నారాయణ్‌ఖేడ్ : మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ పట్టణంలో శనివారం పట్టపగలు దొంగతనం జరిగింది. కారులో పెట్టిన హ్యాండ్‌బ్యాగ్‌ను గుర్తు తెలియని దుండగులు చాకచక్యంగా తస్కరించారు. బ్యాగులో 6 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 వేల నగదు, 2 సెల్‌ఫోన్‌లు ఉన్నాయని బాధితురాలు జ్యోతి తెలిపింది. మూడేళ్ల కుమారుడు హర్షిత్ ను హాస్పిటల్‌కు తీసుకువచ్చినపుడు ఈ సంఘటన జరిగింది. చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే వారు కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించినట్లు తెలిసింది.