bag robbery
-
సినీ ఫక్కీలో బ్యాగు చోరీ
సాక్షి, నాయుడుపేటటౌన్: పట్టపగలు జనసంచారం ఉండే ప్రాంతంలో ఓ మహిళ చేతి సంచిలోని ఆమెకు సైతం తెలియకుండా సినీ ఫక్కీలో చోరీ చేశారు. అందులో రూ.3.90 లక్షల నగదును అపహరించారు. ఈ ఘటన పట్టణంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. బాధితురాలి సమాచారం మేరకు.. మండలంలోని తిమ్మాజికండ్రిగకు చెందిన లొడారి అంకమ్మ పట్ట ణంలోని ఓ ఇంటి కొనుగోలు నిమిత్తం అడ్వాన్సుగా ఇచ్చేందుకు రూ.3.90 లక్షలు తీసుకుని ఆమె సమీప బంధువు పి.శారదమ్మతో కలిసి సర్వీస్ ఆటోలో నాయుడుపేటకు వచ్చింది. పాతబస్టాండ్ వద్ద దిగి పూలు, వస్తువులు కొనుగోలు చేసి పట్టణంలోని ఆ మె కుమార్తె ఇంటికి వెళ్లానుకుంది. అయితే అంకమ్మ పాతబస్టాండ్ వద్ద పూలమొక్కలు విక్రయించే దుకా ణం వద్ద కు వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి ఆమె చేతికి రక్తం కారుతుండడాన్ని గమనించి ఆమెకు చెప్పాడు. అప్పుడు అంకమ్మ ఆమె చేతిలో నగదు భద్రపరచి ఉన్న సంచి కనిపించకపోవడంతో లబోదిబోమంటూ గగ్గోలు పెట్టింది. ఆమెకు కూడా తెలియకుండా పదునైన బ్లేడుతో సంచిని కోసి నగదు సంచిని దోచుకెళ్లినట్లుగా గుర్తించింది. బాధితురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రూ. 3.90 లక్షలు చోరీ జరిగినట్లు సమాచారం అందుకున్న సీఐ మల్లికార్జునరావు, ఎస్సై జీ వేణు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. పాతబస్టాండ్ వద్ద బాధితురాలు వెళ్లిన పలు ప్రదేశాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించినా ఆధారాలు దొరకలేదు. పట్టణంలోని దర్గావీధి ప్రాంతాల్లో ఆటోకు సంబంధించి సీసీ ఫుటేజీలను పోలీసులు రికార్డు చేసుకొని పరిశీలన చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో ఎస్పీబాలుకు చేదు అనుభవం
చెన్నై: సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో పర్యటనలో ఉన్నఆయనను గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. హూస్టన్‌లో ‘ఎస్పీబీ50’ టూర్లో ఉండగా తన బ్యాగ్‌ను దుండగులు ఎత్తుకు పోయారని తన ఫేస్బుక్ పోస్ట్‌లో ఆయన పేర్కొన్నారు. దుండగులు తీసుకెళ్లిన బ్యాగులో పాస్‌పోర్టులు, క్రెడిట్ కార్డులు, కొంత నగదు, పాటల స్క్రిప్టులు ఉన్నాయని తెలిపారు. అయితే, హూస్టన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం అధికారుల సాయంతో 24 గంటల్లోనే డూప్లికేట్ పాస్‌పోర్టును పొందినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన సియాటిల్, లాస్ఏంజెల్స్, అట్లాంటాల్లో పర్యటిస్తున్నారు. -
కారులో ఉంచిన బ్యాగు చోరీ
నారాయణ్‌ఖేడ్ : మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ పట్టణంలో శనివారం పట్టపగలు దొంగతనం జరిగింది. కారులో పెట్టిన హ్యాండ్‌బ్యాగ్‌ను గుర్తు తెలియని దుండగులు చాకచక్యంగా తస్కరించారు. బ్యాగులో 6 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 వేల నగదు, 2 సెల్ఫోన్లు ఉన్నాయని బాధితురాలు జ్యోతి తెలిపింది. మూడేళ్ల కుమారుడు హర్షిత్ ను హాస్పిటల్‌కు తీసుకువచ్చినపుడు ఈ సంఘటన జరిగింది. చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే వారు కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించినట్లు తెలిసింది. -
ఎయిర్‌పోర్టు చూసొద్దామని వెళితే..
శంషాబాద్: ఎయిర్‌పోర్టు చూడాలన్న ఆసక్తి వారికి చేదు అనుభవం మిగిల్చింది. పార్క్ చేసిన కారులో ఉన్న బ్యాగును చోరీ చేసిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఆదిలాబాద్ కు చెందిన మార్కండేయ కుటుంబసభ్యులతో టవేరా కారులో శ్రీశైలం యాత్రకు వెళ్లి సోమవారం రాత్రి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో ఎయిర్‌పోర్టు చూడడానికి వీరు బయలుదేరారు. రాత్రి 11 గంటల సమయంలో పార్కింగ్ ఏరియాలో కారును నిలిపివేసి ఎయిర్‌పోర్టు చూసి వచ్చారు. అప్పటికే గుర్తు తెలియని దుండగులు కారు అద్దాన్ని పగలగొట్టి అందులో ఉన్న బ్యాగును ఎత్తుకుపోయారు. బ్యాగులో పదివేల నగదు, రెండున్నర తులాల బంగారం, డెబిట్ కార్డుతో పాటు కొన్ని పత్రాలు కూడా ఉన్నాయని బాధితుడు తెలిపాడు. ఈ మేరకు విమానాశ్రయంలోని ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు