డ్రైవర్ అవసరంలేని ట్రాక్టర్ ఇది | Kubota Robot Tractor Details | Sakshi
Sakshi News home page

డ్రైవర్ అవసరంలేని ట్రాక్టర్ ఇది

Published Sun, Jan 5 2025 11:35 AM | Last Updated on Sun, Jan 5 2025 11:37 AM

Kubota Robot Tractor Details

చూడటానికి కొంచెం విచిత్రంగా కనిపించే ఈ వాహనం రోబో ట్రాక్టర్‌ (Robot Tractor). ఇది ఎలాంటి నేలనైనా నిమిషాల్లో ఇట్టే దున్నేస్తుంది. సమతలమైన నేలల మీదనే కాదు, ఎగుడు దిగుడు నేలల మీద కూడా సునాయాసంగా ప్రయాణిస్తుంది.

ఈ రోబో ట్రాక్టర్ నడపడానికి డ్రైవర్‌ కూడా అవసరం లేదు. జపానీస్‌ కంపెనీ ‘కుబోటా ట్రాక్టర్‌ కార్పొరేషన్‌’ (Kubota Tractor Corporation) ఇటీవల ఈ రోబో ట్రాక్టర్‌ను ‘కుబోటా ఆల్‌ టెరేన్‌ రోబో–కేఏటీఆర్‌’ పేరుతో రూపొందించింది. దీనికి అధునాతన సెన్సర్లు, శక్తిమంతమైన కెమెరా అమర్చడం వల్ల ఇది అవరోధాలను గుర్తించి, తన దిశను ఎంపిక చేసుకోగలదు.

ఇది డీజిల్‌తోను, బ్యాటరీతోను కూడా పనిచేయగలదు. ఈ ట్రాక్టర్‌ సునాయాసంగా 130 కిలోల బరువును కూడా మోసుకురాగలదు. చిన్న చిన్న పొలాల్లో వాడటానికి అనువుగా తీర్చిదిద్దిన ఈ ట్రాక్టర్‌కు సీఈఎస్‌-2024 (CES-2024) ప్రదర్శనలో సందర్శకుల ప్రశంసలు లభించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement