ట్రాన్స్కో ఏడీఈ ఇంటిపై ఏసీబీ దాడి
హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. తెలంగాణ ఏడీఈ శ్యామ్సుందర్ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. సైదాబాద్ సరస్వతి నగర్లోని ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడినట్లు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు శ్యామ్సుందర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏసీబీ ఈ దాడులు చేసింది. ఏడీఈ సుమారు రూ.20 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్యాంసుందర్ ఆస్తుల వివరాలు
సైదాబాద్, సరస్వతి నగర్‌లో భవనం,
కూకట్‌పల్లి ప్రాంతంలో 2 భవనాలు,
నేరెడ్‌మెట్‌లో ఫ్లాట్,
బోడుప్పల్, కొంపల్లి, కురుమెల్లలో ఫ్లాట్లు,
మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూలు ప్రాంతంలో 2ఎకరాల భూమి
నడిగామలో 36 గుంటల స్థలం
7.50 లక్షల ఎల్‌ఐసీ పాలసీలకు సంబంధించిన పత్రాలను
ట్రాన్స్‌కో ఏడీఈ శ్యాంసుందర్ నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.