రైతులకు ట్రాన్స్‌ఫార్మర్ పెట్టినా.. కనెక్షన్ ఇచ్చినా రూ.2వేలు నిర్బంధ వసూళ్లు
ప్రశ్నించలేకపోతున్న కరువు రైతులు
బి.కొత్తకోట: ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ఆపరేషన్స్ (డిస్కం) వ్యవసాయ రైతులనుంచి అధికారిక దోపీడీకి పాల్పడుతోంది. కరువు పరిస్థితులు, పంటలు పండకపోవడంతో తీవ్రంగా న ష్టాలు చవిచూస్తున్న రైతులకు డిస్కం అధికారులు తీసుకొన్న నిర్ణయం ఇబ్బందులకు గురిచేస్తోంది. తీసుకొవాల్సిన మొత్తం కంటే ముందుచూపు పేరుతో అధికారికంగా అన ధికార వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో 2.65లక్షల వ్యవసాయ కనె క్షన్లు పనిచేస్తున్నాయి. ఈ కనెక్షన్ల నుంచి ఒక్కొటీకి నెలకు రూ.30 చార్జీలను రైతులు చెల్లించాలి. అయితే దీనికి విరుద్ధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనధికార ఆదేశాలను అమలుచేస్తున్నారు. ఒక్కో రైతునుంచి ఏకకాలంలో ఒకే మొత్తంగా రూ.2వేలు వసూలు చేస్తున్నారు. రైతులు విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, అదనపు సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు వీటిని మంజూరు చేస్తున్నారు.
డిమాండ్ నోటీసులమేరకు రైతులు సొమ్మును చెల్లించారు. ప్రస్తుతం వీటిని ఇస్తున్న అధికారులు రైతులనుంచి నిర్బంధంగా రూ.2వేలు వసూలు చేస్తూ బిల్లులు ఇస్తున్నారు. ఇది ఎందుకంటే భవిష్యత్తులో చెల్లించాల్సిన బిల్లులకోసమని చెప్పుకొస్తున్నారు. ఇక రైతు నెలకు కేవలం రూ.30 చెల్లించాలి. దీనికోసం కనెక్షన్ కలిగివుండాలి. కొత్త కనెక్షన్ పొందిన రైతులకు కనెక్షన్ ఇచ్చేముందు, లేకపోతే ఇవ్వకముందే రూ.2వేలు వసూలు చేసుకుంటున్నారు. ఇది చెల్లించకుంటే కనెక్షన్, ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వరే మోనన్న ఆందోళనతో రైతులు విధిలేని పరిస్థితుల్లో చెల్లిస్తున్నారు. దీంతో 67నెలల బిల్లులను ఓకేసారి రైతులనుంచి వసూలు చేస్తున్నారు.
సర్వీసు నంబర్లు ఇవ్వకనే రూ.4వేలు
బి.కొత్తకోట మండలం నాయనబావికి చెందిన రైతు డీ.లోకనాథరెడ్డి రెండు వ్యవసాయబోర్లు వేశాడు. వీటికి వ్యవసాయ కనెక్షన్లకోసం 2014 జూన్2న 20హెచ్‌పీ సామర్థ్యానికి డిపాజిట్టు చెల్లించాడు. ఇంతవరకు కనెక్షన్లకు సర్వీసు నంబర్లు ఇవ్వలేదు. అయితే జనవరి 23న ట్రాన్స్‌ఫార్మర్ ఇచ్చారు. ఇది ఇవ్వాలంటే రూ.4వేల సర్వీసు చార్జీలు ముందుగానే చెల్లించాలన్న షరతు విధించడంతో విధిలేక చెల్లించి రశీదు పొందాడు. సర్వీసు నంబర్లు లేకున్నా చార్జీలైతే వసూలు చేసుకున్నారు.
కనెక్షన్ ఇవ్వకనే రూ.2వేలు
బి.కొత్తకోట మండలం కాయలవారిపల్లెకు చెందిన మహిళా రైతు టీ.అమరావతమ్మ రెండెకరాల పొలంలో వ్యవసాయకోసం బోరుచేయించింది. కనెక్షన్ కోసం 2014 ఏప్రిల్ 1న రూ.10,600 చెల్లించింది. అప్పటికే వున్న 15హెచ్‌పీ సామర్థ్యాన్ని 25 హెచ్‌పీ స్థాయికి పెంచాలి. అయితే ఈ ఏడాది జనవరి18న సామర్థ్యం పెంచుతూ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేశారు. దీన్ని ఏర్పాటు చేసేందుకు రూ.2వేలు కట్టించుకున్నారు. అప్పటివరకు సేద్యమే జరగలేదు. సర్వీసు చార్జీలు కట్టాల్సిన అవసరం కూడా లేదు. అయినప్పటికీ ముందుగానే 67 నెలల బిల్లులను వసూలు చేసుకున్నారు.
డిస్కం అధికారిక దోపిడీ!
Published Sat, Feb 21 2015 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement
Advertisement