27న నారాయణఖేడ్‌కు జగన్ రాక | jagan arrival on 27th to narayana khed | Sakshi
Sakshi News home page

27న నారాయణఖేడ్‌కు జగన్ రాక

Published Thu, Apr 24 2014 11:56 PM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM

27న నారాయణఖేడ్‌కు జగన్ రాక - Sakshi

27న నారాయణఖేడ్‌కు జగన్ రాక

 నారాయణఖేడ్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న నారాయణఖేడ్‌కు విచ్చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  పట్టణంలో రోడ్‌షో, భారీ బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని  వైఎస్సార్‌సీపీ ఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి అప్పారావు షెట్కార్ తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. కాగా ఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి స్థలాన్ని చదును చేసే కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ నేతలు చేపడుతున్నారు. ఏర్పాట్లను నాయకులు మూఢ సురేష్ పటేల్, సుధాకర్, నరేశ్‌యాదవ్, సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.

 కార్యకర్తలు, అభిమానులు  తరలిరావాలి...
 ఇదిలా ఉండగా వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ జగన్‌మోహన్ వస్తున్న విషయాన్ని వెల్లడించారు. జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  ఖేడ్‌కు అధిక సంఖ్యలో తరలిరావాలని, సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  విలేకరుల సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మహమ్మద్ మొహియొద్దీన్, జహీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌రావు, ఖేడ్ అభ్యర్థి అప్పారావు షెట్కార్, సంగారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా యువజన నాయకులు శివశంకర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement