
ఫ్యూజు వేయబోయి...
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామ మాజీ సర్పంచ్, రైతు వొల్లాల లక్ష్మీనారాయణ(50) కరెంటుకాటుకు బలయ్యాడు. ట్రాన్స్‌ఫార్మర్‌పై ఫ్యూజ్‌వైర్ వేస్తుండగా, షాక్ తగిలి అక్కడే మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే... లక్ష్మీనారాయణకు పదెకరాల పొలం ఉంది. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి మోటార్ ఆన్ చేయబోగా, కాలేదు. పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా, ఫ్యూజ్ పోయి కనిపించింది. దీంతో లక్ష్మీనారాయణ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి ఫ్యూజ్‌వైరు వేస్తుండగా, షాక్ కొట్టి దానిపైనే ప్రాణాలు విడిచాడు.
- న్యూస్‌లై న్, ఇల్లంతకుంట