Ban Vs Pak 1st Test: 5 వికెట్లతో మెరిసిన హసన్‌ అలీ.. సెంచరీ దిశగా అబిద్‌ అలీ | Ban Vs Pak 1st Test: Pakistan Abid Ali Half Century Strong Reply On Day 2 | Sakshi
Sakshi News home page

Ban Vs Pak 1st Test: 5 వికెట్లతో మెరిసిన హసన్‌ అలీ.. సెంచరీ దిశగా అబిద్‌ అలీ

Published Sun, Nov 28 2021 8:01 AM | Last Updated on Sun, Nov 28 2021 8:17 AM

Ban Vs Pak 1st Test: Pakistan Abid Ali Half Century Strong Reply On Day 2 - Sakshi

PC: PCB Twitter

Ban Vs Pak 1st Test: Pakistan Abid Ali Half Century Strong Reply On Day 2: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్‌ నిలకడగా ఆడుతోంది. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 145 పరుగులు చేసింది. ఓపెనర్లు అబిద్‌ అలీ (93 బ్యాటింగ్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్‌ (52 బ్యాటింగ్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో క్రీజులో ఉన్నారు.

ప్రస్తుతం పాకిస్తాన్‌ మరో 185 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 253/4తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్‌... మరో 77 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 6 వికెట్లను కోల్పోయింది. ముష్ఫికర్‌ (91; 11 ఫోర్లు) సెంచరీని చేజార్చుకున్నాడు. హసన్‌ అలీ ఐదు వికెట్లతో మెరిశాడు. కాగా బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే.

చదవండి: Ind Vs Nz Test- Srikar Bharat: ఆ క్యాచ్‌ నిజంగా సూపర్‌.. ఒకవేళ భరత్‌ పట్టుబట్టకపోయి ఉంటేనా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement