Telangana: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పలువురు అధికారులు | ACB Arrest HZB RTC Depo Manager Nalgonda Drug Inspector For Taking bribe | Sakshi
Sakshi News home page

హోటల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హుజురాబాద్‌ ఆర్టీసీ మేనేజర్‌

Published Mon, Apr 15 2024 4:39 PM | Last Updated on Mon, Apr 15 2024 5:21 PM

 ACB Arrest HZB RTC Depo Manager Nalgonda Drug Inspector For Taking bribe - Sakshi

సాక్షి, హన్మకొండ/నల్లగొండ జిల్లా: లంచం తీసుకొని అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటుతున్నారు. తాజాగా పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు అడ్డంగా దొరికిపోయారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ హోటల్లో  లంచం తీసుకుంటూ హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఏసీబీకి చిక్కారు.

హుజురాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని చార్జిమెమో అందించారు. అయితే శాఖా పరమైన కేసు కొట్టివేయడం కోసం డిపో మేనేజర్ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు గతంలోనే రూ. 10,000 అందించగ.. మంగళవారం మరో రూ. 20000 రూపాయలు లంచం ఇస్తున్న క్రమంలో ఏసీబీ ఆయన్ను అరెస్ట్‌ చేసింది. 

అదే విధంగా.. రూ.18 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమశేఖర్‌ ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు సోమశేఖర్‌ లంచం డిమాండ్‌ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆధ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్‌లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement