
పాకిస్తాన్ టెస్టు ఓపెనర్ ఆబిద్ అలీ గతేడాది జరిగిన క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో తీవ్రమైన గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడికి యాంజియో ప్లాస్టీ నిర్వహించి రెండు స్టంట్‌లను వైద్యులు అమర్చారు. అయితే అతడు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆబిద్ అలీ భావోద్వేగానికి లోనయ్యాడు. తన ఆరోగ్యం బాగాలేనప్పుడు తనకు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, చైర్మన్ రమీజ్ రాజా,ఎన్‌సీఎ వైద్యులకు అలీ కృతజ్ఞతలు తెలిపాడు.
"గత 5-6 నెలలుగా నేను ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. మళ్లీ ఈ స్థితికి వస్తానని అస్సలు నేను ఊహించలేదు. నా క్రికెట్ కెరీర్ ముగిసి పోయిందని భావించాను. సర్వశక్తిమంతుడైన అల్లాకు ధన్యవాదాలు. నేను మళ్లీ తిరిగి కోలుకోవడానికి సహాయపడిన పిసిబి, చైర్మన్ రమీజ్ రాజా,ఎన్‌సిఎ వైద్యులకు ధన్యవాదాలు. అదే విధంగా పునరావాస కేంద్రంలో నాకు మద్దతుగా నిలిచిన నా సహాచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు" అని ఆబిద్ అలీ పేర్కొన్నాడు.
చదవండి: Attack On Cricketer Mondli Khumalo: కోమా నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా యువ క్రికెటర్..
Comments
Please login to add a commentAdd a comment