ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి రైతు ఆందోళన | farmer protest for transformer in siddipet district | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి రైతు ఆందోళన

Published Tue, Jan 3 2017 2:57 PM | Last Updated on Mon, Oct 1 2018 4:42 PM

farmer protest for transformer in siddipet district

సిద్ధిపేట జిల్లా: సిద్ధిపేట రూరల్‌ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో ఓ రైతు ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. గ్రామానికి చెందిన బొల్ల బుచ్చయ్యకు చెందిన పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ 15 రోజుల క్రితం చెడిపోయింది. ఈ సమస్య సదరు రైతు అధికారులకు ఎంత విన్నవించినా పరిష్కారం కాలేదు. దీంతో మంగళవారం కిరోసిన్‌ డబ్బా పట్టుకుని ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. తన సమస్య పరిష్కారం కాకపోతే ట్రాన్‌ఫార్మర్‌ మీదే కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంటానని బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని స్థానిక రైతులు పోలీసులకు, విద్యుత్‌ అధికారులకు తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement