అధికారుల నిర్లక్ష్యంతో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా ఊరంతా షాక్ వచ్చింది. దీంతో 8 మందికి గాయాలయ్యాయి. బాధితులంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలోని సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్తింగ్ లోపం ఏర్పడి సమస్య తలెత్తుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారని నారాయణఖేడ్ మండలంలోని గంగాపూర్ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్: ఊరంతా షాక్‌తో 8 మంది గాయపడ్డారు. ఈ సంఘటన నారాయణఖేడ్ మండలంలోని గంగాపూర్‌లో సోమవా రం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి విద్యుత్ సరఫరా అవుతున్న సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్తింగ్‌లోపం తలెత్తింది. దీంతో రెం డు మూడు రోజులుగా ఏ విద్యుత్ ఉపకరణం ముట్టుకున్నా షాక్ వస్తుంది. సో మవారం ఉదయం ఇంట్లో టీవీ ఫ్లగ్‌పెడుతున్న క్రమంలో సాయిగొండ(46), మరో ఇంట్లో ఎల్లవ్వ(40), ఈమె కోడ లు పంది లక్ష్మి(30), మరో ఇంట్లో లక్ష్మీ(35), కె.శ్రీనివాస్(26), నర్సుగొండ(34)తోపాటు మరో ఇద్దరికి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.
వీరి తోపాటు మరి కొందరికి స్వల్పంగా గాయాల య్యాయి. సాయిగొండకు చేతికి, కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రు ల్లో చికిత్సలు పొందుతున్నారు. గ్రామానికి విద్యుత్ సరఫరా అవుతున్న సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్తింగ్‌లోపం ఉందని, దీంతోనే విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నట్లు పేర్కొంటూ గ్రామస్థు లు ఆందోళనకు దిగారు. ఏడెనిమిదేళ్లు గా గ్రామంలో ఇలా ప్రమాదాలు జరుగుతున్నా ట్రాన్స్‌కో అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌వద్ద ఆన్, ఆఫ్ స్విచ్‌లు కూడా లేవని ఏ ప్రమాదం జరిగినా నా రాయణఖేడ్‌లోని సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సమాచారం ఇ వ్వాల్సి వస్తుందన్నారు. రెండు రోజులు గా షాక్ వస్తున్న విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోవడంలేదన్నారు.
తరచూ ప్రమాదాలు
గంగాపూర్ గ్రామంలో తరచూ విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్తింగ్‌లోపంతో ఏడెమినిదేళ్లుగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఇప్పటివరకు పదులసంఖ్యలో గాయాల పాయాలయ్యారని చెప్పారు. నాలుగేళ్ల క్రితం గ్రామ సమీపంలో 11కేవీ వైర్లు క్రిందకు వేలాడుతుండగా ఆటోలో తీసుకెళ్తున్న ఇనుపపైప్‌కు వైర్లు తగిలి ఆటో దగ్దమయ్యింది. ఈ ప్రమాదంలో సుమా రు 10మంది వరకు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. గ్రామంలోని పంచాయతీ ఆవరణతోపాటు, గ్రామంలోకి వెళ్లే రెండు సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లవద్ద ఎర్తింగ్ లోపం ఉందన్నారు. వీటివద్ద ఎర్తింగ్ సమస్యను అధికారులు నివారించలేకపోతున్నట్లు చెప్పారు. స మస్యను నివారించి ప్రజలను ప్రమాదా ల బారి నుండి కాపాడాలని సర్పంచ్ నా రాయణ అధికారులను కోరారు.
ఎర్తింగ్ లోపంతో ఊరంతా షాక్
Published Tue, May 20 2014 12:01 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement