వారిద్దరిదీ ఒకే డిపార్ట్‌మెంట్.. ఒకే కులం. ఆ యువతితో మాటలుకలిపాడు. అధికారి మనవాడే కదా అని ఆమె కూడా పరిచయం పెంచుకుంది. అదే అదునుగా చూసి ఆ అధికారి పెళ్లయిన విషయాన్ని దాచి మోసం చేశాడు. దీంతో తనకు జరిగన అన్యాయం మరొకరికి జరగకూడదని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకెళ్తే.. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో అబిద్ అలీ అనే వ్యక్తి డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. అదే సమయంలో డిపార్ట్‌మెంట్‌లో ప్రకాశం జిల్లాలో పనిచేసే మహిళా అధికారికి దగ్గరయ్యాడు. పెళ్లయిన విషయం కూడా చెప్పకుండా ఆ సమయంలో ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. విషయం తెలిసి మహిళా అధికారి నిలదీయడంతో.. తన భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానని మాటాచ్చి తర్వాత ముఖం చాటేశాడు.
అయితే ఆ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆమెను వివాహం చేసుకోకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు పిలిచి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా తన ప్రవర్తనలో మార్పులేకపోవడంతో బాధిత మహిళ తనతో గడిపిన ఫోటోలను, వీడియోలను బయటపెట్టింది. వీటిపై స్పందించిన అబిద్ అలీ ఆ మహిళా అధికారి తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment