ZIM Vs PAK: అబిద్‌ అలీ ‘డబుల్‌’.. పాక్‌దే టెస్టు సిరీస్‌ | ZIM Vs PAK: By An Innings 147 Runs Pakistan Won 2 Matches Test Series | Sakshi
Sakshi News home page

ZIM Vs PAK: పాకిస్తాన్‌దే టెస్టు సిరీస్‌ 

Published Tue, May 11 2021 8:29 AM | Last Updated on Tue, May 11 2021 8:36 AM

ZIM Vs PAK: By An Innings 147 Runs Pakistan Won 2 Matches Test Series - Sakshi

హరారే: జింబాబ్వేతో ముగిసిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ ఇన్నింగ్స్, 147 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 220/9తో ఆట కొనసాగించిన జింబాబ్వే ఐదు ఓవర్లు ఆడి తమ చివరి వికెట్‌కు కోల్పోయింది. ల్యూక్‌ జాంగ్వే (37)ను అవుట్‌ చేసిన షాహిన్‌ అఫ్రిది (5/52) కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేయగా, హసన్‌ అలీ (5/86) కూడా పాక్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక డబుల్‌ సెంచరీ చేసిన ఆబిద్‌ అలీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా నిలవగా... 14 వికెట్లు పడగొట్టిన హసన్‌ అలీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ గా నిలిచాడు. కాగా మూడు టీ20, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ నిమిత్తం పాకిస్తాన్‌, జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌ను 2-1, టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో పాక్‌ కైవసం చేసుకుంది.

చదవండి: మా జట్టే అన్ని ఫార్మాట్లలో నెం.1: అబ్దుల్ రజాక్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement