్టుంది. ఇందుకు అద్దం పట్టే రీతిలో కారుడోర్లకు ఉన్న అద్దాల కింది భాగంలో నోట్ల కట్టల్ని ఉంచి మరీ తరలించడం బుధవారం వెలుగు చూసింది. వీసీకే పార్టీకి చెందిన వ్యక్తి కారుగా తేలడం, అందులో రూ. 2.10 కోట్లు పట్టుబడడంతో ఆ నాయకుడిపై ఈసీ గురి పడింది. అలాగే, మదురైలో 47 కేజీల బంగారు, కడలూరులో రూ. ఐదు కోట్లు విలువగల బంగారాన్ని ఎన్నికల వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో హోరెత్తుతోంది. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ఓటర్లకు తాయిలాల పంపిణికీ తగ్గ సరంజామాల్ని సిద్ధం చేసుకునే పనిలో రాజకీయ పక్షాలు ఉన్నాయని చెప్పవచ్చు. వేలూరులో డీఎంకేకు చెందినదిగా భావిస్తున్న కోట్లాది రూపాయలు పట్టుబడిన నేపథ్యంలో ఇతర పార్టీలు జాగ్రత్తల్లో పడ్డట్టున్నాయి. ఆయా అభ్యర్థులు తమ వద్ద ఉన్న నగదు జాగ్రత్త పరుచుకునేందుకు వినూత్న మార్గాల్ని అన్వేషించే పనిలో పడ్డట్టున్నారు. ఐటీ, ఫ్లయింగ్ స్క్వాడ్ల నుంచి తప్పించుకునేందుకు ఎన్ని వ్యూహాలు చేసినా, వినూత్న మార్గాలు అన్వేషించినా, పట్టుబడాలని రాసి పెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు. బుధవారం అరియలూరు మార్గంలో ఓ కారు పయనిస్తుండడంతో ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అనుమానం నెలకొంది. దీంతో ఆ కారును చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఆ కారు ముందు భాగంలో వీసీకే పార్టీ జెండా ఉండడంతో అనుమానాలకు మరింత బలం చేకూరినట్టు అయింది. ఆకారును క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎక్కడ ఒక్క పైసా కూడా చిక్క లేదు. చివరకు కారు డోర్లకు ఉన్న అద్దాల్ని దించేందుకు ప్రయత్నించగా, అవి కిందికి వెళ్ల లేదు. అద్దాలు జాం అయినట్టుగా అందులో ఉన్న వాళ్లు పేర్కొన్నా, ఫ్లయింగ్ స్క్వాడ్ మాత్రం వదలి పెట్ట లేదు. కావాల్సిన పనిముట్లు తెప్పించి తెరచి చూడగా, అద్దాల కింది భాగంలోకట్టలు కట్టలుగా నోట్లు బయట పడ్డాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం రూ.2.10 కోట్లు పట్టుబడ్టట్టు అధికారులు తేల్చారు. ఈ నగదు తిరుచ్చిలోని వీసీకే పార్టీకి చెందిన ప్రముఖుడిదిగా తేలడంతో ఆ వ్యక్తిని గురి పెట్టారు. ఐటీ వర్గాలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయి. అరియలూరు వైపుగా ఈ నగదు వెళ్తుండడంతో చిదంబరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వీసీకే నేత తిరుమావళవన్ కోసమేనా అన్న చర్చ జోరందుకుంది. మదురైలో బంగారం: తమకు అందే సమాచారాల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ దూసుకెళ్తోన్నది. బన్రూటిలో జరిపిన తనిఖీల్లో ఓ పంచ లోహ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఓ ఆలయం నుంచి చోరీ చేసి తరలిస్తున్నట్టుగా విచారణలో తేలింది. అలాగే, మదురైలో ఓ వ్యాన్‌లో తనిఖీ చేయగా 47 కేజీల బంగారం బయట పడింది. దీని విలువను లెక్కిస్తున్నారు. కడలూరు సమీపంలోని వేప్పూరులో ఓ వాహనం నుంచి రూ. 5.90 కోట్లు విలువగల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై పెరంబూరు నియోజకవర్గం పరిధిలోని కొడుంగయూర్ వద్ద ఓ కారులో రూ.4.25 లక్షలు బయట పడింది. అలాగే, పొల్లాచ్చిలో అన్నాడీఎంకే వర్గాలు మహిళలకు నోట్లు పంచేందుకు సిద్ధం చేసిన టోకెన్లను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు తగ్గ ఫిర్యాదుతో కేసు కూడా నమోదు చేశారు. అరంతాంగిలోని డీఎంకే ప్రముఖుడి ఇంట్లో పెద్ద ఎత్తున నగదు ఉన్న సమాచారంతో ఆ ఇంట్లో పోలీసులు , ఫ్లయింగ్ స్క్వాడ్ వర్గాలు తనిఖీలు చేపట్టాయి. చెన్నై థౌజండ్ లైట్స్, అన్నా సాలైలలో జరిపిన తనిఖీల్లో రూ. 75 లక్షలు గల నగలు, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే,రూ. 50 వేలు విలువగల కుంకుమ భరిణలను సైతం స్వాధీనం చేసుకున్న అధికారులు, శ్రీలంకకు చెందిన ఓ యువకుడి వద్ద విచారణ జరుపుతున్నారు. చెన్నైలో మాత్రం ఇప్పటి వరకు రూ. ఏడు కోట్ల నగదు, 40 కేజీల బంగారం చిక్కినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, కోయంబత్తూరులో పారిశ్రామిక వేత్తగా ఉన్న జి రమేష్ నేతృత్వంలోని యూనివర్సల్ ట్రేడింగ్ సొల్యూషన్ పేరిట ఉన్న ఓ సంస్థలో ఐటీ వర్గాలు సోదాలు జరిపాయి. ఇక్కడ లెక్కలోకి రాని రూ. 9.83 కోట్లు నగదు బయట పడడం గమనార్హం. పెద్ద ఎత్తున నోట్లు, నగలు బయట పడుతుండడంతో పోలీసులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, ఐటీ వర్గాలు మూకుమ్మడిగా దాడుల్లో దిగడం అభ్యర్థుల్ని బెంబేళెత్తిస్తున్నాయని చెప్పవచ్చు. -
నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
సాక్షి, గద్వాల : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. టాస్క్‌ఫోర్స్ దాడుల్లో వరుసగా పట్టుబడుతున్న నకిలీ పత్తి విత్తనాలు సోమవారం జిల్లాకేంద్రంలో దొరికాయి. టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు వెంకటేష్, పెద్ద స్వాములు, నజీర్లకు వచ్చిన సమాచారంతో స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో వెంకట్‌రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా నకిలీ పత్తివిత్తనాలు పట్టుబడ్డాయి. విత్తనాలకు కలర్ వేసి ప్యా కెట్లలో ప్యాకింగ్ చేసి అమ్మేందుకు తయారు చేస్తు న్న విత్తనాలను గుర్తించారు. కలర్ కలిపిన విత్తనాలు 25 కిలోలు, కలర్ కలపనివి 100 కిలోలు మొత్తం 125 కిలోల పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఏఓ భవానీ, వీఆర్ఓలు పంచనామా నిర్వహించి వాటి విలువ రూ.10 లక్షల విలువ ఉంటుందని తేల్చారు. విత్తనాలను సీజ్ చేసి సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఫర్టిలైజర్ షాపులపై దాడులు మక్తల్ : పట్టణంలో పురుగు మందు షాపులపై ఏఎస్పీ, జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారి వెంకటేశ్వర్లు, టీం అధికారి వెంకటేశం సోమవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పట్టణంలోని బాబా, వెంకటేశ్వర, కోరమాండల్ షాపుల్లో పత్తి విత్తనాలను, గోదాంలలో స్టాకును పరిశీలించారు. అయి తే విత్తనాలు, మందులు ఒకే దగ్గరకు చేర్చితే సక్రమంగా ఉండవన్నారు. వారికి వెంటనే నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తమకు సమాచారం అందించాలని కోరారు. అనుమతి ఉన్న షాపుల్లోనే రైతులు వ్తితనాలను కొనుగోలు చేయాలని, తప్పకుండా రసీదు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మక్తల్ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. అయిజ (అలంపూర్): స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం సోమవారం మండలంలోని మేడికొండలో దాడులు చేశారు. ఈ సందర్భంగా ఉప్పరి నాగరాజు నివాసంలో 15 బస్తాలు (10.50 క్విం టాళ్ల) ఫెయిల్ అయిన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏఓ శంకర్‌లాల్ ఫిర్యాదు మేరకు నాగరాజుపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ర్యాలంపాడు రిజర్వాయర్ సమీపంలో.. ధరూరు (గద్వాల): ఇటీవల నకిలీ పత్తి విత్తనాల స్థావరాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భయాందోళనకు గురైన గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు క్వింటాల్ నకిలీ పత్తి విత్తనాలను మండలంలోని ర్యాలంపాడు రిజర్వాయర్ వద్ద పారబోశారు. ర్యాలంపాడు గ్రామ శివారులో ఉన్న రిజర్వాయర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలను పారబోసి వెళ్లారు. రిజర్వాయర్ వద్ద కు వెళ్లిన గ్రామస్తులు వాటిని గమనించి టాస్క్‌ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని పత్తి విత్తనాలను పరిశీలించారు. రంగులు కలిపి రైతులకు అమ్మడానికి సిద్ధం చేసి ఉంచిన విత్తనాలను పోలీసుల కేసులకు భయపడి పారిబోసినట్లు గుర్తించారు. అక్కడ ఉన్న కొన్ని ఆధారాలను సేకరించారు. పక్కనే పడి ఉన్న గోనె సంచులను, వాటిపై ఉన్న పత్తి విత్తనాల లాట్ నంబర్లను గుర్తించారు. త్వరలోనే నిందితులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. లభ్యమైన పత్తి విత్తనాల విలువ దాదాపు రూ.లక్ష ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి భవాని, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేష్, కానిస్టేబుళ్లు నజీర్, స్వాములు తదితరులు పాల్గొన్నారు. -
మూతపడి 30 ఏళ్లు
రామగుండం : అంతర్గాం వీవింగ్ మిల్లు 1987 మే ఒకటవ తేదీన లాకౌట్‌గా ప్రకటించి మంగళవారం నాటికి (మేడే) ముప్పై ఏళ్లు పూర్తయింది. బర్మా, శ్రీలంక, కాందీశీకుల శాశ్వత పునరావాస కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం 1967న కేంద్ర, రాష్ట్ర (అప్పటి ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు అవకాశం కల్పించింది. అంతర్గాంలో టెక్స్టైల్ టౌన్షిప్ (టీటీఎస్) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు గాను 502 ఎకరాల భూ విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వ పునరావాస ఆర్థిక నిధులు రూ.1.05 కోట్లతో దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ సహకార రంగంలో టెక్స్ౖటైల్ సొసైటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో జూలై 7, 1971న స్థానిక, స్థానికేతర 509 మంది కార్మికులతో టెక్స్టైల్ వీవింగ్ మిల్లు సొసైటీగా రూపాంతరం చెందింది. ఇందులో కార్మికులు విధులు నిర్వహిస్తూ 1976 వరకు లాభాల బాటలో పయనించిన వీవింగ్ సొసైటీ క్రమంగా నష్టాల బాటన పడింది. దీనికి కారణం యాజమాన్యం అవినీతి, పాలకుల నిర్లక్ష్యంతో నష్టాల బాటలోకి చేరింది. అప్పటికే పలుమార్లు, లేఆఫ్, లాకౌట్లను ప్రకటించిన యాజమాన్యం కార్మికుల ఆందోళనలతో నెట్టుకురాగా కొంతకాలం తర్వాత ప్రభుత్వం ముడిసరుకు లేదనే సాకుతో 1987 మే (మేడే) ఒకటిన శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు లాకౌట్‌ను ప్రకటిస్తున్నట్లు 1987 మే డే రోజున రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న గవర్నర్ రాజ్‌భవన్ సాక్షిగా ఆమోదముద్ర వేయడం కార్మిక చట్టాలను అపహస్యం చేయడమేనని కార్మిక లోకం గళమెత్తింది. 1987 నుంచి ప్రారంభమైన ఆకలి చావులు... 1987 మేడే రోజున మూతపడిన వీవింగ్ మిల్లు కార్మికులకు అప్పటికే రెండేళ్ల నుంచి వేతనాలు సకాలంలో చెల్లించకపోగా, పలువురు కార్మికులు అప్పటికే అనారోగ్యం బారినపడ్డారు. ఎక్కువగా దూదిలో నుంచి వచ్చే ధూళి కణాలతో ఊపిరితిత్తుల వ్యాధులకు ఎక్కువగా గురయ్యేవారు. 1987 అక్టోబర్‌లో వెలగాల మహాలక్ష్మి అనే కార్మికురాలు ఆకలిచావుతో మతి చెందడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆనాటి నుంచి నేటి వరకు 134 మంది కార్మికులు తమకు రావాల్సిన బకాయిలు స్వీకరించకుండానే మృతిచెందారు. కార్మికులకు అందని బకాయిలు.. వీవింగ్ మిల్లు పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోవడంతో ప్రభుత్వం కూడా కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లించలేని స్థితిలోకి చేరింది. ఈ క్రమంలో వీవింగ్ మిల్లును తుక్కు కింద విక్రయించి వచ్చిన నగదును కార్మికులకు చెల్లించేందుకు జాయింట్ కలెక్టర్‌కు లిక్విడేటర్ హోదాను అప్పగించింది. అప్పటి నుంచి నేటి వరకు 18 మంది లిక్విడేటర్లు మారినప్పటికీ కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈపీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం అందలేదు. శాశ్వత పునరావాస కల్పనకు శ్రీలంక, బర్మా దేశాల నుంచి వచ్చిన తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డున పడేశాయని పలుమార్లు నిరాహార దీక్షలు సైతం చేశాయి. ఇందుకు కనీసం తమకు నివేశన స్థలాల కింద ఇప్పుడున్న క్వార్టర్‌తో కలుపుకొని పది గుంటల స్థలం తమ పేరుతో పట్టా చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు. ప్రస్తుతం సొసైటీకి చెందిన భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. సొసైటీ భూముల్లో పరిశ్రమ స్థాపించాలి... అంతర్గాం సొసైటీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. వాటిని ప్రభుత్వం సర్వే చేయించి అన్యాక్రాంతమైన భూములను గుర్తించి హద్దు రాళ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పాటుపడాలి. – రామారావు, కాందీశీకుల సంఘం ప్రతినిధి జీవితాన్ని నాశనం చేసుకున్నాం... నేను, నా భర్త అప్పారావు కలిసి వీవింగ్ మిల్లులో కార్మికులుగా చేరాం. భర్త 1998లో టీబీ వ్యాధితో మృతిచెందాడు. ఇప్పుడు నేను దంత క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. వీవింగ్ మిల్లుల్లో పని చేయడంతోనే తమ బతుకులు చావుబారిన పడ్డాం. మిల్లు మూతపడే నాటికే నా భర్తకు రూ.57,004 తనకు రూ.56,692 బకాయిలు రావాల్సి ఉంది. – కర్రి పద్మ, వీవింగ్ మిల్లు కార్మికురాలు. -
ఇరీడియం లోహం పట్టివేత
గోదావరిఖని(రామగుండం): బంగారం బరువు ఎక్కువగా ఉండేందుకు దానిలో కలిపే విలువైన ఇరీడియం లోహాన్ని తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చత్తీస్ఘడ్ నుంచి తీసుకువచ్చి గోదావరిఖనిలో విక్రయించేందుకు సిద్ధమవుతుండగా అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు రామగుండం పోలీస్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ రక్షిత కె.మూర్తి తెలిపారు. బుధవారం ఏసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. స్నేహితుల ద్వారా.. గోదావరిఖని హనుమాన్‌నగర్‌కు చెందిన కన్నం విజయ్ హార్వేస్టర్ వ్యాపారం చేస్తాడు. గోదావరిఖనిలో బంగారం దుకాణాలు ఎక్కువగా ఉండడంతో అందులో కలిపేందుకు ప్రభుత్వం నిషేధించిన ఇరీడియం లోహాన్ని అమ్మేందుకు అతని స్నేహితులు ఆదిలాబాద్ జిల్లా పిట్టలవాడకు చెందిన సింగిరెడ్డి లచ్చిరెడ్డి, మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామానికి చెందిన ఏ.కిషన్, నస్పూర్ మండలం సింగాపురం గ్రామానికి చెందిన ఎస్.తిరుపతి, ఆదిలాబాద్ జిల్లా భీమేశ్వరం ప్రాంతానికి చెందిన జె.గంగన్న, జైనథ్‌కు చెందిన బి.అజయ్, బీంపూర్‌కు చెందిన ఎస్.లింగారెడ్డి విజయ్‌ని కలిశారు. ఈనెల 14న ఎన్టీపీసీలోని ఓ లాడ్జిలో కన్నం విజయ్ నుంచి రూ.30వేలు తీసుకుని కొంత ఇరీడియం లోహన్ని అందజేశారు. డొంక ఇలా కదిలింది... రెండ్రోజుల తరువాత మరికొంత లోహాన్ని తీసుకొస్తామని చెప్పి రాకపోవడంతో విజయ్ ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు ఆ కేసును సీసీఎస్‌కు అప్పగించారు. వారిపై నిఘా ఉంచిన పోలీసులు లోహాన్ని తరలిస్తున్న పై ఆరుగురిని బుధవారం ఎన్టీపీసీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు కిలోల ఇరీడియం లోహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న ఇరీడియం అసలా..? నకిలీనా..? అని తేల్చేందుకు ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. అసలుదైతే దాని విలువ రూ.50లక్షలు ఉంటుందనే అంచనా వేస్తున్నామని అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ రక్షిత కె.మూర్తి వివరించారు. ఛత్తీస్‌గఢ్‌నుంచి నుంచి రవాణా... అరుదుగా లభించే ఈ లోహాన్ని చత్తీస్‌గఢ్ గుట్టల నుంచి సేకరించి ఏటూరు నాగారం మీదుగా రవాణా చేస్తున్నారని తెలిపారు. ఇరీడియమ్ లోహం సేకరించే తిరుమణి నవీన్‌కుమార్, తునికి శంకరాచారి, మామిడిపెల్లి శ్రీనివాస్ పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు. సీసీఎస్ ఏసీపీ చంద్రయ్య, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ఐలు ఎస్.ప్రసాద్, రమేష్‌ను అభినందించారు. -
నకిలీమందుల తయారీ గుట్టు రట్టు
కాకినాడ లీగల్: పెద్దాపురంం మండలం జి.రాగంపేట గ్రామంలో లైసెన్స్ లేకుండా అక్రమంగా నకిలీ మందులు ’ఒమిట్‌మెంట్’ ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్న కేంద్రంపై ఔషధ తనిఖీ అధికారులు, కాకినాడరూరల్, రాజమహేంద్రవరంరూరల్ ఔషధ నియంత్రణ అధికారులు వీఎస్ జ్యోతి, వి.అభిప్రియ గురువారం దాడులు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామంలో ఒక ఇంటిలో అక్రమ మందులు తయారుచేస్తున్నట్టు జిల్లా ఔషధ నియంత్రణశాఖ సహాయ సంచాలకులు టి.శ్రీరామమూర్తికి అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామంలో ఒక ఇంటిని సోదా చేయగా సిరి క్రీమ్ 10జీఎం, 20జీఎం భారీగా ఉన్నట్టు గుర్తించారు. వాటి తయారీకి సంబంధించిన ఒమిట్‌మెంట్ ట్యాబ్‌లు, పాకింగ్ సామగ్రి తదితర వాటిని కూడా గుర్తించారు. ఒమిట్‌మెంట్ ట్యాబ్లెట్ల తయారీకి లైసెన్స్ లేకుండా చేయడం నేరమన్నారు. సుమారు రూ.ఐదు లక్షల విలువగల ఒమిట్మెంట్ల మొత్తాన్ని, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఒమిట్‌మెంట్ తయారీకి సంబంధించిన సామగ్రిని ఔషధనియంత్రణ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. అల్లోపతి మందుల తయారీకి లైసెన్సు తప్పనిసరి అల్లోపతి మందుల తయారీకి, విక్రయాలకు ఔషధచట్టం నిర్దేశించిన లైసెన్సులు తీసుకోవాలని, అవి లేకుండా చట్టవిరుద్ధమైన తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా సహాయ సంచాలకులు టి.శ్రీరామమూర్తి తెలిపారు. -
ముక్కిపోయి మూడేళ్లు!
నేలకొండపల్లి : అక్రమార్కులు తరలిస్తున్న బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.. సివిల్ సప్లై గోడౌన్లో నిల్వ చేశారు.. ఆ తర్వాత కన్నెత్తి చూడలేదు.. మూడేళ్లు గడిచింది.. బియ్యం ముక్కిపోయి.. తుట్టెలుపట్టి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేలకొండపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా.. అధికారులు మూడేళ్ల క్రితం పట్టుకున్నారు. 23 టన్నుల(232 క్వింటాళ్లు) బియ్యాన్ని స్థానిక గోడౌన్లో నిల్వ చేశారు. ఆ తర్వాత అధికారులు అటువైపు వెళ్లలేదు. బియ్యానికి పురుగులు పట్టి ముక్కిపోయాయి. ఆ పురుగులన్నీ గోడౌన్ పక్కనే ఉన్న బాలికల వసతి గృహంలోకి ప్రవేశించి విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గోడౌన్లలో పనిచేసే హమాలీలు కూడా పురుగుల వాసనతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని హమాలీలు పలుమార్లు సివిల్ సప్లై అధికారులకు తెలియజేసినా.. పట్టించుకునేవారు కరువయ్యారు. దాదాపు 232 క్వింటాళ్ల బియ్యం మట్టిపాలు కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లా.. పట్టుకున్న బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలించాలని గతంలోనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. బియ్యం పురుగుపట్టి.. దుర్వాసన వస్తుందని చెప్పాను. అధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటాం. – రామచందర్‌రావు, సివిల్ సప్లై గోడౌన్ ఇన్చార్జ్, నేలకొండపల్లి చర్య తీసుకోవాలి.. పేదల బియ్యం అంటే అంత నిర్లక్ష్యమా. లక్షలాది రూపాయలు విలువ చేసే బియ్యం పనికిరాకుండా చేసిన అధికారులపై చర్య తీసుకోవాలి. వారి జీతాల నుంచి రికవరీ చేయాలి. పేదల సొమ్మంటే లెక్కలేదు. – కాశిబోయిన అయోధ్య, వ్యవసాయ కార్మికుడు -
గంజాయి తరలిస్తున్న వ్యాన్ స్వాధీనం
మొక్కజొన్న పొత్తుల ముసుగులో రవాణా ముందస్తు సమాచారంతో పట్టుకున్న రావులపాలెం పోలీసులు l23 గంజాయి బస్తాలు గుర్తింపు? రావులపాలెం: మొక్కజొన్న పొత్తుల ముసుగులో గంజాయిని తరలిస్తున్న ఉధంతమిది. వివరాల ప్రకారం విశాఖ ఏజెన్సీ నుంచి ఇతర రాష్ట్రాలకు రావులపాలెం మీదుగా ఒక వ్యాన్‌లో భారీగా గంజాయి తరలిపోతున్నట్టు బుధవారం తెల్లవారు జామున రావులపాలెం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై పీవీ త్రినాథ్ సిబ్బందితో కలసి జాతీయ రహదారిపై కాపు కాశారు. రావులపాడు శివారు మల్లాయిదొడ్డి సమీపంలో మొక్కజొన్న పొత్తులతో వెళ్తున్న ఒక మినీ వ్యాన్‌ను ఆపి తనిఖీ నిర్వహించారు. మొక్కజొన్న పొత్తుల అడుగున గంజాయి బస్తాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ సమయంలో డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉండగా పోలీసుల ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పరారయ్యారు. అనంతరం స్వాధీనం చేసుకున్న వ్యాన్‌ను పోలీసులు సమీపంలో ఒక పెట్రోల్ బంకు వద్ద సీఐ పీవీ రమణ, తహసీల్దారు సీహెచ్ ఉదయభాస్కర్, ఎస్సై పీవీ త్రినాథ్ సమక్షంలో మొక్క జొన్న పొత్తులను తీసి చూడగా ఆ వ్యాన్‌లో 23 బస్తాల గంజాయిని గుర్తించారు. వీటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని తెలిసింది. అయితే కేసు దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు, నిందితుల వివరాలు త్వరలో తెలుపుతామని సీఐ రమణ తెలిపారు.