గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఏటీ అగ్రహారంలో పెద్ద ప్రమాదమే తప్పింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఏటీ అగ్రహారంలో ఓ చెట్లకొమ్మ విరిగి పడటంతో ఏడు విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి.
ఈ నేపథ్యంలో విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగలడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. దాంతో దగ్గరలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో పెద్ద ఎత్తునా మంటలు చెలరేగాయి. ఘటన స్థలికి దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది.
ఏటీ అగ్రహారంలో తప్పిన ప్రమాదం
Published Tue, Jun 28 2016 8:56 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM
Advertisement
Advertisement