Pakistan Won By 8 Wickets Against Bangladesh 1st Test - Sakshi
Sakshi News home page

తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్‌ ఘనవిజయం

Published Tue, Nov 30 2021 11:58 AM | Last Updated on Tue, Nov 30 2021 12:08 PM

Pakistan Won By 8 Wickets Against Bangladesh 1st Test - Sakshi

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ను ఓపెనర్లు హబిద్‌ అలీ(91), అబ్దుల్లా షఫీక్‌(73)లు రాణించడంతో పాక్‌ సులువుగా విజయాన్ని సాధించింది. వీరిద్దరు ఔటైన తర్వాత అజర్‌ అలీ(24*), బాబర్‌ అజమ్‌(13*)లు మిగతాపనిని పూర్తి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో అర్థసెంచరీతో రాణించిన హబీద్‌ అలీని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 39/4తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ బౌలర్లు షాహీన్‌ అఫ్రిది (5/32), సాజిద్‌ (3/33) రాణించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 330 పరుగులుకు ఆలౌట్‌ కాగా.. పాకిస్తాన్‌ 286 పరుగులకు ఆలౌట్‌ అయింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement