రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏడీఈ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు.
ఆదిలాబాద్ : రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏడీఈ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. కుబీర్‌మండలంలోని నిగ్వ గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాన్స్‌ఫార్మర్ రిపేరు చేయాల్సిందిగా భైంసా విద్యుత్ శాఖ ఏడీఈ ప్రేమ్‌కుమార్‌కి దరఖాస్తు చేశాడు. అందుకు ఏడీఈ 15 వేలు డిమాండ్ చేయగా, 10వేలు ఇస్తానంటూ రైతు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రైతు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశారు. ఏసీబీ అధికారులు వలపన్ని బుధవారం ఉదయం ఏడీ ప్రేమ్ కుమార్‌ను పట్టుకున్నారు. ఏడీ నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఏడీఈ ని అదుపులోకి తీసుకున్నారు.
(భైంసా)