Hostage takings
-
యుద్ధం ఆపేస్తేనే ఒప్పందం
జెరూసలేం: గాజా స్ట్రిప్‌లో యుద్ధం ముగిసే వరకు ఇజ్రాయెల్‌తో బందీల మార్పిడి ఒప్పందం ఉండదని హమాస్ స్పష్టం చేసింది. యుద్ధం ముగియకుండా, ఖైదీల మార్పిడి జరగదని హమాస్ తాత్కాలిక చీఫ్ ఖలీల్ అల్ హయా బుధవారం పేర్కొన్నారు. దురాక్రమణకు ముగింపు పలకకుండా బందీలను ఎందుకు వదిలేస్తామని ఆయన ప్రశ్నించారు. యుద్ధం మధ్యలో ఉండగా తమ వద్ద ఉన్న బలాన్ని మతి స్థిమితం లేని వ్యక్తి కూడా వదులుకోడని వ్యాఖ్యానించారు. సంప్రతింపులను పునరుద్ధరించడానికి కొన్ని దేశాలు, మధ్యవర్తులతో చర్చలు జరుగుతున్నాయని, తాము ఆ ప్రయత్నాలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యుద్ధం ఆపడానికి ఆక్రమించినవారు నిబద్ధతతో ఉన్నారా? లేదా అనేది ముఖ్యమని హయా చెప్పారు. చర్చలను బలహీనపరిచే వ్యక్తి నెతన్యాహు అని రుజువవుతోందన్నారు. మరోవైపు బేషరతుగా శాశ్వత కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా బుధవారం వీటో చేసింది. కాల్పుల విరమణలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను తక్షణమే విడుదల చేయాలని స్పష్టంగా కోరే తీర్మానానికి మాత్రమే అమెరికా మద్దతు ఇస్తుందని ఐరాసలో అమెరికా రాయబారి స్పష్టంచేశారు. ఒప్పందానికి ఇరుపక్షాలు సుముఖత చూపకపోతే మధ్యవర్తిత్వ ప్రయత్నాలను నిలిపివేస్తామని హమాస్, ఇజ్రాయెల్‌కు తెలియజేశామని కాల్పుల విరమణ మధ్యవర్తి అయిన ఖతార్ ప్రకటించింది. దోహాలోని హమాస్ రాజకీయ కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేయలేదని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ నవంబర్ 19న ప్రకటించారు. గాజా యుద్ధాన్ని ముగించడానికి మధ్యవర్తిత్వ ప్రయత్నాలను సులభతరం చేయడానికి హమాస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అల్ అన్సారీ చెప్పారు. అయితే హమాస్‌ను బహిష్కరించాలని ఖతార్‌ను అమెరికా కోరిందని, దోహా ఈ సందేశాన్ని హమాస్‌కు చేరవేసిందని వార్తలు వచ్చాయి. ఈజిప్టు ప్రతిపాదనను స్వాగతించిన హమాస్ గాజా స్ట్రిప్‌ను నడపడానికి అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రత్యర్థి ఫతా ఉద్యమంతో కలిసి ఒక పరిపాలనా కమిటీని ఏర్పాటు చేయాలని ఈజిప్టు చేసిన ప్రతిపాదనను హమాస్ స్వాగతించింది. యుద్ధం ముగిశాక గాజాను ఈ కమిటీ నడిపించి, సమస్యలను పరిష్కరిస్తుందని హయా చెప్పారు. అయితే ఒప్పందం ఇంకా ఖరారు కాలేదన్నారు. యుద్ధం తరువాత గాజాను పాలించడంలో హమాస్ పాత్రను ఇజ్రాయెల్ తిరస్కరించింది. -
సింగపూర్‌లో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్, క్యాండిడేట్స్ టోర్నీ విజేత దొమ్మరాజు గుకేశ్‌కు స్వదేశంలో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఆడే అవకాశం లభించలేదు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా), చాలెంజర్ గుకేశ్ మధ్య ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ ఆతిథ్య హక్కులు సింగపూర్‌కు లభించాయి. ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కుల కోసం అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్), తమిళనాడు ప్రభుత్వం, సింగపూర్ పోటీపడ్డాయి. బిడ్లను పరిశీలించాక ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు సింగపూర్‌కు కేటాయిస్తున్నట్లు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 వరకు గుకేశ్, డింగ్ లిరెన్ మధ్య 25 లక్షల డాలర్ల (రూ. 20 కోట్ల 85 లక్షలు) ప్రైజ్‌మనీతో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతుంది. ఇద్దరి మధ్య 14 రౌండ్లు నిర్వహిస్తారు. తొలుత 7.5 పాయింట్లు సంపాదించిన ప్లేయర్‌ను విశ్వవిజేతగా ప్రకటిస్తారు. 14 రౌండ్ల తర్వాత ఇద్దరూ సమంగా నిలిస్తే టైబ్రేక్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు క్లాసికల్ ఫార్మాట్లో భారత్ నుంచి విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఆనంద్ ఐదుసార్లు (2000, 2007, 2008, 2010, 2012) విశ్వవిజేతగా నిలిచాడు. -
డిస్కం అధికారిక దోపిడీ!
రైతులకు ట్రాన్స్ఫార్మర్ పెట్టినా.. కనెక్షన్ ఇచ్చినా రూ.2వేలు నిర్బంధ వసూళ్లు ప్రశ్నించలేకపోతున్న కరువు రైతులు బి.కొత్తకోట: ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ఆపరేషన్స్ (డిస్కం) వ్యవసాయ రైతులనుంచి అధికారిక దోపీడీకి పాల్పడుతోంది. కరువు పరిస్థితులు, పంటలు పండకపోవడంతో తీవ్రంగా న ష్టాలు చవిచూస్తున్న రైతులకు డిస్కం అధికారులు తీసుకొన్న నిర్ణయం ఇబ్బందులకు గురిచేస్తోంది. తీసుకొవాల్సిన మొత్తం కంటే ముందుచూపు పేరుతో అధికారికంగా అన ధికార వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో 2.65లక్షల వ్యవసాయ కనె క్షన్లు పనిచేస్తున్నాయి. ఈ కనెక్షన్ల నుంచి ఒక్కొటీకి నెలకు రూ.30 చార్జీలను రైతులు చెల్లించాలి. అయితే దీనికి విరుద్ధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనధికార ఆదేశాలను అమలుచేస్తున్నారు. ఒక్కో రైతునుంచి ఏకకాలంలో ఒకే మొత్తంగా రూ.2వేలు వసూలు చేస్తున్నారు. రైతులు విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, అదనపు సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు వీటిని మంజూరు చేస్తున్నారు. డిమాండ్ నోటీసులమేరకు రైతులు సొమ్మును చెల్లించారు. ప్రస్తుతం వీటిని ఇస్తున్న అధికారులు రైతులనుంచి నిర్బంధంగా రూ.2వేలు వసూలు చేస్తూ బిల్లులు ఇస్తున్నారు. ఇది ఎందుకంటే భవిష్యత్తులో చెల్లించాల్సిన బిల్లులకోసమని చెప్పుకొస్తున్నారు. ఇక రైతు నెలకు కేవలం రూ.30 చెల్లించాలి. దీనికోసం కనెక్షన్ కలిగివుండాలి. కొత్త కనెక్షన్ పొందిన రైతులకు కనెక్షన్ ఇచ్చేముందు, లేకపోతే ఇవ్వకముందే రూ.2వేలు వసూలు చేసుకుంటున్నారు. ఇది చెల్లించకుంటే కనెక్షన్, ట్రాన్స్ఫార్మర్ ఇవ్వరే మోనన్న ఆందోళనతో రైతులు విధిలేని పరిస్థితుల్లో చెల్లిస్తున్నారు. దీంతో 67నెలల బిల్లులను ఓకేసారి రైతులనుంచి వసూలు చేస్తున్నారు. సర్వీసు నంబర్లు ఇవ్వకనే రూ.4వేలు బి.కొత్తకోట మండలం నాయనబావికి చెందిన రైతు డీ.లోకనాథరెడ్డి రెండు వ్యవసాయబోర్లు వేశాడు. వీటికి వ్యవసాయ కనెక్షన్లకోసం 2014 జూన్2న 20హెచ్‌పీ సామర్థ్యానికి డిపాజిట్టు చెల్లించాడు. ఇంతవరకు కనెక్షన్లకు సర్వీసు నంబర్లు ఇవ్వలేదు. అయితే జనవరి 23న ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు. ఇది ఇవ్వాలంటే రూ.4వేల సర్వీసు చార్జీలు ముందుగానే చెల్లించాలన్న షరతు విధించడంతో విధిలేక చెల్లించి రశీదు పొందాడు. సర్వీసు నంబర్లు లేకున్నా చార్జీలైతే వసూలు చేసుకున్నారు. కనెక్షన్ ఇవ్వకనే రూ.2వేలు బి.కొత్తకోట మండలం కాయలవారిపల్లెకు చెందిన మహిళా రైతు టీ.అమరావతమ్మ రెండెకరాల పొలంలో వ్యవసాయకోసం బోరుచేయించింది. కనెక్షన్ కోసం 2014 ఏప్రిల్ 1న రూ.10,600 చెల్లించింది. అప్పటికే వున్న 15హెచ్‌పీ సామర్థ్యాన్ని 25 హెచ్‌పీ స్థాయికి పెంచాలి. అయితే ఈ ఏడాది జనవరి18న సామర్థ్యం పెంచుతూ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేశారు. దీన్ని ఏర్పాటు చేసేందుకు రూ.2వేలు కట్టించుకున్నారు. అప్పటివరకు సేద్యమే జరగలేదు. సర్వీసు చార్జీలు కట్టాల్సిన అవసరం కూడా లేదు. అయినప్పటికీ ముందుగానే 67 నెలల బిల్లులను వసూలు చేసుకున్నారు.