గంజాయి తరలిస్తున్న వ్యాన్ స్వాధీనం
గంజాయి తరలిస్తున్న వ్యాన్ స్వాధీనం
Published Thu, Sep 29 2016 12:01 AM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM
మొక్కజొన్న పొత్తుల ముసుగులో రవాణా
ముందస్తు సమాచారంతో పట్టుకున్న రావులపాలెం పోలీసులు
l23 గంజాయి బస్తాలు గుర్తింపు?
రావులపాలెం: మొక్కజొన్న పొత్తుల ముసుగులో గంజాయిని తరలిస్తున్న ఉధంతమిది. వివరాల ప్రకారం విశాఖ ఏజెన్సీ నుంచి ఇతర రాష్ట్రాలకు రావులపాలెం మీదుగా ఒక వ్యాన్‌లో భారీగా గంజాయి తరలిపోతున్నట్టు బుధవారం తెల్లవారు జామున రావులపాలెం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై పీవీ త్రినాథ్ సిబ్బందితో కలసి జాతీయ రహదారిపై కాపు కాశారు. రావులపాడు శివారు మల్లాయిదొడ్డి సమీపంలో మొక్కజొన్న పొత్తులతో వెళ్తున్న ఒక మినీ వ్యాన్‌ను ఆపి తనిఖీ నిర్వహించారు.
మొక్కజొన్న పొత్తుల అడుగున గంజాయి బస్తాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ సమయంలో డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉండగా పోలీసుల ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పరారయ్యారు. అనంతరం స్వాధీనం చేసుకున్న వ్యాన్‌ను పోలీసులు సమీపంలో ఒక పెట్రోల్ బంకు వద్ద సీఐ పీవీ రమణ, తహసీల్దారు సీహెచ్ ఉదయభాస్కర్, ఎస్సై పీవీ త్రినాథ్ సమక్షంలో మొక్క జొన్న పొత్తులను తీసి చూడగా ఆ వ్యాన్‌లో 23 బస్తాల గంజాయిని గుర్తించారు. వీటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని తెలిసింది. అయితే కేసు దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు, నిందితుల వివరాలు త్వరలో తెలుపుతామని సీఐ రమణ తెలిపారు.
Advertisement