ట్రాన్స్‌కో.. జర దేఖో
ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా...?
ఇనుప చువ్వలు తేలిన కరెంట్ స్తంభాలు
ఆశాలపల్లి(సంగెం) : అధికారులు ప్రమాదాలను పసిగట్టడంలో విఫలమవుతున్నారు. సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఆశాలపల్లిలో కరెంట్ స్తంభం ఇనుప చువ్వలు తేలి సగం విరిగిపోయి ఎపుడు పడిపోతుందో నన్న భయం జంకుతోంది. గ్రామంలోని బొడ్రాయి వద్ద మాచర్ల కుమారస్వామి ఇంటివద్ద గల 11 కెవి విద్యుత్ స్తంభం సిమెంట్ ఊడిపోయి లోపల ఉన్న ఇనుప చువ్వలు తుప్పుపట్టిపోయూరుు. దానికే సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చారు.
వేసవిలో గాలి దుమారాలు అధికంగా వస్తున్నందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇటీవల మండలంలోని వంజరపల్లిలో వేలాడుతున్న 11 కేవి విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మహిళలు దుర్మణం పాలైన సంఘటనలో ఏఈ సహా నలుగురి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదం జరకుముందే శిథిలమైన స్తంభం స్థానంలో మరో స్తంభం ఏర్పాటు చేసి ప్రమాదాన్ని నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.