పట్టణంలోని రైతుపేట పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మంగళవారం ఓ పెద్ద ప్రమాదం తప్పింది. సేకరించిన సమాచారం ప్రకారం
ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న లారీ
Published Wed, Oct 16 2013 2:03 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
నందిగామ రూరల్, న్యూస్‌లైన్ :పట్టణంలోని రైతుపేట పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మంగళవారం ఓ పెద్ద ప్రమాదం తప్పింది. సేకరించిన సమాచారం ప్రకారం.. చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ జి.నూకరాజు పెట్రోల్ బంక్‌కు వచ్చాడు. పెట్రోల్ కొట్టించుకుని విజయవాడ వైపు బయలుదేరాడు. లారీ అదుపుతప్పి బం కు వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్ పక్కనే ఉన్న డ్రైయిన్‌లో పడింది.
ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్ నూకరాజుకు ఫిట్స్ రావడంతో లారీపై అదుపు కోల్పోయాడని, దీంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదే ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఈనెల ఏడో తేదీన విద్యుత్ షాక్‌కు గురై పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు క్లీనర్ బడేమియా అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ రోడ్డు వెంబడే ప్రమాదకర పరిస్థితుల్లో ఉండటంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement