apparao setkar
-
27న నారాయణఖేడ్‌కు జగన్ రాక
నారాయణఖేడ్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న నారాయణఖేడ్‌కు విచ్చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో రోడ్‌షో, భారీ బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని వైఎస్సార్సీపీ ఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి అప్పారావు షెట్కార్ తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. కాగా ఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి స్థలాన్ని చదును చేసే కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ నేతలు చేపడుతున్నారు. ఏర్పాట్లను నాయకులు మూఢ సురేష్ పటేల్, సుధాకర్, నరేశ్‌యాదవ్, సత్యనారాయణ, తదితరులు ఉన్నారు. కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలి... ఇదిలా ఉండగా వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ వస్తున్న విషయాన్ని వెల్లడించారు. జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఖేడ్‌కు అధిక సంఖ్యలో తరలిరావాలని, సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మహమ్మద్ మొహియొద్దీన్, జహీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌రావు, ఖేడ్ అభ్యర్థి అప్పారావు షెట్కార్, సంగారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా యువజన నాయకులు శివశంకర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఖేడ్’.. ఫ్యాన్’ స్పీడ్
నారాయణఖేడ్, న్యూస్‌లైన్: నారాయణఖేడ్‌లో ‘ఫ్యాన్’ గాలి వీస్తోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి అప్పారావు షెట్కార్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందంజలో ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలే అండగా.. ప్రజా సమస్యలే ఎజెండా గా ప్రచారం చేపడుతున్నారు. కాగా ఈ నెల 21న షర్మిలమ్మ నిర్వహించిన రోడ్‌షోతో ఖేడ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకెళుతోంది. షర్మిల రోడ్‌షోతో కార్యకర్తల్లో, వైఎస్సార్ అభిమానుల్లో ఎనలేని ఉత్సాహం నింపగా.. ఇన్నాళ్లు తటస్థంగా ఉన్న వైఎస్. రాజశేఖరరెడ్డి అభిమానులు ఒక్కసారిగా అప్పారావు షెట్కార్‌కు తమ మద్దతు ఉంటుందనే సంకేతాలు పంపుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలు కంగుతినే పరిస్థితి కనిపిస్తోంది. షర్మిల రోడ్‌షోకు ఆయా గ్రామాల నుంచి భారీగా జనాలు రావడమే ఇందుకు నిదర్శనమని ఖేడ్ ప్రజలు పేర్కొంటున్నారు. ఖేడ్ నియోజకవర్గంలో ఐదేళ్లుగా ప్రతిపక్ష పాత్ర కరువైంది. ఇక కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఓ వర్గంలోని కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. నియోజకవర్గంలోని కంగ్టి, మనూరు, నారాయణఖేడ్‌లో అన్ని గ్రామాల్లో వైఎస్సార్ సీపీ క్యాడర్ పటిష్టంగా ఉండగా కల్హేర్, పెద్దశంకరంపేటల్లో రోజురోజుకూ ముమ్మరంగా చేరికలు జరుగుతున్నాయి. కాగా మైనారిటీ, దళిత, క్రిస్టియన్, లింగాయత్ నాయకులు అప్పారావ్ షెట్కార్తో సత్సంబంధాలు కలిగి ఉండడం వైఎస్సార్ సీపీ గెలుపునకు అనుకూలించే అంశాలుగా మారాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో కూడా భారీగా చేరికలు నిత్యం కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో కొత్తగా సుమారు 30 వేల మంది యువత ఓటుహక్కును పొందగా వారి ఓట్లు కూడా దాదాపుగా యువ నాయకత్వం వైపు ఉండే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీతోనే అభివృద్ధి సాధ్యం
మనూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీతోనే అభివృద్ధి సా ధ్యమని ఆ పార్టీ నారాయణఖేడ్ అసెంబ్లీ అభ్యర్థి అప్పారావు షెట్కార్ అన్నారు. ఆదివారం ఆయన మనూరు మండలం మోర్గిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి ఫలితంగానే ఆంధ్ర, కర్ణాటక సరిహద్దున మంజీర నదిపై వంతెన నిర్మాణం జరిగిందన్నారు. వంతెన అసంపూర్తిగా ఉండడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని మహా నేత హయాంలోనే వంతెన నిర్మాణం పూర్తయిందన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు వైఎస్ రూ.70 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలి పారు. రాజన్న ఉంటే అన్ని గ్రా మాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందేదన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలి పించాలని అప్పారావు షెట్కార్ అభ్యర్థించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం నిర్వహించే రోడ్‌షోకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీలో చేరికలు.. మనూరు మండలం మోర్గిలోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు అప్పారావు షెట్కార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. మోర్గి కి చెందిన ఇబ్రహీమ్, తుకారం, శిరోమణి, సంగప్ప, కల్లప్ప, శర్ణప్ప, ఏశ ప్ప, అబ్రహం, చంద్రమ్మ, పెంటమ్మ, కాంత మ్మ, బాలమ్మ, శాపూర్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు జగన్నాథ్ తన అనుచరులతో పార్టీలో చేరారు. పంచగామలో భారీగా.. నారాయణఖేడ్: మండలంలోని పంచగామ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పలువురు ఆదివారం రాత్రి వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ ఖేడ్ అసెంబ్లీ అభ్యర్థి అప్పారావు షెట్కార్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి స్వాగతించారు. పార్టీలో చేరిన వారిలో దేవిదాస్, డాని యల్, మానిక్యయ్య, సుకుమార్, విష్ణు, సురేశ్, నవీన్, ప్రభాకర్, జైలు, సుభాష్, బాబు, మల్లేశ్, నాగయ్య, ఏసయ్య, నర్సింలు, జాన్, లాజర్ ఉన్నారు. -
యువతతోనే అభివృద్ధి సాధ్యం
మనూరు, న్యూస్‌లైన్: యువతతోనే అభివృద్ధి సాధ్యమని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి అప్పారావు షెట్కార్ అన్నారు. మనూరు మండలం నాగల్గిద్దలో వివిధ పార్టీలకు చెందిన యువకులు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో యువత కీలకంగా మారిందన్నారు. మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్‌లో యువకులు విద్యావంతులుగా తయారుకావాల్సిన అవసరముందన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే అది కేవలం యువత చేతుల్లోనే ఉందని సూచించారు. యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమన్నారు. గత ఐదేళ్లలో నాగల్గిద్ద గ్రామం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని, ఇది ముమ్మాటికి పాలకుల నిర్లక్ష్యమేనని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. తనకు ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశమిస్తే గ్రామంతోపాటు నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా మొహియొద్దీన్ను, ఖేడ్ అసెంబ్లీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. పార్టీలోకి చేరిన వారిలో నరేశ్, భీందాస్, కృష్ణ, దిగంబర్‌రావు, రమేశ్, సంతోష్, దత్తు, సంగమేశ్వర్, ప్రకాశ్ తదితరులు చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నరేశ్ యాదవ్, అంబదాస్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
షర్మిల సభతో సత్తా చాటుతాం
నారాయణఖేడ్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఎన్నికల ప్రచారసభను విజయవంతం చేసి వైఎస్సార్ సీపీ సత్తాచాటుతామని వైఎస్సార్ సీపీ ఖేడ్ అభ్యర్థి అప్పారావ్ షెట్కార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న షర్మిల నారాయణఖేడ్‌కు రానున్నారని ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.హరికృష్ణ, ఇన్చార్జి సందీప్‌లతో కలిసి ఖేడ్‌లో షర్మిల నిర్వహించనున్న ప్రచార కార్యక్రమాలపై స్థానిక పార్టీ కార్యాలయంలో చర్చించారు. అనంతరం అప్పారావ్ షెట్కార్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాలతో పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన దివంగత నేత వైఎస్సార్ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారన్నారు. అందువల్లే జనమంతా ఇపుడు వైఎస్సార్ సీపీకి మద్దతు తెలుపుతున్నారనీ, ఇదే ప్రజామద్దతుతో తమ పార్టీ అభ్యర్థులంతా విజయం సాధించి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమంలో షర్మిలతో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు జనక్‌ప్రసాద్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మొహియొద్దీన్, జహీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ హాజరకానున్నారని అప్పారావ్ షెట్కార్ తెలిపారు. కార్యకర్తలు భారీగా తరలివచ్చి షర్మిల ప్రచార సభను విజయవంతం చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.హరికృష్ణ, ఇన్చార్జి సందీప్ మాట్లాడుతూ, షర్మిల ప్రచార కార్యక్రమాలు జిల్లాలో ఈనెల 21న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఖేడ్ పర్యటన అనంతరం షర్మిల జహీరాబాద్‌కు చేరుకుని అక్కడ ప్రచార సభల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నేతలు నరేశ్ యాదవ్, మల్లు పటేల్, విజయ్, దత్తు, ఫయాజ్, సురేష్, సత్యనారాయణ, ప్రవీణ్ ఉన్నారు. -
పేదల సంక్షేమమే ఏకైక లక్ష్యం
పెద్దశంకరంపేట, న్యూస్‌లైన్: పేదల సంక్షేమమే వైఎస్సార్ సీపీ ఏకైక లక్ష్యమని, ఇందుకు తమ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోనే నిదర్శనమని ఆ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మహ్మద్ మొహియొద్దీన్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి అప్పారావు షె ట్కార్ పేర్కొన్నారు. గురువారం వారు పెద్దశంకరంపేటలో ఇంటింటా ప్రచా రం నిర్వహించారు. అనంతరం స్థానిక భగత్‌సింగ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉ న్న సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు నేడు అమలు కాలేదన్నారు. రాజన్న మరణం తరువాత ఆ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే నాయకుడే కరువయ్యారని పేర్కొన్నారు. పథకాల అమలు సత్తా ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని వారు పేర్కొన్నారు. తమ పార్టీ రూపొందిం చిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోందని వారు తెలిపారు. 108, 104 వైద్య సేవలను మరింత మె రుగు పరచడానికి కొత్తగా 101, 102 సేవలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామ ని వైఎస్ జగన్ ప్రకటించారని ప్రజలకు వివరించారు. అలాగే రేషన్ కార్డులోని ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం చొప్పున, ఉచిత విద్యుత్, ఏడాదికి 12 సిలిండర్లు, ప్రతి సిలిండర్‌పై రూ. 100 సబ్సిడీ, వికలాంగులకు రూ. వెయ్యి, వృద్ధులకు రూ. 700 పింఛను, డ్వాక్రా రుణాల మాఫీ, అమ్మ ఒడి తదితర పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. స్థానికంగా ఉండే వారినే గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ స్వాతీసత్యనారాయణ పాల్గొన్నారు.