గుర్తుతెలియని దుండగులు మంగళవారం రాత్రి రెండు ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్‌ను దొంగలించుకుపోయారు.
కడప(చిన్నమండెం): గుర్తుతెలియని దుండగులు మంగళవారం రాత్రి రెండు ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్‌ను దొంగలించుకుపోయారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా చిన్నమండెం మండలం కొత్తపల్లె గ్రామ పరిధిలో జరిగింది. స్థానిక నేరాలవంక పల్లెకు చెందిన రైతులు ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రభుత్వ అధికారులు స్పందించలేదు.
దీంతో రైతులంతా కలిసి సొంత డబ్బులతో ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేసుకున్నారు. వాటిని మంగళవారం గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి అందులో ఉండే కాపర్‌వైర్ ఎత్తుకెళ్లారు. బుధవారం విద్యుత్ వచ్చే సమయానికి మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతులు విషయం తెలిసి బోరుమన్నారు.