నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో సమస్యాత్మక ప్రాంతం నారాయణఖేడ్. జిల్లాలోనే నారాయణఖేడ్‌లో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఎన్నికల సమయం అంటే అల్లర్లు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో పోలీ సులు నారాయణఖేడ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. అందు లో భాగంగా సర్కిల్ పరిధిలోని గ్రామాల వారీగా ఇదివరకే సర్వే నిర్వహించి రాజకీయ, అతి సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. ఈ గ్రామాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తును కూడా పెంచే అవకాశం ఉంది. కలెక్టర్ కూడా పర్యటించి ప్రశాంత పోలింగ్ కోసం అధికారులకు సూచనలు సలహాలు అందజేశారు.
నారాయణఖేడ్ మండలంలో నిజాంపేట్, నమ్లిమేట్, ర్యాలమడుగు, హన్మంత్‌రావుపేట్, సంజీవన్‌రావుపేట్, నారాయణఖేడ్, ర్యాకల్, గంగాపూర్, హంగిర్గా(కె),అంత్వార్, అనంతసాగర్, రుద్రార్, లింగాపూర్ గ్రామాలు గుర్తించారు. సిర్గాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మాసాన్‌పల్లి, కల్హేర్, క్రిష్ణాపూర్, మార్డి, నాగ్‌ధర్, రాపర్తి, కంగ్టి స్టేషన్ పరిదిలో బోర్గి, దెగుల్‌వాడీ, కంగ్టి, తడ్కల్, జమ్గి (బి), దామర్‌గిద్ద, గాజుల్‌పాడ్, తుర్కవడ్‌గాం, మనూరు మండలంలో తు ర్కవడ్‌గాం, కరస్‌గుత్తి, ఏస్గి, శెల్గిర, దుదగొండ, గుడూర్, ఎల్గొయి, బెల్లాపూర్, బోరంచ, దన్వార్, ఇస్లాంపూర్, పెద్దశంకరంపేట మండలంలో జంబికుంట, చీలపల్లి, పెద్దశంకరంపేట్, కమలాపూర్, బుజరన్‌పల్లి, టెంకటి, గొట్టిముక్కుల, మల్కాపూర్, కోలపల్లి, మాడ్శట్‌పల్లి, బూర్గుపల్లి, ఎం.లక్ష్మాపూర్, రేగోడ్ స్టేషన్ పరిధిలో మర్పల్లి, టి.లిం గంపల్లి, గజ్వాడ, రేగోడ్, దోసపల్లి, పెద్దతండా, దుద్ద్యాల, దేవునూర్, ఖాదిరాబాద్ గ్రామాలుగా గుర్తించారు. ఈ గ్రామాలను అత్యంత సమస్యాత్మక గ్రా మాల సరసన చేర్చారు. ఖేడ్ మండలంలో మన్సుర్‌పూర్, అల్లాపూర్, చాప్టా(కె), కంగ్టి మండలంలో చౌకాన్‌పల్లి, ఇస్లాంపూర్ గ్రామాలను కూడా గుర్తించారు. ఈగ్రామాల్లోని 400 మందిని పోలీసులు బైండోవర్ చేశారు.
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
Published Thu, Apr 3 2014 12:14 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement