drug inspector
-
ఏసీబీ వలలో డ్రగ్ ఇన్స్పెక్టర్
నల్లగొండ టౌన్: నల్లగొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఊరెల్లి సోమేశ్వర్ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. ఏసీబీ డీఎస్పీ జగదీష్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలోని నూకల వెంకట్‌రెడ్డి చారిటబుల్ ఆస్పత్రిలో ఫార్మసీ ఏర్పాటు లైసెన్స్ కోసం చిట్టెపు సైదిరెడ్డి అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. లైసెన్స్ ఇవ్వడానికి డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమేశ్వర్ రూ.20వేలు లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు సోమవారం నల్లగొండలోని డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రూ.18వేలు డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఇవ్వడానికి సైదిరెడ్డి వెళ్లాడు. డబ్బులను తన బ్యాగులో పెట్టాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ సూచించడంతో రూ.18 వేలను బ్యాగులో పెట్టగానే అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు సోమేశ్వర్‌ను పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని సోమేశ్వర్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్లారు. సీఐలు వెంకట్రావు, రామారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
Telangana: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పలువురు అధికారులు
సాక్షి, హన్మకొండ/నల్లగొండ జిల్లా: లంచం తీసుకొని అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుతున్నారు. తాజాగా పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు అడ్డంగా దొరికిపోయారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ హోటల్లో లంచం తీసుకుంటూ హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఏసీబీకి చిక్కారు. హుజురాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని చార్జిమెమో అందించారు. అయితే శాఖా పరమైన కేసు కొట్టివేయడం కోసం డిపో మేనేజర్ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు గతంలోనే రూ. 10,000 అందించగ.. మంగళవారం మరో రూ. 20000 రూపాయలు లంచం ఇస్తున్న క్రమంలో ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది. అదే విధంగా.. రూ.18 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు సోమశేఖర్ లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆధ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్‌లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం -
Korutla: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
కోరుట్ల: నాలుగేళ్లలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది కోరుట్లకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు బెజ్జారపు వేణు–మాధవిల కూతురు మౌనిక. ఆమె 2013లో ఎం.ఫార్మసీలో గోల్డ్‌మెడల్ సాధించింది. మౌనిక వివాహం సాఫ్ట్వేర్ ఇంజినీర్ శేఖర్‌తో జరిగింది. అనంతరం మళ్లీ చదువుపై దృష్టిపె ట్టి, 2019లో వీఆర్వో ఉద్యోగం సాధించింది. ఆ జాబ్ చేసూ్తనే అదే ఏడాది ఫార్మసిస్ట్ పోస్టుకు ఎంపికైంది. ప్రస్తుతం హై దరాబాద్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా పని చేస్తోంది. 2022 డిసెంబర్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా దరఖాస్తు చేసుకుంది. 6 నెలల కష్టపడి చదివి, పరీక్ష రాయగా శుక్రవారం రాత్రి ఫలితాలు వెలువడ్డాయి. ఆమె రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. తన భర్త శేఖర్ ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఉద్యోగాలు సాధించానని తెలిపింది. -
భార్యకు విడాకులిస్తానని మహిళా అధికారితో చెట్టాపట్టాల్.. చివరకు..
వారిద్దరిదీ ఒకే డిపార్ట్మెంట్.. ఒకే కులం. ఆ యువతితో మాటలుకలిపాడు. అధికారి మనవాడే కదా అని ఆమె కూడా పరిచయం పెంచుకుంది. అదే అదునుగా చూసి ఆ అధికారి పెళ్లయిన విషయాన్ని దాచి మోసం చేశాడు. దీంతో తనకు జరిగన అన్యాయం మరొకరికి జరగకూడదని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళ్తే.. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో అబిద్ అలీ అనే వ్యక్తి డ్రగ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. అదే సమయంలో డిపార్ట్మెంట్లో ప్రకాశం జిల్లాలో పనిచేసే మహిళా అధికారికి దగ్గరయ్యాడు. పెళ్లయిన విషయం కూడా చెప్పకుండా ఆ సమయంలో ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. విషయం తెలిసి మహిళా అధికారి నిలదీయడంతో.. తన భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానని మాటాచ్చి తర్వాత ముఖం చాటేశాడు. అయితే ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆమెను వివాహం చేసుకోకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు పిలిచి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా తన ప్రవర్తనలో మార్పులేకపోవడంతో బాధిత మహిళ తనతో గడిపిన ఫోటోలను, వీడియోలను బయటపెట్టింది. వీటిపై స్పందించిన అబిద్ అలీ ఆ మహిళా అధికారి తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలిపారు. చదవండి: (భార్య వేధింపులు తట్టుకోలేక.. నవ వరుడు ఆత్మహత్య!) -
‘ఫార్మా’లిటీస్ దందా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొందరు ఔషధ నియంత్రణాధికారుల (డ్రగ్ ఇన్స్పెక్టర్ల) దందా జోరుగా కొనసాగుతోంది. మందుల దుకాణాల్లో ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఔషధ దుకాణాలకు వెళ్లారంటే చాలు లోపాలను సరిచేయాల్సింది పోయి, వాటిని అడ్డంపెట్టుకొని అడ్డంగా తినేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇదే అదనుగా కొన్ని ఔషధ దుకాణ దారులు కూడా నాసిరకం మందులు, అనుమతిలేని విక్ర యాలు, ప్రిస్కిప్షన్ లేకుండానే మందుల అమ్మకాలు చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నియంత్రణ గాలికి.. దేశంలోనే ఫార్మా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉంది. పలు దేశాలకు ఇక్కడి నుంచే మందులు ఎగుమతి అవుతున్నాయి. ముడిసరుకును ఉత్పత్తి చేసే ఔషధ సంస్థలు సైతం రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. అటు ఉత్పత్తి, ఇటు విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలను డ్రగ్ ఇన్స్పెక్టర్లే చూడాలి. కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు లంచాలు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఔషధ నియంత్రణ గాల్లో దీపం చందంగా మారింది. దేశంలో 3.16 శాతం, తెలంగాణలో 2.90 శాతం ఔషధాలు నాసిరకమని జాతీయ ఔషధ సర్వే తేల్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే మందుల్లో 12.57 శాతం ఔషధాలకు నాణ్యతా ప్రమాణాలు కొరవడినట్లు వెల్లడించింది. వేధిస్తున్న అధికారుల కొరత... రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 36 వేల మందుల దుకాణాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి 100 మందుల దుకాణాలకు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. అంటే రాష్ట్రంలో దాదాపు 360 మంది అవసరం. మరోవైపు రాష్ట్రంలోని 560 ఔషధ ఉత్పత్తి సంస్థల తనిఖీకి మరో 25 మంది అధికారులు కావాలి. ఇలా మొత్తంగా 385 మంది నియంత్రణాధికారుల అవసరం ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో మంజూరైన డ్రగ్ ఇన్స్పెక్టర్ల పోస్టులు 71 మంది మాత్రమే. ఇందులోనూ 18 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అంటే 53 మందే ఉన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ల చేతుల్లో ఎక్కువ మందుల దుకాణాలు ఉండటంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కానరాని నిబంధనల అమలు... వాస్తవానికి ఉత్పత్తి సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలపై అధికారులు తనిఖీలు చేయాలి. ఎప్పటికప్పుడు గుర్తింపు పొందిన లేబరేటరీల్లో వాటిని పరీక్షించాలి. ఫార్మసిస్టులకూ మందులను నిల్వ చేయడంపై శిక్షణ ఇవ్వాలి. అలాగే ఫార్మసిస్టుల సమక్షంలోనే మందులు విక్రయించాలి. కానీ రాష్ట్రంలో 70 శాతం మందుల దుకాణాల్లో ఫార్మసిస్టులు లేరని ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. అలాగే డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా షెడ్యూల్ హెచ్, హెచ్1 మందులను అమ్మడానికి వీలు లేదు. ఆ మేరకు రికార్డులు కూడా నిర్వహించాలి. బిల్లుల నిర్వహణ ఉండాలి. గడువు ముగిసిన మందులను షాపుల్లో ఉంచరాదు. ఔషధ కంపెనీల ప్రతినిధులు ఇచ్చే శాంపిల్ మందులు, ప్రభుత్వాసుపత్రుల్లో సరఫరా చేసే ఔషధాలను అమ్మకూడదు. కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ల దందా, వారి కొరత కారణంగా చాలా ఔషధ దుకాణాల్లో ఆ నిబంధనలు అమలు కావడంలేదు. బదిలీలు బంద్! ఒక్క హైదరాబాద్ నగరంలోనే 15 వేలకుపైగా మందుల దుకాణాలు ఉండగా ఇక్కడ 20 మందే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వారు జిల్లాలకు వెళ్లడానికి అయిష్టత చూపుతున్నారు. అలాగే జిల్లాల నుంచి బదిలీపై ఎవరైనా హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటున్నారు. వాస్తవానికి మూడేళ్లకోసారి బదిలీ జరగాల్సి ఉన్నా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఏడెనిమిదేళ్లుగా ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ నగరంలోనే పాతుకుపోయారు. -
డ్రగ్ ఇన్స్పెక్టర్ల దందా! డీల్ కుదిరితే ఒకే.. లేదంటే..
‘మరో సందర్భంలో ఆపరేషన్ జరుగుతుండగా ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ నేరుగా తలుపులు తోసుకుంటూ లోనికివెళ్లాడు. మీ ఫార్మసీలో ఫార్మసిస్ట్ లేడు. ఇది నిబంధనలకు విరుద్ధం. దీన్ని మూసేస్తాం. రేపు మీ ఆసుపత్రి గురించి మీడియాలో వస్తుంది’ అంటూ హెచ్చరికలు. ‘మీ ఫార్మసీలో ఎయిర్ కండిషన్ (ఏసీ) నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువగా పెట్టారు. మీ ఆసుపత్రిలో ఉన్న మందుల దుకాణాన్ని మూసేస్తున్నాం’ అంటూ పేషెంట్లను చెకప్ చేస్తున్న వైద్యునికి డ్రగ్ ఇన్స్పెక్టర్ బెదిరింపు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలను, ప్రైవేటు వైద్యులను బెదిరిస్తున్న తీరు పై విధంగా ఉంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ల ఆగడాలు రోజురో జుకూ శృతి మించుతున్నాయి. ఫార్మసీల్లో తనిఖీల పేరిట ఏకంగా వైద్యులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఆసుపత్రి పరువు పోతుందని భయపెట్టి యాజమన్యాలు, వైద్యుల వద్ద అందినకాడికి దండుకుంటున్నారు. కొన్నినెలలుగా అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న వీరి ఆగడాలకు అనేక ప్రైవేటు ఫార్మసీ, ఆసుపత్రి యాజమాన్యాలు బెంబేలెత్తిపోతున్నా యి. ఫార్మసీని మూసేస్తారన్న విషయం లోకానికి తెలిస్తే.. ఆసుపత్రి ప్రతిష్ట బజారున పడుతుందన్న సున్నితమైన అంశాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కో యాజమాన్యం నుంచి రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ ఆసుపత్రి నిర్వాహకుడు వాపోయాడు. ఇలా ఇప్పటిదాకా పదుల సంఖ్యలో ఆసుపత్రుల యజమానులను, వైద్యులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని సమాచారం. ఆకాశ రామన్న లెటర్ ఆయుధంగా..! విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముందుగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఫార్మసీ షాపులు అటాచ్గా ఉన్న ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ► ఉమ్మడి జిల్లాలో ఈ తరహాలో దాదాపు 600 వరకు ఆసుపత్రులు ఉన్నాయి. ► సదరు ఫార్మసీల్లో అనేక లోపాలు ఉన్నాయని, నిర్దేశిత ప్రమాణాల మేరకు మందులు లేవని, జనరిక్ మందులు విక్రయిస్తున్నారని, బ్రాండెడ్ పేరిట నకిలీ మెడిసిన్ అమ్ముతున్నారని, పీసీడీ మందులు, శాంపిల్ మందులు సేల్ చేస్తున్నారంటూ ఓ ఆకాశరామన్న ఉత్తరం వీరికి పోస్టు ద్వారా అందుతోంది. ► ఇది ఎవరు రాస్తున్నారో తెలియదు. ఇది మరునాడు వారి ఆఫీసుకు చేరగానే వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు. ► వస్తూనే ఫార్మసీలోని లోపాలను ఎత్తిచూపుతారు. ఆ తరువాత దాని యజమానిని పిలిపించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలి. ► కానీ.. వీరు ఇక్కడే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నా రు. నేరుగా ఆసుపత్రిలో రోగులను పరీక్షిస్తున్న వైద్యుల వద్దకు వెళ్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని పిలిపించాలని, ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని, మీడియాలో వేయిస్తామంటూ నానా యాగీ చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి యా జమాన్యం వారి లోపాలు బయటపడకుండా అడిగినకాడికి ఇచ్చి వారిని బయటికి పంపిస్తున్నారు. ఐఎంఏ జోక్యంతో దిగివచ్చిన వైనం.. ఇటీవల అన్ని అనుమతులు, నిబంధనలు పాటిస్తున్న దాదాపు 15 ఆసుపత్రుల్లోనూ ఇదే విధంగా డబ్బులు వసూలు చేయడం, బెదిరింపులకు దిగడంతో వైద్యులు తీవ్రంగా పరిగణించారు. ఈ విషయాన్ని నేరుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దృష్టికి తీసుకెళ్లారు. ఫార్మసీలు, ఆసుపత్రిలో లోపాలు ఉంటే దానికి ప్రైవేటు వైద్యులపై బెదిరింపులకు దిగడం, డబ్బులు కావాలని వేధించడం ఏంటని వాపోయారు. దీంతో ఐఎంఏ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ డా.బీఎన్‌రావు సదరు డ్రగ్ ఇన్స్పెక్టర్లను నిలదీశారు. ఫార్మసీలో లోపాలు ఉంటే.. వైద్యులపై ప్రతాపం చూపడం.. డబ్బులు వసూలు చేయడం ఏంటని అడిగారు. వైద్యులను బెదిరిస్తే సహించేది లేదు ఆసుపత్రుల్లో లోపాలు, ఫార్మసీల్లో లోపాలు ఉంటే నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలి. వీటిపై సందేహాలుంటే సదరు యజమానులతో మాట్లాడాలి. అంతే తప్ప రోగులను పరీక్షిస్తున్న వైద్యుల గదుల్లోకి రావడం, ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్లు జరుగుతుండగా చొచ్చుకుపోవడాన్ని ఐఎంఏ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదు. – డా.బీఎన్. రావు, ఐఎంఏ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం ఆసుపత్రి పేరు మీద ఉన్న సబ్సిడీ మీద వచ్చే మందులు ఇన్‌పేషెంట్లకే ఇవ్వాలి. వాళ్ల మెడికల్ షాపుల్లో విక్రయించకూడదు. ఇలాంటి అక్రమాలపై వైద్యులను ప్రశ్నించేందుకు డ్రగ్ ఇన్స్పెక్టర్లకు వీలుంది. నిలువ చేసేందుకు లైసెన్సు లేకుండా మందులు స్టోర్‌లో ఉంచడం నేరం. అలాంటి స్టోర్లను తనిఖీ చేసే అధికారం డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఉంది. ఇవి కాకుండా ఓపీలో వైద్యులను, ఆపరేషన్ థియేటర్లలో వైద్యులను ఇబ్బంది పెట్టడం తప్పు. అలాంటి ఫిర్యాదులు ఇంతవరకూ రాలేదు. వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – విజయ్‌గోపాల్, అస్టిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా -
లంచంగా బంగారం అడిగిన ‘లక్ష్మి’
సాక్షి, హైదరాబాద్: రక్తనిధి కేంద్రానికి అనుకూలంగా ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు లంచాన్ని డిమాండ్ చేసిన ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్(డీఐ)ను అవి నీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆ డీఐ నుంచి బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని ఆ అవినితీ అధికారిని కోర్టులో హాజరు పరిచారు. లింగంపల్లి లక్ష్మీరెడ్డి 15 ఏళ్లుగా బోయిన్‌పల్లిలో జనని వాలంటరీ పేరుతో రక్తనిధి కేంద్రాన్ని నిర్వహిస్తోంది. జంటనగరాల జోన్ కు డ్రగ్ ఇన్స్పెక్టర్గా ఉన్న బొమ్మిశెట్టి లక్ష్మీ ఇటీవల ఆ రక్తనిధి కేంద్రంలో తనిఖీలు చేపట్టింది. తనిఖీల సందర్భంగా రికార్డ్స్‌లో దాతల వివరాలు సరిగా లేకపోవడంతో పాటుగా రక్తం నిల్వ చేసిన గదిలో ఏసీ పని చేయడం లేదని డీఐ లక్ష్మీ గుర్తించి బ్లడ్ బ్యాంక్‌పై కేసు నమోదు చేసింది. రక్తనిధి కేంద్రాన్ని సీజ్ చేయకుండా ఉండాలంటే రూ.2 లక్షలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతమొత్తం ఇచ్చుకోలేనని, నోటీసులిస్తే లోపాలను సరిదిద్దుకుంటానని లక్ష్మీరెడ్డి వేడుకుంది. తమకు కూడా టార్గెట్లు ఉన్నాయని, తాము కూడా పై అధికారులకు ముట్టజెప్పాలని, అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ డీఐ హుకుం జారీ చేసింది. డీఐ వేధింపు లు భరించలేక బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది. పథకం ప్రకారం వలపన్ని పట్టుకున్నారు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ డ్రగ్ ఇన్స్పెక్టర్కు లక్ష్మీరెడ్డి కబురు పంపించింది. అయితే డీఐ నగదు రూపంలో కాకుండా బంగారు ఆభరణాల రూపంలో కావాలని కోరింది. అప్పటికే ఏసీబీకి సమాచారం ఇచ్చిన రక్తనిధి నిర్వాహకురాలు లక్ష్మీరెడ్డి ఏసీబీ ప్రణాళిక ప్రకారం డ్రగ్ ఇన్స్పెక్టర్ను గురువారం సాయంత్రం అబిడ్స్‌లోని ఓ బంగారు దుకాణానికి రప్పించింది. రూ.1.10 వేల విలువ చేసే బంగారు గొలుసు ఆభరణాన్ని ఎంపిక చేసుకుంది. అయితే లక్ష్మీరెడ్డి ప్రస్తుతం తనవద్ద ఇంత డబ్బుల్లేవని, ఇదే బంగారు గొలుసును మరుసటి రోజు తెచ్చి ఇస్తానని చెప్పి, డ్రగ్ ఇన్స్పెక్టర్ను పంపివేసింది. పట్టుబడిన ఆభరణాలతో డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి ఆ తర్వాత ఆ గొలుసుకు డబ్బులు చెల్లించి, షాపు నుంచి బిల్లు తీసుకుంది. డీఐకి బంగారు గొలుసును ఇచ్చేందుకు లక్ష్మీరెడ్డి శుక్రవారం రాత్రి మధురానగర్ సూర్య అపార్ట్ మెంట్‌కు వెళ్లింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ బొమ్మిశెట్టి లక్ష్మికి బంగారు గొలుసును అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే సమయంలో ఆమె నుంచి పలు నగలను కూడా సీజ్ చేసినట్లు తెలిసింది. ఈ తతంగమంతా అధికారులు వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేసి, ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. తనిఖీల పేరుతో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే వేంటనే 1064 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది. -
ఏసీబీకి పట్టుబడ్డ డ్రగ్ ఇన్స్పెక్టర్
సాక్షి, హైదరాబాద్: లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను లంచంగా తీసుకుంటున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శనివారం అరెస్ట్ చేసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నగరంలోని ఓ బ్లడ్ బ్యాంక్‌కు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసింది. దీంతో సదరు వ్యక్తులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో లక్ష్మీ లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు పట్టుబడింది. కాగా గతంలోనూ ఆమె ఇదే బ్లడ్ బ్యాంకు నుంచి 50 వేలు లంచం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. -
డ్రగ్ ఇన్స్పెక్టర్ విందు బాగోతం
కళ్యాణదుర్గం రూరల్: ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ విందుబాగోతం వివాదాస్పదమైంది. మెడికల్ స్టోర్‌లో తనిఖీకి వెళ్లిన డ్రగ్ ఇన్స్పెక్టర్...తనిఖీల కంటే ముందుగానే ఓ డాబాలో మెడికల్ షాపు నిర్వాహకులతో కలిసి విందులో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని జండు మహదేవి మెడికల్ స్టోర్‌లో కొద్ది రోజుల క్రితం ఓ గొర్రెల కాపరి జీవాల కోసం మందులను కొనుగోలు చేశాడు. అయితే వాటిని వాడకపోవడంతో వెనక్కు తీసుకోవాలని కోరగా దుకాణం నిర్వాహకులు అతనిపై దాడి చేశారు. దీనిపై గొర్రెల కాపరి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. సోమవారం డ్రగ్ ఇన్స్పెక్టర్ దాదాఖలందర్ తనిఖీ కోసం కళ్యాణదుర్గం వచ్చారు. అయితే తనిఖీల కంటే ముందుగానే మెడికల్ షాపుల నిర్వాహకులతో కలిసి ఓ డాబాలో విందు చేశారు. అనంతరం దుకాణంలో తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టారు. అన్నీ నిబంధనలకు విరుద్ధమే జండు మహదేవి మెడికల్ స్టోర్ నిబంధనల ప్రకారం మందులు విక్రయించడం లేదని ఇన్స్పెక్టర్ దాదాఖలందర్ తనిఖీల్లో గుర్తించారు. అంతేకాకుండా అనుమతులు లేని మందులు భారీ స్థాయిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. విందు బాగోతం రచ్చ కావడంతో ఈ విషయాలన్ని మీడియా ప్రతినిధులకు కూడా తెలిపారు. సమగ్ర వివరాలతో ఏడీకి నివేదిక పంపుతానని వెల్లడించారు. మరోవైపు పట్టణంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేస్తున్నారని తెలియడంతో పలు మెడికల్ షాపుల యజమానులు దుకాణాలను మూసి వేశారు. -
హ్యాపీ హోలీ అంటూ దారుణం
చండీగఢ్ : నిజాయితీగా పనిచేస్తున్న ఎఫ్డీ (ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్) జోనల్ లైసెన్సింగ్ అథారిటీ మహిళా అధికారిపై పగబట్టాడో ప్రబుద్ధుడు. అక్రమంగా నిర్వహిస్తున్న షాపు లైసెన్స్‌ను రద్దు చేసిందనే అక్కసుతో డాక్టర్ నేహా శౌరి(36)ను కాల్పి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్న ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదానికి దారి తీసింది. పంజాబ్ రాజధాని చండీగఢ్ సమీపంలోని ఖరార్ డ్రగ్ అండ్ కెమికల్ టెస్టింగ్ లాబోరేటరీ వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని మోరిండాకు చెందిన కెమిస్ట్ షాప్ ఓనర్ బల్విందర్‌సింగ్(50)గా గుర్తించారు. పోలీసు అధికారి హర్చరణ్ సింగ్ భుల్లార్ అందించిన సమాచారం ప్రకారం శుక్రవారం ఉదయం మోటార్‌బైక్‌పై వచ్చిన బల్విందర్ సింగ్ నేరుగా నేహా ఆఫీసులోకి చొరబడి ఆమెపై కాల్పులు జరిపాడు. హ్యాపీ హోలీ అంటూ అరుచుకుంటూ సంఘటనా స్థలంనుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ల్యాబ్‌లోని ఉద్యోగి సురేష్ కుమార్ అతన్ని వెంబడించి, మోటార్ బైక్ స్టార్ట్ చేస్తుండగా పట్టుకున్నాడు. దీంతో బల్విందర్ మొదట సురేష్‌పై కాల్పులకు ప్రయత్నించాడు. కానీ బైక్‌ను వెనుకకు లాగడం మూలంగా అతను పడిపోయాడు. ఇక దొరికిపోతాననే ఆందోళనలో తనను తాను కాల్చుకున్నాడు. ఇద్దరినీ ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే నేహా మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు చికిత్స పొందుతూ బల్విందర్ సింగ్ కూడా చనిపోయాడు. 2009లో అక్రమంగా విక్రయిస్తున్న మాదకద్రవ్యానికి బానిసలైనవారుపయోగించే 35 రకాల టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు నేహా. దీనికి సంబంధించిన సరియైన పత్రాలను చూపించకపోవడంతో ఆమె బల్విందర్ దుకాణం లైసెన్సును రద్దు చేశారు. ఈ విషయం త్వరలోనే కోర్టు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై పగ తీర్చుకోవాలని పథకం వేశాడు. ఇందుకోసం మార్చి 9న ఆయుధాల లైసెన్సును తీసకున్నాడు. అంతేకాదు రెండు రోజుల క్రితం రివాల్వర్‌ను కూడా కొనుగోలు చేశాడు. సంఘటనా స్థలంతో రివాల్వర్‌తోపాటు, సింగ్ వద్ద ఒక కత్తిని కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ సంఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సమగ్ర దర్యాప్తునకు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. కాగా నేహాకు రెండేళ్ల కుమార్తె, భర్త వరుణ్ మంగా (బ్యాంకు ఉద్యోగి) ఉన్నారు. సింగ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
ఔషధాలను విక్రయిస్తున్నందుకు స్నాప్‌డీల్‌పై విచారణ
బెంగళూరు: ఆన్లైన్లో నియంత్రిత ఔషధాలను చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్నందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన విచారణ చర్యలు చేపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.‘‘షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్ ‘సుహాగ్రా 100’ ప్రదర్శన, విక్రయం, పంపిణీ చేస్తున్నందుకు గాను స్నాప్‌డీల్, ఆ సంస్థ సీఈవో కౌర్‌బాహల్, సీవోవో రోహిత్‌కుమార్ బన్సాల్‌కు వ్యతిరేకంగా విచారణ చర్యలు తీసుకునేందుకు బెళగావికి చెందిన అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్‌ను అనుమతిస్తూ డిసెంబర్ 21న ఆదేశాఉలు ఇవ్వడం జరిగింది. ఈ ఔషధాన్ని ఓవర్ ద కౌంటర్ విక్రయించకూడదు. ఇది ఔషధ, సౌందర్య ఉత్పత్తుల నిబంధనలకు వ్యతిరేకం’’అని కర్ణాటక డ్రగ్ కంట్రోలర్ అమరేష్ తుంబగి బుధవారం మీడియాకు తెలిపారు. లుథినాయాకు చెందిన హెర్బల్ హెల్త్‌కేర్ కంపెనీ యజమాని, ఉద్యోగులకు వ్యతిరేకంగా కూడా విచారణ చర్యలు చేపట్టినట్టు చెప్పారు. లైంగిక ఉద్దీపనానికి వినియోగించే సుహాగ్ర ఔషధాన్ని వైద్యుల సిఫారసు లెటర్ లేకుండా విక్రయించకూడదని స్పష్టం చేశారు. చట్టానికి సహకరిస్తాం: స్నాప్‌డీల్ ఈ విషయానికి సంబంధించి తమకు ఎటువంటి సమచారం లేదని, విచారణ అధికారులకు సహకారం అందిస్తామని స్నాప్‌డీల్ ప్రకటన జారీ చేసింది. ‘‘స్నాప్‌డీల్ అనేది మధ్యవర్తి. విక్రేతలను, కొనుగోలుదారులతో అనుసంధానిస్తుంది. షెడ్యూల్డ్ హెచ్ విభాగంలోని ఔషధాలను విక్రయించకుండా నిషేధం ఉంది. నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. అటువంటి విక్రేతలు ఇకపై అమ్మకాలు జరపకుండా నిషేధం విధిస్తాం’’ అని స్నాప్‌డీల్ అధికార ప్రతినిధి ప్రకటనలో వివరించారు. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేసేందుకు తమ వైపు నుంచి సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. -
‘అమెరికా డ్రగ్స్ నియంత్రణ’ చీఫ్‌గా భారతీయుడు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి న్యాయ వాదికి కీలక పదవి దక్కింది. మాదక ద్రవ్యాల రవాణా, వాడకం కట్టడికి కృషి చేస్తున్న డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ నూతన యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఇండో–అమెరికన్ ఉత్తమ్ ధిల్లాన్ ఎంపికయ్యారు. ఇటీవలే ఆ పదవి నుంచి విరమణ పొందిన రాబర్ట్ ప్యాటర్సన్ స్థానంలో ఆయన మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ధిల్లాన్ శ్వేతసౌధంలో అధ్యక్షుడు ట్రంప్‌కు డిప్యూటీ కౌన్సెల్, డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేశారు. న్యాయ విభాగం, హోంల్యాండ్ సెక్యూరిటీ, కాంగ్రెస్‌లలో వేర్వేరు హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఉన్నత స్థాయిలో డ్రగ్స్ అక్రమ రవాణాదారులకు వ్యతిరేకంగా వాదించారు. 2006లో డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)లోని కౌంటర్ నార్కోటిక్స్ కార్యాలయానికి తొలి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ హోదాలో నార్కో టిక్స్ సమస్య పరిష్కారానికి కీలక వ్యూహాలు రూపొందించారు. -
మందుల మోసం..
కాకినాడ లీగల్: జిల్లాలో అధిక ధరలకు మందుల విక్రయం, నాసిరకం మందులు అమ్ముతు న్న కంపెనీలు, దుకాణదారులపై జిల్లా ఔషధ నియంత్రణ ఏడీ టి.శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో డ్రగ్ఇన్స్పెక్టర్లు మంగళవారం దాడులు చేశారు. కొన్ని రకాల మందుల షీట్స్‌పై అధిక రేట్లు వేసి విక్రయించడమే కాకుండా..నాసిరకం మందులు విక్రయిస్తున్న కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు. కాకినాడ అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎం.చంద్రరావు, కాకినాడ రూరల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వీఎస్ జ్యోతి మంగళవారం కాకినాడలో వివిధ ముందులదుకాణాలపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. శ్రీరామ్‌సాయి మెడకిల్ డిస్ట్రిబ్యూటర్స్‌కు చెందిన దుకాణంలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన లేబొరేట్ ఫార్మాస్యుటికల్స్ ఇండియాలిమిటెడ్ కంపెనీకి సంబంధించిన మూడు రకాల మందులపై అధిక ధరలు ముద్రించినట్టు గుర్తించారు. జెంటాలాబ్ ఇంజక్షన్ 30ఎంఎల్ ఎంఆర్పీ 73.50 పైసలుగా ముద్రించారు. కానీ ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.27.65పైసలు మాత్రమే. జెంటాలాబ్ ఇంజక్షన్ 10ఎంఎల్ ఎంఆర్పీ 24.50 పైసలుగా ముద్రించారు. అసలు ధర రూ.16.675 పైసలకు విక్రయించాలి. డిక్సీలాబ్ ఇంజక్షన్ 30 ఎంఎల్ ఒకటి రూ.84.50పైసలుగా ముద్రించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.35.85పైసలు ఉండాలి. అధిక ధరకు విక్రయిస్తున్నందుకు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్–2013 చట్టం ఉల్లంఘన కింద డ్రగ్ఇన్స్పెపెక్టర్లు మందులను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత మందుల కంపెనీపై కేసు నమోదుచేసి కాకినాడ మూడో అదనపు జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్కోర్టులో హాజరుపరిచారు. ఏడీ టి.శ్రీరామమూర్తి మాట్లాడుతూ జిల్లాలో మరిన్ని దుకాణాలు, కంపెనీలను తనిఖీ చేయనున్నట్టు వెల్లడించారు. -
మత్తు మందు ఇచ్చి నగల అపహరణ
వేనాడు(తడ): రైలులో ప్రయాణిస్తున్న మహిళలను మాయ మాటల్లో దించి, వారితో కలసి ప్రయాణించి అదనుచూసి చాకచక్యంగా నగలను దోచుకెళ్లిన ఘటన గురువారం రాత్రి వేనాడులో చోటుచేసుకుంది. బాధితుల సమాచారం మేరకు తడ మండలం ఇరకం గ్రామానికి చెందిన నైనా విజయమ్మ, నైనా ధనలక్ష్మి, నైనా సెల్వి కుటుంబాలు చాలా కాలం క్రితం తమిళనాడులోని పొన్నేరికి కాపురం వెళ్లిపోయారు. అమావాస్య సందర్భంగా వేనాడులో ఉన్న షేక్ దావూద్ షావలీ అల్లా దర్గాను దర్శించుకుని రాత్రికి అక్కడ నిద్ర చేసేందుకు ముగ్గురూ గురువారం వేనాడు గ్రామానికి రైలులో వచ్చారు. వీరికి పొన్నేరి వద్ద బురకా వేసుకున్న మహిళ రైలులో కలిసి మాటలు కలిపింది. ఆమె మాటలకు వీరు ముగ్గురూ బాగా ఆకర్షితులయ్యారు. తన కుమారుడికి ఉద్యోగం రావడంతో దర్గా వద్ద అన్నదానం చేసి ముగ్గురు మహిళలకు చీరలు అందించాలని వెళుతున్నట్టు ఆమె వీరికి తెలిపారు. ఇంతలో సూళ్లూరుపేటకు చేరుకున్న మహిళలను మీరు నా కుటుంబ సభ్యుల్లా ఉన్నారంటూ మీకు చీరలు తీసిచ్చి మరో ఇద్దరు ఇతరులను చూసి మిగిలిన చీరలు ఇస్తానంటూ స్థానికంగా ఉన్న ఓ వస్త్ర దుకాణానికి తీసుకువెళ్లి చీరలు కొనిచ్చింది. అనంతరం అందరూ వేనాడుకి చేరుకున్నారు. ముగ్గురు మహిళలు తమతోపాటు తెచ్చుకున్న భోజనం తమకు పరిచయమైయ మహిళతో కలిసి తిన్నారు. అనంతరం ఆ మహిళ కూల్‌డ్రింక్ తెచ్చి వీరికి అందించింది. కూల్‌డ్రింక్ తాగిన కొంతసేపటికి వారు ముగ్గురూ నిద్రలోకి జారుకోగా విజయమ్మ మెడలోని తాళిబొట్టు, కాసులతోటు మరో బంగారు గొలుసు తీసుకుని పారిపోయింది. మిగిలిన ఇద్దరు మహిళలు తమ వస్తువులను దాచుకోవడంతో అవి భద్రంగా మిగిలాయి. ఉదయం లేచి చూసిన బాధితులు తాము మోసపోయినట్లు గుర్తించి స్థానికులకు విషయం తెలిపారు. సమాచారం అందుకున్న తడ ఎస్ఐ దాసరి వెంకటేశ్వరరావు గ్రామానికి చేరుకుని మత్తు ప్రభావం తొలగని మహిళలను సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘మెడికేర్’లో తనిఖీ
- అడ్డుకున్న డాక్టర్ బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి నంద్యాల: స్థానిక సంజీవనగర్ జంక్షన్ సమీపంలోని మెడికేర్ ఆసుపత్రిలో నిబంధనలకు వ్యతిరేకంగా రక్తాన్ని సేకరిస్తున్నారని ఆరోపణలు రావడంతో గురువారం అధికారులు తనిఖీ చేశారు. ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్, కర్నూలు రూరల్, నంద్యాల ఇన్చార్జి డ్రగ్ఇన్స్పెక్టర్ జయలక్ష్మి, కర్నూలు అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్‌అలీ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రక్తసేకరణకు వినియోగించే బ్లడ్ బ్యాగ్ లభ్యమైంది. దీన్ని స్వాధీనం చేసుకొని సిబ్బంది నుంచి అధికారుల బృందం సమాచారం సేకరిస్తుండగా డ్రగ్ ఇన్స్పెక్టర్ జయలక్ష్మిని ఆసుపత్రి అధినేత డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి అడ్డుకొని బ్లడ్ బ్యాగ్‌ను లాక్కొని మొదటి అంతస్తు నుంచి విసిరేశారు. తర్వాత సిబ్బంది దీన్ని మాయం చేసే ప్రయత్నం చేశారు. దీంతో అధికారుల బృందం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రక్త సేకరణ అనుమతి లేదు నంద్యాలలో విజయ బ్లడ్ బ్యాంక్, ప్రభుత్వాసుపత్రి, శాంతిరాం జనరల్ ఆసుపత్రుల్లో మాత్రమే రక్తం తీసుకొనే అవకాశం ఉందని, మిగతా ప్రైవేటు ఆసుపత్రులకు లేదని ఏడీ చంద్రశేఖర్ తెలిపారు. అయితే మెడికేర్‌లో రక్తం సేకరిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో తనిఖీలకు వెళ్లామన్నారు. అధికారుల విధుల నిర్వహణకు అక్కడి డాక్టర్, సిబ్బంది ఆటంకం కలిగించారని, వారిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. అలాగే ఔషధ నియంత్రణ చట్టం ప్రకారం కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. అధికారులే అసభ్యంగా ప్రవర్తించారు.. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు అసభ్యంగా ప్రవర్తించారని డాక్టర్ శ్రీకాంతరెడ్డి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ గౌరి బ్లడ్ బ్యాగ్‌ను ఉపయోగించలేదన్నారు. దీన్ని కలిగి ఉండటం తప్పు కాదన్నారు. అయితే తనిఖీలకు వచ్చిన అధికారులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, ఈ మేరకు ఆమె కూడా ఫిర్యాదును అందజేసిందన్నారు. తాను బ్లడ్ బ్యాగ్‌ను మాయం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు అవాస్తవమన్నారు. -
మత్తు ఇంజెక్షన్ల ముఠా అరెస్టు
కేకేనగర్ (చెన్నై) : తిరుచందూర్‌లో మత్తు ఇంజెక్షన్లను విక్రయించే ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఒక ఇంజెక్షన్‌కు రూ. 200లు వసూలుచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. తూత్తుకుడి జిల్లా తిరుచందూర్ వీరరాఘవరపురం వీధిలో డబ్బుల కోసం ఒక ముఠా మత్తు ఇంజెక్షన్లు వేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తిరుచందూర్ ఆలయ పోలీసులు వీరరాఘవపురంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ ఇస్కిముత్తు (36) ఇంట్లో అధిక సంఖ్యలో ఇంజెక్షన్లు, మత్తు మందులు గల సిరంజలు, మత్తు మందు బాటిళ్లు, 3 ఖాళీ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఇస్కిముత్తు గత కొన్ని రోజులుగా తన ఇంట్లో అనేక మందికి మత్తు ఇంజెక్షన్లు వేస్తున్నట్లు తెలిపింది. అతనికి సహాయపడిన తిరుచందూర్ వీరకాళి అమ్మన్ కోవిల్ వీధికి చెందిన మణికంఠన్ (22), సెల్వం (36)లను అరెస్టు చేశారు. నిందితులను తిరుచందూర్ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
శ్యాంపిల్స్ కేసు మాఫీకి యత్నం?
► రంగంలోకి రాజకీయ నేతలు ► అధికారులపై ఒత్తిళ్లు ఎల్.ఎన్.పేట : మండల కేంద్రంలోని శ్రీగోపాల్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌లో మంగళవారం పట్టుబడ్డ శ్యాంపిల్స్ మందుల కేసును మాఫీ చేసేందుకు జిల్లాలో రాజకీయ నేతలు రంగంలోకి ప్రవేశించినట్టు ప్రచారం జరుగుతుంది. మందుల దుకాణంపై డ్రగ్ ఇన్స్పెక్టర్లు దాడులు చేసి రూ.3లక్షల విలువ చేసే 51 రకాల శ్యాంపిల్స్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం పాఠకులకు విదితమే. వీటిని పట్టుకున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లపై పెద్ద వ్యాపారులు రాజకీయ నేతలతో ఒత్తిడి చేయిస్తున్నట్టు సమాచారం. గుట్టుగా చేసుకునే మందుల వ్యాపారాన్ని బట్టబయలు చేయడం సరికాదని అధికారుల తీరునే దుకాణదారులు తప్పుపడుతున్నట్టు తెలిసింది. మందుల వ్యాపారంలో ఇది సామాన్యమేనని దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని దుకాణ యజమానులు ఇతరుల వద్ద చెబుతున్నట్టు సమాచారం. ఏళ్ల తరబడి గుట్టుచప్పుడు కాకుండా చేసుకుంటున్న శ్యాంపిల్స్ విక్రయాలను బయటపడడంతో రెండు రోజులుగా మండల కేంద్రంలో ఏ ఇద్దరు కలిసినా ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా కేసుకు సంబంధించిన అన్ని మందులను ఆమదాలవలస కోర్టులో అప్పగించడం జరిగిందని డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎ.కృష్ణ సాక్షికి బుధవారం తెలిపారు. -
గుమ్మడిలో డ్రగ్స్ అధికారుల దాడులు
రూ.2 లక్షలు విలువ చేసే మందులు స్వాధీనం కోవూరు: కోవూరు మందబయలు సెంటర్లో ఉన్న గుమ్మడి హాస్పిటల్లో మంగళవారం అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ సురేష్‌బాబు ఆకస్మికంగా దాడులు చేశా రు. ఈ దాడుల్లో రూ.2 లక్షలు విలువ చేసే మందులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో అనుమతులు లేకుండా మందులు ఉన్నాయన్న విషయంపై ఫిర్యాదులు రావడతో దాడులు నిర్వహించామన్నారు. దాడులు జరిగి న సమయంలో విలువైన మందులు ఉండటంతో వాటిని పరిశీలిస్తున్నామన్నారు. ఇటీవల కోవూరులోని సెయింట్ పాల్స్ పాఠశాలలో ఆదివారం ఉచిత వైద్యశిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో మిగిలిన మందులను గుమ్మడి హాస్పిటల్లో నిల్వ ఉంచడం జరిగిందని ఉచిత వైద్యశిబిరం నిర్వహించిన యూకో ఆర్గనైజేషన్ నిర్వాహకులు డ్రగ్ అధికారులకు లిఖితపూర్వకంగా తెలియచేశారు. తరచుగా మా ఆర్గనైజేషన్‌లో ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ఉచిత వైద్యశిబిరాలునిర్వహిస్తుంటామని అందులో భాగంగానే ఈ మందులను కొనుగోలు చేసి తెచ్చామని యూకో నిర్వాహకులు తెలిపారు. ఆదివా రం మెగా వైద్యశిబిరం రాత్రి వరకు జరగడంతో ఈ మందులను గుమ్మడి హాస్పిటల్ ఆవరణలో ఖాళీగా ఉన్న ఓ గదిలో నిల్వ ఉంచామని డ్రగ్ అధికారులకు లిఖితపూర్వకంగా ఇచ్చారు. నిర్వాహకులు చెప్పిన వివరాలను నమోదు చేసుకొని నివేదికలు తయారుచేశామని డ్రగ్ అధికారి సురేష్‌బాబు తెలిపారు. దాడుల్లో కావలి, గూడూరు, నెల్లూరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు సుభాషిణి, ప్రశాంతి, మురళీ పాల్గొన్నారు. -
మత్తు ఇంజక్షన్ల విక్రయం: ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్(యాకుత్‌పురా): మత్తు ఇంజక్షన్లను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను రెయిన్‌బజార్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 200 మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ జి.శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ప్రకాశ్ (43) కొన్ని రోజులుగా మత్తు ఇంజక్షన్లను విక్రయిస్తున్నాడు. యాకుత్‌పురా బాగ్‌హే జహేరా ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ మాజిద్ ఖాన్(45) ప్రకాశ్ వద్ద మత్తు ఇంజక్షన్లను కొనుగోలు చేసి పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ప్రకాశ్‌తో పాటు సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన శైలేష్ (34) సైతం మత్తు ఇంజక్షన్ల విక్రయాలు చేస్తుంటాడు. మాజిద్ మత్తు ఇంజక్షన్లను రూ. 5.50లకు కొనుగోలు చేసి యాకుత్‌పురా పరిసర ప్రాంతాల్లో అవసరమైన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అబ్దుల్ మాజిద్ ఇంటిపై దాడి చేసి 200 మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం రెయిన్‌బజార్ పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మత్తు ఇంజక్షన్ల విక్రయాలు చేస్తున్న ప్రకాశ్‌తో పాటు అబ్దుల్ మాజిద్, శైలేష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఏసీబీ అధికారులమని బెదిరించి.. ఐఫోన్ డిమాండ్
► రూ. 4 లక్షలు వసూలు, డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఘాతుకం అమీర్‌పేట: ఔషధ నియంత్రణ మండలిలో పనిచేసే ఓ ఇన్స్పెక్టర్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఏసీబీ అధికారులమని చెప్పి మరో ఇన్స్పెక్టర్ను బెదిరించి డబ్బులు దండుకున్నారు. అంతటితో ఆగకుండా ఐఫోన్ కావాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ వాహిదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన అనిల్‌ప్రసాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తూ ఎల్లారెడ్డిగూడలో నివాసముంటున్నాడు. అదే విభాగంలో జీడిమెట్ల జోన్లో పని చేస్తున్న అరవింద్కుమార్రెడ్డిని అనిల్‌ప్రసాద్ తన స్నేహితులు వెంకట్రావు, లింగారావులతో కలిసి ఏసీబీ అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. వెంకట్రావు అరవింద్‌కుమార్‌కు ఫోన్‌చేసి తాను ఏసీబీ డీఎస్పీ నని నీపై అవినీతి ఆరోపనలు వచ్చాయని, త్వరలో విచారణ చేయాల్సి ఉంటుందని బెదిరించాడు. రూ.4లక్షలు ఇస్తే అంతా చక్కదిద్దుతానని చెప్పాడు. నాలుగు రోజులక్రితం వారు అడిగినంత డబ్బు తెచ్చి ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న అనిల్ప్రసాద్కు ఇచ్చాడు. అయితే వెంకటరావు మరుసటి రోజు ఫోన్ చేసి ఐఫోన్ కావాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన అరవింద్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు శనివారం అనిల్‌ప్రసాద్, లింగారావులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారినుంచి రూ.1,95 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న సత్తెనపల్లికి చెందిన వెంకట్రావు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
డ్రగ్ ఇన్స్పెక్టర్ల ఆకస్మిక తనిఖీలు
మిర్యాలగూడ అర్బన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఫార్మసీ షాపుల్లో శనివారం డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆరుగురు డీఐలు రెండు బృందాలుగా విడిపోయి పట్టణ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. పట్టణంలో సుమారు 180 వరకు ఔషధ దుకాణాలు ఉన్నాయి. కాగా, తమ తనిఖీల్లో భాగంగా కొన్ని షాపుల్లో వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నట్టు, ఫార్మాసిస్టులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారులకు నివేందిచనున్నట్టు అధికారులు తెలిపారు. -
నకిలీ మందులు విక్రయ ముఠాకు జైలు
నిజామాబాద్ లీగల్ : నకిలీ మందులు విక్రయించిన వ్యక్తులకు జైలు శిక్ష, జరిమానాలు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని గుర్బాబాది రోడ్డులో గల ఓం శ్రీ కాలభైరవ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, నిజామాబాద్ మండలం బోర్గాం(పీ) గ్రామంలోని అను మెడికల్ స్టోర్‌సలో 2009 ఫిబ్రవరి 10న డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫ్లోసిన్ అనే ట్యాబ్లెట్ శాంపిల్ తీశారు. దీనిని హైదరాబాద్‌లోని ప్రభుత్వ ల్యాబొరేటర్‌కు పరిశీలన నిమిత్తం పంపారు. ట్యాబ్లెట్లో ఓఫెక్సెస్ 200 ఎంజీ నిల్‌గా ఉందని నివేదిక వచ్చింది. దీనిని వింకో ఫార్మా, భరత్ ల్యాబొరేటర్స్ కంపెనీలు ఉత్పత్తి చేసినట్లుగా గుర్తించారు. పై రెండు కంపెనీలు ప్రస్తుతం మూతపడ్డాయి. ఈ మేరకు డ్రగ్ ఇన్స్పెక్టర్ నకిలీ మందులు విక్రయిస్తున్న ఓం శ్రీ కాలభైరవ, అను మెడికల్ స్టోర్‌సపై కేసు నమోదు చేశారు. ఈ కేసు ట్రయల్ నడిచి శుక్రవారం బెంచ్‌పైకి వచ్చింది. కేసు పూర్వపరాలను మొదటి అదనపు జిల్లా జడ్జి కిరణ్‌కుమార్ పరిశీలించారు. నకిలీ మందులు విక్రయిస్తున్న వి.శ్రీనివాస్, ఫార్మసిస్టు మంజుల, రాజేష్, అనురాధకు సంవత్సరం కఠిన కారగార శిక్ష, రూ. 10 వేల చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో రెండు నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. డ్రగ్ శాఖ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామకృష్ణ వాదించారని డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. -
ఏసీబీ వలలో ప్రొద్దుటూరు డీఐ
ప్రొద్దుటూరు : అభిలాష్ అనే వ్యక్తి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ (డీఐ) రమేష్ రెడ్డి బుధవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. దాంతో అతడిని అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేల్‌కు చెందిన అభిలాష్ అనే వ్యక్తి మెడికల్ షాప్ పెట్టాలని నిర్ణయించాడు. అందుకు అనుమతి కోసం డీఐ రమేష్ రెడ్డిని సంప్రదించారు. అయితే రూ. 20 వేలు లంచం ఇస్తే వెంటనే అనుమతి మంజూరు చేస్తానని రమేష్‌రెడ్డి... అభిలాష్‌కు తెలిపారు. దాంతో అతడు ఏసీబీని ఆశ్రయించి... విషయాన్ని వివరించాడు. దీంతో వల పన్ని బుధవారం డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అభిలాష్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా రమేష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. -
బ్లడ్‌బ్యాంకులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరడా
సాక్షి, హైదరాబాద్: రక్తనిధి కేంద్రాలపై ఔషధ నియంత్రణ శాఖ కొరడా ఝుళిపిం చింది. రాష్ట్రంలోని 132 బ్లడ్ బ్యాంకుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. వీటిల్లో చాలా వరకు రక్తదాతలు, స్వీకర్తల వివరాలు నమోదు చేయకపోగా, నిర్ధేశించిన ధర కన్నా అధిక మొత్తానికి రక్తాన్ని అమ్ముతున్నట్లు గుర్తించింది. అర్హులైన టెక్నిషియన్లు లేకపోవడం, దాత నుంచి సేకరించిన రక్తాన్ని గ్రూపులుగా విభజించి శుద్ధి చేసిన తర్వాత నిల్వచేయడం, చివరకు బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణ, ఇలా అంతా లోపభూయిష్టంగా ఉన్నట్లు వెల్లడయింది. బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రితోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంకులు సహా 109 కేంద్రాలకు నోటీసులు జారీ చేసిం ది. వారంలోగా వివరణ ఇవ్వాలని, లేదంటే లెసైన్స్‌లను రద్దు చేయడంతోపాటు కేంద్రాలను సీజ్ చేస్తామని హెచ్చరించింది. గతంలో హెచ్చరించినా మారని తీరు... తెలంగాణలో 132 బ్లడ్ బ్యాంకులు రిజిస్ట్రర్ కాగా, ఇందులో 35 స్టోరేజ్ సెంటర్లు ఉన్నా యి. వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే అత్యధికంగా 61 బ్లడ్‌బ్యాంకులు ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 21 ఉన్నాయి. నోటీసులు అందుకున్న వాటిలో గ్రేటర్‌లోని బ్లడ్ బ్యాంకులే ఎక్కువ. ఔషధ నియంత్రణ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సుల్తాన్‌బజార్, పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులతోపాటు నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రి రక్తనిధి కేంద్రాల్లో తనిఖీ నిర్వహించి కనీస వసతులు లేవని నోటీసులు జారీ చేశారు. అక్కడ నిల్వ ఉన్న బ్లడ్ బాటిళ్లను సీజ్ చేశారు. నిలోఫర్‌లో 45 బాటిళ్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయినా ఆయా బ్లడ్‌బ్యాంకులు తీరు మార్చుకోలేదు. తలసీమియా బాధితులకు విక్రయం.. డ్రగ్‌కంట్రోల్ బోర్డు అధికారులు ప్రతి మూడు మాసాలకు ఒకసారి రక్త కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలి. ఆరు మాసాలకోసారి కూడా అటువైపు చూడటం లేదు. రక్తదాన శిబిరాలు నిర్వహించి సేకరించిన రక్తం లో 30 శాతం రక్తాన్ని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఇవ్వాలనే నిబంధన ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. తలసీమియా బాధితులకు రక్తాన్ని ఉచితంగా సరఫరా చేయాలనే నిబంధనను పట్టించుకోకపోగా.. ఒక్కో బాటిల్‌పై రూ.1200 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒ,ఎ, బి, నెగిటీవ్ రక్తంతో పాటు తెల్లరక్త కణాలు, ప్లాస్మా వంటివి కావాలంటే అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. -
దగ్గు మందు మాఫియా పై కధనాలు