Narayana khed
-
వచ్చే ఎన్నికల్లో నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిది..!
నారాయణ ఖేడ్ నియోజకవర్గం నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్.భూపాల్ రెడ్డి రెండోసారి విజయం సాదించారు.2014 ఎన్నికలలో ఇక్కడ గెలిచిన పి.కిష్టారెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి భూపాల్ రెడ్డి గెలుపొందారు. తిరిగి 2018 ఎన్నికలలో తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ ఎమ్.పి సురేష్ షెట్కార్‌పై 58508 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భూపాల్ రెడ్డికి 95550 ఓట్లు రాగా, సురేష్ షెట్కార్ కు 37042 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ బిజెపి అభ్యర్ధిగా పి. సంజీవరెడ్డికి కాంగ్రెస్ ఐ అభ్యర్దితో దాదాపు సమానంగా 36వేలకు పైగా ఓట్లు లభించాయి. ఆయన మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు కావడం వల్ల ఓట్లు గణనీయగా వచ్చాయి.కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడంతో బిజెపి పక్షాన పోటీచేశారు.రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి భూపాల్ రెడ్డి. 2014లో తెలంగాణలో టిఆర్ఎస్ గాలిని ఎదుర్కుని గెలిచిన కాంగ్రెస్ ఐ నేతలలో నారాయణ ఖేడ్ సిటింగ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఒకరు. ఈయన టిఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్.భూపాల రెడ్డిని 14786 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. 2014లో తెలుగుదేశం - బిజెపి కూటమి అభ్యర్ధిగా రంగంలో దిగిన మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డికి 40405 ఓట్లు వచ్చాయి. నాలుగోసారి శాసనసభకు ఎన్నికైన కిష్టారెడ్డి దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత బాగారెడ్డికి దగ్గర బంధువు అవుతారు. కిష్టారెడ్డి ఆ తర్వాత మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచెంది. నారాయణ ఖేడ్, అంతకుముందు సదాశివపేటలలో కలిపి ఏడుసార్లు రెడ్లు ఎన్నికైతే, ఏడుసార్లు షెట్కార్‌లు గెలుపొందారు. ఒకసారి ఎస్.సికి అవకాశం వచ్చింది. నారాయణ ఖేడ్‌లో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి పదిసార్లు గెలవగా, టిడిపి రెండుసార్లు, స్వతంత్రపార్టీ ఒకసారి గెలుపొందాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. రెండుసార్లు టిఆర్ఎస్ గెలిచింది. 1972, 1983లో ఇక్కడ రెండుసార్లు గెలిచిన వెంకటరెడ్డి, 1994లో గెలిచిన విజయపాల్‌రెడ్డి తండ్రీ కొడుకులు. నారాయణఖేడ్‌లో రెండు సార్లు గెలిచిన అప్పారావు షేట్కర్, మూడుసార్లు నెగ్గిన శివరావుషేట్కర్, ఒకసారి గెలిచిన సురేష్‌కుమార్ షేట్కర్లు ఒకే కుటుంబానికి చెందినవారు.2009లో సురేష్ షెట్కార్ జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఒకసారి గెలుపొందారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
లెక్చరర్‌పై ప్రిన్సిపాల్ దాడి
సాక్షి, నారాయణఖేడ్: విచారణ అధికారులకు తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ నారాయణఖేడ్ సాంఘిక సంక్షేమ గురుకులం ప్రిన్సిపాల్ తనపై దాడిచేశాడంటూ జూనియర్ లెక్చరర్ సాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. నారాయణఖేడ్ మండలంలోని జూకల్ శివారులో సాంఘిక సంక్షేమ గురుకులం కొనసాగుతుంది. కాగా గురుకులానికి డా.మధుసూధన్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో పలు విషయాలపై ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదులు వెళ్లడంతో రెండు రోజులపాటు గురుకులాల కేంద్ర విజిలెన్స్ కమిషన్ అధికారులు విచారణ నిర్వహించారు. గురుకులాల సిబ్బంది ద్వారా అధికారులు వివరాలు సేకరించారు. తాను ప్రిన్సిపాల్‌పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని లెక్చరర్ సాయిరెడ్డి విలేకర్ల ముందు వాపోయారు. శనివారం అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో తాను నివసిస్తున్న క్వార్టర్ తలుపులను ప్రిన్సిపాల్ బాధడంతో తలుపులు తీశానని అన్నారు. తాగిన మైకంలో ఉన్న ప్రిన్సిపాల్ తనపై దాడికి తెగబడ్డాడని అన్నారు. అప్పటికే టెన్త్ విద్యార్థులు పలువురుని వెంట తీసుకొని ప్రిన్సిపాల్ వచ్చాడని అన్నారు. ప్రిన్సిపాల్ దాడిచేస్తుండడంతో విద్యార్థులు తనను కాపాడి రక్షించారని, ప్రిన్సిపాల్‌ను విద్యార్థులు బయటకు తీసుకెళ్లారని వాపోయారు. దాడిపై అదేరాత్రి తాను నారాయణఖేడ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని లెక్చరర్ సాయిరెడ్డి వివరించారు. ఆది నుంచి వివాదస్పదమే.. కాగా నారాయణఖేడ్ గురుకుల ప్రిన్సిపాల్‌పై గత ఏడాది కాలంగా ఏవో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. విద్యార్థులతో పనులు చేయిస్తున్నాడని, వంట సరుకులు, చికెన్, మటన్ తక్కువగా ఇచ్చి, ఇవ్వకున్నా ఇచి్చనట్లు లెక్కలు రాస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో గురుకులాల కార్యదర్శికి ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేశారు. వంట సరుకులు కూడా తక్కువగా ఇస్తున్నారని, తమను దూషిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కాంట్రాక్టర్ సైతం గురుకులం ముందు ఆందోళనకు దిగారు. ఈ విషయాలు అప్పట్లో పత్రికల్లో రావడంతో ఆర్సీఓ విచారణ జరిపి మెమో కూడా జారీ చేశారు. విజిలెన్స్ విచారణ.. రెండు రోజులపాటు గురుకులం ప్రిన్సిపాల్‌పై వచి్చన ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ అధికారి ఎం.డీ హుస్సేన్ గురుకులంలో విచారణ జరిపారు. ఆరోపణలు వాస్తవమా, కాదా, ఏం జరుగుతుందనే అంశాలపై విజిలెన్స్ అధికారులు సిబ్బంది, విద్యార్థులను ఆరా తీశారు. విచారణ చేస్తున్నాం.. లెక్చరర్ సాయిరెడ్డిపై ప్రిన్సిపాల్ మదుసూధన్ దాడిచేసిన విషయంపై ఎస్ఐ సందీప్‌ను వివరణ కోరగా దాడిచేసినట్లు ఫిర్యాదు వచ్చిందని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని సమాధానం ఇచ్చారు. ప్రిన్సిపాల్ మదుసూధన్ వివరణకోసం ప్రయతి్నంచగా ఆయన స్పందించలేదు. -
కారులో ఉంచిన బ్యాగు చోరీ
నారాయణ్‌ఖేడ్ : మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ పట్టణంలో శనివారం పట్టపగలు దొంగతనం జరిగింది. కారులో పెట్టిన హ్యాండ్‌బ్యాగ్‌ను గుర్తు తెలియని దుండగులు చాకచక్యంగా తస్కరించారు. బ్యాగులో 6 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 వేల నగదు, 2 సెల్ఫోన్లు ఉన్నాయని బాధితురాలు జ్యోతి తెలిపింది. మూడేళ్ల కుమారుడు హర్షిత్ ను హాస్పిటల్‌కు తీసుకువచ్చినపుడు ఈ సంఘటన జరిగింది. చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే వారు కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించినట్లు తెలిసింది. -
ఎర్తింగ్ లోపంతో ఊరంతా షాక్
అధికారుల నిర్లక్ష్యంతో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా ఊరంతా షాక్ వచ్చింది. దీంతో 8 మందికి గాయాలయ్యాయి. బాధితులంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలోని సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ లోపం ఏర్పడి సమస్య తలెత్తుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారని నారాయణఖేడ్ మండలంలోని గంగాపూర్ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్: ఊరంతా షాక్‌తో 8 మంది గాయపడ్డారు. ఈ సంఘటన నారాయణఖేడ్ మండలంలోని గంగాపూర్‌లో సోమవా రం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి విద్యుత్ సరఫరా అవుతున్న సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్లోపం తలెత్తింది. దీంతో రెం డు మూడు రోజులుగా ఏ విద్యుత్ ఉపకరణం ముట్టుకున్నా షాక్ వస్తుంది. సో మవారం ఉదయం ఇంట్లో టీవీ ఫ్లగ్పెడుతున్న క్రమంలో సాయిగొండ(46), మరో ఇంట్లో ఎల్లవ్వ(40), ఈమె కోడ లు పంది లక్ష్మి(30), మరో ఇంట్లో లక్ష్మీ(35), కె.శ్రీనివాస్(26), నర్సుగొండ(34)తోపాటు మరో ఇద్దరికి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. వీరి తోపాటు మరి కొందరికి స్వల్పంగా గాయాల య్యాయి. సాయిగొండకు చేతికి, కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రు ల్లో చికిత్సలు పొందుతున్నారు. గ్రామానికి విద్యుత్ సరఫరా అవుతున్న సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్లోపం ఉందని, దీంతోనే విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నట్లు పేర్కొంటూ గ్రామస్థు లు ఆందోళనకు దిగారు. ఏడెనిమిదేళ్లు గా గ్రామంలో ఇలా ప్రమాదాలు జరుగుతున్నా ట్రాన్స్‌కో అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్వద్ద ఆన్, ఆఫ్ స్విచ్‌లు కూడా లేవని ఏ ప్రమాదం జరిగినా నా రాయణఖేడ్లోని సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సమాచారం ఇ వ్వాల్సి వస్తుందన్నారు. రెండు రోజులు గా షాక్ వస్తున్న విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోవడంలేదన్నారు. తరచూ ప్రమాదాలు గంగాపూర్ గ్రామంలో తరచూ విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్లోపంతో ఏడెమినిదేళ్లుగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఇప్పటివరకు పదులసంఖ్యలో గాయాల పాయాలయ్యారని చెప్పారు. నాలుగేళ్ల క్రితం గ్రామ సమీపంలో 11కేవీ వైర్లు క్రిందకు వేలాడుతుండగా ఆటోలో తీసుకెళ్తున్న ఇనుపపైప్కు వైర్లు తగిలి ఆటో దగ్దమయ్యింది. ఈ ప్రమాదంలో సుమా రు 10మంది వరకు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. గ్రామంలోని పంచాయతీ ఆవరణతోపాటు, గ్రామంలోకి వెళ్లే రెండు సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లవద్ద ఎర్తింగ్ లోపం ఉందన్నారు. వీటివద్ద ఎర్తింగ్ సమస్యను అధికారులు నివారించలేకపోతున్నట్లు చెప్పారు. స మస్యను నివారించి ప్రజలను ప్రమాదా ల బారి నుండి కాపాడాలని సర్పంచ్ నా రాయణ అధికారులను కోరారు. -
27న నారాయణఖేడ్‌కు జగన్ రాక
నారాయణఖేడ్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న నారాయణఖేడ్‌కు విచ్చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో రోడ్‌షో, భారీ బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని వైఎస్సార్సీపీ ఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి అప్పారావు షెట్కార్ తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. కాగా ఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి స్థలాన్ని చదును చేసే కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ నేతలు చేపడుతున్నారు. ఏర్పాట్లను నాయకులు మూఢ సురేష్ పటేల్, సుధాకర్, నరేశ్‌యాదవ్, సత్యనారాయణ, తదితరులు ఉన్నారు. కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలి... ఇదిలా ఉండగా వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ వస్తున్న విషయాన్ని వెల్లడించారు. జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఖేడ్‌కు అధిక సంఖ్యలో తరలిరావాలని, సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మహమ్మద్ మొహియొద్దీన్, జహీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌రావు, ఖేడ్ అభ్యర్థి అప్పారావు షెట్కార్, సంగారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా యువజన నాయకులు శివశంకర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో సమస్యాత్మక ప్రాంతం నారాయణఖేడ్. జిల్లాలోనే నారాయణఖేడ్‌లో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఎన్నికల సమయం అంటే అల్లర్లు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో పోలీ సులు నారాయణఖేడ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. అందు లో భాగంగా సర్కిల్ పరిధిలోని గ్రామాల వారీగా ఇదివరకే సర్వే నిర్వహించి రాజకీయ, అతి సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. ఈ గ్రామాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తును కూడా పెంచే అవకాశం ఉంది. కలెక్టర్ కూడా పర్యటించి ప్రశాంత పోలింగ్ కోసం అధికారులకు సూచనలు సలహాలు అందజేశారు. నారాయణఖేడ్ మండలంలో నిజాంపేట్, నమ్లిమేట్, ర్యాలమడుగు, హన్మంత్‌రావుపేట్, సంజీవన్‌రావుపేట్, నారాయణఖేడ్, ర్యాకల్, గంగాపూర్, హంగిర్గా(కె),అంత్వార్, అనంతసాగర్, రుద్రార్, లింగాపూర్ గ్రామాలు గుర్తించారు. సిర్గాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మాసాన్‌పల్లి, కల్హేర్, క్రిష్ణాపూర్, మార్డి, నాగ్‌ధర్, రాపర్తి, కంగ్టి స్టేషన్ పరిదిలో బోర్గి, దెగుల్వాడీ, కంగ్టి, తడ్కల్, జమ్గి (బి), దామర్గిద్ద, గాజుల్పాడ్, తుర్కవడ్‌గాం, మనూరు మండలంలో తు ర్కవడ్గాం, కరస్‌గుత్తి, ఏస్గి, శెల్గిర, దుదగొండ, గుడూర్, ఎల్గొయి, బెల్లాపూర్, బోరంచ, దన్వార్, ఇస్లాంపూర్, పెద్దశంకరంపేట మండలంలో జంబికుంట, చీలపల్లి, పెద్దశంకరంపేట్, కమలాపూర్, బుజరన్పల్లి, టెంకటి, గొట్టిముక్కుల, మల్కాపూర్, కోలపల్లి, మాడ్శట్పల్లి, బూర్గుపల్లి, ఎం.లక్ష్మాపూర్, రేగోడ్ స్టేషన్ పరిధిలో మర్పల్లి, టి.లిం గంపల్లి, గజ్వాడ, రేగోడ్, దోసపల్లి, పెద్దతండా, దుద్ద్యాల, దేవునూర్, ఖాదిరాబాద్ గ్రామాలుగా గుర్తించారు. ఈ గ్రామాలను అత్యంత సమస్యాత్మక గ్రా మాల సరసన చేర్చారు. ఖేడ్ మండలంలో మన్సుర్‌పూర్, అల్లాపూర్, చాప్టా(కె), కంగ్టి మండలంలో చౌకాన్‌పల్లి, ఇస్లాంపూర్ గ్రామాలను కూడా గుర్తించారు. ఈగ్రామాల్లోని 400 మందిని పోలీసులు బైండోవర్ చేశారు. -
జోరుగా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచారం
నారాయణఖేడ్, న్యూస్‌లైన్: స్థానిక జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహానంద షెట్కార్‌తోపాటు ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ నాయకులు ముమ్మర ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నారాయణఖేడ్ పట్టణంలోని మార్వాడిగల్లి, గౌలిగల్లిలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ఓటర్లకు వివరించారు. మహానేత వైఎస్సార్ మరణం తరువాత రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. వైఎస్సార్ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే వైఎస్సార్ సీపీకి అండగా నిలవాలని వారు కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా తమ పార్టీ కృషి చేస్తుందని వారు హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో వైఎస్సార్ సీపీ నాయకులు డాక్టర్ విజయ్‌కుమార్ షెట్కార్, శ్రీదేవి షెట్కార్, ఉమాదేవి, నీరజ, లక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థులు సంగమేశ్వర్, రాణి, సుధాకర్, ఫయాజ్, నరేష్ యాదవ్, సత్యనారాయణ, దత్తు, విజయ్, సంజీవ్‌రెడ్డి, సుధాకర్, తుకారాం తదితరులు పాల్గొన్నారు. -
జోరుగా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచారం
నారాయణఖేడ్, న్యూస్‌లైన్: స్థానిక జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహానంద షెట్కార్‌తోపాటు ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ నాయకులు ముమ్మర ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నారాయణఖేడ్ పట్టణంలోని మార్వాడిగల్లి, గౌలిగల్లిలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ఓటర్లకు వివరించారు. మహానేత వైఎస్సార్ మరణం తరువాత రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. వైఎస్సార్ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే వైఎస్సార్ సీపీకి అండగా నిలవాలని వారు కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా తమ పార్టీ కృషి చేస్తుందని వారు హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో వైఎస్సార్ సీపీ నాయకులు డాక్టర్ విజయ్‌కుమార్ షెట్కార్, శ్రీదేవి షెట్కార్, ఉమాదేవి, నీరజ, లక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థులు సంగమేశ్వర్, రాణి, సుధాకర్, ఫయాజ్, నరేష్ యాదవ్, సత్యనారాయణ, దత్తు, విజయ్, సంజీవ్‌రెడ్డి, సుధాకర్, తుకారాం తదితరులు పాల్గొన్నారు. -
జోరుగా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచారం
నారాయణఖేడ్, న్యూస్‌లైన్: స్థానిక జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహానంద షెట్కార్‌తోపాటు ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ నాయకులు ముమ్మర ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నారాయణఖేడ్ పట్టణంలోని మార్వాడిగల్లి, గౌలిగల్లిలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ఓటర్లకు వివరించారు. మహానేత వైఎస్సార్ మరణం తరువాత రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. వైఎస్సార్ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే వైఎస్సార్ సీపీకి అండగా నిలవాలని వారు కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా తమ పార్టీ కృషి చేస్తుందని వారు హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో వైఎస్సార్ సీపీ నాయకులు డాక్టర్ విజయ్‌కుమార్ షెట్కార్, శ్రీదేవి షెట్కార్, ఉమాదేవి, నీరజ, లక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థులు సంగమేశ్వర్, రాణి, సుధాకర్, ఫయాజ్, నరేష్ యాదవ్, సత్యనారాయణ, దత్తు, విజయ్, సంజీవ్‌రెడ్డి, సుధాకర్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.