Shyam Sunder
-
పథకాలతో కేంద్రం లాలన
అభిప్రాయం ఆరుగాలం కష్టపడి పని చేసే రంగం భారతదేశంలో ఏదైనా ఉందంటే వ్యవసాయరంగమేనని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే వారి కష్టానికి తగిన ఫలితం దక్కుతుందా అంటే గ్యారంటీ లేని రంగం ఇదే. దాదాపు 60 ఏళ్లకుపైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పాలకుల నిర్వాకం నిర్లక్ష్యమే దీనికి కారణం. దేశంలో ఏ వస్తువును తయారు చేసే ఉత్పత్తిదారైనా తాను తయారు చేసిన వస్తువుకు సరైన ధర నిర్ణయించే అధికారం కలిగి ఉన్నాడు. కానీ రైతుకు మాత్రం తాను పండిచే పంటకు ధర నిర్ణయించే అధికారం లేదు. దీంతోనే రైతులు దళారీ వ్యవస్థలో చిక్కుకుని తీవ్రంగా నష్ట పోతున్నారు. ఈ దుర్భరపరిస్థితులను దృష్టిలో పెట్టుకునే నరేంద్రమోదీ ప్రభుత్వం రైతుల కష్టాలు తీర్చే దిశలో కొన్ని అడు గులు వేసింది. కేంద్రప్రభుత్వం చేపట్టిన పలు పథకాల్లో ప్రధాన మంత్రి కృషి సంచయ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, భూసార పరీక్ష కార్డులు, రాష్ట్రీయ గోకుల్ మిషన్, అగ్రి ఉడాన్ 2017 వంటివి కీలకమైనవి. ఇటీవల14 రకాల పంటలకు కేంద్రం ఇబ్బడి ముబ్బడిగా మద్దతు ధర ప్రకటించింది కూడా. వ్యవసాయానికి యోగ్యమైన భూములన్నిం టికీ సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రతి చేనుకూ నీరు నినాదంతో కరువు నివారణ లక్ష్యంతో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ పథకమే క్రిషి సంచన యోజన. దీన్ని మోదీ ప్రభుత్వం 2015 జూలైలో ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలిదశలో 23 ప్రాజెక్టులు చేపట్టి మార్చి 2017లోగా పూర్తి చేయాలని సంకల్పించింది. తర్వాతి దశలో 2018 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా మరో 31 ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణ యించి పనులు చేపట్టింది. ఈ మొత్తం 99 ప్రాజె క్టులను పూర్తి చేసి 76 లక్షల హెక్టార్లకు సాగునీరం దించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం అయిదేళ్లలో (2015–16 నుంచి 2019–20) 50 వేల కోట్ల రూపాయల దీర్ఘ కాలిక ధనసహాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. రైతులు చెమటోడ్చి పండించిన పంట మార్కెట్లో గిట్టుబాటు ధరకు అమ్ముకునేదాకా నమ్మకం లేని దుస్థితి. అతివృష్టి లేదా అనావృష్టి కారణంగా పంట చేనుల్లోనే రైతు కళ్లముందే పంట నాశనం కావటంతో, ఆ బాధను తట్టుకోలేక.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ దుస్థితిని నివారించేందుకు మోదీ ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన్ను ప్రవేశపెట్టింది. బీమా మొత్తానికి, ఉత్పత్తి వ్యయానికీ మధ్య తేడాను తగ్గించడం దీని ప్రత్యేకత. ఇందు కోసం రైతులు ఖరీఫ్ పంటల బీమా ప్రీమియంలో కేవలం రెండు శాతం, రబీ పంటలకు 1.5 శాతం, ఉద్యాన, వాణిజ్య పంటలకు 5 శాతం చెల్లిస్తే సరి పోతుంది.ప్రీమియంలో మిగతా భాగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. అంటే కేంద్రం భారీ సబ్సిడీని రైతులకు అందిస్తున్నట్లు లెక్క. ఇది ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో అమలవుతోంది.వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని గుర్తిం చిన కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇబ్బడిముబ్బడిగా పెంచింది. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం పెంచని విధంగా అత్యధికంగా వరికి క్వింటాలుకు రూ. 200 చొప్పున పెంచగా, జొన్నకు 725, పత్తికి 1,130, వలిసెలకు 1,827, పొద్దుతిరుగుడుకు 1,288, పెసర్లకు 1,400, రాగు లకు 997 రూపాయలుగా పెంచింది. సజ్జ, మొక్క జొన్న, కంది, మినుములు, సోయాబీన్స్, నువ్వులు తదితర పంటలకు కనీస మద్దతు ధరను మోదీ ప్రభుత్వం భారీగా పెంచి రైతులకు న్యాయం చేయ సంకల్పించింది. కేంద్రం మరో బృహత్తరమైన పథకా నికి శ్రీకారం చుట్టింది. దేశంలో కూలీలు దొరకని పరి స్థితులను నివారించేందుకు వ్యవసాయ రంగాన్ని యాంత్రీకరించాలని భావించింది. రైతులకు భారీ సబ్సిడీపై ట్రాక్టర్లను, వరినాటు యంత్రాలను అందించాలని నిర్ణయించింది. రైతులకు 50 శాతం సబ్సిడీపై వరినాటు యంత్రాలను, మిగిలిన 50 శాతం బ్యాంకు రుణంగా అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం సబ్సిడీపై ఈ యంత్రాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.స్వాతంత్య్రానంతరం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో కుదేలైన వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం గత నాలుగేళ్లుగా చేపట్టిన వివిధ రకాల పథకాలతో కొంత భరోసా పెరిగింది. కేంద్రం చిత్తశుద్ధితో చేపడుతున్న ఈ పథకాల ద్వారా భవిష్యత్తులో రైతు ఆత్మహత్యలు లేని, రైతే రాజుగా మారే భవ్య భారతాన్ని మనం దరం చూడాలని ఆశిద్దాం. శ్యామ్ సుందర్ వరయోగి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, ఫౌండర్ – మేనేజింగ్ ట్రస్టీ, రాఘవ్స్ ఫౌండేషన్, హైదరాబాద్ ఫోన్ నెంబర్: 98669 66904 -
ట్రాన్స్‌కో ఏడీఈ ఇంటిపై ఏసీబీ దాడి
హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. తెలంగాణ ఏడీఈ శ్యామ్‌సుందర్ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. సైదాబాద్ సరస్వతి నగర్‌లోని ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడినట్లు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు శ్యామ్‌సుందర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏసీబీ ఈ దాడులు చేసింది. ఏడీఈ సుమారు రూ.20 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్యాంసుందర్ ఆస్తుల వివరాలు సైదాబాద్, సరస్వతి నగర్లో భవనం, కూకట్పల్లి ప్రాంతంలో 2 భవనాలు, నేరెడ్‌మెట్‌లో ఫ్లాట్, బోడుప్పల్, కొంపల్లి, కురుమెల్లలో ఫ్లాట్లు, మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూలు ప్రాంతంలో 2ఎకరాల భూమి నడిగామలో 36 గుంటల స్థలం 7.50 లక్షల ఎల్ఐసీ పాలసీలకు సంబంధించిన పత్రాలను ట్రాన్స్‌కో ఏడీఈ శ్యాంసుందర్ నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ట్రాన్స్‌కో ఏడీఈ ఇంటిపై ఏసీబీ దాడి
-
దోనికి వారెంట్!
సాక్షి, అనంతపురం: భారత క్రికెట్ కెప్టెన్‌ధోనికి అనంతపురం జిల్లా షెడ్యూలు కులాలు, తెగల ప్రత్యేక న్యాయస్థానం బెయిలబుల్ వారెంట్లు(బీడబ్ల్యూ) జారీ చేసింది. జులై 16లోగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ప్రముఖ ఆంగ్ల మాసపత్రిక ‘బిజినెస్ టుడే’ 2013, ఏప్రిల్ సంచిక కవరు పేజీపై మహావిష్ణువు ఆకారంలోని ధోని చిత్రాన్ని ముద్రించింది. ఆయుధాలు ఉండే స్థానంలో ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఉత్పత్తులను చూపడం, వాటిలో ఒక చేతిలో పాదరక్షలు పట్టుకున్నట్లు చూపడం వివాదానికి తెర లేపింది. దీనిపై అనంతపురానికి చెందిన ఎర్రగుంట్ల శ్యామసుందర్ గత ఏడాది జూన్ మూడున కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు.. ఫిర్యాదుదారుడు హాజరు కానందున గత ఏడాది నవంబరులో కేసు కొట్టివేసింది. దానిపై శ్యామసుందర్ జిల్లా సెషన్సు కోర్టును ఆశ్రయించారు. ప్రతివాదులైన మహేంద్రసింగ్ ధోనికి, బిజినెస్ టుడే సంపాదకుడు చైతన్య కాల్బాగ్‌కుకోర్టు సమన్లు జారీ చేసింది. చైతన్యాల్ కాల్బాగ్ తరఫున న్యాయవాది యజ్ఞదత్తా (హైదరాబాద్) కోర్టుకు హాజరయ్యారు. అయితే ధోని తరఫున ఎవరూ హాజరు కాలేదు. దాంతో నోటీసులు స్వీకరించని ధోని తిరస్కరణ వైఖరికి కారణాలు తెలపాలంటూ న్యాయమూర్తి విజయకుమార్ మంగళవారం బెయిలబుల్ వారంట్లు జారీ చేశారు. -
నీటి నిల్వకు ‘కడెం’ సన్నద్ధం
కడెం, న్యూస్‌లైన్ : వర్షాకాలంలో నీటి నిల్వ కోసం కడెం ప్రాజెక్టు సిద్ధమవుతోంది. నీటి నిల్వతోపాటు జలాశయంలోకి అదనంగా నీళ్లొస్తే.. బయటకు పంపేందుకు వినియోగించే వరద గేట్లను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. నాలుగైదు రోజుల నుంచి ప్రాజెక్టు యంత్రాలు, గేట్ల సామర్థ్య పరిశీలనలో అధికారులు నిమగ్నమ య్యారు. వారం క్రితం ఎస్సారెస్పీ ఎస్ఈ శ్యాంసుందర్, ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్లు కలిసి కడెం ప్రాజెక్టు గేట్లను పరిశీలించిన విషయం తెలిసిందే. గేట్లను పెకైత్తి వాటి పనితీరు, సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యుత్ సరఫరా లేని సమయంలో వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన 100 కేవీ సామర్థ్యం గల జనరేటర్ పనితీరును తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఖరీఫ్ సీజన్లో సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాలుగైదు రోజులుగా ప్రాజెక్టు వరదగేట్ల గదుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. వరద గేట్లను పైకి లేపేందుకు ఉపయోగించే గేరు బాక్సులు, యంత్రాలు, వైర్ రోప్‌లు తదితర యంత్రాలకు గ్రీసింగు పూస్తున్నారు. దీని తర్వాత కాడీ కంపౌండ్, ఆయిలింగు వంటి పనులు చేపడతారు. ప్రాజెక్ట్‌కు ఉన్న 18 గేట్లకు ఈ పనులు చేస్తున్నారు. ప్రాజెక్టు డీఈ నూరుద్దీన్, జేఈ నరేందర్ పనులను పర్యవేక్షిస్తున్నారు. వరదగేట్లపై ఉన్న వీధిదీపాల మరమ్మతు కొనసాగుతోంది. రాత్రివేళ వరదగేట్లు ఎత్తే సమయంలో అవసరమైన వెలుతురు కోసం భారీ సామర్థ్యం గల లైట్లను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, కనిష్ట స్థాయి నీటిమట్టం 675 అడుగులు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 7 టీఎంసీలు. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 678 అడుగుల నీటిమట్టం ఉంది.