నల్గొండ జిల్లాలో విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్ కో ఏఈ ఏసీబీకి చిక్కాడు.
నల్గొండ : నల్గొండ జిల్లాలో విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్ కో ఏఈ ఏసీబీకి చిక్కాడు. వివరాలు... జిల్లాలోని నల్లచెలమాలకు చెందిన రైతు హనుమంతు గౌడ్ విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం చందంపేట ట్రాన్స్ కో ఏఈ సంతోష్ ని సంప్రదించాడు. కనెక్షన్ కోసం ఏఈ రైతును రూ.25 వేలు లంచం అడిగాడు. ముందుస్తుగా రైతు రూ.10 వేలు అందజేశాడు. అనంతరం ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఏఈ పై నిఘా వేసిన అధికారులు గురువారం రైతు నుంచి మిగిలిన రూ.15 వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చందంపేట)