మద్యం మత్తులో ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టాడు.
గరిడేపల్లి: మద్యం మత్తులో ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం మంగాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
మంగళవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ట్రాక్టర్‌పై వస్తున్న లింగయ్య రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టడంతో... ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఉన్న స్తంభం కూలిపోయి హైటెన్షన్ విద్యుత్ తీగలు కిందపడ్డాయి. అదే సంమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు గ్రామస్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.