transco ADE
-
ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ శాఖ ఏడీఈ
ఆదిలాబాద్ : రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏడీఈ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. కుబీర్మండలంలోని నిగ్వ గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాన్స్ఫార్మర్ రిపేరు చేయాల్సిందిగా భైంసా విద్యుత్ శాఖ ఏడీఈ ప్రేమ్కుమార్కి దరఖాస్తు చేశాడు. అందుకు ఏడీఈ 15 వేలు డిమాండ్ చేయగా, 10వేలు ఇస్తానంటూ రైతు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రైతు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశారు. ఏసీబీ అధికారులు వలపన్ని బుధవారం ఉదయం ఏడీ ప్రేమ్ కుమార్ను పట్టుకున్నారు. ఏడీ నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఏడీఈ ని అదుపులోకి తీసుకున్నారు. (భైంసా) -
ట్రాన్స్కో ఏడీఈ ఇంటిపై ఏసీబీ దాడి
హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. తెలంగాణ ఏడీఈ శ్యామ్సుందర్ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. సైదాబాద్ సరస్వతి నగర్లోని ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడినట్లు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు శ్యామ్సుందర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏసీబీ ఈ దాడులు చేసింది. ఏడీఈ సుమారు రూ.20 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్యాంసుందర్ ఆస్తుల వివరాలు సైదాబాద్, సరస్వతి నగర్లో భవనం, కూకట్పల్లి ప్రాంతంలో 2 భవనాలు, నేరెడ్మెట్లో ఫ్లాట్, బోడుప్పల్, కొంపల్లి, కురుమెల్లలో ఫ్లాట్లు, మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు ప్రాంతంలో 2ఎకరాల భూమి నడిగామలో 36 గుంటల స్థలం 7.50 లక్షల ఎల్ఐసీ పాలసీలకు సంబంధించిన పత్రాలను ట్రాన్స్కో ఏడీఈ శ్యాంసుందర్ నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ట్రాన్స్కో ఏడీఈ ఇంటిపై ఏసీబీ దాడి
-
ఏసీబీకి దొరికిన విద్యుత్ ఏడీఈ
మహబూబ్ నగర్ : ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట విద్యుత్తు ఏడీఈ కామేశ్వర్రావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రాందాస్తేజ కథనం ప్రకారం..పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన ఆవుల శ్రీశైలం 2012లో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీ చెల్లించాడు. ట్రాన్స్ఫార్మర్ మంజూరు కాలేదు. అయితే, సదరు డీడీ తాలూకు రసీదు ఎక్కడో పోయింది. కొన్నాళ్ల క్రితం ట్రాన్స్ఫార్మర్ కోసం శ్రీశైలం కొత్తకోటలో ఏడీఈ కామేశ్వర్రావును కలిశాడు. రూ.30వేలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేస్తానని పట్టుబట్టాడు. ఈ క్రమంలో ఇటీవల రూ.10వేలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఏడీఈ పై నిఘా వేశారు. బుధవారం కొత్తకోటలో రైతు నుంచి రూ.6 వేలు తీసుకుంటుండగా కామేశ్వర్రావును అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ సిబ్బంది రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. (కొత్తకోట)