Abid Ali
-
భార్యకు విడాకులిస్తానని మహిళా అధికారితో చెట్టాపట్టాల్.. చివరకు..
వారిద్దరిదీ ఒకే డిపార్ట్మెంట్.. ఒకే కులం. ఆ యువతితో మాటలుకలిపాడు. అధికారి మనవాడే కదా అని ఆమె కూడా పరిచయం పెంచుకుంది. అదే అదునుగా చూసి ఆ అధికారి పెళ్లయిన విషయాన్ని దాచి మోసం చేశాడు. దీంతో తనకు జరిగన అన్యాయం మరొకరికి జరగకూడదని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళ్తే.. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో అబిద్ అలీ అనే వ్యక్తి డ్రగ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. అదే సమయంలో డిపార్ట్మెంట్లో ప్రకాశం జిల్లాలో పనిచేసే మహిళా అధికారికి దగ్గరయ్యాడు. పెళ్లయిన విషయం కూడా చెప్పకుండా ఆ సమయంలో ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. విషయం తెలిసి మహిళా అధికారి నిలదీయడంతో.. తన భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానని మాటాచ్చి తర్వాత ముఖం చాటేశాడు. అయితే ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆమెను వివాహం చేసుకోకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు పిలిచి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా తన ప్రవర్తనలో మార్పులేకపోవడంతో బాధిత మహిళ తనతో గడిపిన ఫోటోలను, వీడియోలను బయటపెట్టింది. వీటిపై స్పందించిన అబిద్ అలీ ఆ మహిళా అధికారి తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలిపారు. చదవండి: (భార్య వేధింపులు తట్టుకోలేక.. నవ వరుడు ఆత్మహత్య!) -
'నా క్రికెట్ కెరీర్ ముగిసి పోయిందని భావించాను.. పాకిస్తాన్ క్రికెట్‌కు ధన్యవాదాలు'
పాకిస్తాన్ టెస్టు ఓపెనర్ ఆబిద్ అలీ గతేడాది జరిగిన క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో తీవ్రమైన గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడికి యాంజియో ప్లాస్టీ నిర్వహించి రెండు స్టంట్లను వైద్యులు అమర్చారు. అయితే అతడు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆబిద్ అలీ భావోద్వేగానికి లోనయ్యాడు. తన ఆరోగ్యం బాగాలేనప్పుడు తనకు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, చైర్మన్ రమీజ్ రాజా,ఎన్సీఎ వైద్యులకు అలీ కృతజ్ఞతలు తెలిపాడు. "గత 5-6 నెలలుగా నేను ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. మళ్లీ ఈ స్థితికి వస్తానని అస్సలు నేను ఊహించలేదు. నా క్రికెట్ కెరీర్ ముగిసి పోయిందని భావించాను. సర్వశక్తిమంతుడైన అల్లాకు ధన్యవాదాలు. నేను మళ్లీ తిరిగి కోలుకోవడానికి సహాయపడిన పిసిబి, చైర్మన్ రమీజ్ రాజా,ఎన్‌సిఎ వైద్యులకు ధన్యవాదాలు. అదే విధంగా పునరావాస కేంద్రంలో నాకు మద్దతుగా నిలిచిన నా సహాచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు" అని ఆబిద్ అలీ పేర్కొన్నాడు. చదవండి: Attack On Cricketer Mondli Khumalo: కోమా నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా యువ క్రికెటర్.. -
పాక్ క్రికెటర్ ఆబిద్ అలీకి యాంజియో ప్లాస్టీ.. రెండు నెలలు విశ్రాంతి
పాకిస్తాన్ టెస్టు ఓపెనర్ ఆబిద్ అలీ రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. గురువారం అతడికి రెండోసారి యాంజియో ప్లాస్టీ నిర్వహించి మరో స్టెంట్‌ను వైద్యులు అమర్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు నెలల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు. 34 ఏళ్ల ఆబిద్ పాక్ తరఫున 16 టెస్టులు ఆడి 1,180 పరుగులు... 6 వన్డేలు ఆడి 234 పరుగులు చేశాడు. -
మ్యాచ్ ఆడుతుండగానే చాతిలో నొప్పి... పరుగున ఆసుపత్రికి
పాకిస్తాన్ టెస్టు ఓపెనర్ అబీద్ అలీ చాతినొప్పికి గురయ్యాడు. క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో భాగంగా కైబర్ పంక్తున్నవాతో జరుగుతున్న మ్యాచ్‌లో అబీద్ అలీ 61 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్ ద్వారా అబీద్ అలీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 9వేల పరుగులు పూర్తి చేశాడు. కాగా మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే అతనికి రెండుసార్లు చాతినొప్పి రావడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. డ్రెస్సింగ్‌రూమ్‌కు చేరుకున్న అబీద్ వెంటనే ఫిజియో సలహాతో ఆసుపత్రిలో జాయినయ్యాడు. ప్రస్తుతం అబీద్ అలీ అబ్జర్వేషన్లో ఉన్నాడని.. గుండె సంబంధిత వ్యాధి ఏమైనా ఉందా అన్న కోణంలో వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికైతే అతని పరిస్థితి బాగానే ఉందని.. చెకప్ తర్వాత అబీద్ అలీ పరిస్థితిపై ఒక క్లారిటీ వస్తుందని సెంట్రల్ పంజాబ్ మేనేజర్ అశ్రఫ్ అలీ పేర్కొన్నాడు. ఇక క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ ద్వారా 2007లో క్రికెట్లో అరంగేట్రం చేసిన అబీద్ అలీ 31 ఏళ్ల వయసులో పాకిస్తాన్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక పాక్ జాతీయ జట్టు తరపున 16 టెస్టులు ఆడిన అబీద్ అలీ 16 టెస్టుల్లో 1180 పరుగులు చేశాడు. చదవండి: Shoaib Maliks Nephew: రికార్డు సృష్టించిన షోయబ్ మాలిక్ మేనల్లుడు.. అరుదైన ఘనత -
ఐసీసీ అవార్డు రేసులో వార్నర్, సౌథీ.. టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు
David Warner Nominated For ICC Player Of The Month Award: 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' అవార్డుకు గాను నవంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్ల జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, పాక్ ఆటగాడు ఆబిద్ అలీ, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ నిలిచారు. పురుషుల విభాగంలో ఈ ముగ్గురు క్రికెటర్లు నామినీస్ కాగా.. మహిళల కేటగిరీలో పాక్ స్పిన్నర్ ఆనమ్ అమిన్, బంగ్లా బౌలర్ నహీదా అక్తర్, విండీస్ ఆల్‌రౌండర్ హలే మథ్యూస్ ఉన్నారు. వార్నర్.. నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 69.66 సగటుతో 209 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలువగా.. అదే టోర్నీలో సౌథీ 7 వికెట్లతో రాణించి తన జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. డబ్ల్యూటీసీలో భాగంగా భారత్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో సైతం సౌథీ 8 వికెట్లు సత్తా చాటాడు. ఈ అవార్డు రేసులో ఉన్న పాక్ ఓపెనర్ ఆబిద్ అలీ బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 133, 91 పరుగులతో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, నవంబర్ నెలలో టీమిండియా ఆటగాళ్లు తక్కువ మ్యాచ్‌లు ఆడటం.. అందులో పెద్దగా రాణించకపోవడంతో ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. కాగా, ఐసీసీ.. ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెలా ఈ అవార్డును అందజేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: IND Vs SA: వాళ్లిద్దరినీ త్వరగా ఔట్ చేస్తే.. భారత్‌దే విజయం! -
తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఘనవిజయం
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ను ఓపెనర్లు హబిద్ అలీ(91), అబ్దుల్లా షఫీక్(73)లు రాణించడంతో పాక్ సులువుగా విజయాన్ని సాధించింది. వీరిద్దరు ఔటైన తర్వాత అజర్ అలీ(24*), బాబర్ అజమ్(13*)లు మిగతాపనిని పూర్తి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో అర్థసెంచరీతో రాణించిన హబీద్ అలీని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 39/4తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లు షాహీన్ అఫ్రిది (5/32), సాజిద్ (3/33) రాణించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 330 పరుగులుకు ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 286 పరుగులకు ఆలౌట్ అయింది. -
Ban Vs Pak 1st Test: 5 వికెట్లతో మెరిసిన హసన్ అలీ.. సెంచరీ దిశగా అబిద్ అలీ
Ban Vs Pak 1st Test: Pakistan Abid Ali Half Century Strong Reply On Day 2: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ నిలకడగా ఆడుతోంది. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 145 పరుగులు చేసింది. ఓపెనర్లు అబిద్ అలీ (93 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్ (52 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ మరో 185 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 253/4తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్... మరో 77 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 6 వికెట్లను కోల్పోయింది. ముష్ఫికర్ (91; 11 ఫోర్లు) సెంచరీని చేజార్చుకున్నాడు. హసన్ అలీ ఐదు వికెట్లతో మెరిశాడు. కాగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs Nz Test- Srikar Bharat: ఆ క్యాచ్ నిజంగా సూపర్.. ఒకవేళ భరత్ పట్టుబట్టకపోయి ఉంటేనా! .@AbidAli_Real and @imabd28 in conversation following their unbroken 145-run opening stand.#BANvPAK #HarHaalMainCricket pic.twitter.com/VtgcaQcso4 — Pakistan Cricket (@TheRealPCB) November 27, 2021 -
ZIM Vs PAK: అబిద్ అలీ ‘డబుల్’.. పాక్‌దే టెస్టు సిరీస్
హరారే: జింబాబ్వేతో ముగిసిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్, 147 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 220/9తో ఆట కొనసాగించిన జింబాబ్వే ఐదు ఓవర్లు ఆడి తమ చివరి వికెట్‌కు కోల్పోయింది. ల్యూక్ జాంగ్వే (37)ను అవుట్ చేసిన షాహిన్ అఫ్రిది (5/52) కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయగా, హసన్ అలీ (5/86) కూడా పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక డబుల్ సెంచరీ చేసిన ఆబిద్ అలీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలవగా... 14 వికెట్లు పడగొట్టిన హసన్ అలీ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ గా నిలిచాడు. కాగా మూడు టీ20, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నిమిత్తం పాకిస్తాన్, జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌ను 2-1, టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో పాక్ కైవసం చేసుకుంది. చదవండి: మా జట్టే అన్ని ఫార్మాట్లలో నెం.1: అబ్దుల్ రజాక్ -
ఉదయాన్ని స్వప్నిస్తూ నిదురలోకి..
అమరుడైన తమ మనిషి (లెజెండ్)ని ప్రజలు కీర్తిస్తారు. ఒక వ్యక్తి జీవించి ఉండగా లెజెండ్ కావడం అరుదు. మగ్దూం అటువంటి అరుదైన వ్యక్తి ! నా జీవితకాలంలో నేను (నరేంద్ర లూథర్) చూసిన లివింగ్ లెజెండ్ మగ్దూం. ఆయన గుణగానంలో సదా పరవశిస్తాను. మగ్దూం జీవితంలో సాహిత్యం-సామాజిక ఉద్యమాలు పడుగుపేకల్లా కలిసిపోయాయి. మగ్దూం కుమార్తెకు సంధ్యారాగం ‘అసావేరి’ అని పేరు పెట్టారు. అజ్ఞాతవాసంలో ఉండగా పుట్టిన కుమారుడి పేరు ‘సెకండ్ ఫ్రంట్’ ! తర్వాత కాలంలో ‘నుస్రత్’ (విజయం) అయ్యాడు ! ఉర్దూ దినపత్రిక సియాసత్ వ్యవస్థాపకుడు అబిద్ అలీఖాన్ ఇంట్లో ఓ మరుపురాని సాయంత్రం గడిపాం. జమీలా అనే అందమైన యువతి మగ్దూం సమక్షంలో ఆయన కవితలను గానం చేస్తోంది. అప్పుడు మగ్దూం వయసు సమారు 50 ఏళ్లు. నేను 30లోకి రాబోతున్నా.. మగ్దూంలోని యవ్వన కాంతి నన్ను ఆశ్చర్యపరచింది. ఏమిటీ రహస్యం అన్నాను. ‘నీ గురించి చింతించకు. వ్యక్తిగతం కానీ మంచి విషయాల గురించి ఆలోచించు’ అని హితవు పలికారు ! మగ్దూం సలహాను శిరోధార్యంగా భావించాను. వీలైనంత వరకూ అనుసరిస్తున్నాను. సంజీవయ్య ఎదుట కన్నుగీటారు.. ‘మల్లె పందిరి కింద’ కవితాగానం జరిగిన కొద్ది రోజుల తర్వాత మగ్దూంను అరెస్ట్ చేయాల్సిందిగా నేను ఆదేశించాల్సి వచ్చింది. ‘చట్టం అనుమతి లేకుండా వ్యక్తులు సమావేశం కారాదు’ అనే నిబంధనను ఉల్లంఘించిన నెపంతో ! ఆదేశాలు అమలులో ఉండగానే మగ్దూం ముఖ్యమంత్రి సంజీవయ్యను కలిశారు. అక్కడే చీఫ్ సెక్రటరీ ఉన్నారు. ‘సమాజానికి పెనుముప్పు, పొంచి ఉంటే ప్రజలు కలసి మాట్లాడుకోవడం మానవత్వానికి సంబంధించిన విషయం. ఈ కనీస జ్ఞానం లేనివాడు మీ చీఫ్ సెక్రటరీ’ అని మగ్దూం చెడామడా తిట్టారు. ప్రజాసంఘాలు, నాయకుల పట్ల అవగాహన ఉన్న సంజీవయ్య, మగ్దూంను విడుదల చెయ్యండి అన్నారు. తలదించుకున్న చీఫ్ సెక్రటరీతో కరచాలనం చేస్తూ, మగ్దూం నా వైపు కన్నుగీటారు ! ఒక ‘బ్రహ్మానందం’! బ్రహ్మానందరెడ్డి హయంలో ఒకసారి మగ్దూం నిరాహారదీక్షకు కూర్చున్నారు. పెరిగిన బియ్యం ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ! మగ్దూం అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు. దీక్షలో పరిస్థితి విషమిస్తోంది. విరమింపజేయాల ంటే ప్రభుత్వం నుంచి హామీని రాబట్టాలి. మగ్దూం సహా రాజ్‌బహదూర్ గౌర్ మరికొందరు చర్చలకు ముఖ్యమంత్రి చాంబర్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్‌ల పట్ల విముఖతతో ఉన్నారు. ఏవో ఫైళ్లను చూస్తున్నట్టు నటిస్తూ తల ఎత్తలేదు. మూతి బిగించిన వారితో సంభాషణ సాధ్యమా ? అప్పుడు మగ్దూం తన వాళ్లతో ‘‘బ్రహ్మానందంగా’ ఉండే వ్యక్తి కోసం కదా మనం వచ్చాం. ఇక్కడ అలాంటి వ్యక్తెవరూ లేనట్లుంది. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ఉన్నట్లున్నారు. పోదాం పద’ అన్నారట ! ఆ మాటలకు ముఖ్యమంత్రి ‘బ్రహ్మానంద’భరితుడయ్యారు. ఉద్యమకారుల డిమాండ్లకు అంగీకరించారు. ‘రాజ్’ కూడా బ్రహ్మానందం చెందారు. పేదల కోసం విజయవంతంగా దీక్ష చేసిన మగ్దూం ఓ ముద్ద తిన్నారు మరి. నెరవేర్చని వాగ్దానం ‘మగ్దూం చాచా’ అని పిలిచే రాజ్ బహదూర్ గౌర్ కుమార్తె తమారా అంటే ఆయనకు ప్రత్యేక వాత్సల్యం. ఆమెకు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని మగ్దూం నెరవేర్చలేకపోయారు. 1969లో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. వి.వి.గిరి గెలిస్తే కోన్ ఐస్‌క్రీం ఇప్పిస్తానన్నారు మగ్దూం. శాసనమండలిలో సీపీఐ సభాపక్షనేతగా రాణించిన మగ్దూం పార్టీ పనులపై ఢిల్లీ వెళ్లారు. ఆగస్ట్ 25 ఉదయం రాజ్ బహదూర్‌కు ఫోన్ చేసి, నిద్రలేపారు. ఒంట్లో బాగోలేదన్నారు. మిత్రుడిని వెంటనే పంత్ హాస్పిటల్లో చేర్చారు గౌర్. మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆ ఒక్క సందర్భమే చాచా అన్న మాట నిలుపుకోలేకపోయారు అంటారు తమారా ! ఢిల్లీ నుంచి వచ్చిన మగ్దూం భౌతికకాయాన్ని సందర్శించేందుకు నగరం జనసంద్రం అయింది. అన్ని అశ్రునయనాలను నగరం ఎన్నడూ చూడలేదు. హజ్రత్ షా ఖామోష్లో ఖననం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక అవిశ్వాసిని ఇక్కడ ఖననం చేసేందుకు ససేమిరా అంగీకరించం అన్నారు ఛాందసులు. అభ్యంతరాలను మగ్దూం అభిమానులు తోసిపుచ్చారు. ‘జిందాబాద్’ నినాదాలతో మగ్దూం భౌతికకాయాన్ని సగౌరవంగా విశ్రమింపజేశారు. సమాధిపై ఆయన కవితా పంక్తులు శిలాక్షరాలై ఉన్నాయి.. ‘బజ్న్ మే దూర్ వో గాతా రహా తన్హా తన్హా సో గయా సజ్ పర్ సర్ రఖ్ కే సహర్ సే పహెలె’ (సమూహాలకు దూరంగా పాడుతున్నాడతడు త నువుతో తనువుతో తంత్రిణిపై తలను చేర్చి నిదురలోకి జారాడు ఉదయానికి పూర్వమే) హైదరాబాద్ ఎన్నో ఉదయాస్తమాలను చూసింది. నవాబులు, జ మీందార్లు, పాలకులు.. ఎందరెందరి ఉదయాస్తమాలనో చూసింది ! ఒక అనాథ బాలుడిని ఈ నగరం మగ్దూం అనే మహనీయునిగా మలచింది ! ఆ హీరోకు పలికిన వీడ్కోలుతో సరిసమానమైనది అంతకు ముందు ఆ తర్వాత నగరం ఎన్నడూ చూడలేదు. మగ్దూంలాంటి మరొకరు కనిపిస్తారా..? మగ్దూం కనిపించిన ఉదయం ఆగమిస్తుందా..? ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి