రణరంగంగా శంభు సరిహద్దు.. రైతులపైకి టియర్‌ గ్యాస్‌ ప్రయోగం | Haryana Farmers Call For Delhi Chalo Protest March Today Live Updates And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

Farmers Delhi March Updates: రణరంగంగా మారిన శంభు సరిహద్దు.. రైతులపైకి టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

Published Sat, Dec 14 2024 10:43 AM | Last Updated on Sat, Dec 14 2024 2:53 PM

Haryana Farmers Call For Delhi march Today Updates

Live Updates..

👉పంజాబ్‌-హర్యానా సరిహద్దులు రణరంగంలా మారాయి. రైతు సంఘాల ఢిల్లీ చలో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శంభు సరిహద్దు వద్ద రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, రైతులు ముందుకు కదలడంతో పోలీసులు.. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. అలాగే, వాటర్‌ కెనాన్లను రైతులపైకి ప్రయోగించారు. టియర్‌ గ్యాస్‌ కారణంగా పలువురు రైతు సంఘాల నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రులకు తరలించారు. 

 

 👉పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి పలు డిమాండ్లతో రైతు సంఘాల ఢిల్లీ చలో కార్యక్రమంలో నేడు మళ్లీ కొనసాగనుంది. ఈ మేరకు రైతులు సన్నద్దమవుతున్నారు. ఢిల్లీ చేరుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

👉ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మందితో కూడిన రైతు జాతా ఈరోజు మధ్యాహ్నం మరోసారి ఢిల్లీకి బయలుదేరనుంది. ఇక, రైతుల కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

👉 మరోవైపు.. రైతుల మార్చ్‌ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అంబాలా జిల్లాలో తాత్కాలికంగా ఇంటర్నెట్‌ సేవలు, మొబైల్‌ ఎస్‌ఎంఎస్‌ సేవలను నిలిపివేసింది. నేటి నుంచి ఈనెల 17వ తేదీ వరకు ఈ సేవలను నిలిపి వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అత్యవసర సేవలు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. 

👉ఇదిలా ఉండగా.. రైతుల మార్చ్‌ నేపథ్యంలో రైతు సంఘాల నాయకుడు సర్వన్‌ సింగ్‌ పంధేర్‌ మాట్లాడుతూ.. రైతులు ఆందోళనలు చేపట్టి నేటి 307 రోజులు అవుతోంది. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని మేమందరం కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ క్రమంలోనే మార్చ్‌ తలపెట్టాం. దేశం మొత్తం రైతులకు అండగా నిలుస్తోంది. కానీ, ప్రధాని మోదీ మాత్రం మౌనం వహిస్తున్నారు’ అని కామెంట్స్‌ చేశారు.

ఇక, ఇప్పటికే రెండు సార్లు రైతులు ఢిల్లీ చలో కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో రైతులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ సందర్బంగా పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు గాయపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement