ఆదిలాబాద్ జిల్లా లో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోవడంతో హెల్పర్ తీవ్రంగా గాయపడ్డాడు
కథలాపూర్ : ఆదిలాబాద్ జిల్లా లో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోవడంతో హెల్పర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని కథలాపూర్ మండలంలో గురువారం జరిగింది. మండలంలోని చింతకుంట గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. ఆయిల్ మీద పడడంతో అక్కడున్న ప్రైవేటు హెల్పర్ వంతెన శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. అతణ్ణి వెంటనే కథలాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.